Feb 25, 2012


ఓ తల్లి ...  భర్త చనిపోయాక ..ఏనామిదేళ్ళ కుతుర్నిని పెంచి పెద్ద చేసింది. మంచి చదువు చెప్పించింది.
కూతురే లోకంగా సాగిపోతున్న ఆమె జీవితం ప్రయాణంలో తన కాలేజి ప్రేమికుడు మళ్ళి కనపడ్డాడు.
ప్రేమించమని వెంటపడిన  అతన్ని కుటుంబం కోసం సున్నితంగా తిరస్కరించింది. ఇంట్లో వాళ్ళు చూపించిన పెళ్లి చేసుకుంది. హైగా సాగుతున్న సంసారాన్ని  దురదృష్టం వెంటాడి ఒంటరిది అయ్యింది. కాని  ఇప్పుడు మళ్ళీ ఆ ప్రేమికుడు కళ్ళముందు.
మంచి పోసిషన్ లోకి రావలసిన సమయంలో  ప్రేమ కోసం మూడేళ్ళు.. ప్రేమ విఫలమై మూడేళ్ళు  వృధా అయ్యి, ఏదో చిన్న పాటి ఉద్యోగంలో బ్రతుకీడుస్తున్న ఆతడు ఆమెకి కనపడ్డాడు. కలిసి మాట్లాడుకొనే అవకాశం దొరికింది.
 తండ్రి అంటే గౌరవం ఇష్టం ఉన్న అ టీనేజ్ పిల్లకి తెలిసింది. తన తల్లి ఇలా చేయటం ఆమెకి ఇష్టం లేదు. ఏదోలా అనిపించింది.బాధ పడింది. ఏడ్చింది . ఉండబట్టలేక   ఎవరతను? అని నిలదీస్తే ...??
. human  emotions ,   beautiful  visuals ..excellent  music ..made  this    as  must  watch film by a great director.




Feb 10, 2012

చెంప దెబ్బ



ఐదో తరగతో...అరో తరగతో గుర్తులేదు..
పాటం ఐపోగానే ప్రశ్న జవాబులు రాయిస్తారు. మరునాడు క్లాసు లో అవి ఆడుతారు. చెప్పని వాళ్ళని చెప్పిన వాళ్ళు చెంప దెబ్బలు వేయాలి. నేను ఎప్పుడు వేయటమే కాని చెంపదెబ్బ తిన్నది లేదు.
ఓ నాడు విచిత్రంగా ఒక ప్రశ్నకి జవాబు చెప్పలేక పోయా.. ఓ పిల్ల పేరు గుర్తులేదు.. ఆ జవాబు చెప్పి నన్ను కొట్టింది. చెంపకి నెప్పి లేదు..కాని ఎక్కడో తెలియని బాధ. ఏడుపు భిగ పట్టాను. అంతకంటే విచిత్రంగా క్లాసు ఐపోయే టైంకి ఆ అమ్మాయి ఓ ప్రశ్నకి జవాబు చెప్పక పోవటం నేను చెప్పటం జరిగాయి
. కొట్టాను చూడు.... అయిదు వెళ్ళు చెంపమీద అచ్చు పడ్డాయి ఏర్రగా.. ఆ సౌండ్ కి క్లాసు క్లాస్సంతా కాం ఐపోయింది . టీచర్ విస్తు పోయింది. ఆ రోజంతా ఏడ్చింది ఆ పిల్ల, పాపం.
ఎందుకు అలా కొట్టానో ఏంటో.. నాకే తెలీదు.