నేను చాలా డిఫరెంట్, .. అందరి లాగే.. (తోక్కేం కాదు )
చెప్పేది సూటిగా గుచ్చుకునేటట్టు చెప్పేస్తా..(రక్తం రాదులెండి)
ఎదుటోడిని కాల్చుకుతినడం అలవాటు. అంటే..నిజం నిప్పులాంటిది మరి. నా తప్పేం లేదు.
పొద్దున్నే లేచి ఓ డబ్బా కట్టుకొని బస్సులో వేళాడి ఆఫీసుకి
వెళ్ళటం.. ఏం చేస్తున్నామో తెలీకుండా చెప్పింది చేసి ఉసురు మంటూ కొంపకి
రావటం నా వాళ్ళ కాదు.
ఇంక చాలు లేవరా బాబు అనిపిస్తే నిద్ర లేవటం. చేయాలి అని అనిపించినపుడు మాత్రమే పని చేయటం. ఒక్క సారి ఏదైనా వర్క్ కి
కమిట్ అయితే చేసి తీరటం, (ఇంతవరకు కాలేదు, ఎప్పుదవుతానో తెలిదు, హి హి )
ఇది నా లైఫ్ స్టయిలు. (lazy ఫెల్లో అని చెప్పు, నీకు కరెక్ట్ గా సూట్
అవుతుంది )