నిన్న సాయంత్రం .. సర్వీసింగ్ కి ఇచ్చిన బైక్ తెచ్చుకుందామని నారాయణ గూడా వెళ్ళాను. సెలవులు ముగిసి కాలేజీ లు మళ్ళి మొదలయ్యాయిగా.. బస్సు స్టాప్ లో ఫుల్లు గా అమ్మాయిలూ అబ్బాయిలు.. నవయవ్వనులు..గుంపులు గుంపులుగా..
ఏది fashion నో ఏది కాదో.. ఏది తమంకి నప్పుతుందో ...ఏది నప్పదో.. ఏ రంగులు తమకి సూట్ అవుతాయో..ఏవి కావో...తెలుసో లేదో కాని ఒక్కోరు ఒక్కోరకంగా..
ఒకడేమో వచ్చిరాని మీసాలని నున్నగా గోరిగేసాడు.. ఇంకోడు ఫ్రెంచ్ గా మార్చేశాడు.. మరొకడు Goate పెట్టాడు, ఒకడు జులపాల జుట్టు తో..ఇంకోడు ఆల్మోస్ట్ గుండు తో. కత్తి యుద్ద కాంతారావులా కాళ్ళకి చుట్టుకుపోయిన పాంట్లు, పొట్టి చేతుల T shirts ..ముదుకు పొడుచుకొచ్చినట్లు కనబడే రంగు రంగుల కాన్వాస్ shoe , పాపం కొంత మంది మాత్రం మధ్యతరగతిని ప్రతిబింబిస్తూ ఇవేవి లేకుండా.. 'సింపుల్.' .గా ఉన్నారు. కాని అందరి attitude లో ఏదో తెలియని నిర్లక్షం కనపడుతోంది.. ఎవరు ఎలా ఉన్నా అందరి చూపులు మాత్రం అమ్మాయిల వైపే...
ఇహ అమ్మయిలేమో..పాత బడ్డ fashion చుడీ దార్ లలో..కొంతమంది షేపులు కనపడే లేగ్గింగ్స్ తో కొందరు ఇందాక చెప్పిన జీన్స్ ,అప్పుడే వికసిస్తున్న అందాలు కనపడేట్టు T షర్టు... జుట్టు విప్పేసి ఓ పిల్ల..గుర్రం తోకలా ఉన్న జుట్టుతో ఇంకో అమ్మాయి.,, బాబ్డ్ హెయిర్ కట్ తో మరో అమ్మాయి.. .నడుం దాకా రావాల్సిన జడ మెడ దగ్గరే ఆగిపోయిందో పిల్లకి...;)
వీళ్ళకీ మనసంతా అబ్బాయిల వైపే ఉన్నా...అదేమీ లేనట్లు నటిస్తున్నారు..కాని అప్పుడప్పుడు దొంగ చూపులు చూస్తున్నారు..స్నేహితురాళ్ళతో గుసగుసలలో నవ్వుతున్నారు. కొందరు మౌనంగా దిక్కులు చూస్తున్నారు..ఇంకొందరేమో.. 'అబ్బ ఛీ' అన్నట్టు మొహం పెట్టారు.
మొత్తం మీద బోయ్స్ n గాళ్స్ మనస్సులో ఒకే భావం...ఒకే తపన.ఒకే ఆరాటం..ఏకే ఉబలాటం..ఏదో శక్తి..ఏదో ఆసక్తి,,,ఏదో ఆశ,,ఏదో నమ్మకం.. ఏదో...ఏదో..ఏదో.. అదే యవ్వనం తాలూకు చిన్హం.
No comments:
Post a Comment