Oct 29, 2009

నా స్వేచ్ఛ



నేను సాంప్రదాయక మధ్య తరగతి కుటుంబం లో పుట్టాను . నా చిన్నతనం హాయిగా గడిచిపోయేది..తినడం.. స్కూలు .. ఆటలు.. ఇవి తప్ప నాకు మరో ప్రపంచమే తెలిదు..ప్రకృతి అంతా వింతగా తోచేది. ఇంటి వెనక తోటలో కూసే పిచ్చికలు, రంగు రంగుల సితాకోక చిలకలు , తూనిగలు, బోసి నోళ్ళతో నవ్వే పువ్వులు..ఆకాశంలో లో మెరిసే చుక్కలు .. వీటిని చూస్తూ సమయం గడిపేవాడిని.
స్కూలుకి వెళ్ళడం, అదో బద్ధకం.. నరకంగా తోచేది బడి అంటే. కాని తప్పించుకునే మార్గమే లేదు..ఈవిషయం లో మా అన్నయ్యని చూస్తే అసూయ కలిగేది..అన్నయ్య కాలేజి కావటం తో హాయిగా సైకిలు ఫై వెళ్ళేవాడు..పైగా ఒకటే పూట. ఇంకా చాల సార్లు క్లాసులు లేవని ఇంట్లోనే ఉండేవాడు..అది చూసి , పెద్దవాడి నవుతానా అని ఆలోచించే వాడిని.. కాని ఎలా..???

ఎలాగోలా పదవ తరగతి పూర్తి అయింది.రెండు కొత్త pants కుట్టించారు , నేను పెద్దవాడిని అయ్యానన్న సంతోషం కల్గింది. నేను మా అన్నయ లాగే హాయిగా సైకిలు పై కాలేజి కి వెళ్ళొచ్చు అని కలలు కన్నాను, కాని మా నాన్న నన్ను పక్క టౌనులో join చేసాడు. రోజు బస్సు లో వెళ్ళాలి..

ఇంక రోజు అద్దం ముందు గడిపే సమయం ఎక్కువైంది..గంటకోసారి ముఖం కడుక్కోవటం..ఫెయిర్ N లవ్లీ .. పౌడర్ అద్దటం. చెంపలకి వచ్చిన చిన్ని మొటిమలు పెద్ద సమస్య ఐపోయింది నాకు. మనసంతా ముఖం మీద, హెయిర్ స్టైల్ లోను.. డ్రెస్సింగ్ మీదా ఉండేది. చుక్కల్లా మెరిసే అమ్మాయిల కళ్ళు....పువ్వుల్లా నవ్వే పెదాలు ఇవి కొత్త వింతలయ్యాయి.
కాలేజి..ఫార్ములాలు .. నంబర్లతో కుస్తీ .. ఇల్లు .. రెట్టింపైన హోం వర్క్ ...నరకం అంటే ఇదే కాబోలనిపించేది.
పెద్దయితే ఏదో హాప్పీగా తిరగొచ్చు అనుకున్న కాని..more syllabus,more house hold work,, more self conscious...తో ఉన్న స్వేచ్ఛ కాస్త పోయింది .
ఇక క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళటం మెదలెట్టాను. సినిమాలంటే పిచ్చి ఎక్కువయింది , వారానికి మూడు సినిమాలు.హాల్లో సినిమా మారకపోతే చూసిందే చూడటం .. సినిమాకి డబ్బులు లేకపోతె కాలేజి కి దగ్గరలో ఉన్న గుట్ట పై కి వెళ్లి స్నేహితుడి తో లోకం .. జనాలు..దేవుడు.. ఫిలాసఫీ మాటలాడుకోవటంతో నా స్వేచ్ఛని తిరిగి పొందాను. తోచింది చేయటమే తప్పితే జీవితం, దాని సూత్రం ఏంటో పసి గట్టలేక పోయాను. .
......
ఇంకా ఉంది

RELICS OF KAAKATEEYAS ... అనన్యం.....అపూర్వం ...ఆశ్చర్యం .


నేను BFA సెకండ్ ఇయర్ లో ఉండగా.. audio visual show చేయాల్సిన ఒక assignment ఉండింది .. ఏం చేద్దామా అనిఆలోచిస్తే కాకతీయులు పరిపాలించిన వరంగల్ మీద చేస్తే బావుంటుంది అని అనిపించి .. ఒక నాలుగురోజుల schedule వేసుకున్నా.. ఒక ఫ్రెండ్ తో కలసి ఫోర్ట్ వరంగల్.. వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం . ఘనపూర్ కోటగుల్లు అన్నిచుట్టి slides షూట్ చేశా,
నా visuals explain చేసి నాకు స్క్రిప్ట్ ఎలా కావాలో చెప్పి.. మా ఫ్రెండ్ కిరణ్ కుమార్ తో తెలుగులోరయించిన స్క్రిప్ట్ఇది.. చాల బాగా రాసాడు.. దేన్ని నేను ఇంగ్లీష్ లో translate చేసి..presentation ఇచ్చాను ..మంచి response వొచ్చింది..
దురదృష్టవశాత్తు మా ఫ్రెండ్ కిరణ్ ఆ తరవాత మా కాలేజీ వదిలేసాడు. ఆపై ఇక కమ్యూనికేషన్ లేదు నాకు అతనికిమధ్య. ఎక్కడున్నాడో ఏమో..తెలిదు.. కాని అతడు రాసిన ఈ స్క్రిప్ట్ మాత్రం నా దగ్గరే ఉంది.. అతని గుర్తుగా ఇక్కడ అదిబ్లాగ్ గా రాసా ..
ఇంకో విషయం..నేను షూట్ చేసినవి slides, ( positives) .. అవి ప్రస్తుతం ఇక్కడ పోస్ట్ చేయలేకపోతున్నా. వీలైతేస్కాన్ చేసి.. పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాను...


"ప్రస్తుతం అఖండ భారత దేశానికే తలమానికం కాదగిన..అన్నపూర్ణ గ పేరు గాంచిన..ఆంధ్ర దేశాన్ని ఎందఱో రాజులుపరిపాలించగా తెలుగు బాషా ప్రధానమైన ప్రదేశాలను. ఏక చత్రాధిపత్యం కింద చేర్చింది కాకతీయులు. అనన్యసామాన్యమైన పోరాట పటిమ,అపూర్వ పరిపాలనా దక్షత, అద్వితీయ కళా పిపాస కలిగిన కాకతీయుల చరిత్రకు సాక్షాలు ఈ కళారూపాలు..
ఒకప్పటి ఓరుగల్లును..ఇప్పటి వరంగల్లు నీ రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయయుల పాలనలో జీవంపోసుకొని శిల్పంగా అవతరించిన ప్రతి శిలా మనకు వరం.
భారతీయ సంస్కృతికే ఒక కృతిని... ఆకృతిని కల్పించిన కళల్లో 'శిల్పకళ' ప్రముఖమైనది. తమలో దాగిన ఆగమజ్ఞాననిధిని, తత్వార్థఖని ని రాళ్ళల్లో ఇముడ్చిన కాకతీయుల ప్రతిభ
...అనన్యం.....అపూర్వం ...ఆశ్చర్యం .

స్పందిచే మనసుంటే ఇక్కడి ప్రతి రాయి సుమదురమే.. వీక్షించే కనులుంటే ప్రతి శిల్పం మనోహరమే. అద్భుతమైనకాకతీయుల కళామణిహారం లోంచి జాలు వారిన ఆణి ముత్యాలే ఈ రామప్ప దేవాలయం..స్వయంభుదేవాలయం..ఘనపూర్ కోటగుళ్ళు.
ప్రతి వ్యక్తి అంతరంగం లో సుమధుర తరంగాలను మీట గలిగిన ఈ శిల్పసంపద కొన్ని వందల సంవత్సరాల చరిత్రనుతనలో ఇముడ్చుకొందంటే అతిశయోక్తి కాదు. కాలగమనం తో పాటే తామూ గతించకుండా..ఎన్ని ప్రభావాలకి లోనైనా కూడా తమ ప్రాభవాన్ని కోల్పోకుండా పర్యాటకులకి ..."ఔరా".... అనిపించే రీతిలో నేటికి సజీవమై నిలుచుందీ కాకతీయుల ప్రతిభ .

పటిష్టమైన వాస్తు శాస్తం, విస్మయ పరిచే శిల్ప శాస్త్రాల కలబోత అయిన ఈ శిల్పసంపద... ఆ చంద్ర తారార్కం.
"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో..ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో " ఇక్కడి ప్రతి రాయికి బాష తెలుసు..భావం తెలుసు..అనుభూతితెలుసు..ఆర్ద్రత తెలుసు..

శౌర్యానికి సాహసానికి సింహం ప్రతీతి, అందుకే కాకతీయుల శౌర్యానికి పతీకగా "వ్యాలా" అవతరించింది. వీరి శిల్పకళలో 24 రకాల "వ్యాలా" లని చూడవచ్చు.
కాకతీయుల శిల్పకళా సౌరభాన్ని విరజిమ్మే మొదటి విరించి స్వయంభు దేవాలయం.అభేద్యమైన ప్రాకారాలతో, ఒకప్పుడు అనుపమానమైన ప్రాభవాన్ని గడించిన ఈ దేవాలయపు శిథిలాలే మనకు మిగిలిన అద్భుతాలు.
స్వయంభు దేయలయానికి నలువైపులా ప్రవేశ మార్గాలు ఈ కీర్తి తోరణాలు. ఏకశిలపై ఇంతటి కళను నిక్షిప్తం చేయటం ఒక ఎత్తైతే దాన్ని ప్రతిష్టించడం మరొక ఎత్తు.
కీర్తి తోరణానికి మకుతయమానం రాజహంస.
అపర పరాక్రమ వనిత రుద్రమదేవి ప్రతిరూపం "రాయగజకేసరి" శిల్పం .
భిన్న భంగిమలతో..విభిన్న వాయిద్యాలతో చెక్కిన శిల్పాలు, కాకతీయుల కళాభిమానాన్ని, సృజనాత్మకతని మనకి తెలియజేస్తాయి.
నల్లని గ్రానైట్ రాయిని సజీవ మైన "నంది" గా మలచిన కళాతృష్ణకి జేజేలు పలకాల్సిందే ..
శిల్పకలకే ఒక ఒరవడిని నేర్పిన ఇక రామప్ప దేవాలయ సౌందర్యం వర్ణనాతీతం. ఇక్కడి శిల్పాలు..వాటి లయ సౌందర్యం రామప్ప ఉలికి నీరజనాలర్పిస్తాయి .
సజీవ కృతి తమలో ఇముడ్చుకున్న "కరిరాజులు" రసస్పందనలో మునిగితేలే కళాహృదయాలకి గిలిగింతలు.

రాజ్యాలు పోయాయి... రాజులు పోయారు.. కాని మనం మన చరిత్రని సంస్కృతి ని ఎలుగెత్తి వినిపించేందుకు తమ జ్న్యాపకాలని మిగిల్చారు. ఆధునిక మానవ మనుగడలో.. తమ మనుగడకి బద్రత కరువై మౌనంగా రోదిస్తున్నాయి ఈ కళా రూపాలు..
వీటికి మనస్సుంది..ఆ మనస్సుకి స్పందన ఉంది ..తరతరాల చరిత్రని తమలో ఇముడ్చుకున్న ఈ శిల్పాలకి మాత్రం మానవ స్పందన కరువైంది.
చరిత్రకి సాక్షాలుగా నిలిచిన ఈ శిల్పాలు..తమని కొద్దిగా ఆదరించమని మౌనంగా అర్థిస్తున్నాయి..

ఆ నాటి శైశవాన్ని...అద్వైతాన్ని కంటికి రెప్పలా కాపాడుకోకపోతే అంతకు మించిన ..దుర్గతి... దుర్మతి ..దుర్హతి ఇంకొకటి లేదు."


Oct 20, 2009

ప్రేమసాక్షిగా ...



రఘురామ్ నాకు సీనియర్. బాగా చదివేవాడు .. నాకు maths లో ఏదైనా doubts వొస్తే చేపుతుండేవాడు. మా ఇంటికి దగ్గరగా ...ఊరికి  కొంచం దూరంగా ఉండేది అతడి ఇల్లు. తండ్రి టీచర్, తల్లి చాల మంచిది. రఘురామ్ ఒక్కడే వాళ్ళకి.
నేను ఒకరకంగా ఆకతాయినే, ఇంటర్ 2nd ఇయర్, చదువుపై అంతంత మాత్రం శ్రద్ధ. ఆటలపై ఎక్కువ ఆసక్తి. ఎంత సేపు క్రికెట్ అడదామనే. అందుకే ఇంట్లో వాళ్ళే నన్ను రఘు దగ్గరికి పంపేవాళ్ళు లెక్కలు నేర్చుకోమని.
మా ఇంటి పక్కనే సంపత్ ఉండేవాడు....అమ్మ నాన్న చెల్లి తో.. కాలేజీ లో చిన్న టైపు దాదా.. cricket matches ఆడుతూ, తగాదాల్లో పాలు పంచుకుంటూ..అమ్మాయిలని ఆటపట్టిస్తూ..ఒక ముగ్గురు నలుగురు గ్యాంగ్ తో తిరిగే వాడు.
నాకాశ్చర్యమేసింది .. ఇంట్లో వాళ్లకిది తెలుసా ?? తెలిసినా ఎలా ఉరుకుతున్నారని? మా ఇంట్లో మాత్రం చిన్న తప్పు చేస్తేనే వీపు మోగిపోయేది.
సంపత్ వాళ్ళ చెల్లి ..రోజా... పెద్దగా అందగత్తె కాకపోయినా బావుండేది..ఇంటర్ 1st ఇయర్... నేను సాయంతం మేడ పైన కూర్చొని చదువు తుంటే..తను వాళ్ళ మేడ పైకి వచ్చేది ..ఇద్దరం ఒకరికొకరం చూసుకునే వాళ్ళం.. అదో దివ్యానందం..ఒకమ్మాయి నన్ను హీరోలా ఉహించు కొంటుంటే కలిగే thrilling experience. కాని నా "ఆనందం" నాది కాదని తెలిసింది.
ఒక రోజు మేడ మీద చదువుతున్నాను :).. అదే ....రోజా కోసం ఎదురు చూస్తున్నాను. ఎంతకీ రాలేదు..నాకు కోపం,బాధ రెండూ పెరిగిపోతున్నాయి..ఇంతలొ light pink nighty లో దర్శనమిచింది. ఆనందం ఎక్కువై... దైర్యం చేసి హాయ్ అని చేయి ఉపాను గాల్లో..తను కూడా అలాగే చేసి.. నన్ను వెయిట్ చెయ్యమని చెప్పి కిందకు వెళ్ళింది.. ఓ పది నిముషాల తరవాత వొచ్చింది..ఆ పది నిముషాలు నేను గాల్లో తేలాను.. ఏదో కాగితాన్ని ఉండాలా చుట్టి, మా మేడ మీదకి విసిరేసింది.. నేను రెండూ సెకన్లు షాక్ , కాని మళ్లీ దివ్యానందం చుట్టుముట్టింది..మొదటి ప్రేమలేఖ అందుకున్నందుకు..గబగబా విప్పి చూస్తే అందులో రెండూ చీటిలున్నాయి. మొదటిది చిన్నది..అది నాకు..అందులో.." hi ,you are my best and close friend కదా...please help me..Im in love with raghuram.. give the letter to raghu.. plese హాన్ please..."
....తేరుకున్నాను,ఒక రెండు నిముషాల తరవాత.. ఈ వారం రోజులు ఎంత హుషారు నాలో. పనులన్నీ చక చకా చేసేస్తున్నాను,, అమ్మ కూడా ఆశ్చర్య పోయింది..క్రికెట్ ఎందుకు మనేశాడా అని...రోజా నా సీనియర్ అయిన రఘురాం ని ప్రేమిస్తోంది.. నేను రోజు అతని దగ్గరికి వెళ్తున్నానని నాతో క్లోజ్ గా ఉంటె mediator లా వాడుకోవొచ్చు అని ముందు నన్ను పడేసింది... అమ్మ అమ్మాయిలు చాల ఫాస్ట్.. అనుకోని రెండో లెటర్ తీసాను. చదవాలనిపిచలేదు.. అయినా రఘురాం చాల సిన్సురే, చదువు తప్ప వేరే ధ్యాస లేదు. కాలేజీ లో తలెత్తి అమ్మాయిల వైపు చూడదు, క్రికెట్ ఆడడు. ఈ అమ్మాయిని ప్రేమిస్తాడా ..ప్రేమిస్తున్నాడా.. అంతా అయోమయం..కాని ఇలాటి వాళ్ళే ముదుర్లని, రఘుకి letter ఇవ్వగానే తెలిసింది. నేను letter ఇవ్వగానే,, చదవకుండానే చెప్పేసాడు.. తను రోజా ప్రేమించు కుంటున్నట్లు . మరి ఎప్పుడూ అలా కనపడ లేదే ? అన్నాను అమాయకంగా..
ఇందులో కనపడటానికేముంది .. రోజు ఇద్దరం కాలేజీ లో ఒకరి నోకరం చూసుకునే వాళ్ళం.. ఒక రోజు నేనే చెప్పాను తనంటే నాకిష్టమని.. తనూ నాకు చెప్పింది,, కాని కాలేజ్ లో మాట్లాడుకోము..ఇద్దరం sincere స్టూడెంట్స్ మే కనక బయట పడలేదు విషయం.. నికు తప్ప వేరే వాళ్ళకి తెలియదు.. please ఎవ్వరికి చెప్పకు.. అని తానో letter ఇచ్చాడు, రోజా కివ్వమని.. నా బ్రతుకు ఇలా కాకి ల కబుర్లు మోసే బ్రతుకైపోయింది,. ఇక నేను మళ్లీ క్రికెట్ లో మనసు పెట్టాను.. ఈ పక్క వారానికోసారి లెటర్స్ అందిస్తూనే ఉన్నా.

అ రోజు maths exam అనుకుంటా ..ఆరోజు ఉదయమే letter ఇచింది రోజా, నెక్స్ట్ డే నాకు maths exam కనక సాయంత్రం రఘువాళ్ళ ఇంటికెళ్ళాను ..వెళ్ళేసరికి రఘు లేడు.. మేడ పై కూర్చో వస్తాడు అంది వాళ్ళమ్మ . సరే అని వెళ్లి కూర్చున్నాను... ఎంతకీ రాలేదు.
ఆ రోజు మధ్యాన్నం.. అంటే రోజా కి maths exam ఐపోయాక.. ఇద్దరు కలిసి సినిమాకి వెళ్లారు..చాల dare చేసి.. ఎందుకంటే మాది చిన్న టౌన్.. ఎవరు ఎక్కడ కనపడినా తెలిసిపోతుంది. సాయంత్రం నేను రఘు వాళ్ళింటికి వచేముందు...ఎవరో కొత్త friend రఘుని తీసుకెళ్ళాడని తెలిసింది.

కొద్ది సేపు అలానే కూర్చున్న ఏవో లెక్కలు చేసుకుంటూ.. ఇంతలొ..పెద్దగా ....రఘూ... రఘూ ఏడుపులు , అరుపులు వినపడుతుంటే.. కిందకు దిగాను.
నలుగురు కుర్రాళ్ళు.. రఘుని మోసుకొస్తున్నారు..ముఖం అంతా రక్తం,,, కళ్ళజోడు పగిలిపోయింది... .. చచ్చి పోయాడు..రఘు చచ్చి పోయాడు... కాదు...... రఘుని చంపేశారు..,,కొట్టి చంపేశారు...

Oct 19, 2009

'మళ్లీ మొదటికొచ్చిన జీవితం '



Times of ఇండియా ఆఫీసు. సాయంత్రం 4.30.నిముషాలు..
bike visitors stand లో park చేసి.. లోపలికెళ్ళాడు..
." I want tho meet miss divya Mukharjee"
" OK please take ur seat".
సమాధానం విని పక్కనే ఉన్న సోఫా లో కుర్చున్నడతాను.. average buildup తో.. జీన్స్ పై T షర్టు వేసాడు.
చూడటానికి బానే ఉన్నాడు.. కొంచం టెన్షన్ గా ఉన్నట్టున్నాడు..కాలుని అదే పనిగాఉపుతున్నాడు.
ఇంతలొ "NIE candidates..ఇతనితో 4th floor కి వెళ్ళండి" receptionist చెప్పింది..ఒక ఆఫీసు బాయ్ ని చూపిస్తూ..
అదివిని..అతను మెల్లిగా లేచి ఆఫీసు బాయ్ నీ అనుసరించాడు..అలాని..తనతో పాటుగా వస్తున్న ఒక నడివయస్కురాలిని, పక్కనే ఉన్న అమ్మాయిని గమనించలేకపోలేదు..
అసలు చెప్పాలంటే..అతని కల్లెప్పుడు అమ్మాయిలనే చూస్తుంటాయి..అందాలని చూస్తాయి..అంచనా వేస్తాయి... హృదయం ఉందా అని వెతుకుతాయి...తనని ఒక వాలు చూపు చూడమని అర్థిస్తాయి ..చూడకపోతే విసుక్కుంటాయి ..చూస్తే విచ్చుకుంటాయి ..
అలా 4th ఫ్లోర్ కి వెళ్ళి ఒక హలో కూర్చున్నాడు.. ఇందాక చెప్పిన అమ్మ..అమ్మాయికూడా కూర్చున్నారు పక్కనే.
అ అమ్మాయే పలకరిచింది..
your dept?
"...Photography"..
yours name ??
చెప్పాడతను...
qualification??
XXXXXXX
good can u work for me ?
ohh sure ..
అలా ఇద్దరు పరిచయం అయ్యారు. 

ma
orientation class అయ్యాక..
"u want to have something like coffee ??" అంది madam
no.. thanks, I got to go ..అంటు.. నడివయ్స్కురాలు.. వెళ్ళిపోయింది..
ఆతను ఆ అమ్మాయి మిగిలారు..
( అలా అని నేను సంబోదిస్తున్నాను.. అతనైతే.. madam ని కూడా అదోలా చూసాడు)
"oh సరే" అన్నాడతను ఏ మాత్రం సంకోచించకుండా, అమాయి కూడా సరే అనడం తో ముగ్గురు
.. terrace పైన ఉన్న cafeteria కి వెళ్లారు.. అక్కడ ఏదో అవి ఇవి మాట్లాడి.. madam కి BYE చెప్పి ఇద్దరు కిందకి వోచ్చేసారు . అలా ఇద్దరు కిందకి వచ్చేటప్పుడు ...(అ) ప్రయత్నంగా ఆమె భుజాన్ని  భుజం తో  తాకాడు, కింది  చేతులు మాత్రం ఆమె ఉరువులని సుతారంగా రాసాయి ఒకసారి. దాంతో ఆమె చటుక్కున అతని కళ్ళలోకి చూసింది...కళ్ళు కళ్ళు సూటిగా కలిసాయి , ఆమె పెదవి చివరన చిన్ని చిరునవ్వు విరిసింది.చెంపల్లోకి నును సిగ్గు చేరింది. వెన్నులోంచి చిన్న జలదరింపు పాకింది. ఇవ్వన్నీ గమనించిన అతని   మనసు మనసులో లేదు. ఏదో ఉహాలోకంలో తేలిపోయింది....ఇదే సరిగ్గా ఇలాంటి సమయం లోనే కొంచం చొరవ చూపితే విచిత్రాలు జరగవచ్చని ఎవరో చెప్పిన గుర్తుకు వచ్చింది. అందుకే ఏదో ఒకటి చేయాలి.. కాని ఏం చేయాలి ?? తెలిదు  
అ అమ్మాయి వాష్ రూం కి వెళ్లి వొస్తానని చెప్పింది . సరే వెళ్ళొస్తా bye అని చెప్పక.. వాష్ రూం కి వెళ్ళొస్తా  అని ఎందుకు చెప్పినట్టు ?? తనని 'ఆగు వస్తా' అని చెప్పినట్టా ?? ..లేక ఇంకా ఏదైనా అర్థం దాగుందా..లేక casual గా చెప్పిందా..  ఖచ్చితంగా తనని ఉండమనే చెప్పింది. సో ఆమెని ఇంటిదగ్గర DROP చేస్తా అని అంటే.. ఆమె ఒప్పుకుంటే..ఇంటికి వెళ్ళాక కాఫీకి రమ్మంటే.... ఉహాలు పరుగులు తీసాయి. దైర్యం కూడ తీసుకున్నాడు   ...బయటకి వొచ్చేలోపు ..మనవాడు.. బైక్ పై గేటు ముందు రెడీ గా ఉండి .. అడిగాడు.. " shall I drop you somewhere??

ప్రేమ.. స్నేహం.. జాలి.. దయా.. కరుణా.. ఏ కోశానా  లేకుండా,  ఏమాత్రం ఆలోచించకుండా..అంది ఆమె.
"no thanks" 

సమాధానం విని.. 'మళ్లీ మొదటికొచ్చిన జీవితం తూ  ' మనస్సులో విసుక్కొని బైక్ ని ముందుకి పోనిచ్చాడు ..

ఎన్నాళ్ళని ???


చక్రీ.... ఎన్నాళ్ళని కలల్లో బ్రతుకుతావు?? ఏదో అదృష్తం తలుపు తడుతుందని..ఎవరో వస్తారని..ఏదోచేస్తారని..ఎన్నాళ్ళు??
అవును నాకు తెలుసు, నేనంటే నీకిష్టం..కాని కేవలం ఇష్టం ఉంటె సరిపోతుందా....? కలసి బ్రకాలంటే ఏదో ఒకటి చేయాలికదా..ఎన్నాళ్లని ఆగను ... నీకోసం .. నీ సక్సెస్ కోసం .??
నీకు తెలుసా సగటు ఆడపిల్ల ఎం కోరుతుందో..??
...పెళ్లి.. మనసు అర్థం చేసుకొనే భర్త... ఇల్లు.. ముచ్చటైన పిల్లలు..ఇంతే...
నేనో సగటు ఆడపిల్లని చక్రీ... నీ కలలతో నాకు పనిలేదు.. నీవేం చేస్తావో కూడా నాకు తెలియదు.. నాక్కావలసింది..ఇవే. నీవీయగలవా ?? లేవు... ఇవ్వలేవు.. ఇచ్చే పరిస్థితుల్లో లేవు..
గత రెండేళ్లుగా నీకోసం వేచాను. కాని నీ జీవితం లో ఎలాంటి మార్పు లేదు..కలుస్తావు..ఏదేదో చెపుతావు..సినిమాఅంటావ్..ప్రాజెక్ట్స్ అంటావ్..ఫోటోగ్రఫీ అంటావ్.. కాని అన్ని కథలే.. అన్ని కలలే.. ఒక్కటి జరుగుతుందో లేదోతెలిదు..నాకు నమ్మకం పోయింది. ఎన్నో సార్లు నీకు చెప్పాలని ప్రయత్నిచాను. జీవితం అంటే కల కాదని..కానినామాటలు నీకేక్కలేదు.. ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడు చక్రీ.. చదువు ఐపోయింది అనుకున్న ప్రతివాడుఏదో ఒక పనిచేస్తూ. డబ్బు సంపాదించుకుంటున్నాడు..తనకి తగినంతలో ఎవరినో ఒకరిని చూసుకొని పెళ్లి చేసుకొని....ముందుకువెళ్తున్నాడు .. కలకి, వాస్తవానికి తేడా తెలుసుకొని ..నిజంలో బ్రతుకుతున్నాడు.

సరే ఇవన్నీ... ఎన్ని చెప్పినా లాభం లేదని తెలుసు..అసలు విషయానికి వస్తాను.. నాకు వచ్చే నెల 12 తారీఖున పెళ్లి.. రాజేష్ తో ..software engeneer.... పెళ్లి హైదరాబాదు లోనే....నీకు రెండేళ్ళు టైం ఇచ్చాను అర్థం చేసుకోలేదు.. అందుకే నిరయానికి వచ్చాను..అన్ని వైపులనుండి వచ్చే వోత్తిడులకి తల వోగ్గాను.. అర్థం చేసుకుంటావనిఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంత కంటే నాచేతుల్లో ఏమి లేదు..ఏమి చేసే పరిస్థితుల్లో లేను..

పెళ్ళికి తప్పక వస్తావని..ఆశిస్తున్నాను..
చివరగా ఒకమాట.. మళ్లీ అదే మాట..
చక్రీ...దయచేసి వాస్తవ ప్రపంచంలో బ్రతుకు..

- సదా నీ విజయాన్ని కోరుకునే
సు చి త్ర

Oct 18, 2009

హాలిడే హోం వర్క్



వెంకటప్పయ్య..(వెంకి) ఆరో తరగతి చదువుతున్నాడు.. పరిక్షలు ఐపోయాయి..ఇక పదిహేను రోజులు సెలవులు.. ఆనందం తో ఎగురుకుంటూ..క్లాసు బయటికి పరిగెత్తాడు ఫ్రెండ్స్ తో.
ఎన్నో ఉహలు మొదలయ్యాయి ..బాగా నిద్రపోవాలి....క్రికెట్..ఫ్రెండ్స్..ఇష్టమైనవని తినటం..తాతయ్యతో కబుర్లు..అక్కని ఏడిపించటం...కాని ఇంతలొ..మరో అనౌన్స్మెంట్..
"every one should write the answers for the exam question papers in the holidays"

విన్నాడు..కాని పట్టించుకునే స్థితిలో లేడు..
చలో పదా అని ఏదో ఉహాలోకం పిలుస్తుంటే.. సరిగమలే తెలియని రాగం పాడుకుంటూ..
మాది బిందాస్స్టైల్..పెద్దలకే నేర్పిస్తాం అంటూ  వెళ్తున్నాడు.  ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కడెక్కడో తిరిగి..ఇల్లు చేరుకున్నాడు.
సెలవుల్లో  క్రికెట్, సినిమాలు,వీడియో గేమ్స్ తో యమ busy అయిపోయాడు. అక్కయ్యని కాక పట్టి.. ఎలాగోలా.. అన్ని హోం వర్క్ లు పూర్తి చేసాడు...కాని సోషల్ పేపర్ మాత్రం కనపడక చేయలేదు.  అస్సలే సోషల్ టీచర్ అంటేఅందరికి హడల్.
అప్పటికి  ..ఒకరిద్దరు ఫ్రెండ్స్ ని అడిగాడు..కానీ  దొరకలేదు..టెన్షన్ మొదలైంది..
కలల్లో సోషల్ టీచర్ భయపెడుతూ ఉంది .
సెలవులు ముగిసాయి.. మళ్లీ స్కూళ్ళు తెరిచారు. పొద్దున్నే నిద్ర లేపారు వెంకిని.. ఇన్నాళ్ళు పోద్దేక్కే వరకు నిద్రపోయిన  అలవాటుకి...లేవాలనిపించలేదు. కడుపునొప్పి...కూడా రక్షించలేక పోయింది.. బద్దకంగా లేచి తయారయ్యాడుస్కూల్ కి.. 

దారిలో..అన్ని తనకి నచ్చినవి చూస్తుంటే ఏడుపొచ్చింది..తనలాగే చాలమంది పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు.. ఆటోల్లో ..బస్సుల్లో ..కొంతమంది..happygaa..కొంత మంది sad గా ..

అప్పటికే prayer స్టార్ట్ అయింది.. గేటు ముందు కూర్చున్నాడు భయంగా...బాధగా..
బాగ్ లో ఏదో తగిలింది.. తీసి చూసాడు ... cadbury.. అక్క పెట్టింది.. తను ఎంత ఎడిపించినా అక్కకి తనంటే ఎంత ఇష్టం అనుకున్నాడు.... ..ఒక చిన్న నవ్వు అ చిరుపెదాలపై మెరిసింది....prayer ఐపోయింది.. లోపలికెళ్ళాడు..క్లాసు రూం అంత గోల గోలగాఉంది.
అందరూ హాలిడే హోం వర్క్ చేసినట్టున్నారు... ఆనందంగా అరుస్తున్నారు..
..వెంకికి మాత్రం.."సోషల్ టీచర్" భయం ...టెన్షన్ పెరిగిపోతోంది... ఇంకో రెండు నిముషాల్లో ఏమవుతుందో అని... మరి అలాంటి పరిస్తితుల్లో వెంకి ఎలా తప్పించుకున్నాడు అనేది  ఈ సినిమా

సినిమాలో రెండు సందర్భోచిత పాటలు.. ఒక ఎంద టైటిల్ సాంగ్ ఉన్నాయి.
కింది లింక్ లో విని అభిప్రాయం తెలియ చేయండి

  Powered by     eSnips.com