Jun 19, 2011

నేను మనిషిని.


ఓ వేసవి సెలవుల్లో ఉరువెల్లి హాయిగా పొద్దు మాపు తిని పడుకుంటున్నా. మధ్యలో పుస్తకాలు తిరగేస్తూ.
ఓ రోజు పొద్దున్నే ఎక్కడినుంచి వచ్చిందో ఏంటో ..ఓ బుజ్జి కుక్క పిల్ల వచ్చింది లోపలికి .వెల్లగోట్టాను.. కాని కొద్దిసేపటి తరవాత మళ్ళి వచ్చేసింది. ఎన్ని సార్లు వెల్లగోట్టినా మళ్ళి మళ్ళి సిద్దం అయ్యేది. ఏం చేయాలో..ఎలా వెల్లగోట్టలో తెలియలేదు. ఏదో రునానుభంధం ఉందేమో...సరేలే అని వదిలేసాం.
ఒక పగిలిపోయిన కుండ పెంకు లో అన్నం,పాలు కలిపి పొద్దు మాపు పెట్టాం. అలా పది పదిహేను రోజులు గడిచిపోయింది,
ఇంట్లో వాళ్ళం ఎవ్వరం వచ్చినా  ..చిన్ని తోక ఆడించటం.. కాళ్ళు రాసుకుంటూ ప్రేమని వ్యక్తం చేయటం..వగలు పోవటం...అన్ని చేసేది..ముచ్చటగా అనిపించింది..అదే తెలియని మొహం రాగానే పెద్ద గొంతు తో ఒకటే అరుపు.  ఇంటి ముందు సింహం లాగా కూర్చునేది వచ్చిపోయే వారిమీద అరుస్తు . ఎక్కడెక్కడో తిరిగి హుందాగా ఇది నా ఇల్లు అన్నట్టు వచ్చేది. తనకోసం వేసి తట్టు సంచిలో..ఏదో ఆలోచిస్తూ పడుకునేది.. టైం కి అన్నం వేయాల్సిందే..కొంచం అటు ఇటు అయినా కుయి కుయి మంటూ గోల.. చంటి పిల్లాడి లాగా.. తన ప్రేమ... కోపం..అయిష్టం...ఏదో రకంగా వ్యక్తం చేసేది. ఎన్ని వగలో..
బాగానే అలవాటయ్యింది..దాంతో..
ఒకరోజు దాన్నే గమనిస్తున్నాను...ఉరికే మెడ గోక్కున్తోంది మాటి మాటికి.  కుక్క అన్నాక గోక్కోదా అని పట్టించుకోలేదు....ఓ రెండు రోజులుగా అది ఎక్కువ టైం  గోక్కోవటమే చేస్తోంది ..దానికో తోడు ..కొంచం కొంచం బొచ్చు రాలి పోవటం మొదలైంది. మాకేం తెలుసు రాలిపోయి మల్లి వస్తుందో..ఏంటో...అనుకుంటున్నాం...కాని రోజు రోజుకీ దాని బాధ ఎక్కువవుతోంది.. తిండి తగ్గించి...తిండికోసం అరవటం  మానేసింది.. పదిరోజుల్లో చాల బలహీనంగా తయ్యారయ్యింది.  ఎం చేయాలో తోచలేదు.
అలవాటు లేని విషయం.. కావాలని తెచ్చుకున్నది కాదు కూడాను. చూస్తున్నాం కాని ఏమి చేయటం లేదు.
ఉన్నచోటు నుండి కదలదు...ఉరికే మొహం చూస్తుంది.... దీనంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి ..తోక  అడిచటం కుడా లేదు..పాపం శక్తి లేదేమో..

మూడురోజులైంది అన్నం ముట్టటం లేదు..జ్వరంగా ఉందేమో.. తెలిదు. ఇహ మా అన్నయకి చెప్పి బండి తీసి డాక్టర్ దగ్గరికి తెసుకేల్దాం అని ఇద్దరం రెడీ అయ్యాం.. ఒక పాత తువ్వాలు తో దాన్ని తీసుకొని బండి ఎక్కగానే..ఉంటేనా..చంగున దూకి పారిపోతోంది. అలా ఎంత ప్రయత్నించినా నావల్ల  కాలేదు దాన్ని పట్టుకోవటం.
సరే అని మేమే బయలు దేరాం డాక్టర్ దగ్గరికి.. వెళ్లి విషయం చెప్పాం.. ఏదో ఒక టోనిక్..కొబ్బరి నునే లో కలిపి పుయాటానికి ఆయింట్మెంట్  రాసిచ్చాడు. 

ఎంత ప్రయత్నించినా అది పాలు కుడా తాగటం లేదు. ఇహ టానిక్ కలిపిన పాలు అసలే తాగటం లేదు. అప్పటికి ఇహ విధి లేక దాని నోరు తెరిచి పోసాం ..మహా అంటే రెండు గుక్కలు..కాని తప్పించుకొని మూల కూర్చుంది..
ఆయింట్మెంట్  వంటినిండా పూస్తే..విదిలించింది..దుమ్ములో పోర్లాడింది. 
నీ ఖర్మ అని వదిలేసాం.
తిండి అసలే ముట్టక..ఐదు రోజులై..నిలబడే శక్తి లేక... లేచి నిలబడితే కూలి పడిపోతోంది..చంటి పిల్లాడి లాగా ఎంతో హుషారుగా ఉండేది..అయ్యో ఎలా ..ఎం చేయాలి అని అనుకున్నా కాని ఎం చేసే పరిస్థితి లేదు.

ఆ రోజు మధ్యానం రెండు  అయ్యిందనుకుంటా.. కుక్కపిల్ల పరిస్థితి ఏంటా  అని బయటికి వచ్చా.. నన్ను ఒక దీనాతి  దీనమైన చూపు చూసింది..అతి బలహీనంగా తోక ఆడించి.. నిలబడింది..నావైపు ఒక అడుగు వేసింది.. కూలబడింది...
అంతే...ఆ జీవి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి...

అమ్మా అని గట్టిగా కేకేసా.. కదిపి చూసాం.. కాని లేవలేదు. తోక అడిస్తుందేమో అని ఆశపడాను... దాన్ని చూస్తూ  సాయంత్రం ఏడింటి వరకు గడిపా.. కాని చలనం లేదు. ఏదో జడపదార్థం లా అయిపొయింది..

ఒక సంచిలోకి దాన్ని వేసుకొని..మాఇంటి వెనకాల ఉన్నా రైల్వే ట్రాక్ అవతల ఉన్న దట్టమైన చెట్లు వైపు బయలుదేరాను. అక్కడ దట్టంగా పెరిగిన ఒక పొద చూసి పొదల్లోకి విసిరేసాను సంచీ ని.. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసా..
ఇంటికి రాగానే బాత్రూం లో కూర్చుంటే..మా అమ్మ రెండు బిందెల నీళ్ళు గుమ్మరించింది నా మీద. ఏ ఋణానుభంధమో అంటూ.

ఏ భందమో..ఏ స్నేహమో.. ఏ భందుత్వమో.. ఎక్కడినుంచి వచ్చిందో... ఇరవై రోజులు..ఒక చిన్ని బంధం  పెనవేసింది....కాని అంతలోనే...కళ్ళముందే ...ఇలా జరిగింది. అంతే జీవితం...అంతే బంధం.

అన్నింటికంటే నన్ను బాధించింది, నామీద నాకే  సిగ్గుగా అనిపించింది  ఒకే ఒక్క విషయం..
విసిరేసాను.. నిర్దాక్షిణ్యంగా విసిరేసాను సంచినీ.. కనీసం  సంచీని పదిలంగా పొదల్లో పెట్టొచ్చు..లేదా గుంతలో  పూడ్చి పెట్టేయవచ్చు. కాని చేయలేదు..విసిరేసాను..
ఎందుకంటే .. దాని మొహాన్ని మళ్ళి చూసే దైర్యం లేదు నాకు..ప్రేమ  లేదు నాకు ..గుండెని రాయిని చేసాను..చేసుకోగల సమర్థుడిని. ఎందుకంటే.......నేను మనిషిని.

కన్నీళ్లు ధారకడుతున్నాయి..

3 comments:

Anonymous said...

అయ్యో! నోరు లేని మూగజీవులు తమ బాధ ఇదీ అని కూడా ఎవరితోనూ చెప్పుకోలేవు కదా! దాన్ని తన్ని తరిమేయకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి మీకు చేతనయినంత మీరు చేశారు. దాని ఆయువు అంతవరకే ఉంది అంతే.

Anonymous said...

అయ్యో! నోరు లేని మూగజీవులు తమ బాధ ఇదీ అని కూడా ఎవరితోనూ చెప్పుకోలేవు కదా! దాన్ని తన్ని తరిమేయకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి మీకు చేతనయినంత మీరు చేశారు. దాని ఆయువు అంతవరకే ఉంది అంతే.

praveena said...

నేను రెగ్యులర్ గా మీ బ్లాగ్ చదువుతూ వుంటాను. మీ పోస్ట్ అన్నీ చాలా touching గా వుంటాయి.