నాకు నేనే ముఖ్యం.
నా అనుభవాలు .. నా ఆలోచనలు..అనుభూతులు.. జ్ఞాపకాలు ఇవే నా జీవితం.
నా పుట్టుకకు ముందున్న చరిత్ర ..నాకోసం కొంత నేను తెలుసుకున్నాను..
తొలుత
గా నాకు తెలీక కొన్నింటిని అంగీకరించాను.. తెలియదు కనుక ఇంకోన్నింటిని
ఇంకా అంగీకరిస్తున్నాను. కొన్నింటిని ఒప్పుకున్నాను.. కొన్నింటిని
మార్చుకున్నాను. కొన్నింటికి తప్పక..తప్పించుకోలేక చేస్తున్నాను.నిరంతరం "జీవితాన్ని" అన్వేషిస్తున్నాను.
నా పుట్టుకని అర్థం నాకింకా బోధ పడలేదు. పడుతుందో లేదో కూడ తెలిదు.
దేవుడు ఉన్నాడో లేడో అన్నది కాదు నా ప్రశ్న.. నమ్ముతున్ననా లేదా అన్నదే సందిగ్ధం...
మనిషిని నేను దేవునిగా అంగీకరించను. కేవలం పరమాత్మ తత్వాన్ని ప్రభోదించే గురువు గా మాత్రమే అనుకుంటాను. నేను ఫోటోగ్రాఫర్నీ కాను.. సినిమాటోగ్రాఫర్ని అంతకన్నా కాదు..
దర్శకుడిని కానే కాను..రచయితని అసలే కాను.
నేను ఎవరినీ కాను..ఏమీ సాధించలేదు..కేవలం ఆశ పడ్డాను అంతే.
చెప్పటం నాకు రాదు.. చేయటం చేత కాదు.
నేనొక ప్రకృతి ప్రేమికుడిని,కళారాధకుడిని, స్వేచ్చా వాదిని, సత్యాన్వేషిని.
అసలుగా చెప్పాలంటే పరమ 'పలాయన వాదిని.'
No comments:
Post a Comment