మూడక్షరాల పదం ...
జీవితం లో గెలుపు కన్న ఆనందం ముఖ్యం. ఒకవేళ గెలుపే ఆనందం అయితే గెలవాలి.
కాని కొన్ని సార్లు గెలుపు కుడా ఆనందాన్ని ఇవ్వలేదు. కళింగ యుద్ధం తరవాత అశోకుడికి ఆనందానికి బదులు బాధ వేసింది.
మనకి కావాలనుకున్నది పొందటమే ఆనందం అయితే ఆ ఆనందం ఆనందం కాదు. మనకి కావాల్సింది పొందాం కాని ఏం కోల్పోయి పొందాం అన్నది ప్రశ్న.
అందుకే చెప్పారు గెలవటం కాదు పాలుగొనటం ముఖ్యం అని.
గమ్యాన్ని చేరుకోటం ముఖ్యం కాదు, ఆ చేరుకునే దారిలో ఎన్ని అనుభూతులు, ఎన్ని అనుభవాలు ఉన్నాయనేది ముఖ్యం.
No comments:
Post a Comment