Apr 3, 2011

ఒక్కరోజు కూడ గడవక ముందే...

ఇందాక ATM కి వెళ్ళాను..ఎమన్నా ఉంటే ఉడ్చేద్దామని. కాని బ్యాంకు ముందు ఓ పదిమంది గుంపు కట్టారు. అర్రే డబ్బుల్లేవా ఏంటో అనుకుంటుండగా...ఎవడో ఒకడు సెక్యూరిటీ మీద అరుస్తున్నాడు. ఇంతలో ఒకాయన నేరుగా లోపలి వెళ్లి డబ్బులేక్కపెట్టుకుంటూ వచ్చాడు. నేను వరుసలో డోర్ దగ్గరకెళ్ళి నించున్న. అయితే ఆ గుంపులో నుండి ఒకాయన వచ్చి అ సెక్యూరిటీ ని బండ బూతులు తిడుతూ మీద మీదకీ వస్తున్నాడు. ఇంతకీ ఆ సెక్యూరిటీ చేసింది ఏంటంటే ఇతన్ని అపాడట..మీరు లేట్ గా వచ్చారు మీ ముందు వచ్చిన అతను తీసుకున్నాక మీరు అని. దానికి ఇతగాడికి కోపం నషాళానికి అంటింది. సెక్యూరిటీ మీద విరుచుకు పడిపోయాడు. తన తాలూకు గుంపు వచ్చేసింది. ఆ గుంపులో నుండి ఓ నిరక్ష్యరాస్యుడు చెపం వాయించనే వాయిన్చాడా సెక్యూరిటీ ని. అర్రే అని అందరూ ఆపారు..మళ్ళీ కొట్టాలని ప్రయత్నం. ఆగవయ్య.. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టటం అని ఓ పెద్దాయన అన్నా వినడే, ..పోనీ లెండి అని ఓ చదువుకున్నావిడ అన్నా బూతులు ఆపడే.. లేడీస్ వస్తుంటే ఎక్కువ చేస్తున్నాడు బూతులు. నేను లక్షలు పెడతాను బాంకులో..ఏమనుకుంటున్నావో అంటూ.. నాకైతే డబ్బుల్లేని frustration కనపడింది. మాట తీరు పెద్దగా చదువుకున్నట్టు లేదు. పోనీ ఏ రియల్ ఎస్తాటే వ్యాపారి అంటే.. టాటా సఫారీ కూడ లేదాయే. పోనీ ఒక చిన్న కారు ?? అదీ లేదు..బైక్ కూడ ఉన్నట్టు కనపడలేదు.మరి లక్షలు ఎక్కడనుంచి పెడతాడు. ఆ పెట్టె వాడే అయితే సెక్యూరిటీ తో గొడవ పదే టైం ఉంటుందా అని.?? పాపం సెక్యూరిటీ అతని కళ్ళల్లో నీలు తిరిగాయి. అతను చేసిందల్లా తన డ్యూటీ. నిజంగా ఆ సెక్యూరిటీ తప్పు చేసే ఉంటే అతనికి నేర్పిద్దాం..పాపం పుట్టిన పాపానికి ..చదువు కోని పాపానికి ఈ ఉద్యోగం చేస్తుంటే..అతని కొడితే ఏం వస్తుంది ? మనకంటే పెద్దవాళ్ళని/ గొప్పవాళ్ళని ఎలా గౌరవిస్తున్నాం అనేది కాదు ముఖ్యం మనకంటే తక్కువ వాళ్ళను ఎలా treat చేస్తున్నాం అనేది ముఖ్యం. నిన్నయితే మాచ్ చూసి ఓహో భారతీయులం అనుకుని.. ఒక్కరోజు కూడ గడవక ముందే మనం ఏంటో మనం మరిచి పోతున్నాం.. పక్క వాడి బలహీనత మీద చెయ్యి చేసుకుంటున్నాం. నిన్న నేను ఇండియాని గెలిపించమని ప్రార్థన చేయలేదు. కాని ఈ రోజు ఈనా భారతీయులని బాగు చెయ్యి అని ప్రార్థిస్తున్నాను.

4 comments:

కమల్ said...

మంచి వ్యాసం..! సాటి మనిషిని మనిషిగా చూసే తత్వం మనుషుల్లో మృగ్యమైపోతున్నది..! నిజంగా ఆ సెక్యూరిటి ఎంత బాదపడి వుంటాడో..! కేవలం తను చేయలవలసిన ఉద్యోగధర్మం నిర్వస్తున్నందుకే అతన్నిలా కొట్టడం..! మానవత్వం అనిపించుకోదు.

ఆత్రేయ said...

మంచి టపా
అందుకే వెనకటికో పెద్దాయన అన్నాడు "మన వాళ్ళు ఉత్త .....లోయ్ " అని.

said...

చాల మందికి నేను మనేర్స్ నేర్పాను ATM దగ్గర క్యు లు దాటి వెల్లెవాల్లకు, లోపలి వెనకాలే ముగి వెళ్ళే వాళ్ళకు. వాళ్ళ వంక చాల చులకనగా, నీచుడా అన్నంత ఫీలింగ్ తో ఒక లుక్ పడేసేవాడిని. వెంటనే కంట్రోల్ అయ్యేవాళ్ళు.

లేక పొతే మనతోపాటే లొపలికి రావటం, మీదపడిపోయి ఏదో మన బాలన్స్ గట్రా తెలుసుకోవాలని ఆరాటం, ఒక నిమిషం ఏ సి లో ఎక్కువ ఉండాలనుకోవటం... ఏమిటో జనాల కుతూహలం...

chakri said...

ఎంతసేపు ఎదుటివాడి జీవితం పై కుతూహలం, వాళ్ళ బాగు చూసి ఏడవటం తప్ప..మన జీవితాన్ని ఎలా పైకి తేవాలి అన్న ఆలోచనలు తక్కువ మన వాళ్లకి.