Oct 29, 2009

RELICS OF KAAKATEEYAS ... అనన్యం.....అపూర్వం ...ఆశ్చర్యం .


నేను BFA సెకండ్ ఇయర్ లో ఉండగా.. audio visual show చేయాల్సిన ఒక assignment ఉండింది .. ఏం చేద్దామా అనిఆలోచిస్తే కాకతీయులు పరిపాలించిన వరంగల్ మీద చేస్తే బావుంటుంది అని అనిపించి .. ఒక నాలుగురోజుల schedule వేసుకున్నా.. ఒక ఫ్రెండ్ తో కలసి ఫోర్ట్ వరంగల్.. వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం . ఘనపూర్ కోటగుల్లు అన్నిచుట్టి slides షూట్ చేశా,
నా visuals explain చేసి నాకు స్క్రిప్ట్ ఎలా కావాలో చెప్పి.. మా ఫ్రెండ్ కిరణ్ కుమార్ తో తెలుగులోరయించిన స్క్రిప్ట్ఇది.. చాల బాగా రాసాడు.. దేన్ని నేను ఇంగ్లీష్ లో translate చేసి..presentation ఇచ్చాను ..మంచి response వొచ్చింది..
దురదృష్టవశాత్తు మా ఫ్రెండ్ కిరణ్ ఆ తరవాత మా కాలేజీ వదిలేసాడు. ఆపై ఇక కమ్యూనికేషన్ లేదు నాకు అతనికిమధ్య. ఎక్కడున్నాడో ఏమో..తెలిదు.. కాని అతడు రాసిన ఈ స్క్రిప్ట్ మాత్రం నా దగ్గరే ఉంది.. అతని గుర్తుగా ఇక్కడ అదిబ్లాగ్ గా రాసా ..
ఇంకో విషయం..నేను షూట్ చేసినవి slides, ( positives) .. అవి ప్రస్తుతం ఇక్కడ పోస్ట్ చేయలేకపోతున్నా. వీలైతేస్కాన్ చేసి.. పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాను...


"ప్రస్తుతం అఖండ భారత దేశానికే తలమానికం కాదగిన..అన్నపూర్ణ గ పేరు గాంచిన..ఆంధ్ర దేశాన్ని ఎందఱో రాజులుపరిపాలించగా తెలుగు బాషా ప్రధానమైన ప్రదేశాలను. ఏక చత్రాధిపత్యం కింద చేర్చింది కాకతీయులు. అనన్యసామాన్యమైన పోరాట పటిమ,అపూర్వ పరిపాలనా దక్షత, అద్వితీయ కళా పిపాస కలిగిన కాకతీయుల చరిత్రకు సాక్షాలు ఈ కళారూపాలు..
ఒకప్పటి ఓరుగల్లును..ఇప్పటి వరంగల్లు నీ రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయయుల పాలనలో జీవంపోసుకొని శిల్పంగా అవతరించిన ప్రతి శిలా మనకు వరం.
భారతీయ సంస్కృతికే ఒక కృతిని... ఆకృతిని కల్పించిన కళల్లో 'శిల్పకళ' ప్రముఖమైనది. తమలో దాగిన ఆగమజ్ఞాననిధిని, తత్వార్థఖని ని రాళ్ళల్లో ఇముడ్చిన కాకతీయుల ప్రతిభ
...అనన్యం.....అపూర్వం ...ఆశ్చర్యం .

స్పందిచే మనసుంటే ఇక్కడి ప్రతి రాయి సుమదురమే.. వీక్షించే కనులుంటే ప్రతి శిల్పం మనోహరమే. అద్భుతమైనకాకతీయుల కళామణిహారం లోంచి జాలు వారిన ఆణి ముత్యాలే ఈ రామప్ప దేవాలయం..స్వయంభుదేవాలయం..ఘనపూర్ కోటగుళ్ళు.
ప్రతి వ్యక్తి అంతరంగం లో సుమధుర తరంగాలను మీట గలిగిన ఈ శిల్పసంపద కొన్ని వందల సంవత్సరాల చరిత్రనుతనలో ఇముడ్చుకొందంటే అతిశయోక్తి కాదు. కాలగమనం తో పాటే తామూ గతించకుండా..ఎన్ని ప్రభావాలకి లోనైనా కూడా తమ ప్రాభవాన్ని కోల్పోకుండా పర్యాటకులకి ..."ఔరా".... అనిపించే రీతిలో నేటికి సజీవమై నిలుచుందీ కాకతీయుల ప్రతిభ .

పటిష్టమైన వాస్తు శాస్తం, విస్మయ పరిచే శిల్ప శాస్త్రాల కలబోత అయిన ఈ శిల్పసంపద... ఆ చంద్ర తారార్కం.
"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో..ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో " ఇక్కడి ప్రతి రాయికి బాష తెలుసు..భావం తెలుసు..అనుభూతితెలుసు..ఆర్ద్రత తెలుసు..

శౌర్యానికి సాహసానికి సింహం ప్రతీతి, అందుకే కాకతీయుల శౌర్యానికి పతీకగా "వ్యాలా" అవతరించింది. వీరి శిల్పకళలో 24 రకాల "వ్యాలా" లని చూడవచ్చు.
కాకతీయుల శిల్పకళా సౌరభాన్ని విరజిమ్మే మొదటి విరించి స్వయంభు దేవాలయం.అభేద్యమైన ప్రాకారాలతో, ఒకప్పుడు అనుపమానమైన ప్రాభవాన్ని గడించిన ఈ దేవాలయపు శిథిలాలే మనకు మిగిలిన అద్భుతాలు.
స్వయంభు దేయలయానికి నలువైపులా ప్రవేశ మార్గాలు ఈ కీర్తి తోరణాలు. ఏకశిలపై ఇంతటి కళను నిక్షిప్తం చేయటం ఒక ఎత్తైతే దాన్ని ప్రతిష్టించడం మరొక ఎత్తు.
కీర్తి తోరణానికి మకుతయమానం రాజహంస.
అపర పరాక్రమ వనిత రుద్రమదేవి ప్రతిరూపం "రాయగజకేసరి" శిల్పం .
భిన్న భంగిమలతో..విభిన్న వాయిద్యాలతో చెక్కిన శిల్పాలు, కాకతీయుల కళాభిమానాన్ని, సృజనాత్మకతని మనకి తెలియజేస్తాయి.
నల్లని గ్రానైట్ రాయిని సజీవ మైన "నంది" గా మలచిన కళాతృష్ణకి జేజేలు పలకాల్సిందే ..
శిల్పకలకే ఒక ఒరవడిని నేర్పిన ఇక రామప్ప దేవాలయ సౌందర్యం వర్ణనాతీతం. ఇక్కడి శిల్పాలు..వాటి లయ సౌందర్యం రామప్ప ఉలికి నీరజనాలర్పిస్తాయి .
సజీవ కృతి తమలో ఇముడ్చుకున్న "కరిరాజులు" రసస్పందనలో మునిగితేలే కళాహృదయాలకి గిలిగింతలు.

రాజ్యాలు పోయాయి... రాజులు పోయారు.. కాని మనం మన చరిత్రని సంస్కృతి ని ఎలుగెత్తి వినిపించేందుకు తమ జ్న్యాపకాలని మిగిల్చారు. ఆధునిక మానవ మనుగడలో.. తమ మనుగడకి బద్రత కరువై మౌనంగా రోదిస్తున్నాయి ఈ కళా రూపాలు..
వీటికి మనస్సుంది..ఆ మనస్సుకి స్పందన ఉంది ..తరతరాల చరిత్రని తమలో ఇముడ్చుకున్న ఈ శిల్పాలకి మాత్రం మానవ స్పందన కరువైంది.
చరిత్రకి సాక్షాలుగా నిలిచిన ఈ శిల్పాలు..తమని కొద్దిగా ఆదరించమని మౌనంగా అర్థిస్తున్నాయి..

ఆ నాటి శైశవాన్ని...అద్వైతాన్ని కంటికి రెప్పలా కాపాడుకోకపోతే అంతకు మించిన ..దుర్గతి... దుర్మతి ..దుర్హతి ఇంకొకటి లేదు."


No comments: