Mar 31, 2011

గీతాంజలి - 2




గీత నాన్న..డాక్టర్ శర్మ ని కలుసుకుంటాడు ప్రకాష్. గీతకి గుండె కి ఉన్న ప్రాబ్లం చెప్పి..గీత ఇంతకాలం  మా మాధ్య ఉండటం మా అదృష్టం..ఈ అదృష్టం ఇంకెంతకాలం ఉంటుందో అని తన బాధనీ ఆనందాన్ని  కలిపి చెపుతాడు.

 నీకు Congenital హార్ట్ అంటే ఏంటో తెలుసా  ? 
ఉహు..
పక్కన ఉన్న పిల్లల గ్యాంగ్ మొత్తం టకా టకా అని చెప్పేస్తారు.
తెలిసి ఇలా ఉండగాలిగావా ??
హా ..
ఎలా ??
పూర్తి వ్యాసం కోసం  నొక్కండి 
   

Mar 30, 2011

నేను


అందరూ ..ఆంధ్రాకో..తెలంగాణాకో... ఇంకోదేశానికో ...ఇంకెక్కడికో..పొట్ట చేతబట్టుకొని వచ్చారేమో .. నేనైతే ఈ భూమ్మీదకే పొట్టచేతబట్టుకొని వచ్చాను . నా నెత్తిమీద ఉన్న ఆకాశమే నా దేవుడు...నా కాలికింద ఉన్న నేలే నా తల్లి... నా చుట్టూ ఉన్న ప్రకృతే నాదేశం..నా మనసే నా రాజ్యం..నా చేతిలో ఉన్న పనే నా మనీ... నన్నెవడు దోచుకోలేడు.  దోచుకున్నాడని వాడు ఫీల్ అయినా ఆది నేను కాదనుకున్నదే..నేను ప్రేమతో ఇచ్చిందే. నాకు నేను విధించుకున్న బంధనాలే నన్ను బందిస్తాయి. కట్టుకున్నది నేనే..తెంచుకోవాల్సిందీ నేనే. బయటికి ఒకింత ..ఒకవైపు ఉన్నట్టు కనపడినా ఆది నా కనీసపు బాధ్యత .. నేను కళారాధకుడిని. విశ్వ మానవత్వపు సాధకుడిని.

ఇన్నాళ్ళూ ..



ఇన్నాళ్ళూ ..  కాలంతో పరుగులు పెట్టి అలిసిపోయాను. కాలమే నాకోసం   ఆగుతుందో. లేక తనతో పాటే లాక్కేలుతుందో ..దానిష్టం.

ఇన్నాళ్ళూ.. లోకంతో పాటు నటించి విసిగిపోయాను.. ఇక లోకమే నాకోసం నటిస్తుందో.. లేక నటించటం అపేస్తుందో ..దానిష్టం. 

ఇన్నాళ్ళూ... నీ ప్రేమకోసం తపించాను. ఇక నీలో ప్రేమని  ఇస్తావో.. నా ప్రేమని తర్కిస్తావో /తిరస్కరిస్తవో  నీ ఇష్టం. 


ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి ...పట్టుకోల్పోయాను..ఇక పుస్తకమే నన్ను చదువుతుందో..లేక నేనే పుస్తకం అంటుందో దానిష్టం.

ఇన్నాళ్లూ.. డబ్బుకోసం వెంపర్లాడాను . ఇక డబ్బే నావేనకోస్తుందో..లేక తనదారి తాను చుసుకుంటుందో దానిష్టం.


ఇన్నాళ్ళూ .. జనాన్ని మేల్కొలపాలని అరచి  నీరసించాను. ఇక జనం మేలుకొంటారో..నన్నే నిద్రపుచ్చుతారో వాళ్ళ ఇష్టం.

ఇన్నాళ్ళూ .. నన్ను నేను తెలుసుకోవాలని ప్రయత్నించి వికటించాను.. ఇక నేను 'నన్ను'ని  తెలుసుకుంటుందో...నన్ను 'నేను' ని  తెలుసుకుంటుందో దానిష్టం.

ఇన్నాళ్ళూ ... మనసులోతుల్లోకి జారిపొవాలని శ్రమించాను. ఇక మనసే నాలోకి జారుతుందో. జారలేక జారగిల  పడుతుందో..దానిష్టం.

ఇన్నాళ్లూ  కలలు కంటూ కాలం గడిపాను...ఇక ఆ కలలు నిజమే అవుతాయో..కల్లలే అవుతాయో వాటిష్టం.


ఇన్నాళ్ళూ .. దేవుడిని కన్నుక్కోగలనని విస్వసించాను.. ఇక దేవుడే  నన్ను కనుక్కుంటాడో, కనపడకుండానే ఉంటాడో ఆయనిష్టం.

" గీతాంజలి"




software జాబులు..జేబునిండా డబ్బులు....లివిన్ రేలషన్ షిప్పులు వన్  నైట్  స్టాండ్ లు,  తాకే ఇట్ easy లవ్వులు... ఇవన్నిటి ముందు  ఈ విషయం  సాధారణం అయిపోయిందో..లేక  అలవాటయ్యి  ఇదో   పెద్ద విషయంగా చూడటం లేదో.. లేక మనం  పెద్దగా ఫీల్ కావటం లేదో.. కాని  అప్పట్లో...  వాళ్ళు ఇద్దరూ లేచిపోయారంట  అన్న విషయం  పెద్ద దుమారం లేపేది ..క్షణాల్లో  ఊరు ఊరు పాకి పోయేది.   పెద్దల్లకి అది మర్డర్ చేసిందానికంటే పెద్ద క్రైమే , యువకులకి అదో  క్రేజీ..adventure లా ఫీల్ అయ్యేవాళ్ళు ..   అలాంటి రోజుల్లో   " నేను నీకు నచ్చానా??  అయితే మంద్దరం ఉరు విడిచి లేచిపోదామా ? "
 అని ఓ  అమ్మాయి నోట చెప్పించి..జనాల మతి పోగొట్టాడు మాస్టర్ అఫ్ ఇండియన్ celluloid మణిరత్నం. అయితే సినిమా లేచిపోవటం గురించి కాదని అందరికీ తెలిసిందే . :)

 పేరులోనే ఓ కొత్తదనం. అది కుడా నలుపు ఎక్కువగా ఉండే  పోస్టర్  మీద  వంపులు తిరిగి భలే ఆకర్షకంగా.. " గీతాంజలి" 
ఏముంది ఈ సినిమాలో ? 
http://navatarangam.com/2011/03/geetanjali-1/

Mar 24, 2011

యువత

 ఆలోచనలేని  ఆవేశం..ఉప్పొంగే ఉడుకు రక్తం.. ఎగసి పడే ఉత్సాహం..
కాని దాన్ని ఏం చేసుకోవాలో  తెలిదు ..
స్నేహం..హాయ్ లు ,,బై లు.. సినిమాలు..షికార్లు..మాటలు..ముచ్చట్లు..కోపాలు, తాపాలు..  ప్రేమలు..అలకలు..కులుకులు..కిస్సులు..హగ్గులు...
చదువు తక్కువ...టైం పాస్ ఎక్కువ..
బుక్కులు ముట్టరు ..పేస్ బుక్కు  మాత్రం  వదలరు.
అన్ని అందుబాటులోనే.. కాని ఏ ఒక్కటీ అందుకోరు.
చదువుకి తొందర లేదు..ప్రేమకి మాత్రం ముందరి కొస్తారు.
అన్ని ఎదురుగా ఉన్నా..ఏదో పెద్ద టెన్షన్..
నైల్ తో పోయేదానికి ..నైఫ్ దాకా తెస్తారు..
గుండెలకి గాలికి బదుకు పొగ కావలి..
పాలు తాగే వయసులో బీరు కావలి.. 
పట్టుమని పది మార్కులు రాకున్నా  పొగరు మాత్రం పుట్టెడు.
ఎం చేయాలో  తెలిదు కాని ఏదైనా చేసేయగలమని బ్రమ
ఇదంతా  ఉండొద్దని కాదు.. ఇదే ఉంటె బ్రతుకు బొగ్గే..


Mar 23, 2011

In to the wild.


Christopher McCandless అనే ఒక నవ యువకుడు ఈ materialistic సమాజం మీద విసుగు పుట్టి ,  ఉన్న డబ్బుని దానం చేసి అలస్కా గమ్యంగా ప్రయాణం సాగిస్తాడు. ఆ ప్రయాణం లో కలిసిన స్నేహితులు.. పొందిన అనుభవాలు.. చెందిన అనుభూతులు..దర్శించిన సత్యాలు… ఇదే ఈ సినిమా కథ.

Mar 21, 2011

మరి నాతో దోస్తీ చేస్తారా ??


హాయ్.
నాపేరు ప్రేమ.
నన్ను దైవ స్వరూపం అంటారు.అందుకే ఆయన బుద్దులు నాకు వచ్చాయి.
అదే గుండెలతో క్రికెట్టు..జేవితాలతో ఫుట్ బాల్  ఆడటం.
దొరకినది అన్నవాడికి దూరంగా పోతా..
దొరకదు అన్న వాడికి దగ్గరగా వచ్చి ఆశ పెడతా..
ఉంది అనుకున్న వాడు లేదు అనుకునేలా.
లేదు అనుకున్నా వాడు ఉంది అని  ఫీల్ అయ్యేలా చేస్త్తుంటా..
మనసులు కలపటం...విడగొట్టటం నాకు బలే సరదా..
ఉన్నట్టే ఉంటాను...లేకుండా పోతాను..
లేదులే అని మిన్నకుంటే పక్కనే ఉంటాను.
అన్నీ ఉన్నవాడు కూడ నేను లేకుంటే దరిద్రుడే..
ఏమి లేని వాడు నేనుంటే మహా ధనికుడే.
తెలీని వాడికి నేర్పిస్తా..తెలిసిన వాడిని మరిపిస్తా.

మీ మనులోనే ఉండి  మిమ్మల్ని మాయ చేస్తా..
నేను లేకుంటే కొంత మందికి నిద్రే పట్టడు.కొంత మంది తిండే ముట్టరు.
ఇంకొంత మంది నాకోసం చస్తారు.. కొందరు చంపటానికీ వెనకాడరు.
ఇవన్నీ నాకు భలే సరదా ..
ఇందుగల దండులేనని  సందేహము వలదు..నేను.
ఎక్కడ చూసినా నేనే.. అన్నింట్లో నేనే. అన్ని రూపాలు నావే.
తల్లిగా లాలిస్త.. ..తండ్రీ గా పాలిస్త..
స్నేహితుడిగా చిగురిస్తా..ప్రియురాలిగా మురిపిస్తా .
భర్తలా అజమాయిషీ  చేస్తా.. బార్యగా పడుంటా.

నా గురించి  రాసుకుంటూ పోతే మహా కావ్యాలే .. నా గురించి  పాడితే కొత్త రాగాలే..
నొప్పింపక, తానొవ్వక 'నన్ను' తప్పించుకు తిరుగువాడు లోకం లో లేడు.
నన్ను విడిచి బ్రతకంగల వాడెవ్వడు లేడు .. అలాగని నన్ను పూర్తిగా గెలుచుకున్న వాడు ఒక్కడూ ఉండడు.
మరి నాతో దోస్తీ  చేస్తారా ??

Mar 20, 2011

మంచు గుండె


కరుడుకట్టిన కసాయి మనసును నేను..కాని
 నన్ను నాలా ఉండనియ్యక,
 చూడు..ఈ మూలకి గడ్డిలో నా పాదాల కిందనుండి  ఆ చిన్ని పువ్వును చూసావా.. నాకోసం రెక్కలు విచ్చినన్నుచూసి ప్రేమగా నవ్వుతుంటే?? ఆకుల చేతులు చాచి నన్ను హత్తుకోవాలని ప్రయత్నిస్తుంటే..
గడ్డ కట్టిన మంచు గుండె కరిగిపోతోంది.
ఆ నీరంతా కళ్ళలోంచి  ధార కడుతోంది.


Mar 19, 2011

చంపేస్తూ ..బ్రతికిస్తూ


మొదలంటూ పీకేసినా  ఎక్కడో చిన్నిచిగురు వేస్తూ..అణగదొక్కినా మళ్లీ ఎక్కడినుండో చిరునవ్వు చిందిస్తూ..
చంపి పాతర వేసినా దయ్యం లాగా పీడిస్తూ
నిలువుగా అడ్డంగా నరికేసినా మళ్లీ ఉపిరి పోసుకుంటూ..
తప్పించుకు తిరుగుతున్న ప్రతి సారి అడ్దోస్తూ..
పరిగెడుతూ పారిపోతున్న నన్ను నన్ను నీడలా వెంబడిస్తూ..
 మెలకువలో కలకలం రేపుతూ
నిదురలో కలగా మెలకువ తెప్పిస్తూ..
ప్రశాంతంగా పని చేసుకుందామంటే భగ్నం చేస్తూ..
చావకుండా  బ్రతికిస్తూ.. బ్రతుకులోనే చంపేస్తూ.. చంపేస్తూ ..బ్రతికిస్తూ
ఏమిటో ఈ 'ఆకర్షణ' ? ఎందుకో నాకీ ఘర్షణ

Mar 16, 2011

నన్ను ఎప్పుడైనా చూసావా ?'



హాయ్,
నన్ను ఎప్పుడైనా చూసావా ?'
నిన్నా ...ఉమ్మ్..  హా గుర్తోచ్చావ్.. చూసాను..
ఎక్కడ ?
గుళ్ళో..
గుళ్ళో నా.. ?
అవును గుల్లోనే..  ఎక్కువగా నిటారు గా నిలబడి ఉంటావ్. బంగారం వెండి తొడుగులు తొడుక్కొని..
అది నేను కాదు..
కాదా ?? మరి ఎవరు ?
అది నీవు సృష్టించుకున్న వాడు.
నీవు కాదా .. నేను సృష్టించుకున్న వాడా ???
అవును నీవు సృష్టించుకున్న నీ దేవుడు.
మరి నువ్వో..
నేను అసలు  దేవుడిని.
అసలు దేవుడివా ..మరి నీవెక్కడ ఉంటావ్ ?  ?
నేను ఎక్కడ లేనూ? అంతటా ఉన్న కదా...
గాలి సవ్వడిలో..చెట్ల మాటల్లో.. ఎత్తైన కొండ గాభీర్యంలో..రాయి మృదుత్వంలో...పూల గరుకు తనం లో.. రంగుల్లో.. పొంగులలో.. చెట్టులో పుట్టలో.. పాటలో..మాటలో..నడతలో ..నవ్వులో...జీవం లో,నిర్జీవంలో..  నీలో ...
హా.....అంతటా  నీవేనా,  నాలోకూడానా .?
అవును  నీలో కుడా  :)
ఎప్పుడు కనపడలేదే ?
శోధిస్తే  కదా కనపడటానికి, ఎంత సేపూ  ఎదురుగా   ఓ విగ్రహం పెట్టుకొని పసుపు, కుంకుమ,దీపాలు, ఏదో మంత్రాలు.. శ్లోకాలు తప్ప.
ఎప్పుడైనా నన్ను  నీలో వెతికావా?? చూసావా?? అనుభూతి చెందవా??

నన్ను ఒదులుతావా ??

 నన్ను ఒదులుతావా ??
ఉహు..??
ప్లీజ్ ?
ఉహు..వదల..వదల బమ్మాలీ  వదల
ఎంతకాలం ఇలా  ??
నేను చచ్చేంత వరకు..నీవు  ఇలాగే..
ఎందుకు వదలవు ?
ఎందుకంటే నిన్ని వొదిలితే నేను చచ్చినట్టే.
అదెలా??
అదంతే.... నేను మాత్రం నిన్ను చచ్చినా వదలను.
నీవు కూడ ఎక్కడికీ కదలటానికి వీలులేదు.
ఏంటి అజ్ఞాపిస్తున్నావ్?? నేనెవరో తెలుసా ?? నేను నిన్ను సృష్టించిన దేవుడిని..
నేనెవరో తెలుసా ?? నేను మనిషిని.  నివు నన్ను సృష్టించటం కాదు నేనే నిన్ను పుట్టించాను.
సృష్టించిన పాపానికి నాకే ఎసరు పెట్టావా ?
ఎసరా ?? ... గుండెల్లో పెట్టుకుని .. రోజు ధూప దీప  నైవేద్యాలు పెడుతుంటే..
గుండెల్లో కాదు..గుళ్ళో బందీని చేసావ్..
అయితే ఏం కావలి ?
నాకు స్వేఛ్చ కావాలి..
ఎందుకు ?
కొత్త సృష్టి చేసుకోవాలి.
అయితే అస్సలు వదలను.

గమ్యం

ఎక్కడికయ్యా  వెళ్తునావ్?
తెలిదు.
ఎక్కడికో తెలిస్తే తొందరగా వెళ్లోచ్చుగా.. పైగా ఎలా వెళ్ళాలో తెలుస్తుంది.
నాకు తొందరేం లేదు.. ఎలాగోలా వెళ్లక తప్పదు
అర్రే..ఎక్కడికో తెలీకుండా ఎలా వెళ్తావ్ ??
వెళ్తున్నాగా .
మహా తిక్కలోడి లాగ ఉన్నావే ?
నీకంటే  నా ??
ఏమిటీ నేను తిక్కలోడినా ??
అవును..
ఎందుకని ?
జీవిత ప్రయాణ గమ్యం నీకూ తెలిదు కనక..
తెలిసినట్టే మాట్లాడుతావ్ గనక..

Mar 9, 2011

రానీ... ఆవేశం రానీ...

 
రానీ... ఆవేశం రానీ...
అక్షరాలని పదును చేసి.. గుండె బావిలో గునపాల్లా దింపనీ..
ఆ బాధలోంచి ఓ తియ్యని భావోద్వేగపు
జల పొంగనీ ..
భావాలని పోగు చేసి మనసు  కింద కొలిమి పెట్టనీ
మలినాన్ని తొలిగించి అసలు సిసలు మానవ తత్వపు బంగారాన్ని వెలికి తీయనీ..
రానీ... ఆవేశం రానీ...

Mar 8, 2011

మనకి మనం

 

కొన్ని బాధలు మనలో మనం పడాలి.

కొన్ని లెక్కలు మనకి మనం తేల్చుకోవాలి..

కొన్ని సమస్యలు మనకి మనం పరిష్కరించు కోవాలి.

కొన్ని అనుభవాలు..మనకి మనం దాచుకోవాలి.

కొన్ని అనుభూతులు మనకి మనం నెమరేసుకోవాలి.

...కొన్ని భావాలు మనకి మనం ఆస్వాదించాలి.

కొంత జీవితం మనకోసం మనం గడపాలి.

ఓ స్నేహాన్ని మనతో మనమే చేయాలి.

స్మశాన వైరాగ్యం.


అనగనగా ఒకాయన.. బాగానే బతికాడు.. పుటుక్కున పోయాడు.
అందరు వచ్చి... కన్నీళ్లు కార్చి.. బాధని దిగమింగి.. కాటికి తీసుకెళ్ళి... కట్టెకి నిప్పు పెట్టేసరికి మిట్టమద్యాన్నం దాటింది..
అలా అందరూ ఎగిసే మంటని చూస్తూ ఉండగా..
ఎవరో ఓ పెద్దాయన, ఎవరితోనో..
ఇంటిదగ్గర వంట సామాను సిద్దం చేసారా?  అని అనగానే...
ఒక్కసారి అందరి ఆత్మారాముడు గబుక్కున మేల్కొని, స్నానం చేసి వడి వడిగా ఇంటి ముఖం పట్టారంతా.
ఇదీ స్మశాన వైరాగ్యం.

అది కట్టే కాలే వరకే... ఆ తరవాత కడుపు కాలి వైరాగ్యానికి తిలోదకాలిచ్చి మళ్లీ ఈ లోకం లోకి రావాల్సిందే,  ఎవ్వరైనా..!  

సంతాన వైరాగ్యం..


అనగనగ ఒక అమ్మడు..పెళ్లి అయ్యి అత్తవారింటికి కాపురానికి వెళ్ళింది. ప్రేమించే మగడు..ఆదరించే అత్తా మామలు... పండగ చేసుకుంది..
పురుడు పోసుకుంది...ఆయాసం తో తొమ్మిది నెలలు మోసింది.
కానుపు సమయం వొచ్చేసింది.. ఆ బాధ తట్టుకోలేక..
 ఆ సుఖము వొద్దు ..ఈ బాధ వొద్దురా దేవుడా..
దీనికి అంతా కారణం...అదే కదా.. ఇంకోసారి..మళ్లీ నన్ను ముట్టుకోనిస్తానా...అని మనసులో ఒట్టు పెట్టుకుంది.
పండంటి పిల్లాడు..కేరింతలు..తుళ్ళింతలు..పులకింతలు.. ముద్దు ముచ్చట్లతో, బారసాలతో.. మూడు నెలలు గడిచాయి.


ఓ ప్రశాంత సాయంత్రం , ఏకాంత సమయం.. ..ఓ పక్క హాయిగా నిదుర పోతున్న పాపడు..ఇంకో  పక్క పుస్తకం తిరగేస్తున్న  వాళ్ళాయన...
ఏమండీ..అని..గోముగా గోకింది..


మళ్లీ కథ మొదలు..
ఇదీ సంతాన వైరాగ్యం..కొంత కాలమే ...

స్త్రీ అనుకోవాలే గాని,,,

Woman Power Logo Clip Art

స్త్రీ నవ్వలే  గాని.. ముత్యాలని  వరసకట్టి మెరిపించగలదు.
స్త్రీ పాడాలే  గాని...కోయిల మూగ  బోయేలా  పాడగలదు.
స్త్రీ అడాలే గాని..నెమలి నివ్వెర పోయేలా ఆడగలదు.
స్త్రీ సంతోషించాలే  గాని.. మేఘంలా  పరవశించి వర్షించగలదు.
స్త్రీ కరుణించలే గాని...మహాసముద్రాని గుండె లోతుల్లోంచి పొంగించ గలదు.
స్త్రీ ప్రేమించాలే గాని.. .రక్తాన్ని క్షీరంగా మార్చి అందించగలదు. (నుదుటన తిలకం లా దిద్దుకోగలదు)
స్త్రీ లాలించాలే గాని... దేవుణ్ణి  సైతం నిద్రపుచ్చ గలదు.
స్త్రీ అనుకోవాలే  గాని...మూతి తిప్పినంతలో మగాడిని ఓడించగలదు.
స్త్రీ కోరుకోవాలే కాని... ఆకాశాన్ని  చీరలా  చుట్టుకోగలదు.
స్త్రీ తలచుకోవాలే గాని..చుక్కలని దారంతో దండ కట్టి తలలో తురుముకోగలదు.
స్త్రీ పునుకోవాలే గాని.. ప్రపంచాన్ని కాళ్ల పట్టీలుగా మార్చుకోగలదు.
స్త్రీ  ఆపాలే గాని ...భూగోళాన్ని( మగాడి గుండెని )  ఒక్క చిరునవ్వు తో ఆపగలదు.
స్త్రీ ఆడించాలే  గాని.. లోకాన్ని బంతిల మార్చి ఫుట్ బాల్   ఆడగలదు.
స్త్రీ అనుకోవాలే గాని ఏదయినా చేయగలదు.

Mar 7, 2011

నేనెవరు ?


నాకు నేనే ముఖ్యం.
నా అనుభవాలు .. నా ఆలోచనలు..అనుభూతులు.. జ్ఞాపకాలు ఇవే నా జీవితం.

నా పుట్టుకకు ముందున్న చరిత్ర ..నాకోసం కొంత నేను తెలుసుకున్నాను..
తొలుత గా నాకు తెలీక కొన్నింటిని అంగీకరించాను.. తెలియదు కనుక ఇంకోన్నింటిని ఇంకా అంగీకరిస్తున్నాను. కొన్నింటిని ఒప్పుకున్నాను.. కొన్నింటిని మార్చుకున్నాను. కొన్నింటికి తప్పక..తప్పించుకోలేక చేస్తున్నాను.
నిరంతరం "జీవితాన్ని" అన్వేషిస్తున్నాను.
నా పుట్టుకని అర్థం నాకింకా బోధ పడలేదు. పడుతుందో లేదో కూడ తెలిదు.

దేవుడు ఉన్నాడో  లేడో  అన్నది కాదు నా ప్రశ్న.. నమ్ముతున్ననా  లేదా అన్నదే సందిగ్ధం...
 మనిషిని నేను దేవునిగా అంగీకరించను. కేవలం పరమాత్మ తత్వాన్ని ప్రభోదించే గురువు గా మాత్రమే అనుకుంటాను. 

నేను ఫోటోగ్రాఫర్నీ కాను.. సినిమాటోగ్రాఫర్ని అంతకన్నా కాదు..
దర్శకుడిని కానే కాను..రచయితని అసలే కాను.

నేను ఎవరినీ కాను..ఏమీ సాధించలేదు..కేవలం ఆశ పడ్డాను అంతే.
చెప్పటం నాకు రాదు.. చేయటం చేత కాదు.
 

నేనొక  ప్రకృతి ప్రేమికుడిని,కళారాధకుడిని, స్వేచ్చా వాదిని, సత్యాన్వేషిని.
అసలుగా  చెప్పాలంటే పరమ  'పలాయన వాదిని.'

Mar 5, 2011

స్వేచ్చ కావాలి..

 
స్వేచ్చ కావాలి..
పిల్లలకి స్కూల్ నుండి స్వేచ్చ కావాలి ..
విద్యార్థులకి  చదువు నుండి
పేదవాడికి దరిద్రం నుండి.. 
మనిషికి సంఘం నుండి   
ప్రేమికుడికి...కులాలు..మతాలూ..అంతస్తుల నుండి
వివాహితులకి వివాహం నుండి 
ఎకాకికి ఒంటరి తనం నుండి..
బానిసకు యజమాని నుండి కావాలి..
ఉద్యోగికి అధికారి నుండి..
ధనికుడికి  tax నుండి...

సెలెబ్రిటీస్ కి అభిమానులు, మీడియా నుండి
జీవితం చాలు అనుకున్నా వాడికి జీవితం నుండి 
ప్రకృతికి, మిగతా జీవులకి, దేవుడికి మనుషుల నుండి.. 
ఇంకా ఏదో తెలియని వాటినుండి  
 నాకు నానుండి..
స్వేచ్చకు స్వేఛ్చ నుండి..  స్వేఛ్చ కావాలి.. 




Mar 4, 2011

నా రాతలు

 
నా రాతలు.. ఎలా ఉంటాయో నాకు తెలుసు..
ఏది లోతుగా ఉండదు.. స్పష్టతా ఉండదు.. అప్పుడే కలిసిన వ్యక్తులతో హాయ్.హౌ రు అని పొడి పొడి గా మాట్లాడినట్టు..ఉంటాయి. 
కాని అ పొడి మాటల్లోనే కొంచం తడి తగులుతుంది..
విషయం  అర్థం చేయించే  ప్రయత్నమూ ఉంటుంది.
అప్పుడే మొదలవుతుంది..అంతలోనే అర్ధాంతరంగా అయిపోతుంది.  
నిష్టూరమే అయినా ఉన్న మాట చెప్పేస్తుంది.గుండె బద్దలు కొట్టేస్తుంది
జీవితం ఎప్పుడూ  ఏదో మూలసూత్రాల ఆధారంగా నడుస్తుందని నా అభిప్రాయం. అ సూత్రాలేవో కనున్నోవాలని నా ప్రయత్నం. కనుక్కొని చేసేదేమీ లేకున్నా.
ఎందుకంటే...సూత్రం తెలిసినా  తెలియకున్నా ... జీవితం గడుస్తుంటుంది..  కాని సూత్రం తెలిస్తే అదో ఆనందం....గుండె నిబ్బరం.

స్వేఛ్ఛ

 
స్వేఛ్ఛగా తిరిగే నీకు మళ్ళీ స్వతంత్ర్యం ఎందుకు?’అని అడిగిన ప్రతిసారీ
నా కనపడని సంకెళ్ళు శబ్ధం చేసి పెద్దగా నవ్వుతాయి.
"స్వతంత్ర్యం అంటే స్వేఛ్ఛగా తిరగటం కాదు.భయం లేకుండా ఉండటం" అంటాయి   - కత్తి మహేష్ . 
'తలెత్తుకొని తిరిగే తత్వం ' అంటాయి.
'ముక్కుసూటిగా మసలే తనం ' అంటాయి
'అరమరికలు లేని స్నేహం' అంటాయి..
'అవసరానికి అందిచే చేయి' అంటాయి..
...'హాయిగా నవ్వే అవకాశం' అంటాయి..
' గుండె లోతుల్లో, కల్మషం లేని ప్రేమ' అంటాయి.
'ముసుగు లేకుండా గడిపే జీవితం' అంటాయి.. - చక్రధర్



గేయ రామాయణం.



















రామాయణం ఒక మహా కావ్యం.. ఒక హృద్యమైన కథ. నవరసాల మేళవింపు.  ఎంతో మంది రామాయణాన్ని  తమ తమ కవితా పటిమకు తగ్గట్టు రాసారు.
సిద్ధిపేట వాస్త్యవ్యులైన రుక్మాభట్ల నరసింహరామ శర్మ గారు.. రామాయణాన్ని చక్కని గేయ రూపంలో రచించి ఆలపించారు.
హరికథ కి దగ్గర శైలి లో ఉండే  ఈ గేయ రామాయణము వింటే ..ఆహా.. అద్భుతం అనకుండా ఉండలేము. అయన లైవ్ పెర్ఫార్మెన్స్ లో వింటే ఇంక ఆ రసానందం  చెప్పనలవి కాదు. వివిధ సందర్భాలలో అయన ఈ గేయ రామాయణాన్ని లైవ్ పెర్ఫార్మెన్స్ గా ఇస్తుంటారు. ఎక్కడ ఆ అవకాశం దొరికినా వదలకండి.  ఒకప్పుడు క్యాసెట్టు ఉండేది నాదగ్గర.. ప్రస్తుతం లేదు. CD ఎలాగైనా సంపాదించాలని చూస్తున్నాను..దొరికితే  పంచుకుంటాను.
వింటే బావుంటుంది ..కాని అది వీలు లేదు కనక.. మచ్చుకు ఓ కొన్ని పంక్తులు 


" పుట్టందుల తల్లిదండ్రుల .. పూని మోయు నెల్ల వేళల .
శ్రవనుండను ముని బాలకుడు ..వనమున చరియించెను నాడు.
తలిదండ్రులు దప్పిక గొనగా.. తా వేడెలేను జలములు దేగా..
సరసి లోన కడవ ముంచెను.. చయ్యన శబ్దంబు పుట్టెను..
ఆ ధ్వని దశరతుండు వినెను..అడవి దిరుగు గజమనుకొనేను..
 శబ్దభేది గురిని నేర్పున ..శరము విడిచే వింత రయమున..
ఆ క్షణమున  వచ్చి దగిలేను..ఆహా యని బాలుడు పడెను."

అలా అనుకోకుండా శ్రవనుడిని  చంపినందుకు .. ఆతని గుడ్డి తల్లిదండ్రులు దశరథునికి శాపం ఇస్తారు..
పుత్ర శోకముతో మరణింతువు గాక. అని..
 కాని దశరథునికి పిల్లలే లేరు కదా.. మరి ఎలా??
ఈ అంధ ముని జంట ఇచ్చింది శాపమా..వరమా ?? అందుకే  

" కారణ, కార్యములీ రెండు ...కలిసి ఈశ్వరేచ్చల నుండు "
రామాయణము..దివ్య గానము.


Mar 3, 2011

అమ్మాయిలూ మీరు గ్రేటో గ్రేట్..

 
ఆడది / అమ్మాయి  బయటికి అడుగు పెట్టింది మొదలు....

ఒకడు చురుక్కున చూస్తాడు.. ఒకడు కళ్ళలోకి సూటిగా  చూస్తాడు. ఇంకోడు ఇంకెక్కడో చూస్తాడు.. మరొకడు కిందనుంచి పైకి ఎగాదిగా చూస్తాడు.. ఒకడు చూసి చూడనట్టు చూస్తాడు. ఒకడు ఒకటికి నాలుగు సార్లు చూస్తాడు..ఒకడు regular time intervals లో చూస్తాడు.
ఒకడు పల్లికిలిస్తాడు.. ఒకడు చిరునవ్వు నవ్వుతాడు.. ఒకడు నవ్వి నవ్వనట్టు నవ్వుతాడు..ఇంకోడు కళ్ళతోనే నవ్వుతాడు..ఒకడు సిగ్గుపడుతూ నవ్వుతాడు..ఇంకోడు నవ్వి సిగ్గు పడతాడు.


ఒకడు రెండడుగులు దగ్గరికి వేస్తాడు.. ఇంకోడు ఎదురుగా నిలబడతాడు.. ఒకడు పక్కకోచ్చేస్తాడు.. ఒకడు గుంపులో నుండి బయటికొస్తాడు..ఇంకోడు గుంపులో దొంగ చాటుగా  తొంగి చూస్తాడు..ఒకడు gentle man ల పోజు  కొడతాడు...ఇంకోడు యమా rough గా రాసుకేల్తాడు...ఒకడు మీదకోస్తాడు .. ఒకడు దూరంగా జరుగుతాడు..ఒకడు మాట పెంచుతాడు..ఒకడు గొంతు తగ్గిస్తాడు.. 
ఎన్ని వేషాలో
..
మనసులో  "ఏదో ఆశ " పెట్టుకుని .. పరిచయం ఉన్నవాళ్ళు.., ..స్నేహితులు.. బంధువులు.. దగ్గరివాళ్ళు.. తెలిసిన వాళ్ళు..తెలియని వాళ్ళు.. వయసు..వరస కుడా పెద్దగా పట్టించుకోకుండా.. 
కలుపుగోలు మాటలు...గుడ్ మోర్నింగులు..జోకులు..అర్థం లేని మాటలు.. అనవసర  SMS లు..
అర్థింపులు..అబ్యర్థనలు..పొగడ్తలు..ప్రార్థనలు...అలకలు..ఉలుకులు..నటనలు..నర్తనలు...encouraging లు ..అడక్కున్నా సహాయాలు...వద్దన్నా ..బహుమతులు..care takingలు, ప్రతిదానికి best wishes లు, అడ్వాన్సు హ్యాపీ పండగలు...

మగాళ్ళ attitude ఎలా ఉంటుందంటే...
పెళ్లి కాలేదా..... మంచిది 
అయ్యిందా ......no problem .
ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా... పర్లేదు
 బాయ్ ఫ్రెండ్ లేడా ....వావ్  మరింకేంటి...
పిల్లలు ఉన్నారా.... అవునా..కాని  మీరలా అలా అస్సలు కనబడటం లేదు. :)

అబ్బబ్బబ్బా .. ఇవన్ని భరిస్తూ పని చేసుకొని ఇంటికోస్తున్నారంటే  ..అమ్మాయిలూ  మీరు  గ్రేటో  గ్రేట్..

Mar 2, 2011

సన్యాసం



సన్యాసం తీసుకొని మాత్రం చేసేదేముంది అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.  అంటే శ్రియ.. నయనతార, ఇంకా _ _ _ _ లాంటి భక్తురాళ్ళు ఉంటె ఆది వేరే విషయం అనుకోండి ;)

 ఈ మధ్య MMS ల పుణ్యమాని మహా మహా  బాబాలు..యోగుల అసలు రూపాలు బయట పడుతుంటే... దానికంటే సంసారమే నయ్యం అని తేలిపోతోంది.
అందుకేనేమో..ఎలాగూ మీ వల్లకాదురా అని ఏ వయసుకు ఆ ముచ్చట తీర్చుకోండి బాబు అని .బ్రహ్మచర్యం..గృహస్తం..వానప్రస్థం..సన్యాసం..  ఆశ్రమధర్మాలు పెట్టారు మన పూర్వికులు.
అప్పుడెప్పుడో  " దలై లామా"  "ఇప్పుడనిపిస్తోంది నేనూ  మిస్ ని మిస్ అయ్యానా " అని  అన్నట్టు విన్నాను..
కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు( ఎం పడుతుందో నాకు తెలిదు :) ) బ్రహ్మచర్యం ముసుగులో ఉన్న ఆ యోగులకే, బాబాలకే, nun లకే ..ఫాదర్ లకే తెలియాలి..నిజంగా తాము 'అది' వోదిలేసరా  లేక..దొంగ చాటు వ్యవహారం నడిపిస్తున్నారా అని. 

ఏదో జీవితం లోనో, ప్రేమలోనో,డబ్బు సంపాదనలోనో  విఫలమై చావలేక జీవితాన్ని దేవునికి  అంకితం చేద్దామని సన్యాసిగా మారగానే..అందమైన భక్తురాళ్ళు అనుకోకుండా తగులుతారు.ఎక్కడినుండో విరాళాలు వొచ్చి పడుతుంటాయి. అప్పుడు అటు,ఇటు ..ఎటు తేల్చుకోలేక చివరికి  బ్రహ్మచర్యానికి కామా  పెట్టేసి.. కామానికి కాలు దువ్వుతారు. భక్తి బయటికి రక్తి లోపల..విరక్తి మాటలు జనాలకి..
ఇంకొంతమందికి ఇది ముందే తెలుసు..దీనికోసమే బాబాలు అవుతారు.
ఒక మంచి వేషధారణ,.రెండు  ట్రిక్కులు.. మూడు నామాలు.నాలుగు మంత్రాలు.అయిదు వైరాగ్యపు మాటలు..ఆరుగురు శిష్యులు ఇవి చాలు   సింహలో బాలయ్య డైలాగులా  "పదిమందిని ...పదికి పది పెంచుతూ..పది పది సార్లు ఆకర్షించటానికి. మరే మన జనాలు వెర్రి వెంగలప్పలు కదా, అక్షరంరాని వాళ్ళు, ఇంట్లో దరిద్రం "శివతాండవం" చేసే వాళ్ళు, భక్తీ పరవశం ఎక్కువైన మేధావులు ..అన్ని కోల్పోయి..ఇంకా కోల్పోవటానికి ఏమి లేని  నిర్భాగ్యపు స్త్రీలు...వీళ్ళంతా కలసి సామాన్య సన్యాసిని, బాబా ని చేసేస్తారు. .దాంతో ఇహ అయన 'ఇంటా బయటా' కార్యక్రమం రూపొందిస్తాడు. 
మరీ నేనూ చెప్పినంత సులువేమీ కాదనుకోండి, ఈ బాబా అవతారం ఎత్తి విజయం సాధించటం. ఎన్నో ఏళ్ళ కృషి, మంచి మాటకారితనం, సూపర్ మేనేజ్మెంటు, multiple tasking ...ఉంటె తప్ప మంచి రాబడి గల రసిక బాబా కాలేరు.
నా బాధంతా ఇంత కష్టపడటం ఏదో.. బయటే, బాహాటంగా, ఒక మంచి రంగాన్ని( బాబా అవతారం కూడా ఓ రంగమే అనకండి )  ఎన్నుకొని  కష్ట పడితే  ఏ దొంగావేశాలకి తావుండదు కదా..తమకి తాము  explanation ఇచ్చు కోవలసిన అవసరం లేదు కదా అని.
అయినా జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు..ఎం చేస్తుందో తెలుసా ?? :):)
                                                                     (అడగండి, చెపుతా...)


 .