"వంట చేసేందుకు క్షవరానికీ, వండ్రంగానికి, భిక్షానికి ట్రైనింగు కావలి. కాని ప్రజలను ఏ వెర్రి ఉహలకయినా ప్రోత్సహింపగల పత్రికాధిపతి కి మాత్రం ఎ విధమైన ట్రైనింగు అవసరం లేదు. డబ్బు... పత్రిక పెట్టాలనే "వేనిటి" తప్ప.
- చలం "
మన టీవీ చానల్స్ ..మన రేడియో మన పత్రికలూ.. .మన మీడియా
YSR మరణాన్ని , తెలుగు సినిమా పాటలు జోడిచి పదే పదే చూపించి.. వందకి పైగా చావులకి కారణం ఐంది..
నిన్న తెలంగాణా ఉద్యమాన్ని అదే రకంగా చూపించి జనాల్లో విద్వంసకర చైతన్యాన్ని పురి కొల్పింది.
నేడు మళ్లీ ఏదో చెత్త బ్లాగ్ ని ఫోకస్ చేసి..విద్వంసానికి నాంది పలికింది..
రాష్ట్రం లో దేశం లో జరిగే ప్రతి విద్వంసకర దుశ్చర్యకి పూర్తి భాద్యత మీడియా దే. అది న్యూ చానలే కావొచ్చు.. "అ అంటే అమలాపురం" అని చంటి పిల్లలతో అర్ధనగ్నగా అసభ్యంగా డాన్స్ ప్రోగ్రాములు రూపొందిస్తున్న ఇతర చానెల్స్ కావొచ్చు.. భక్తి పేరుతో మత విశ్వాసాలను తద్వారా మత మౌడ్యాన్ని పెంపోదిస్తున్న భక్తీ చానెల్స్ కావొచ్చు..
" హాయ్..భారతి "
హాయ్ whats ur name.. what u do ?
ఐ అం నిహారికా..ఇంటర్ ఫస్ట్ ఇయర్..
ఓకే, కూల్.. bf ఉన్నడా..
లేడు..
ఆయ్యో లేడా ,,ఏం ఎవ్వరు propose చేయలేదా ?"
అంటూ పసి పిల్లలకి ఒక ఉతాం ఉచ్చే రేడియో కావొచ్చు..
నేటి మీడియా
1) కేవలం డబ్బు కోసమే ఆవిర్భావించటం.
2) ఒక ఆశయం ఒక దృక్పథం.. ఒక ఆలోచన లేకపోటం
3) మాస్ మీడియా కి ఉన్న శక్తి ఏంటో తెలియని వాళ్ళు ఆయా మీడియా కి heads గా ఉండటం.
4) కేవలం డబ్బు ఉంది చానెల్ ఓపెన్ చేయటం తప్ప..ఆ విషయం లో ఎలాంటి చదువు సంధ్యలు లేకపోటం.
5) సమాజం పై ,, సమాజ పురోగమనం పై.. తమకి ఉన్న భాద్యత తెలికపోవటం.
6) చెప్పిందే..చూపిన్చిన్దె పదే పదే 24 గంటలు చూపించి.. జనాల ని భావోద్వేగంలోకి.. ఉన్మదంలోకి నెట్టటం.
7)మళ్లీ తమది భాద్యత కానట్టు.. ఈ ఉన్మాదాన్ని ఇంకో కథనంగా చూపించటం.
ఎంతటి దుస్థితి !!!!
4 comments:
Bravo!!!
మీరు చెప్పింది అక్షరాలా నిజం... ఈ రోజుల్లో అన్ని tv channels ఇలానే ఉంటున్నాయి...
Post a Comment