Apr 30, 2011

ఓ దృశ్యమా

ఓ దృశ్యమా.. నీకు వందనం..
నేను చూడలేని లోకాలని చూపించి.
నేను పొందలేని అనుభవాలని  అందించి
నాకే తెలియని భావాలని తట్టిలేపి..
వెలకట్టలేని  అనుభూతులని  పంచి..


క్రికేట్టువై దేశభక్తి ని రేపావో.. .
అశ్లీలమై నా మృగతృష్ణ ని నిద్రపుచ్చావో.. ..  
అట మాట పాట కలగలుపుకొని నాకు ఆనందాన్ని ..కలిగించావో..
బొమ్మలుగా మారి  పిల్లలకి చిట్టి కథలు చెప్పావో .
సీరియళ్లుగా సాగి పెద్దల గత జ్ఞాపకాలని తట్టి లేపావో..


లేచింది మొదలు...నిద్ర పోయేవరకు..
నిద్ర పోయినా...కను పాపల తెరమీద
ఎటు చూసినా నీ దర్శనమే..
ఎం చేసినా నీ రూపమే..
ఓ దృశ్యమా.. నీకు వందనం..

No comments: