Jul 8, 2011

నేనూ ఒక scam చేసానండోయ్ ..

నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు యమా సినిమాల పిచ్చి. ఇదీ అదీ అని కాకుండా అన్ని సినిమాలు.. కానీ జేబులో డబ్బు ఉండేది కాదు. ఎప్పుడు జేబులు గల గల లాడినా తిండి లేకున్నా  కాలేజీ ఎగ్గొట్టి సినిమాలో దూరేవాడిని.
మా ఫ్రెండ్ ఒకతనికి స్కాలర్ షిప్ వచ్చింది కాని అతడు అప్పటికే కాలేజి వదిలి పోయాడు. ఇంకో ఇద్దరు మిత్రులు నాకు  విషయం  చెప్పి,  అతని  పేరు మీద నా identity కార్డ్ తయారు చేసారు.నా పేస్ features కొంచం అతనిలాగే ఉంటాయి మరి. నేను చేయవలసిన పనల్లా ప్రిన్సిపాల్ ని కలిసి చెక్ తీసుకోవాలి. 
స్కాలర్ షిప్ వచ్చిన వాళ్ళందరూ ప్రిన్సిపాల్ ని కలవాలి. అతను రెండో మూడో ప్రశ్నలు వేస్తాడు. సమాధానం చెప్పాలి. చెక్ మీద sign చేసి మన చేతికి ఇస్తాడు. పక్కనే  register లో మనం చెక్ తీసుకున్నట్టు సంతకం చేయాలి. ఆ తరవాత మీకు తెలుసుగా..డబ్బు మనదే.
ఆది గవర్నమెంట్ కాలేజీ కనక  వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. ఎవరు ఎవరో ప్రిన్సిపాల్  గుర్తుపట్టే ఛాన్స్ యే లేదు అని అని నన్నుlure చేసారు.
డబ్బు ..అ డబ్బు తో చూసే సినిమాల లిస్టు కళ్ళముందు కనపడే సరికి నేను scam లో పాలు పంచుకున్నా.
   భయం భయంగా ఆ రోజు ఆఫీసు ముందు నిల్చున్న.. ప్రకాష్ అని పిలిచారు , నేను చుట్టూ చూస్తున్న.. నాపక్కన ఫ్రెండ్ నన్ను డొక్కలో పొడిచాడు అప్పుడు గుర్తొచ్చింది నేనే ప్రకాష్ అని. గుండె ని అదిమి పట్టి లోపలికేల్లాను. 
నీ పేరు.. 
చా.ప్రకాష్ సర్..
గ్రూప్.. మ్మ్ మ్మ్  MPC..
మీ నాన్న ఏం చేస్తాడు..
వ్యవసాయం.  
అతను మాములుగా చూసినా నన్ను అనుమానం తో చూస్తున్నాడేమో అని అనిపించింది. భయం వేసింది . ఈ లోపు చెక్ మీద సంతకం పెట్టి నా చేతికి అందించాడు బాగా చదువుకో అంటూ.. నేను registerలో సంతకం చేస్తుంటే ఇంకో విద్యార్ధి వచ్చాడు.  హమ్మయ్య ఇహ నన్నెవరు గమనించరు అనుకొని .. చెక్ తెసుకొని ఆఫీసు రూం బయటికి రాగానే పరుగో పరుగు.. మళ్లీ ఏ అనుమానం వచ్చి వెనక్కి పిలుస్తారో  అని. హహ్హ 
మొత్తానికి 325 రూపాయలు వచ్చింది నా వంతుకి. :) :)



Jul 7, 2011

సముద్రం..

లోకంలోని సంతోషాన్ని తనదిగా కేరింతలు కొట్టే అలల సముద్రం.
ఒక ఆనంద తరంగం ఈ సముద్రం.
ఒక తుళ్ళింత  ఈ సముద్రం.
ఒక లాలింపు ఈ సముద్రం..
ప్రపంచపు బాధనంతా   నిండుగా నింపుకున్న కన్నీటి సముద్రం..
ఒక ఎదగోష ఈ సముద్రం..
ఎడతెగని తపన ఈ సముద్రం..
ఎగసిపడే ఆరాటం ఈ సముద్రం..

Jul 1, 2011

తేడాఏమీ లేదు

ఇండియా.. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇదో గమ్మత్తయిన దేశం. ఎటు చూసినా మూడనమ్మకాలు..సెంటిమెంట్లు, అర్థం లేని ఆచారాలు. 
కుల మతాలతో వచ్చే కుళ్ళు కంపుని ఇంపుగా పీలుస్తారు. 
బయటికి బాగానే నవ్వుతారు..కాని లోపల అంత విషమే....
స్త్రీ లను గౌరవించటం మన సాంప్రదాయమ అంటూనే..."స్త్రీ" మీద రోజూ  అఘాయిత్యమే. 
'చదువు' కేవలం ఉద్యోగానికే ఉపయోగిస్తారు తప్ప తర్కానికి కాదు. .
దుర్గ..సరస్వతి ..లక్మి అని పుజిస్తూనే..చంటి దాన్ని గొంతు నులుపుతారు. 
దేవుడు అంటే భయం..కానీ మనుషులని చంపటం ఆగదు. స్త్రీ అంటే గౌరవం...మాన భంగాలు ఆగవు. 
ఇంతకు మునుపు 'స్త్రీ ' ని భర్త చావగానే చితిలో కాలిపో అన్నారు.. ఇప్పుడు గర్భం లోనే మాడిపో అంటున్నారు. తేడాఏమీ  లేదు ..కేవలం కాలం మారింది అంతే. 
స్త్రీ ని ఇంతగా exploit చేసిన దేశం ఇంకేది  లేదు.