Mar 16, 2011

నన్ను ఎప్పుడైనా చూసావా ?'



హాయ్,
నన్ను ఎప్పుడైనా చూసావా ?'
నిన్నా ...ఉమ్మ్..  హా గుర్తోచ్చావ్.. చూసాను..
ఎక్కడ ?
గుళ్ళో..
గుళ్ళో నా.. ?
అవును గుల్లోనే..  ఎక్కువగా నిటారు గా నిలబడి ఉంటావ్. బంగారం వెండి తొడుగులు తొడుక్కొని..
అది నేను కాదు..
కాదా ?? మరి ఎవరు ?
అది నీవు సృష్టించుకున్న వాడు.
నీవు కాదా .. నేను సృష్టించుకున్న వాడా ???
అవును నీవు సృష్టించుకున్న నీ దేవుడు.
మరి నువ్వో..
నేను అసలు  దేవుడిని.
అసలు దేవుడివా ..మరి నీవెక్కడ ఉంటావ్ ?  ?
నేను ఎక్కడ లేనూ? అంతటా ఉన్న కదా...
గాలి సవ్వడిలో..చెట్ల మాటల్లో.. ఎత్తైన కొండ గాభీర్యంలో..రాయి మృదుత్వంలో...పూల గరుకు తనం లో.. రంగుల్లో.. పొంగులలో.. చెట్టులో పుట్టలో.. పాటలో..మాటలో..నడతలో ..నవ్వులో...జీవం లో,నిర్జీవంలో..  నీలో ...
హా.....అంతటా  నీవేనా,  నాలోకూడానా .?
అవును  నీలో కుడా  :)
ఎప్పుడు కనపడలేదే ?
శోధిస్తే  కదా కనపడటానికి, ఎంత సేపూ  ఎదురుగా   ఓ విగ్రహం పెట్టుకొని పసుపు, కుంకుమ,దీపాలు, ఏదో మంత్రాలు.. శ్లోకాలు తప్ప.
ఎప్పుడైనా నన్ను  నీలో వెతికావా?? చూసావా?? అనుభూతి చెందవా??

No comments: