స్త్రీ సౌందర్యాన్ని వర్ణించి..ఆ సౌందర్యం తన మనసుని ఎట్టా కాల్చేస్తుందో.. స్త్రీ తన సున్నితత్వం.. వల్ల తెచ్చుకునే ..కష్టాలు, కన్నీళ్ళ గురించి రాస్తూ ..అప్పుడే తన నెత్తిమీద ఎగిరే కొంగల బారు కేసి చూసి, ఎంతో దూరం ఎగిరి వెళ్లి..తమ పిల్లలకి అవి తెచ్చే తాయిలం.. తల్లుల రాకని గమనించి వింత శభ్దాలు చేస్తూ అవి పొందే సంతోషాన్ని మనది గా చేస్తాడు.ఎన్నో రహస్యాలని తనలో దాచుకొని మౌన మునిలా నిల్చున్న ఆ నీలాకాశం కేసి చేతులు చాస్తున్నట్టు కనపడే పొడవాటి పచ్చని చెట్లని చూసి , గోధుమ రంగు నుంచి ఆకుపచ్చగా మారుతోన్న లేత ఆకుని పరికించి .. ఆ చెట్లు ఆకాశం నీలాన్ని తన ఆకుల పిడికిట్లో దాచుకున్నాయని అబ్బురపడతాడు. కొమ్మ నుండి కొమ్మకి ఎగురుతూ ఆటలాడుతున్న పిచ్చికలతో మాటాడి వాటి బాష అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.వాటిని దూరపు బంధువులు గా అనుకొంటాడు. స్నేహితులని గుర్తు చేసుకొని.. వాళ్ళ గుణ గణాలని విశ్లేషించి..పొగిడి తిట్టి వాళ్ళతో తన అనుభవాలని..అనుభూతులని మనతో పంచుకుంటాడు. దాంతో మన గతాన్నీ మనం ఓ సారి జ్ఞప్తికి తెచ్చుకోక తప్పదు. ..తరతరాల మన జీవన విధానాన్ని,అందులోని లోపాలని ఎత్తి చూపుతాడు. "ఒక ప్రశ్నలోంచి ...ఒక ఆలోచన లోకి,ఒక ఆనందం లోంచి ఒక అనుభవం లోకి, ఒక జవాబు లోంచి ఒక అనుభూతి లోకి" తీసుకు వెళ్తాడు, అలుపు లేకుండా.
తన ఆలోచనలనీ ...జీవితాన్ని మొత్తం అక్షరాల్లోకి దోల్లించాడు. మన మనస్సులో దాగిన క్రూరత్వాన్ని..ద్వేషాన్ని..కల్మషాన్ని బయటకి లాగి చూపించి..ఆ మురికిని కడిగి పారేయ్యలని ప్రయత్నిస్తాడు.లోక సౌందర్యాన్ని మనచే తాగిస్తాడు. జీవిత మాధుర్యాన్ని చూపిస్తాడు. అవీ చలం రాతలు.
ఒకటా రెండా ప్రతీ వాఖ్యం ఒక గొప్ప statement. ఒక ఖచ్చితమైన వాస్తవం. ఒక రస గుళిక..ఒక ఆలోచనా స్రవంతి.
రోజూ మనం ఇంత జీవితాన్ని అనుభవిస్తూ...వివిధ అనుభవాలకి లోనవుతూ..వింత ఆలోచనలు చేస్తూ...సత్యాలని దర్శిస్తూ.. కుడా ఒక్క మాట సూటిగా..ఖచ్చితంగా..నిజాయితీగా.. మాట్లడలేకపోతున్నాం..మనలో దాగిన రహస్యాలని..కల్మషాన్ని..కోరికలని.. ద్వేషాన్ని..ప్రేమనీ..కరుణ నీ.. బయట పెట్టలేక..నటిస్తూ..జీవిస్తూ...నటనలో జీవిస్తూ..జీవితమంతా నటిస్తూ.. ఒక్కరోజు కుడా మనకి మనంగా బ్రతకలేక ఈ చచ్చు బ్రతుకే నిజమనుకొని ..ఇదీ ఆనందం అనుకొని..మనని మనం మరిచి..ఈ వేషాలు..డాబులు ..దర్పాలూ.. ఎంతకాలం..?? ఎంతకాలం ??
2 comments:
ఎనలైజేషన్, సమీక్షచాలా బాగుందండీ
annayya...the best read about chalam. u almot understood chalam.
Post a Comment