ఉదయం 5 గంటలకల్లా లేచి.. మడి స్నానం చేసి ఎర్రని పట్టు వస్త్రం ధరించి గోపిచందనం పెట్టుకొని అనర్గళంగా స్తోత్రాలు వల్లె వేస్తూ....... సాలగ్రామ శిలయంతు... అంటూ.. సాలగ్రామ పూజ చేసి, వైసుదేవం పెట్టి ఆ ప్రసాదాన్ని కళ్ళ కద్దుకొని తినాలని మా అమ్మ కోరిక.
నాకేమో.... మా అమ్మని ఎక్కడికైనా Holiday తీసుకెళ్లి.. మడి గిడి లేకుండా దర్జా గా ... restaurant లోకి అడుగు పెట్టి ..హ్యాపీ గా కావలసిన items order ఇచ్చి ఆ రుచులారగిస్తూ... ఎంజాయ్ చేయాలని.. .
ఈ జన్మకి ఇద్దరి కోరికలు తీరవు..,
ఎందుకంటే.. చావనైనా చస్తాను కాని ఇవన్ని నా వల్లకాదు అని నేను...
నా బొందిలో ప్రాణం ఉండగా అలంటి కూడు తినను అని మా అమ్మా..
:) :)
అన్ని బుద్దులు చెప్పి అంతా జాగ్రత్తగా పెంచితే ఇలా ఎలా
తయారయ్యవ్ రా, నా కడుపునా చెడ పుట్టావ్ రా! అని అని ఆమె..
చూడమ్మా...జనాలంతా హాపీ గా ఎంజాయ్ చేస్తుంటే.. నీవేంటి ఇంకా తడి మడి అని.. వదిలేయ్ అని నేను..
నీది బ్రామ్హణ పుటకేనా అని ఆమె..
ఎదో ఒక పుటక ... బేసిక్ గా మనుషిని అని నేను..
దేవుడు నిన్ను క్షమించడు .. అని ఆమె..
దేవుడా?.. ఉన్నాడా? .. లేడా? అని సందేహం నాకు...
నీకేదో మాయరోగం వొచ్చింది .. ఉండు నీపేరు మీద హోమం చేయిస్తా అని ఆమె..
హోమం చేయించిన రోజే చికెన్ తింటా నీ ఇష్టం మరి అని నేను..
రేపు దసరా పండగ వొస్తున్నావా? అని అని ఆమె..
దసరా నా.. ఎవరో పాండవులు అప్పుడెప్పుడో గెలిస్తే మనకేంటి.. అసలు ఉన్నారో లేరో !!!
రాను ....అని నేను..
మన సంప్రదాయం మరవొద్దు రా!
నాకే సంప్రదాయాలు వొద్దు ..అని నేను..
....
No comments:
Post a Comment