Apr 25, 2011

తల్లి మనసు


మొన్నెపుడో సరదాగా సాయంత్రపు నడకకు బల్దేరాను..మెయిన్ రోడ్డు, pollution బాగా ఉంది కూడ..అయినా అదేపనిగా ఇంట్లో కుర్చోటం భరించలేక వెళ్ళా .
 తిరిగి వస్తోంటే రోడ్డు మీద ఏదో గొడవ.. ఎంటా  అని చూస్తే...ఎవడో ఓ కుర్రాడు  తాగి నడి రోడ్డు మీద నిలబడ్డాడు. వచ్చి పోయే వాహనాలు ఆగి, వాడిని వితగా చూస్తూ పక్కనుంచి వెళ్ళిపోతున్నాయి. కొంత సేపు ట్రాఫిక్ జాం కూడా అయ్యింది. ఇంతలో యాభై ఏళ్ళ పబడ్డ వయసున్న ఒకావిడ, వాళ్ళ అమ్మ అనుకుంటా  "రా ఇంటి కి రా" .. అని వాడిని  లాగుతోంది..వాడు విదిలించుకుంటూ వాహనాలకి ఎదురుగా వెళ్తున్నాడు.
ఓరినీ ..ఏం పుట్టిన్దిరా నీకు.. ఎవడిని బెదిరించటానికి ? చచ్చేదానికి  బెదిరించటం ఎందుకూ ? ... అని అనుకుంటుండగానే..
వాడు  వాళ్ళ అమ్మని దూరంగా నేట్టేసాడు...ఆమె దుమ్ములో పడిపోయింది.   దుమ్ములోంచి లేచి మళ్లీ   'రా రా .. నీ కాల్మొక్త రా ..రా'  అని లాగుతోంది. వాడు నేట్టేయటము. ఆమె పడిపోయి లేవటం.. వీడు మళ్లీ రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడటం.
అప్పుడు ఇహ అక్కడ ఉండే  వాళ్ళూ పోగయ్యి వాడిని పక్కకి లాగేశారు.. వాడు విదిలించుకొని పోబోతోంటే ..లాగి ఒక్కటి కొట్టారు.. ఆ తల్లి బాబూ కొట్టకండి బాబు అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంది .

దాదాపు 25 ఏళ్ళ యువకుడు.. పని చేసేట్టు కనబడటం లేదు. బహుశా తల్లి వెట్టి చాకిరీ  చేసి పోషిస్తుంటే.. డబ్బు లాక్కొని తాగి వచ్చే తన్నే  బాపతుగా కనపడ్డాడు. నచ్చిన పని చేసి, ఎంతో కొంత సంపాదించి, తల్లిని పోషించాల్సింది  పోయి, ఇలా  తాగుబోతయ్యాడు..
పాపం ఆ తల్లి.. కన్న పాపానికి ఇన్నేళ్ళు  పెంచి పెద్ద చేసిందే కాక.. తాగి తంతే భరిస్తోంది. కడుపు లో ఉన్నపుడు తన్నలేదా.. ఇప్పుడు తంతే ఒక లెక్కా అనుకుందేమో ఆ మాతృమూర్తి .పాపం ఆ వయసులో, నలుగుర్లో, నడి రోడ్డు మీద, కన్నకొడుకే తిరస్కారం తో నేట్టేస్తుంటే...ఎందుకో చాల  బాధగా అనిపించింది ఆమెని చూస్తే..
మాతృహృదయానికి నా కన్నీటి చుక్క అర్పితం.

3 comments:

ప్రవీణ said...

hmm..touching. మాతృ హృదయాన్ని తన్ని తగలేసి కూడా ప్రేమను పొందుతున్నాడు. పాపం ఎంత బాధ ఆ తల్లికి...

శిశిర said...

ఇలాంటి ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. పుడుతూ బాధపెడతారు, పుట్టి పెరిగాకా బాధపెడతారు.

~sreem said...

enthainaa... amma AMME!







internet promotion, limewire