Dec 23, 2010

చలం "మైదానం" గురించి




మైదానం ఒక బోల్డు రచన .. ఒక కాల్పనిక స్వేచ్చా  ప్రపంచంలో ఒక స్త్రీత్వం, .. అది  కోరుకునే భిన్న పురుష తత్వాలు. 
బ్రాహ్మణ స్త్రీ తురక వాడితో లేచిపోవటం.. బ్రాహ్మణ స్త్రీ ఎందుకంటే అన్ని కులాల్లోకి అగ్రకులం, బ్రాహ్మణ స్త్రీ కి కట్టుబాట్లు ఎక్కువ. పాతివ్రత్య కథలకి ప్రతినిధులు. వాళ్ళ  బ్రతుకు, మనసు  ఒక  చీకటి కుహరం . తర తరాల బ్రహ్మణ స్త్రీ లు పడిన బాధలకి మైదానం నాయిక రాజేశ్వరి ప్రతినిధి. ఆ  చీకటి గది ఒక మైదానం గా మారితే. ఆ చీకటిలోకి వెలుతురూ కిరణం తొంగి చూస్తే.. ఆ కిరణాలు అనేకానేక రంగుల కిరణాలుగా చీలితే.. చుట్టూ ఉన్న కట్టుబాట్ల గోడలు కూలిపోయి  ఒక ఎల్లలు లేని మైదానం గా మారితే ??
ఇక ఆ స్పేస్ లో అసలైన " స్త్రీ " మనసు చేసే  స్వేచ్చా విహారమే  ఈ
" మైదానం"


" మైదానం" అనే నవల కామానికి,, ఆకర్షణకి ,, మొహానికి. ప్రేమకి..మధ్య  ఉగిసలాడే ఓ మనసు కథ.
ఆకర్షణా, కామం తో మొదలై.. మోహము.. ప్రేమ వైపు పయనిస్తుంది..

Dec 22, 2010

ఈ నాడు ఏం జరుగుతోంది హిందూ మతం లో ??


ఈ నాడు ఏం జరుగుతోంది హిందూ మతం లో ??
మనకి దేవుళ్ళకి కొదువ లేదు.. ఎటు చూసినా దేవుళ్ళే.. ఏ పేరు చెప్పినా దేవుడే..రామయణ భారత భాగవతాల్లో.. పురాణాల్లో చెప్పిన వాళ్లే కాక.. గ్రామ దేవతలు.. నవగ్రహాలు.. అడుగడుగునా పుట్టగొడుగుల్లా దేవుళ్ళే.
"మనుజుడై   పుట్టి మనుజుని సేవించి.. అనుదినము దుఃఖ పడనేలా " అన్నట్టు.. రోజుకో బాబా.. అవతారం ఎత్తుతాడు ....జీవితం మీద ఓ రెండు మూడు నిర్వచనాలు, నాలుగు వేదాంతం మాటలు.. రెండు మోక్ష మార్గాలు..చెపుతాడు. కనీస ఇంకిత 
జ్ఞ్యానం లేని జనాలు అతన్ని దేవుడిని చేస్తారు. ఈ బాబాలకి.. కూడా దేవుళ్ళకి పూజ చేసినట్టే.. భజనలు..హారతులు .. ధూప దీప నైవేద్యాలు..
దేవుడు ఒక్కడే అంటారు.. మళ్లీ ఇన్ని రూపాలని పూజిస్తారు..
బౌద్ద జైన సిక్కు మతాలూ పుట్టుకొచ్చాయి..అవి కూడా హిందూ మతం లో అంతర్భాగమే అంటారు. ఎంటిందంతా ??
హిందూ మతానికి తనకంటూ ఒక ఉనికి.. లేదా?? ఖచ్చితంగా హిందూ మతం అంటే ఇది అని చెప్పెడాడు ఎవడైనా ఉన్నాడా ?
ఎటు పోతోంది హిందూ మతం ? ఆపే వాడెవడు ?
హిందూ మతం ఏం చెపుతోంది ??పురాణ పురుషులని , పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే బాబాలకి ..ధూప దీప నైవేధ్యాలా పెట్టి పుజించామనా ?? లేక యమ నియమాలు పాటిస్తూ యోగాభ్యసమా ??
ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఎవరు, ఎంతమంది నిజంగా జన్మ రాహిత్య స్థితి కావాలని.. eternity కలగాలని ఆశిస్తున్నారు ?
ఎంత మంది.. ఈ సుఖ భోగాలకై.. పరితపిస్తున్నారు ?
ఒక solidity లేదు కనకనే..ఒకే బావన లేదు కనకనే .. complicated ఐపోయింది..చిక్కుముడి పడిపోయింది.. ఇప్పుడు ఎవ్వరు ఏమి చేయగలిగింది లేదు. there is no way..

నేను అనుకునేది ఏంటంటే ..

అసలైన హిందూ ఆధ్యాత్మిక సంపద అయిన ... కుండలిని, క్రియా, రాజయోగాది యోగాభ్యాసాలు వదిలేసి..బౌతిక మైన ఆహార్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. రామాయణ భాగవత భగవత్గీత పద్యాలను వల్లె వేసే వాళ్లే హిందూ అధ్యాత్మికతకి ప్రతీకలు గా భావిస్తున్నాం. హిందూ మతం "life is a celebration" అని చెప్పే జీవన శైలి. భారతీయ ఆధ్యాత్మికత నిస్సంకోచంగా పరమాత్మని చేరే ఒక సాధనం. ఒకటి సుసమాజం కోసం..ఇంకోటి ఆత్మా - పరమాత్మల సంయోగ సాధనం. ఒకటి సామాజికం, ఇంకోటి వ్యక్తి గతం. కనక వ్యక్తి గతంగా పరమాత్మా దర్శనం కావాలంటే మతం తో పనిలేదు,  యోగ సాధన తప్ప.   సామాన్య సామాజిక జీవితం గడిపేవాడు ఏ మతం లో చేరి ఏం చేసిన.. భారతీయ ఆధ్యాత్మికత కి వాటిల్లే ప్రమాదం ఏమి లేదు.

Nov 26, 2010

తెలుసా??


నిద్ర పోతున్నావా.. బాగా అలసి పోయి.మత్తుగా..నిన్ను నివే ఆదమరిచావా ??
లేక కలల ప్రపంచంలో.. బంగారు వన్నెల రెక్కలతో విహరిస్తూ  వింత లోకాన్ని అస్వాదిస్తున్నవా ??
లేక మానస సముద్రంలో దూకి... అంతరంగ.. అందాల్ని..అద్బుతాల్ని  అవిష్కరిస్తున్నావా?
తెలియని అగాధపు లోతుల్ని శోధిస్తున్నావా  ?
లేక... నీకే తెలియని భయం.. వికృత రూపంలో దర్శనమిస్తోందా ??
లేక... హృదయాంతరాలాల్లో   ఉన్న ఆనందాన్ని    నీ మొహం మీద చిరునవ్వులా ఒలికిస్తున్నావా   ??


నీ నిద్ర కోసం..సూరీడు దూరంగా  ఇవతలి వైపుకి వోచ్చాడని..
ఆకాశం చుక్కల  దుప్పటి కప్పి ..చద్రున్ని బెడ్లాంప్   లాగా వెలిగించిందనీ ..
అనంతః  దూరంలోంచి పరుగు పరుగున పిల్ల గాలి నీకోసం వేంచేసిందనీ..
సమస్త ప్రకృతి నీకు జోల పాడుతోందనీ.. తెలుసా ??


తూరుపు నీ మెలకువకై.. కళ్ళలో వొత్తులు వేసుకు  చూస్తోందనీ
నారింజ రంగు చీరతో  తెగ మురిసిపోతోందనీ..
పక్షిలోకం కొత్త రాగాలు నేమరేస్తున్నయనీ..
నీ  వాకిట్లో  గులాబీ  నవ్వుని practice చేస్తోందనీ..
నీకోసం  మల్లియ  పరిమళాన్ని నింపు కొంటోందని   తెలుసా?? 

Nov 6, 2010

కార్పోరేట్ దోపిడీ


దీపావళి  పండక్కి  మా అన్నయ్య  వొచ్చాడు ఫామిలీ తో సహా.. ఆ మాట ఈ మాటల్లో  ..చక్రి. నాకు తెలియకుండా  
15 రూపాయలు కట్ అయ్యాయి ఫోన్ బాలన్సు నుండి. ఎందుకంటావ్ ?
నేను వెంటనే... ఏదైనా కాలర్ ట్యూన్ గాని activate చేశావా?
నాకు తెలిసి ఏం చేయలేదు. ఆగు చూద్దాం అని నా ఫోన్ నుండి కాల్ చేశా.. 
" నిన్నా లేదు మొన్నా లేదు.. నిన్న మొన్న లేకపోతే రేపే లేదు ..ఏక నిరంజన్" 
వొస్తే రాదు.. చస్తే రాదు.. పోయిండేది తిరిగే  రాదు ఎక్ నిరంజన్ "
పాట  చక్కగా వినిపిస్తోంది. కాలర్ ట్యూన్ activate చేయించావ్ గా ...
లేదు నేనేం  చేయలేదు.. 
సరే అని customer care కి రింగ్ ఇచ్ఛా...
మీరు customer care executive తో మాట్లాడటానికి ప్రతి మూడు నిమిషాలకి 50 పైసలు ఛార్జ్ చేయబడతాయి.అయినా మీరు మాట్లాడాలనుకుంటే ఒకటి నొక్కండి..
నొక్కాను 
  వాడు పెట్టిన సొల్లు మ్యూజిక్..మధ్య మధ్యలో వొచ్చీ  రాని  తెలుగులో  ఇదీ కావాలంటే అది నొక్కు, అది కావాలంటే ఇదీ నొక్కు అని అమ్మాయి వాయిసు.
ఎవడబ్బ సొమ్మని చెప్పా పెట్టకుండా 15 /- నోక్కేసా డన్న  కసి, ఎందుకలా అడుగుదామని ఫోన్ చేద్దామంటే  charging call .. 
క్షణ క్షణానికి  అసహనం, కసి,  బాధ  లను కంట్రోల్ లో పెట్టుకొని ఒకటా రెండా ఏకంగా 15 నిముషాలు లైన్ లో  ఉంటె.. అప్పుడు వొచ్చింది ఓ పిల్ల లైన్  లోకి 

చెప్పండి సర్ మీకు నేను ఏ విధంగా సహాయ పడగలను ?
కాలర్ ట్యూన్ ఎందుకు ? ఎవరినడిగి activate చేసారు ?
అదేంటి సర్ మంచి పాట  అందుకే.
మంచి పాట ఎవరికీ ?  ( కోపం ఆగటం లేదు )
అందరూ పెట్టుకుంటున్నారు సర్ .. just 15 రూపాయలే కదా..( నీ అయ్యని కట్టమను,  అనలేదు, ఆపుకున్నా )
 కోపం నషాళానికి అంటింది..
చూడు మాకు కాలెర్ ట్యూన్ అవసరం లేదు..  దయ చేసి తీసివేయండి  మా బాలన్సు 15 /- మళ్లీ ఇచ్చేయండి 
అలా ఇప్పుడు కుదరదు సర్. ( నీ  ..... అందామనుకొని  సంస్కారం వల్ల ఆగిపోయా ) 
ఇపుడు request పెట్టండి .. next టైం అలా జరగకుండా  ఉంటుంది.  
ఇంక కోపం లో ఏం మాట్లాడానో తెలిదు..  నా బాధ కసి .. అంతా తీరేదాక ...
థాంక్ యు సర్.. మీకు ఇంకా ఎమన్నా సహాయం కావాలా  ఏ మాత్రం సిగ్గు లేకుండా అంది.
అలా తర్ఫీదు ఇచ్చారు. బ్రతకలేక  ఈ తిట్లు తినే జాబ్ చేస్తున్నారు అది వేరే విషయం . 
ఆ సిగ్గు లేనిధీ  ఈ పిల్ల కాదు.  ఆ  బిచ్చ గాడు.


ఎంత చెప్పు.. ఏం లాభం..  డబ్బు మాత్రం తిరిగి రాలేదు.
  telephone సర్వీసెస్ ఇలా దర్జా దోపిడీ కి దిగజారి పోయాయి. 
ఈ దోపిడీ ఒక్క తెలిఫోనే సంస్థలే కాదు ఇంకా చాలాసంస్థలు చాల రకాలుగా,  మీకు తెలిసే చేస్తారు. మీరేం చేయలేరు. కేవలం బాధపడటం  తప్ప.
ఈ రోజుల్లో చదువుకున్నా లేకపోయినా. ఏదున్నా లేకపోయినా.. ఏం పని చేస్తున్నా.. ఒక ఫోన్ ఉండటం అవసరంగా మారింది.
పాపం కూలీలు, మేస్త్రీలు.. ఆటో వాలాలు, టీ బండి.. టిఫిన్ బండి ,,ఐరన్ షాప్ వాళ్ళు.. ఇలా నానా కష్టం చేసి ఏదో చిన్న బాలన్సు వేసుకుంటే.. ఈ లం....కొడుకులు..అది నొక్కు ఇదీ నొక్కు అని .. ఒక్కోసారి అది కూడా చెప్పకుండా డబ్బులు కట్ చేస్తుంటే.. 
ఎవరికి చెప్పుకోవాలి?
ఏం చేద్దాం చెప్పండి ?

corporate beggers


పొద్దున్నే 6 గంటలకి  నా గుర్ర్ ని చెడగోడుతూ గుర్ర్ర్ గుర్ర్ అని నా ఫోన్ మెసేజి వచ్చినట్టు  గోల పెట్టింది. అసలే రాత్రి నిద్రపట్టక ఏ రెండు గంటలకో  పడుకున్న నాకు.. అంత పొద్దున్న ఎవరబ్బా మెసేజి అని లేచి చూద్దును కదా.. 
" dear customer, your bill has been dispatched for the amount of -----/-  and please pay the bill . if your already paid please ignore this manege "
పొద్దు పొద్దున్నే బిల్లు  కట్టు అని . గత మూడేళ్ళుగా వీడి సర్వీసులే పట్టుకొని వేలాడపడుతున్నా నమ్మడు.  due డేట్ ఉన్నా పట్టించుకోడు.బిల్ generate చేసిన నాటినుండి .. కట్టే దాకా.. చంపుకు తింటాడు. బిల్లు కట్టాక మహా అయితే ఒక 15 రోజులు కొంచం నిమ్మళం. ఆ తరవాత మళ్లీ మొదలు.
పండక్కి ఒక్క best wishes msg చేయడు. పుట్టిన రోజుకి  హ్యాపీ birthday చెప్పడు.  బిల్లు , caller tunes , ring tones వీటికోసం మాత్రం పొద్దనకా మాపనకా ఒకటే కాల్స్ , మెసేజి లు.  అవతల మనిషి చచ్చినా మెసేజి లు మాత్రం ఆగవు.
అసలే ఒక పక్క హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ. నడి ట్రాఫిక్లో ఉండగా ఫోన్ ఒకటే గోల. ట్రాఫిక్ లోంచి మెల్లిగా బయట పడి..మిస్ కాల్ చూసి మళ్లీ ఫోన్ చేస్తే..
sir, i am priyanka calling form vodaphone,  మంచి పోస్ట్ పైడ్ offers   ఉన్నాయి, చెప్పమంటారా??
నీ అమ్మా( మనసులో ) ... నాకే ఫోన్ వొద్దు తల్లి.. దయచేసి మళ్లీ ఇంకోసారి ఫోన్ చేయకు.
రెండుగంటలు గడిచాయో లేదో సర్ i am ప్రణవి. సర్ మంచి offers ఉన్నాయి.
ప్రణవి ఒక పని చెస్తావా?? నన్ను  చంపెయ్యి.
సర్ సారీ సర్.. 
 పిజ్జా  ఒక్కసారి ఆర్డర్  ఇచ్చి తిన్న పాపానికి  వాడు మెసేజిలతో  మన ప్రాణాలు తినేస్తాడు.
ఇక prepaid వాళ్ళకొచ్చే కాల్స్ , మెసేజెస్కి లెక్కే లేదు.
real estate, matrimony, colleges, web designing ..movies ,,ring tomes,, caller tunes.. u name them..

 వీటిని మౌనంగా బరిస్తున్న వాళ్ళంతా నిజంగా సహన దేవుళ్ళు.
 వీళ్ళ బాధ బరించలేక, మా friend మెసేజీలు చూసుకోడం మానేసాడు. కొత్త నెంబర్ నుంచి ఫోన్ వొచ్చిందంటే  లిఫ్ట్  చేయడు.
ఒక రోజు వాళ్ళావిడ పెద్ద గొడవ. బాలన్సు ఐపోయి వేరే నంబెర్ నుండి  ఫోన్ చేస్తే వీడు లిఫ్ట్ చేయలేదని.
ఇండియన్ government .. ఒక 1000 /- కి కక్కుర్తి పడి telemarketers   కి license ఇచ్చి జనాల ప్రాణాలని బలి ఇస్తోంది. 
మీరూ నాలాగ బాదితులయితే  go to link and register your phone number.
 http://ndncregistry.gov.in/ndncregistr/index.jsp?reqtrack=mFRktNCwWVEDkoLhwabDixQuj


Oct 20, 2010

ఒకరోజు సరదాగా..



యా.. సరదా డేట్...
శ్రుతి రెండేళ్లుగా  ఇంటర్నెట్ లో పరిచయం..
అప్పుడప్పుడు sms .. ఫోన్ కాల్స్.. 
నెట్ లో కలిసిన ప్రతిసారి.. నేనూ కలుద్దాం అనటం.. ఆమె అవసరమా అనటం..




అల్ అఫ్ అ సడన్.. 
ప్రతిసారిలాగే..
కలుద్దామా అని నేను.. ఎప్పుడు?? అని ఆమె..
నిజమా అని నేను అడిగేన్తలో.. 11 కల్లా   వోచ్చేయి .. లేకపోతే ...i will go to office
ఒహ్హ వొస్తున్నా...
చక చక తయారై..బయలుదేరా ( చిన్నప్పుడు సినిమా అంటే ఇలాగె అయ్యేవాడిని )


హాయ్.. how are u లు ఐపోయాక
శృతి అంటే ఇలా ఉంటుందా.. ఈమేనా... అని ఆశ్చర్యం ..
అ మాటలకి.. రూపానికి పోల్చుకోటం లో నేను...
మాటల్లో రౌడి లాగ ఉన్నావ్..కాని.. చూస్తే అలా అనిపించవ్ అని ఆమె..
ఆఫీసు వెళ్ళాలనిపించలేదు.. అది కాక  నివ్ చాల రోజులనుండి కలుద్దాం అంటున్నావ్ కదా .....గొణుగు 
అవునా.. అంటే టైం పాస్ కి అన్నమాట....   
హే కాదు.. కలుద్దాం అంటున్నావ్ కదా.. అందుకే...
సర్లే .. ఇంకా...
 ఈ మాటల్లో లంచ్ అయింది..
నేను : అండ్ నౌ.. హే లాంగ్ డ్రైవ్ వెళ్దామా..?
శ్రుతి : ఎక్కడికి..??
నేను : ఏమో.. అలా .. may be చిల్కూర్.. 
శృతి : అంత దూరమా.. ఇంత ఎండలోన..
నేను : అంత దూరం కాకపోతే .. సగం దూరం వెళ్దాం..వెనక్కి వోచ్చేద్దాం ..ఏమంటావ్ ??
శృతి: సరే నీ ఇష్టం..
నేను : ఓకే.. ( అని..బైక్ మెహది పట్నం వైపు పోనిచ్చా..)
ఎదురుగ.. flyover .. నాకు అది airport fly over అని తెలిదు..
అది కాక  చాల పెద్ద లెటర్స్ తో రాసారు.. Two wheelers are strictly not allowed అని.. అది కుడా కనపడలేదు.
flyover ఎక్కించా..
ఖాలిగా ఉంది.. స్పీడ్ పెంచా...
అప్పుడు చెప్పింది.. శృతి.. హే.. ఎందుకు దీనిమీదకి  తెచ్చావ్.. 
two wheelers are strictly not allowed అని రాసారు గా
అవునా..అయ్యో ..నేను చుడలేదు..ఇప్పుడెలా??
అయితే వెనక్కి తిప్పు..
తిప్పుదామనే అనుకున్నా.,కాని వెనక్కి రావటానికి దారి లేదు..
అడపా దడపా ఎదురుగ కార్లు తప్ప ఒక్క two wheeler కూడా రావటంలేదు..
కనిసం ఒక్కడైనా రావోచ్చుగా నాకు తోడుగా..
ఎంత దూరం పోయినా.. fly over ఐపోటం లేదు.. వొస్తూనే ఉంది రోడ్డు..
అయ్యో..ఎలా అంది..తెగ టెన్షన్ తో అంది శృతి..
అయిందేదో  అయింది..అవతలి చివర  వొచ్చేదాకా   enjoy the ride ..
మహా అయితే 500 /- ఫైన్ ఉంటుంది ..
 11 km ఎవ్వరు లేని  మెలికల రోడ్డు...మాకోసమే వేశారా  అనిపించింది..
THE END రానే వొచింది..ఆపనే ఆపాడు  ... చిన్న ట్రాఫిక్ గుడిసె..దాన్లో ఉన్న  ట్రాఫిక్ భటుడు..

సర్.. తెలీకుండా వచ్చాం ..బోర్డు కనపడలేదు.. వెనక్కి వెళ్దాం అనుకుంటే.. దారి కూడా లేదు... (కొంచం లో వాయిస్ లో చెప్పా)
అయితే ఫైన్ కట్టు..
ఎంత ...అని నోట్లోకి వొచ్చేసేదే .. 
కాని..ఏ ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నా.. వొచ్చే రేగులేర్ మాట... దానికంటే ముందు వొచ్చేసింది తెలీకుండానే..
"నేను  ప్రెస్ "
 మరి ముందే చెప్పోచుగా..అని చిరునవ్వు తో  లోపలికెల్లిపోయాడు.
వెనక పిల్లకి టెన్షన్ సడన్ గా మైనస్  లో కి పడిపోయింది..
:) :)
ఇంకంతే......

Oct 5, 2010

అన్నింటికీ మూలం...

ఒక చిన్న కొలను... ఒడ్డున పిల్లలంతా ఆడుకుంటున్నారు..
ఒక పిల్ల వాడు మాత్రం .. వింత శబ్దం చేస్తూ.. ఎగురుతున్న ఒక అందమైన   పిట్టని గమనిస్తున్నాడు..
అది అ కొమ్మ ఈ కొమ్మ.. ఎగురుతూ.. రివ్వున.. అవతలి వొడ్డుకి ఎగిరిపోయింది.
తాను ఆ పక్షి లా ఎగరగలిగితే..??
 అన్నయ్య కి చెప్పాడు.. అతనికి ఉత్సాహం కలిగింది.. అవును..మనం కూడా రివ్వున ఎగరగలిగితే..
ఇద్దరికీ నిద్ర పట్టటం లేదు...
యువకులు గా ఎదిగారు.. ఉండ బట్ట లేక.. పక్షికి మల్లె రెక్కలు తయారు చేసుకొని.. ఓ కొండ పై నుండి దూకారు..
కాళ్ళు చేతులు విరిగాయి.. కానీ నమ్మకం  మాత్రం వీడలేదు.
ఎంత పిచ్చి పని.. అని అందరూ  నవ్వు కొన్నారు 
అప్పుడు  తమ్ముడు అన్నాడు " I believe i can fly .. I believe I can touch the sky .."
అన్వేషణ మొదలైంది.. పుస్తకాలు  తిరగేసి.. పక్షులని గమనించి.. లెక్కలు వేసి..బొమ్మలు గీసి..
చివరకు..... సాధిచారు.. first air craft తయారు చేసారు..
వాళ్లే wright brothers .
ఇలాంటివి చరిత్రలో ఎన్నో కథలు.. ఎన్నో ఆవిష్కరణలు.. ఎన్నో అద్భుతాలు.
అన్నింటికీ మూలం..నమ్మకం....ప్రఘాడ కాంక్ష  .. పట్టుదల..
 "if u can believe u can do "
"నీ కాంక్ష  బలమైనపుడు  అది నిజ స్వరూపం దాల్చి నీ కళ్ళముందు నిలుస్తుంది"

Oct 3, 2010

మూడక్షరాల పదం ...


జీవితం లో గెలుపు కన్న ఆనందం ముఖ్యం.  ఒకవేళ గెలుపే ఆనందం అయితే గెలవాలి.
కాని కొన్ని సార్లు గెలుపు కుడా ఆనందాన్ని ఇవ్వలేదు. కళింగ యుద్ధం తరవాత అశోకుడికి ఆనందానికి బదులు బాధ వేసింది.
మనకి కావాలనుకున్నది పొందటమే ఆనందం అయితే ఆ ఆనందం ఆనందం కాదు. మనకి కావాల్సింది పొందాం  కాని ఏం కోల్పోయి పొందాం అన్నది ప్రశ్న.
అందుకే చెప్పారు గెలవటం కాదు పాలుగొనటం ముఖ్యం అని.
గమ్యాన్ని చేరుకోటం  ముఖ్యం కాదు, ఆ చేరుకునే దారిలో ఎన్ని అనుభూతులు, ఎన్ని అనుభవాలు ఉన్నాయనేది ముఖ్యం.

Sep 18, 2010

money..ammayee


ఇదుగో, చాలామంది  అమ్మాయిలు మనీ minded అనటానికి..మగాడి పర్సు తప్ప ఇంకేం కనపడదు అనటానికి ఇదొక చిన్న ఉదాహరణ ..

ఈ అమ్మాయికి.. సంవత్సరానికి 10 లక్షలనుండి కోటి సంపాదించే మొగుడు కావాలంట.. కనిసం పది లక్షలు లేనిది పెళ్లి చేసుకోదట..
ఆ కోటి సంపాదించే వాడూ ఈ పిల్లతో కాపురం ఎందుకుంటాడు..రోజుకో అమ్మాయితో తిరుగుతాడు..పోనీ మంచోడే అయినా.. ఈ పిల్లే ఎందుకు అని...??
Swati Sharma 9
Classic Plus Member
Female - Unmarried | Profile created for: Daughter
Age: 30 yrs | Height: 5 Ft 4 In / 163 Cms | Weight: 54 Kg / 119 lbs | Education: Management | Residing State: Delhi
Partner Preference Specifications
Age
30 - 36 Yrs
Height
5 Ft 7 In - 6 Ft 4 In
(170 Cm to 193 Cm)
Marital status
Unmarried
Physical Status
Normal
Mother Tongue
Hindi
Educational and Professional Preference
Education
Bachelors - Engineering/ Computers, Management - BBA/ MBA/ Others, Masters - Engineering/ Computers, Finance - ICWAI / CA / CS / Others, Service - IAS/ IPS/ IRS/ IES/ IFS Others, PhD
Annual Income
Rs.10 Lakh to Rs.1 Crore
Occupation
Any
Location Preference
Citizenship
India
Country Living in
India
Residing State
India - Uttaranchal, Uttar Pradesh, Haryana, Chandigarh, Delhi
Resident Status
Any
Residing City
Any
About My Partner
Annual disposable Income must be more than10(ten) lacs.Manglik and Non Manglik both partners acceptable. 
2) S.Radha
my only one daughter is looking smart doing IT Engineering 4th year. We want a boy who is earning more than Rs. 1,00,000 per month and the age difference should be 2-4 yearsand strictly brahmin Iyer only.

కుజదోషం ఉండనీ లేకపోనీ ..పర్లేదు...మంచోడా చెడ్దోడా పట్టించుకోను..
healthy కాకున్నా wealthy అయితే చాలు...డబ్బు ఎలా సంపాదించాడో అనవసరం.
డబ్బు ఉందా లేదా ?? అంతే అది ముఖ్యం.. 

ఇప్పుడు పెళ్లి ఒక కెరీర్ - చలం 

Jul 7, 2010

సిగరెట్టు



"సిగరెట్టు ఉంటె అగ్గిపెట్టె ఎవడైనా ఇస్తాడు "


"సిగరెట్టు కాలితేనే కాని మనసు చల్ల బడదు"


"గుండె మండుతున్న విషయం సిగరెట్టు పొగ చెపుతుంది"


"నే తాగిన ప్రతి సిగరెట్టు మీద ఒట్టు,, నేను నిన్ను  ప్రేమిస్తున్నాను "


"సిగరెట్టు   ఇన్స్పిరేషన్ అయితే respiratary problems వొస్తాయి "


"సిగరెట్టు కనిపెట్టిన వాడు కాన్సెర్ కి మందు కనిపెట్ట లేక పోయాడు "

Jun 30, 2010

అమ్మ కోరిక ... నా కోరిక

ఉదయం 5 గంటలకల్లా లేచి.. మడి స్నానం చేసి ఎర్రని పట్టు వస్త్రం ధరించి  గోపిచందనం పెట్టుకొని అనర్గళంగా స్తోత్రాలు వల్లె వేస్తూ....... సాలగ్రామ శిలయంతు... అంటూ.. సాలగ్రామ పూజ చేసి, వైసుదేవం పెట్టి ఆ ప్రసాదాన్ని కళ్ళ కద్దుకొని తినాలని  మా అమ్మ కోరిక.

నాకేమో.... మా అమ్మని ఎక్కడికైనా Holiday తీసుకెళ్లి.. మడి గిడి లేకుండా  దర్జా గా ... restaurant లోకి అడుగు పెట్టి ..హ్యాపీ గా కావలసిన items order ఇచ్చి  ఆ  రుచులారగిస్తూ... ఎంజాయ్ చేయాలని.. .

ఈ జన్మకి ఇద్దరి కోరికలు తీరవు..,
ఎందుకంటే..  చావనైనా  చస్తాను కాని ఇవన్ని నా వల్లకాదు  అని నేను... 
నా బొందిలో ప్రాణం ఉండగా అలంటి  కూడు తినను  అని మా అమ్మా..
:) :) 
అన్ని బుద్దులు చెప్పి  అంతా  జాగ్రత్తగా పెంచితే ఇలా ఎలా 

తయారయ్యవ్ రా,  నా కడుపునా చెడ పుట్టావ్ రా! అని అని ఆమె..
చూడమ్మా...జనాలంతా  హాపీ గా ఎంజాయ్ చేస్తుంటే.. నీవేంటి ఇంకా  తడి మడి అని.. వదిలేయ్ అని నేను..
నీది బ్రామ్హణ  పుటకేనా అని ఆమె..
ఎదో  ఒక పుటక ... బేసిక్ గా మనుషిని అని నేను..

దేవుడు నిన్ను  క్షమించడు .. అని ఆమె..
దేవుడా?.. ఉన్నాడా? .. లేడా?  అని సందేహం నాకు...

నీకేదో  మాయరోగం వొచ్చింది .. ఉండు నీపేరు మీద హోమం చేయిస్తా అని ఆమె..
హోమం చేయించిన రోజే చికెన్ తింటా నీ ఇష్టం మరి అని నేను..

రేపు దసరా పండగ వొస్తున్నావా?  అని అని ఆమె..
దసరా నా..  ఎవరో పాండవులు అప్పుడెప్పుడో గెలిస్తే మనకేంటి.. అసలు ఉన్నారో లేరో !!!
రాను ....అని నేను..

మన సంప్రదాయం మరవొద్దు రా!
నాకే సంప్రదాయాలు వొద్దు ..అని నేను..
....

May 19, 2010

నన్ను కాల్చి చంపేసింది..



L    U     S    T      .. నన్ను కాల్చి చంపేసింది..
వయసొచ్చిన  నాటినుండి .. నేటి వరకు.. నన్ను నా జీవితాన్ని ఉపేసింది
20 సంవతరాలు..
ఏం చేయాలో తేలిక, చెప్పుకునే దిక్కులేక ,
అడగలేక, ఆగలేక .......రాత్రనక....పగలనక..
                         ......  నరకం..........
 ప్రేమగా పలకరిచే గొంతు లేక, సేద తీర్చే వొడి లేక..
 నేను తిట్టని దేవుడు లేడు.
అన్నమయ్య మది నిండా వేంకటేశ్వరుడు  నిండి నట్టు..
నా మది నిండా అదే..
అమ్మా  ఆకలేస్తుంది అనో,, నాన్నా  డబ్బులు కావాలనో అడగొచ్చు 

కాని దీన్ని  .. ఎవరిని..ఎక్కడ..  ఎలా.
నన్ను మెచ్చి వొచ్చిన   అమ్మాయి లేదు.. నేను మెచ్చి అడిగిన అమ్మాయిలతో   చీ ..పో లే .
I am not that kind of girl you know.. ..ohhh stupid.. as if they don't have LUST. 


దీనికి తోడు .. ఇంటర్నెట్ లో ఇండియన్ స్కాండల్సు..
ఇలాంటి అమ్మాయి నాకు తగలదేం   అని వాడి అదృష్తానికి మళ్లీ రగిలి.
..అయ్యో చావైనా  రాదే..

అద్బుల్ కలాం ని చూసి ఆశ్చర్యము, బాధ..................












నిజంగా దేవుడున్నాడా


నిజంగా దేవుడున్నాడా అని ఒక్క సారయినా  మీకు అనుమానం రాలేదా ??

మొన్న వైష్ణవిని  మాడ్చి మసి బొగ్గు చేసినపుడు ?
మన రాజకీయ నాయకులని   చూసినపుడు ?  వాళ్ళ కుంభకోణాలు గురించి విన్నపుడు ?
బాబాలు  దేవుడి ముసుగులో చేస్తున్న అరాచకాలు విన్నపుడు ?
నిత్యం జరిగే మర్డర్లు మాన భంగాలు, దోపిడీలు దొంగతనాలు..అల్లర్లు ఆత్మ హత్యలు
దేశం లో  ఎక్కడ పడితే అక్కడ  దరిద్రం చేసే  "రుద్ర తాండవం" చూస్తున్నపుడు ?
కన్న తండ్రే కిరాతకంగా , కూతురుని  అనుభవిస్తున్నపుడు ?
తల్లి,  పిల్లని అమ్ముకున్నపుడు ?
జనాలని టెర్రరిస్టులు పిట్టల్ని కాల్చినట్టు కాల్చినపుడు ?
బాంబులు బగ్గు మన్నపుడు ?
అమాయకులు ముక్కలైనపుడు ?
ఎప్పుడూ రాలేదా  ??
దేవుడున్నాడా అని ఒక్క సారయినా  మీకు అనుమానం రాలేదా ?











మనిషి

జీవ పరిమాణ సిద్దాంతం నుండి మనిషి వోచ్చడా? లేక బైబిలు లో చెప్పినట్టు దేవుడు ఒక అడ ఒక మగని  సృష్టిస్తే   వాళ్ళ నుండి ఈ మన మనుష జాతి విస్తరించిందా ??

                           తెలీదు  కాని ....

మనిషి ప్రయాణం అప్రతి హతంగా సాగి

నిప్పు రగిల్చి.. రుచులు వడ్డించి

కాంతిని చీల్చి... రంగులుగా మార్చి,

చక్రాన్ని చేసి , ప్రపంచాన్ని చుట్టి.

నింగి పై ఎగిసి , నీటిపై తేలి..

భూమి లోతుని ...ఆకాశం అంతును చూసి 

కంప్యూటర్ కనిపెట్టి...ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి.. 

ఏమి సాధించాలనో ఆ తపన ?
అంతు లేని కాంక్ష.. గమ్యం లేని పయనం...
అదే మనిషి జీవితం.

Mar 31, 2010

దైవం

మనకి అర్థం కానిదంతా దైవ మాయే. 
భూగోళాన్ని అపకేంద్ర , అభికేంద్ర బలాలు ఒక నిద్రిష్ట కక్షలో తిరిగేలా చేయటం, పదార్థంలో పరమాణువుల అమరిక...తద్వారా  పదార్థ ధర్మ మార్పు, జంతుజాల జీవన క్రియలు  నుంచి మొదలు కొంటె ప్రతిదీ ఒక పద్దతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. 
మానవ మేధస్సు సృష్టి లో ఉన్న కొన్ని రహస్యాలని చేదించి స్వలాభానికి వాడుకుంటూ ఉంది.. కాని  సృష్టి కారణం, కారకులు, జీవం , జీవితం ..వీటిని ఇంకా నిర్వచించ లేక పోయింది . ఇక్కడే "దేవుడు" అన్న పదం ప్రతిపాదించ బడుతుంది..మనకి అర్థం కానిదంతా దైవ మాయే.

దేవుడు ఒక సాంఘీక  అవసరం

దేవుడు ఒక సాంఘీక అవసరం. ప్రజలు దేవుడి పేరుతో కొంత రిలాక్స్ అవ్తున్నారు. తమ తమ కోరికలని తీరుస్తాడని, ఆపదలనుంచి గట్టేకిస్తాడని, సమస్యలని పరిస్కరిస్తాడని నమ్ముతున్నారు. ఆ నమ్మకం లో బ్రతకక పోతే వ్యక్తీ గతంగా, సాంఘీకంగాఅశాంతి ప్రబలి పోతుంది. సమాజం లో విలువలు నశిస్తాయి. అవి పోయిన నాడు లోకం నరకం. ఇప్పటికే చాల శాతం మంది బ్రతుకు పోరాటం లో, ఆశల వాహినిలో, సుఖ భోగ లాలసలో పడి విలువలు మరిచి దోపిడీలు , దొంగ తనాలు, మోసం, హత్యలు , అత్యాచారాలు చేస్తున్నారు. ఇక దేవుడు అనేది గుడ్డి నమ్మకమే అని తెలిసిందో... ప్రపంచం వల్లకాడైపొదూ  ..

ఒక దానికి surrender కావాలి 

మనిషి దేనికో ఒక దానికి surrender కావాలి . అదొక ఆనందం. దానినే ప్రపత్తి అంటారు. మన అహంని మరిచిపోయి ఎవరికో ఒకరికి, దేనికో ఒన దానికి అర్పణ కావాలి..
దేనికి కావలి.?? ఎవరికీ కావాలి??
నీకా? కాని నీలో నాకు లోపాలు కనపడుతున్నాయే..నాకంటే గొప్పగా కనిపించటం లేదే నీవు ??
మరి ఎలా...
సరిగ్గా అప్పుడే "దేవుడు" ఒక అవసరం అవుతుంది ఎవరికైనా. ఎవరితో మనం మనని మరిచిపోయి, ముసుగు తొలగించి, మంచి చెడు చెప్పుకొని. ఏడ్చి, నవ్వి, ఒదార్చుకొని..స్వాంతన పొందుతామో అదే దేవుడు.
ఆ దేవునికి మనని మనం అర్పణ చేసుకొని, ఆ ప్రపత్తి లోఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
అందుకే దేవుడిని idealize చేసి, సకల గుణగణుడుగా, మహా శక్తి సంపన్నుడుగా, దయామయుడిగా, ఆపద్భంధవుడిగా, కొంగు బంగారంగా కీర్తిచి...స్తుతించి, శ్లాఘించి  స్వాంతన ఆనందాన్ని పొందుతున్నాం.
సంగీత మాదుర్యము, భక్తి ప్రపత్తి, సాహిత్య పు గారడీ కలగలిసి మన మనసులో పుట్టించే ఆనంద తరంగాలు మనని ఒలలాడిస్తాయి .

దేవుడంటే ....????

 ఏ శక్తి జీవ చైతన్యానికి ఆధారమో,ఏ శక్తి పూలకి రంగుగా మారుతుందో.. ఏ శక్తి పక్షి రెక్కలో దూరి దాన్ని గాల్లో తెలుస్తుందో.. ఏ శక్తి భూమిని గాల్లో పట్టి ఉంచిందో.. ఏ శక్తి మనని పలికిస్తుందో,నడిపిస్తుందో, పరుగులేట్టిస్తుందో, మన ఆలోచనలకి ఆధారమో, . .. ఏ శక్తి మాటై, పాటై మాధుర్యమై మనని అలరిస్తుందో, ఏ శక్తి వేలుగునీడలో సృష్టిస్తుందో, ఏ చైతన్యం విత్తు లో ఉన్న జీవాన్ని మేలుకొలిపి భూమిని చీలుచుకొని మొలకగా మారుస్తుందో.. ఆ శక్తి చైతన్యమే దేవుడు.

దేవుడు మీ కోరికలు తీర్చడు.

నిజం..

దేవుడు మీకోరికలు తీర్చడు. అరిచి గీ పెట్టు.. లక్ష కొబ్బరికాయలు కొట్టు.. గుండు గీయించుకొని తిరుగు జన్మంతా.. దేశం లోని గుళ్ళు గోపురాలు చుట్టబెట్టు ... ఎమన్నా చెయ్యి ...మీ   కోరిక తీర్చడు..

మీకు మీరు .. హృదయంతరాళం లోనుంచి .. ఫీల్ అయ్యి.. sincere గా శ్రమిస్తే మీ  కోరిక నెరవేరుతుంది..

మనకి కావలసినవి కోరుకోటానికి.. ..అనుకున్నది తీరక పోతే గుండె మండి తిట్టు కోటానికి దేవుడు కావలి. 

 



Mar 22, 2010

అసలైన అబలత్వం

మొన్నెపుడో  ప్రపంచ మహిళా దినోత్సవం  జరిగింది. మహిళలందరూ ఒక చోట చేరి " మహిళ గొప్పతనం, కుటుంబానికి, సమాజానికి మహిళ ఎలా సేవ చేస్తుందో, తామెంత ముక్య పాత్ర పోషిస్తున్నారో తెలియజెప్పారు. సమాజం లో ఎలా దూసుకుపోతున్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారో , ఎలాంటి ఆపదలు ఎదురు కావోచ్చో, వాటిని ఎలా face చేయాలో  వివరించారు. మహిళా బిల్లు అదేంటో నాకు తెలియదు కాని దాని గురించి కూడా చర్చించారు.
ఆడది ఆబల  కాదు సబల అని చాల మంది మహిళలు prove చేసారు, చేస్తున్నారు.
కాని నేను గమనించింది ఏంటంటే... ఇల్లు విడిచి ఉద్యోగాలు చేస్తున్నా , విమానలేక్కి గాల్లో చక్కర్లు కొడుతున్నా.. పొలిసు మిలిటరీ దళాల్లో  చేరి దైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నా.. కొన్ని విషయాలలో మాత్రం ఆడది ఆబాల గానే మిగిలిపోయిందేమో అని అనుమానం .
ఉద్యోగం చేసినా, ఊళ్ళేలినా  ఇంటికొచ్చి  కన్నీటి చిట్టా విప్పుతుంది. చున్ని అంచుతోనో.. tissue  paper   తోనో కళ్ళు, ముక్కు తుడుచుకొంతోంది. కారణం ఏదైనా కావొచ్చు. బాస్ తిట్టాడనో,  బాయ్ ఫ్రెండ్ ముఖం చాటేసాడనో, మొగుడు పట్టించుకోటం లేదనో.  
         స్త్రీ తత్వం సున్నితం, తద్వారా బాధ అనివార్యం. ఎంత సున్నితం గా ఉంటె అంతా బాధ. ప్రపంచ తత్వం, మగాడి గుణం తెలిసి కూడా,  సగం ఎదుర్కొని ఇంకో సగంలో ఓడిపోతోంది. ఇంటికొచ్చి ఏడవటం  అసలైన అబలత్వం. ముఖ్యంగా  relationships  విషయంలో మహిళ బాధని అధిగమించలేక పోతోంది.
ప్రపంచాన్ని గెలుస్తున్నాం.. కాని మనని మనం గెలవకలగాలి.. మన attitude ని మార్చుకోగాలగాలి. దాన్ని సాధన చేయాలి. ఇది సాధించిన  రోజున నిజమైన మహిళా దినోత్సవం. 

Mar 16, 2010

ఇది నా లైఫ్ స్టయిలు.

నాకు, చక్రి గాడికి  అస్సలు పడదు... నాగురించి  నన్ను  ఒక్క మాట చెప్పనీయడు. చూడండి ఏమంటున్నాడో..


నేను చాలా డిఫరెంట్, .. అందరి లాగే..  (తోక్కేం కాదు )
చెప్పేది సూటిగా గుచ్చుకునేటట్టు చెప్పేస్తా..(రక్తం రాదులెండి)
ఎదుటోడిని కాల్చుకుతినడం అలవాటు. (వీడి మొహం చపాతీలు కాల్చటం కూడా రాదు వీడికి )
లైఫ్ ని top angle నుంచి చూస్తే భయం ( వీడికే )
 low angel నుంచి చూస్తే అబ్బ నావల్ల కాదు అని అనిపిస్తుంది (వీడి  వల్ల నిజంగా కావటం లేదు , పరమ  escapist ).
అందుకే eye level is best. (పాపం ట్రై చేస్తున్నాడు )
పొద్దున్నే లేచి ఓ డబ్బా కట్టుకొని బస్సులో వేళాడి ఆఫీసు కి వెళ్ళటం.. ఏం చేస్తున్నామో తెలీకుండా చెప్పింది చేసి ఉసురు మంటూ కొంపకి రావటం నా వాళ్ళ కాదు. ( మరేం చేతనవుతుందో.. తిని కుర్చోటమా )
ఇంకా చాలు లేవరా బాబు అనిపిస్తే నిద్ర లేవటం. చేయాలి అని అనిపించినపుడు మాత్రమే పని చేయటం. ఒక్క సారి ఏదైనా వర్క్ కి కమిట్ అయితే చేసి తీరటం, (ఇంతవరకు కాలేదు, ఎప్పుదవుతాడో  తెలిదు, హి హి )
ఇది నా లైఫ్ స్టయిలు.
(lazy ఫెల్లో అని చెప్పు, నీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది )

Mar 10, 2010

స్వాములోరి పూజమహిమ..

ఆ మధ్య ఎప్పుడో మా అమ్మ పోరు పడలేక .. ఒక జాతకాల స్వామిజి దగ్గరికి వెళ్ళా. ఆమెకీ ఎవరో చెప్పారంటా  గొప్ప స్వామిజీ . అతను చెప్పినట్టు చేస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి అని..
సరే ఇద్దరం వెళ్ళాము.. అడ్రస్ వెతుకుంటూ..


లోపల జనం బాగానే ఉన్నారు.. అయన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు.. జనం అంతా కింద కూర్చున్నారు  . ఏదో జపం చేస్తున్నట్టున్నాడు,  ఎప్పుడూ కళ్ళు తెరుస్తాడా అని జనం ఆయన్ని అదేపనిగా చూస్తున్నారు,  ..నేను మా అమ్మ వెళ్లి కాళ్ళు కడుక్కొని వరుసలో చోటు చేసుకొని కూర్చున్నాం. (కాళ్ళు  కడుక్కొమ్మని శిష్యుడు చెప్పాడు..అదో కండిషన్ అక్కడ మరి.)
అలా ఒక 15 నిముషాల తరవాత అయన కళ్ళు తెరిచాడు.
అందరినీ  తేరి పార చూసి.. లోపలి కెళ్ళాడు.. కొన్ని సెకనుల  తరవాత ఘంటా నాదం వినిపించింది..హారతి  పళ్ళెం,తీర్థం తో బయటకు వచ్చాడు..
అందరూ భక్తి తో మోకరిల్లి, హారతి కళ్ళ  కద్దుకొని  తీర్థం తీసుకున్నారు,
ఒకాయన అయన దగ్గరికెళ్ళి తన గోడు విన్నవించుకున్నాడు..
భార్య తనతో కాపురం చేయటం లేదంట.. జేబులో డబ్బులు మాయం చేస్తుందంట, నిన్నే ౪ వేలు నోక్కేసిందట,  ఎం చేయాలో తెలీటం  లేదంట.. ఎలా దారికి తెచ్చుకోవాలి  అని సందేహం వెల్ల గక్కాడు.
స్వామి వారు ఒక చీటిలో ఏదో రాసిచ్చాడు..ఏం రాసాడబ్బా అని నాcuriosity  ఆపుకోలేక చచ్చా అనుకో...
చీటీ ని చూసి  అతను దాన్ని కళ్ళకద్దుకొని  సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు.


     మా వంతు వొచ్చింది. అంతకుముందే శిష్యుడి ద్వారా  డేట్ అఫ్ బర్త్,  స్టార్, అండ్ టైం అఫ్ బర్త్ రాసిచ్చిన చీటీ అయన చేతికి వొచ్చింది.
కొంత సేపు  వెళ్ళు లేక్కపెట్టుకొని లెక్కలు వేసాడు.  "అంతా బానే ఉంది .. లక్మి దేవి కటాక్షం  లేడు, అందుకనే అనుకున్న పనులు జరగటం లేడు.పెళ్లి కూడా అందుకే వాయిదా పడుతోంది.. అని. స్వామి వారు మహా జ్ఞాని, నేను బ్రహ్మ చారి వెధవనని గుర్తుపట్టేసారు. మా అమ్మ సంతోషం ముఖం లో ప్రస్పుటంగా కనపడింది.
 చీటీ మీద  ఏదో రాసి  మా అమ్మ చేతిలో పెట్టాడు. నేను నా curiosity  ని చంపే  ప్రయత్నం లో చీటీ లాక్కుని చూసాను..
1200 /- అని ఉంది. శిషుడు తనవైపు రమ్మని సైగ చేస్తే స్వామికి నమస్కారం చేసి, అతని దగ్గరికి వెళ్ళాము. రెండో ఇంట్లో రాహువు శని కొట్టుకుంటున్నారు. ఏదోఇంట్లో శుక్రున్ని  కేతువు మింగేశాడు. కనకనే పెళ్లి కుదరటం లేడు అన్నాడు. నేనేమో పెళ్లి సంగతి సరే , కనీసం gf అయినా దొరకటం లేదు . దానికి కూడా  వీళ్ళేనా  కారణం అని అడగాలని నోటి దాకా వొచింది. అమ్మని చూసి ఆగిపోయా..నాకేమి అర్థం కాలేదు ఆ బాక్స్. నన్ను వెన్ను పోటు పొడవటానికి ఇంత మంది ఉన్నారా? నా వెనక మహా కుట్ర జరుగుతోందే అని అనిపించింది. పెట్టక పెట్టక అసలైన వాటికే ఎసరు పెట్టారు అనుకున్నా.  జపం చేసి హోమం చేయాలి.మూడు రోజులు పడుతుంది  అని వివరించాడు.
అలాగే అంటూ  అక్కడినుండి వోచ్చేసాం .
ఇక మొదలుపెట్టింది మా అమ్మ..  ఎప్పడు వెళ్దాం అని..
వేల్దామే ప్రస్తుతానికి 1200 /-  లేవు అని చెప్పా.. నీకెందుకు నేను నాన్న ని అడిగి తెస్తాగా  అంది.
వొద్దు లేవే  డబ్బులు దొరకగానే నేనే చెప్తా కొంచం ఓపిక పట్టు అని చెప్పా.
సరిగ్గా ఒక వారం  తరవాత..డబ్బులు అడ్జస్ట్   కాకున్నా ఏదో ఒకలా మేనేజ్ చేసి.. (అమ్మ పోరు పడలేక )
సరే వెళ్దాం పద అని మళ్లీ ఆయనదగ్గరికి వెళ్ళాం.
ఇందాక చెప్పినట్టు హారతి, తీర్థం  అయిపోయాక అయన ఇచ్చిన  చీటీ చూపించి డబ్బులు ఇవ్వబోయాం .. దానికి ఆయన  పూజ ఐపోయాక అన్నట్టు చెప్పాడు.
రోజు ఉదయం 6   కల్లా  వొచ్చి తీర్థం తెసుకొని వెళ్ళండి అని చెప్పాడు..
మొదటి రోజు నా పేరు మీద సంకల్పం  చేసాడు.. రెండో రోజు జస్ట్  తీర్థం  తెసుకొని  వోచ్చేసాం .మూడో రోజు మాత్రం.. హోమగుండం లో పూజ, నాలాగే ఒక 8 మంది దాకా, .. నెయ్యి , నువ్వులు అగ్నికి ఆహుతి చేసాం .    తర్వాత  తీర్థం ప్రసాదం... డబ్బు సమర్పిచుకున్నాం.
నాకు మహా చెడ్డ చిరాకుగా  ఉంది..డబ్బు  పోయినందుకేమో..??? 
కాని  next day  ఎం జరిగిందంటే..

11 గం  కి ఏదో పనిమీద బయటికి వెళ్లి వొచ్చా. చేసే పని లేక, అలా కల్లుముసుకొని పడుకున్నా.. నిద్ర పట్టేసింది ఘాడంగా.. అ మత్తులోనే ఓ సారి లేచి బయటికి చూసా ..అంతా  సవ్యంగానే  ఉంది ..నిశబ్ధంగా ..
మళ్లీ ఒచ్చి ఇంకో కునుకేసా.. ౩ pm దాకా ..తరవాత ఇంక ఆకలికి ఆగలేక నిద్రపట్టక లేచా. బయట నా బైక్ లేదు. 
 అర్థం కాలేదు.. అసలు ఈ రోజు డేట్ ఎంత?  నేను ఎక్కడున్నా? బయటికి వెళ్ళానా  లేదా ?  బైక్ ఎక్కడ పార్క్ చేశా ? ..ఇలా ఒక్క సారి ఆరోజు చేసిన పనులని రీల్ వేసుకుంటే అప్పుడర్థమైంది.. బైక్ ఎవడో కొట్టేసాడని.
వెంటనే తేరుకొని.. కంట్రోల్ రూం కి ఫోన్  చేస్తే, నల్లకుంట PS   కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని అన్నారు. ఆలస్యం చేయకుండా ఆటోలో వెళ్ళా  , అక్కడ గేటు ముందున్న  పోలీసు దగ్గరినుండి నుండి.. ఎదురైన ప్రతివాళ్ళు
"ఏమైంది.. ఎక్కడ.. ఎక్కడ పెట్టావు, లాక్ చేయలేదా.. ఎంత సేపైంది.. మీకు careless ఎక్కువ " అని లక్ష ప్రశ్నలు వేసి  చివరికి తేల్చింది ఏంటంటే ..నా అడ్రస్  వేరే PS   పరిథి లోకి వొస్తుంది అని.. అక్కడి నుండి వేరే స్టేషన్ కి పరుగు లంకించుకొని మళ్లీ ఎదురైన  ప్రతివాళ్ళకి వివరాలు ఇచ్చి అందరి తో తిట్లు తిని చివరికి  కంప్లైంట్ తీసుకునే  అతనికి  చెప్తే..  నెంబర్, నేమ్  రాసుకొని..  "ఆ దొరికితే ఇస్తాం, అప్పుడప్పుడు వొచ్చి  కలుస్తూ ఉండు" కూల్ గా చెప్పాడు
ఈ  ఏప్రిల్  22  వొస్తే రెండు వసంతాలు నిండుతాయి .

ఇదీ   స్వాములోరి   పూజమహిమ..

Mar 9, 2010

కట్టుకథ- 3

ఎ ప్పుడూ అంచనాలు తారు మారు అయ్యే నాకు కూడా ఈ సారి అంచనా correct అయ్యింది.. అదే... నాకు సీట్ రాదు అనుకున్నాను.. రాలేదు.. అప్పుడే గాట్టి నిర్ణయం తీసుకున్నా  .. కనిసం ఒక్క రోజైనా  నిఫ్ట్ లో స్టూడెంట్ గా  ఉండాలని .. మళ్లీ preparation start. ఈ సారి confidence ని పెంచుకోడానికి meditation మొదలెట్టా...ఈ ఫై ఫై మెరుగులకి భయపదోద్దని నా మనసుకి నేనెం ధైర్యమిచ్చు కున్నా...మొత్తం 240 సీట్లు, 239 సీట్లు అలాంటి  వాళ్ళకి రావొచ్చు గాక.. మిగిలిన ఆ ఒకటి మాత్రం నాది...నాదే ..అన్నంత   లెవెల్లో.confedent గా ఫీల్ అయ్యా..
ఈ సారి ఎంట్రన్స్ హాల్ ముందు ఆ rich people ని చూసి...పిచ్చినా కొడుకులు..ఈ మాత్రం ఎంట్రన్స్ కి ఇంత బిల్డుప్ అవసరమా..? అన్నటు ఎవ్వరిని లెక్క చేయకుండా..ఎంట్రన్స్ రాసాను..


ఓ మూడు నెలల తరవాత....
ఓ ఎండాకాలం మిట్ట మధ్యాన్నం.... ..ట్రింగ్ మన్న పోస్ట్ మాన్ సైకిల్ బెల్ ..
వెళ్లి చూస్తే..నిఫ్ట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్.

Mar 7, 2010

కట్టు కథ -2

                
అలా ఓ రెండు నెలలు పేపర్లు కెరీర్ magazines తిరగేస్తే........NIFT fashion designing కోర్సు కనిపించింది..అవును నేను ఫ్యాషన్ డిజైనర్ అయితే ,,, నాకంటూ ఒక గుర్తింపు..క్లిక్ అయితే పేరు, డబ్బు.. నేను ఎంత fashioned గా ఉన్నా , వాడు ఫ్యాషన్ డిజైనర్ రా అని గొప్ప చెప్పుకుంటారు.
ఇంట్లో వాళ్లకి చెప్పాను..చేస్తే fashion designing మాత్రమే చేస్తా అని. మీకంతగా కోర్సు మీద నమ్మకం లేకపోతే..మీరే వెళ్లి en quire చేసుకొని రండి అని అన్నాను.
సరే చూద్దాం, అని ఓరోజు మా నాన్న హైదరాబాద్ బయలుదేరి..,నిఫ్ట్ కి వెళ్లి..enquire చేసి మొత్తానికి అప్లికేషను ఫాం తెసుకొచ్చాడు.." నీ మొహానికి సీట్ వొస్తుందని నేను అనుకోవటం లేదు"..అంటూ అప్లికేషన్ ఫాం ఇచ్చాడు.
రంగురంగుల బట్టలేసుకొని.. చలాకీగా తిరుగుతూ..ఇంగ్లిష్ వాయించేసే..నార్త్ ఇండియన్ గాళ్స్  మధ్య నన్ను ఉహిచుకొని..మా నాన్న అలా అనటం చాల మాములు విషయం.
నిజానికి అన్ని విషయాలు తెలుసుకుందామని నేనే ఓసారి వెళ్ళా ..కాని లోపలికేల్లె దైర్యం లేక వొచ్చేసా ..అందుకే తెలివిగా నాన్నకి చెప్పా.. పాపం నాన్న ఎలాగోలా నాకోసం అప్లికేషను తెచ్చాడు.
ఇక నన్నెవ్వరు పట్టించుకోలేదు.. నేను మాత్రం ఏవో బొమ్మలు గీస్తూ,,రంగులద్దుకుంటూ..ఇంగ్లీష్ magazines చదువుతూ..నాకు తెలిసినంతలో లో prepare అయ్యాను.

ఇక entrance రోజు మళ్లీ కళ్ళు తిరిగాయి..examination hall ముందు చాల వరకు...jeens T shirts లో rich అమ్మాయిలు అబ్బాయిలు.. అదే లెవెల్లో వాళ్ళ అమ్మా నాన్నలు..
పిల్లలు last minite preparation లో ఉంటె..స్పూన్ ఫీడింగ్ చేస్తున్న తల్లి దండ్రులు. ధారాళంగా ఇంగ్లీష్ లో encouragement. నాలాంటి వాళ్ళు బిక్కు బిక్కు మంటూ వీళ్ళనే చూస్తున్నారు. ఇంత మంది rich పీపుల్. అన్ని రకాలుగా encourage చేసే parents ఉండగా. నాలాంటి వాడికి సీట్ రావటం అసంభవం అనుకున్నాను మనసులో.
మొత్తానికి ఎలాగో ఒకలా entrance ముగిసింది.. ఫలితాలు వెలువడ్డాయి..


సీట్ విషయం అంటారా. నాకేందుకొస్తుంది చెప్పండి..ఈ ఫై ఫై మెరుగులు చూసి..భయపడి..inferior గా ఫీలయ్యే నాలాంటి వాడికి అస్సలు రాదు........

కట్టు కథ -1



దేవుడు అందరికి   ఏదో ఒక టాలెంట్ ఇస్తాడని అంటారు..నాకేం టాలెంట్ ఇచ్చాడో ఇప్పటికీ  తెలిదు. ఇంటర్మీడియట్ వరకు హ్యాపీ గ గడిచి పోయింది  ఆడుతూ పాడుతూ,, అప్పుడు తెలిదు జీవితం  మనిషిని పీల్చి పిప్పి చేస్తుందని..
దరిద్రం నన్ను, నా attitude ని మార్చి వేసింది.  ఇంటర్ తరవాత డిగ్రీ కోసం హైదరాబాద్ వొచ్చాను.. ఒక పనికి మాలిన న కాలేజీ లో చేరాను. కనీసం  బిల్డింగ్ అయినా   posh గా లేదు. ఉదయం  ఆర్ట్స్ goups , మధ్యాన్నం నుండి science groups . అప్పట్లో ఏమి తెలిదు, చెప్పే నాథుడు లేడు. వెళ్లి Bsc MPC   లో జాయిన్ అయ్యా వేరే  దిక్కు  లేక.   ఇంటర్ దాక తెలుగు మీడియం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం. 
మధ్యాన్నం కాలేజీ కావటం తో బాగా  తిని కాలేజీ కి రావటం, అక్కడ నిద్ర మత్తులో పాటాలు ఏమి అర్థం కాలేదు.
కనిసం అమ్మాయిలైన ఉన్నారా అంటే  40 మంది అబ్బాయిలు,  కేవలం 5 మంది అమ్మాయిలు. వాళ్ళు కూడా చూడటానికి అంతగా బాగుండే వారు కాదు.అది కాక వాళ్ళతో మాట్లాడాలంటే భయం. వాళ్ళేమో  ఇంగ్లీష్ మీడియం.కొంచం డబ్బు గల వాళ్ళుగానే  కనపడే వాళ్ళు.
నా మొహానికి  పారగాన్ స్లిపెర్స్ , పారలల్ బాగి  ప్యాంటు. రెండే రెండు జతలు  ఉండేవి. పొట్ట కొస్తే ఇంగ్లీష్ ముక్క నోట్లోంచి రాదు. అందంగా కనపడే బట్టలు లేవు. కాళ్ళకి షూస్ కూడా లేవు. అమ్మాయిలతో మాట్లాడాలంటే బెరుకు. భయం. నాతో ఎవరు మాట్లాడుతారు ??
అదే  Bcom లో చాల మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు . అమ్మాయిలు అబ్బాయిలు హాపీగా ఏ అరమరికలు లేకుండా నవ్వుతు మాట్లాడుకునే వాళ్ళు.. కలిసి సినిమాలు, షికార్లు వెళ్ళేవాళ్ళు. 
ఒక రోజు  నేను కాల్గే కి వెళ్తుంటే.. ఒక అమ్మాయి, సూపర్ గా ఉంది.  Bcom అనుకుంటా,  స్కూటీ మీద వొచ్చింది ,  అప్పుడే classes నుండి బయటికొచ్చిన  వాళ్ళ classmate   (వాడూ handsome గానే ఉన్నాడ. నీటు   గా  డ్రెస్, inshirt వేసి  , కాలకి షూస్. చేతికి soprts వాచీ)
"హాయ్ రవి అని  తెల్లని అందమైన  చేయి చాచింది. వాడు తన చేతిని ఆమె చేతితో కలిపి మృదువుగా నొక్కాడు.ఒక్క క్షణం లో ఆ  దృశం 10 సార్లు repeat అయ్యింది,  వాడి అదృష్టానికి  నాలోని ఈర్ష  లావాలా పొంగింది.
నా జీవితం లో ఒక అమ్మాయి నాకు అలా షాకే హ్యాండ్ ఇస్తుందా అని అనిపించింది.
"హే కాలేజీ కి రావలనిపిచలేదు .. what happened  in the class ? 
"nothing much,  as usual" 
సర్లే గాని సిన్మకేల్దామా  ? "    నాకైతే గోదారి గలా గలా అంటే ఇదే నేమో అని పించింది.
వాడు సరే అని  స్కూటీ ఎక్కాడు.
చీ వెధవ జీవితం . నన్ను నేను తిట్టుకొని తిట్టు లేదు, ఆ క్షణంలో.
  ఫస్ట్ ఇయర్ అంతా terms , vocablary   నేర్చుకోటానికే సరి పోయింది. రెండు సబ్జక్ట్స్ లో ఫెయిల్. ఎలాగోలా suplamentary లో   పాస్ అయ్యా.
సినిమాల  పిచ్చితో సెంకండ్ ఇయర్ లో ఫెయిల్ మళ్లీ రెండు సబ్జక్ట్స్ మిగిలిపోయాయి.ఈ సారి suplamentary  లో కూడా పాస్ కాలేక పోయా.
 కాని నా దృష్టి  చదువు మీద లేదు.  ఎలా? ఎలా? ఎలా?  నేను handsome boy  కావలి  ? ఇంగ్లీష్ లో తెలుగులో అనర్గళంగా అమ్మాయిలతో గల గలా మాట్లాడి వాళ్ళని కిల కిలా నవ్వించ గలగాలి?  ఎం చేస్తే అలా కాగలను ? ఇవే ఆలోచనలు.

దాంతో  ఫైనల్ ఇయర్ లో కూడా ఫెయిల్. మళ్లీ రెండు సబ్జక్ట్స్.. సిగ్గుపడి, కష్టపడి, సెప్టెంబర్ లో గట్టెక్కి, ఏదో డిగ్రీ అయిన్దనిపించా .

తరవాత ఎం చేయాలో తెలిదు. తెలిసినవి రెండే రెండు.. అయితే BEd , లేకుంటే  Msc.

వాటిల్లో కూడా సీట్ రాలేదు. మా నాన్న పోరు పడలేక certificate course in library sciece లో  చేరా . కాని అదేదో వింతగా అనిపించింది.  దానికి తోడూ వినీత నన్ను పట్టిచుకోలేదు. ఆ కోర్సు ని మధ్యలో వదిలేసా. 
నాన్నని అడిగాను.. స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ కావాలని ఉంది అని. 
నీ మొహానికి తెలుగే రాదు, అది నేర్చుకో ముందు అన్నాడు. ఇక ఎం చేయాలో తెలియలేదు.
రోజు తినం పడుకోటం తప్ప వేరే పని పాట లేడు.
ఇలా అయితే లాభం లేదని రోజు deccen cronicle తెచుకొని బిగ్గరగా చదవటం, తెలియని పదాలకి అర్థాలు రాసుకోతం చేశా. మెదడు నిండా ఒకటే ఆలోచనలు. మారాలి , నన్ను నేను మార్చుకోవాలి..ఏదో ఒకటి చేయాలి.
 ఒక కొత్త కోర్సు,   అందట్లోకి గొప్పగా చూపించేది,  మా సర్కిల్ లో diffrent గా, డబ్బు విలాసం అన్ని ఇచ్చేది , రిచ్ అండ్ పోష గాళ్స్ తో  కళ కళ లాడేది ...   ఒక కొత్త కోర్సు చేయాలనిపించింది.. అలా ఓ రెండు నెలలు పేపర్లు కెరీర్ magazines తిరగేస్తే.....

Mar 5, 2010

దేవుడు



మొన్న ఆ మధ్య "దేవుడు " గురించి ఒక కమ్యూనిటీ లో discussions జరిగింది..అందులో ముఖ్యమైన పాయింట్స్ బ్లాగ్ లో పెడదాం అనిపించింది..

M: దేవుడు ఈ కష్టాలు ఎందుకు తీర్చటం లేదు?అమ్మ ఎంత ఆకలి వేస్తున్నా ఎందుకు అన్నానికి పిలవట్లేదు అంటే ఈ రోజు పండగ అన్నమాట. అమ్మ మనకోసం చాల చాల తీపి వంటకాలు చేస్తున్నది.

M :ఒక అతన్ని మరొక వ్యక్తి అడిగాడట , బాబు! నీవు ఇంతగా దేవుణ్ణి నమ్ముతున్నావు, నీ కొడుకు చనిపొయ్యాడు కదా ఇక నైన దేవుణ్ణి నమ్మకుండా వుంటావా అని, "అయ్యా పోయిన కొడుకు పోనే పొయ్యాడు ఉన్న ఒక ఆధారము కూడా పోగొట్టుకోమంటారా? " అన్నాడట.- చలం ఉత్తరాలు

చక్రి :అమ్మ తీపి వంటకాలు చేస్తుంది సరే,, కానీ ఈ లోపు కుర్రాడు ఆకలితో చచ్చి ఊరుకుంటే ?? 

"యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అబ్యుధానం ఆధర్మస్య : తదాత్మానం సృజామ్యహం" 

భగవత్ గీత శ్లోకం .. మన భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే అంతా అయిపోయిన తరవాత ..చివరలో..

ఇక రెండు నిముషాల్లో చస్తాం అనగా అప్పుడోస్తాడు.. ఈ లోపు మంచి వాడు కష్టాలను అనుభవించి అనుభవించి చావుకి రెడీ ఐన తరవాత.. ఇక చెడ్డ వాడు అన్ని అనుభవించి సంతృప్తి చెందే సమయంలో భగవంతుదోస్తాడు.. ఆ సమయంలో వచ్చినా రాకున్న పెద్దగా ఒరిగేదేం లేదు..
లోకం లో జరుగుతున్నది ...జరిగేది ఇదే...
ఎమన్నా అంటే పాపం పండాలి అంటారు.. ఎందుకు పండాలి..మొగ్గలోనే ఎందుకు తున్చకూడదు??
 
K : chakri gaaru...
dhevudu oka optimistic solace...


చక్రి:  కే.. గారు.. మీరన్నది నిజమే ఐనప్పటికీ.. ఈ దేవుడు, మతం ,, కులం ,పూజలు పసుపు కుంకుమలు విగ్రహాలు . బ్రమ్హోత్సవాలు రథొత్సవాలు .. కార్తీక స్నానాలు..కుంభ మేళాలు.. మడి.. మైల.. అంట్లు.. ఆచారం.
పొద్ద్దున లేస్తే మైకుల్లో అరుపులు.. ఒకవైపు గుళ్ళో పాటలు.. ఇంకో వైపు మసీదు నమాజులు .. మరో వైపు దివ్య మహా సభలు ..
ఒకడు సత్య సాయిబాబా అంటదు.. ఇంకోడు కాదు కాదు షిర్డీ సాయిబాబా అంటాడు..
శనికి తైలాభిషేకాలు .. పాముకి పుట్టలో పాలు ...
అది కాక politicians ఊరేగింపులు ,, వినాయక నిమజ్జనాలు,పెళ్లి బారాత్ లు ఎన్నని చెప్పాలి...
మీకు ఈ experiences ఉన్నాయో లేదో తెలిదు .. నేను మాత్రం అన్నిటితో విసిగి పోయాను..
ఈ దేవుడు అనేది వ్యక్తిగతంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలిదు 
( మీరన్నట్టు ) కాని సమాజ పరంగా కొంచ నష్టమే ఎక్కువ.. ఇది నా అభిప్రాయం .

M: సమాజానికి కూడా ఉపయోగమే. నాస్తికులైన మన పక్క రాష్ట్రము వాళ్ళని చూడండి, ఏమి చెయ్యాలో తెలియక బతికున్నవరినే దేవుడిగా పూజిస్తారు. హీరోయిన్ లకు గుళ్ళు కడుతున్నారు. హీరోలకు పాల అభిషేకాలు చేస్తున్నారు. ఈ హీరోలు హీరోయిన్లు మాకు అలా చేయ్యమని అడగనట్లే దేముడు కూడా అడగలేదు. ఇది అలా చేసిన వాళ్ళ మనో వికారం. /ఆనందం .కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, TV చూడటం చాల మందికి కాలక్షేపం అయినట్లే ఇది కూడా . మీకు ఇష్టమైతే ఉత్సవంలో డాన్స్ చెయ్యండి లేకుంటే లేదు :) 

 

చక్రి: భలే చెప్పారండి.. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని tv చూస్తే ఎవరికీ ఏ బాధ లేదు ..
కాని రోడ్డు కేక్కితేనే నాలాంటి వాడికి బాధ........ఎవడింట్లో వాడు దేవుడినే పుజిస్తాడో దెయ్యాన్నే అవహిస్తాడో వాడిష్టం..
ఇక తిరపతి .. శ్రీశైలం..మక్కా ....(క్రైస్తవులకి ఏముందో ) ఇలాటి పుణ్య క్షేత్రాలు ఉందనే ఉన్నయి, కేవలం వీటి కోసమే ..దైవ భక్తి ఎక్కువైనవాడు అక్కడికి వెళ్లి హాయిగా పారవశ్యం చెందవచ్చు కాని ఈ మైకుల్లో అరుపులే .. నోటితో అరిస్తే కాసేపుకి అలసి పోతారు కాని మైకుల్లో పాటలు ఎవడికి కావాలి..??
గల్లి గల్లి లో .. వినాయకులు.నాయకులూ. మైకుల్లో అరుపులు... మాట్లాడితే రోడ్డెక్కి తైతక్కలాడటం...







ఏమి భాగ్యమది.

సినిమా షూటింగ్ కోసం .. కులు, మనాలి వెళ్ళాం.
మనాలి నుండి " లే లడక్" దారిలో షూటింగ్ లొకేషన్ ఉంది.
అక్కడే  సాయంత్రం దాక షూటింగ్ చేసాక,  చీకటి పడుతుండగా  మిగతా వాళ్ళందరూ తిరిగి బస చేసిన hotel కి వెళ్ళిపోయారు.. నేను మా డైరెక్టర్, మిగతా మెయిన్ టీం దారిలో ఇంకో చిన్న ప్రాంతంలో షూటింగ్ చేయాలనీ అక్కడికి చేరుకున్నాం....అ ప్రదేశం అచ్చం "చలం" గారు వర్ణించినట్టు .. చుట్టూ మంచు కొండలు, దాన్ని తాకుతూ మెలికలుగా రోడ్డు.. పక్కనే ఒక చిన్న కొలను...మంచు కరిగి చేరిన స్వచ్చమైన చల్లని నీరు అ కొలనులో..

సాయంత్రం చీకటిగా మారుతోంది...ఇంతలొ ఎవరో అన్నారు..ఈ రోజు పౌర్ణమి అని .. చుట్టూ చూస్తున్నాం..ఏవైపు నుండి చంద్రోదయం అవుతుందా అని.. కొంత సేపు తరవాత .....


ఓ వైపు తెల్లని వెండి కొండల మధ్య నుండి  కాంతి పుంజం దర్శన మిచ్చింది.. అ వైపు కెమెరా ఆన్ చేసి కూర్చున్నాం..చల్లని మంచు గాలి మమల్ని సన్నగా వోణికిస్తోంది. ఇంతలో.. . మెల్లిగా.. తెల్లగా.. మంచు కొండలని వెండిలా మెరిపింప చేస్తూ.. నిండు చంద్రుడు దర్శన మిచచ్చాడు .
వావ్ ..ఏదో తెలియని ఆనందం చుట్టుముట్టేసింది..

.....నేనంటూ లేకుండా ఆ కాంతి లో ఐక్యమైతే ... ఏమి భాగ్యమది.

Mar 3, 2010

ప్రశ్నించుకోండి.....




                                

మునుపెన్నడో శంకర మఠం హత్యోదంతం.. అప్పుడెప్పుడో పుట్ట పర్తి ప్రశాంతి నిలయం లో హత్య.. మొన్న కలికి భగవాన్, నిన్న నిత్యానంద స్వామి రాసలీలలు..

వీళ్ళని ఆరాధ్య దైవాలుగా చేసుకొని.. మహిమల్ని ఆపాదించింది ఎవరు??
 
వీళ్ళకి విరాళాలు ఇచ్చి పెంచి పోషించింది ఎవరు ?
వీళ్ళ ఫోటోలు పెట్టి పూజలు, భజనలు చేసింది, చేస్తోంది ఎవరు ?

కాషాయం కట్టగానే కామం మాయం ఐపోతుందని ఎవరు చెప్పారు ?
జీవిత మూల సూత్రాలు మరిచి పోయారా ? 

కూడు , గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. ఒక వయసు వచ్చాక కామం ప్రాథమిక అవసరం అని వేరే చెప్పాలా??
పడక గదుల్లో కెమెరాలు పెడితే , తపస్సు చేసుకుంటున్న నిత్యానందులు  కనపడతాడా?? 

ధనం మూలమిదం జగత్ అని మళ్లీ గుర్తు చేయాలా నేను ??
డబ్బు ముందు నైతికవిలువలు నిలబడవని తెలుసుకోలేదా?
కోటి విద్యలు కూటికోసం అని తెలిదా?? 

The fittest will survive అని పెద్దలు చెప్పింది మరిచారా ???? 

మీ జీవితాలని మార్చేస్తా అని వాడంటే మటుకు మీరెలా నమ్ముతారు ?
ఎం చదువు కున్నారు ? డిగ్రీలుంటే సరిపోతుందా.. విచక్షణా జ్ఞానం ఉండక్కరలేదా??

కళ్ళ ముందు సత్యం ..నిత్యం కనబడుతోంటే.. గుడ్డి వాళ్ళయ్యారా??
ఎవడో చెప్పే కాకమ్మ కథలకి పడి పోతారా ??

"చలం" అసలు సంగతి  అరచి చెపుతూ ఉంటె  వినపడలేదా??

తిరగేయండి గ్రంధాలని
ఒంటబట్టించుకోండి సారాంశాన్ని,
వెతకండి ములాలని,
కనుక్కోండి సత్యాన్ని,
ప్రశ్నించుకోండి మిమల్ని మీరు.  

Mar 2, 2010

రంగుల లోకం పిలిచే వేళా ..





నిన్న (అంటే  మార్చ్  1 సోమవారం 2010) ..హైదరాబాద్ అంతా  హోలీ పండగ  బాగా చేసుకున్నారనుకుంటా ..నేను మాత్రం ముందురోజే  హైదరాబాద్ విడిచి పారి పోయా..
 పార్వతి, శివుడికై తపస్సు.. అది  చూసి  కాముడు  ( మన్మదుడు  ) పార్వతికి  సహయంచేద్దామని   శివుడిపై పూల బాణం వేయటం..శివుడు ఆగ్రహంతో కాముడిని  బస్మం చేయటం.. దానికి నిదర్శనంగామనం కామున్ని దహనం చేసి ఒకరి పై ఒకరు రంగులు పోసుకొని  .. ..ఈ  పండగ చేసుకోటం ...భలే భలే ..
ఈ గోలంతా భరించే ఓపిక లేక , ముందు రోజు సాయంత్రమే నేను , మా కజిన్ తో కలిసి వాళ్ళ ఊరికి ప్రయాణం కట్టా .  
వాళ్ళ ఊరు..చుట్టుపక్కల ఉండే పంటపొలాలు..చిట్టడవులు..రాళ్ళూ రప్పలు..గుళ్ళు గోపురాలు..అన్ని చుట్టేసాం .. అలసిపోయి సుస్టుగా తిని పడుకున్నాం.. మావాడికి ఆఫీసు ఉంది కనక పొద్దున్నే లేచి తిరుగు ప్రయాణం అయ్యాం.
వొచ్చీ రాగానే  పాల కోసం షాప్ దగ్గరికేల్లాను .ఓ కాలేజీ  అమ్మాయి రీ ఛార్జ్  కోసం వొచ్చింది. మొహం అంత గులాబీ రంగు..హోలీ  రంగు ఇంకా పోనేలేదు. అప్పుడు అనిపించింది.. నేను హోలీ మిస్ అయ్యానా అని. 
ఇంటికొచ్చి చాయ్ తాగి, కెమేరా  లో షూట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ చూడ్డం  మొదలెట్టా, అప్పుడు తెలిసింది.  నామీద కూడా రంగు పడిందని.
ఎలా అంటారా ....


షామీర్ పేట్ లేక్  లో.. ఆకాశం చిమ్మిన నీలం , కెంజాయ రంగులు,
పంటచేలు పులిమిన ఆకుపచ్చ రంగు,
మోదుగచెట్టు గుప్పిన ఎరుపు రంగు,
పల్లె మనుషుల...పసి మనసుల అద్దిన తెలుపు,
పూదోట   చిలకరించిన  పసుపు, గులాబి రంగులు..
అడవి పువ్వులు..పోద్దుదిరుగుడు   చల్లిన   పసుపు  రంగు..

ఇలా ...ప్రకృతి కాంత నా మీద చల్లిన ర్ణాని  ఫోటోల్లో  దాచేశా...!! 
 
 

Feb 23, 2010

నాలో నేను.



నాలో నేను.... ఇది నా మనసులో జరిగే ఆలోచనలు, ఆనందాలు, బాధలు, భయాలు, ఆందోళనలు, అల్లకల్లోలాలు,.సమాజం-నా అబిప్రాయాలు. కల్పిత కథలు,  నిజ జీవితానికి కల్పన జోడించిన విషయాలు,  వీటికి  సంబందించిన పోస్టింగ్స్ వుంటాయి.
ఈ బ్లాగ్ ప్రారంభించాతానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే  "  రచన చేయటం  నేర్చుకోడం కోసం" 
అంతే తప్ప ఎవరిని ఉద్దేశ పూర్వకంగా ఇక్కడ ప్రస్తావించే ప్రసక్తి లేనే లేదు. దయ చేసి తమకి అన్వయిన్చుకోవోద్దని మనవి.
- చక్రధర్ రావు

Feb 21, 2010

మీరెన్ని వేషాలు వేసినా



వైకుంటం   .. పాలసముద్రం చల్లగా ఉంది.. ఆ సముద్రం లో ఒక పెద్ద 10 తలల ఆది శేషుడు..
శ్రీ మహా విష్ణువు  ఆది శేషుడి మీద పడుకుని ఒక కునుకు తీస్తునాడు.
లక్ష్మి  దేవి ఆవలిస్తూ కాళ్ళు  వత్తుతూ  ఉంది.
దేవీ .. కొంచం గట్టిగ నొక్కు..ముల్లోకాలు తిరిగి నొప్పిగా ఉన్నాయి..
ఏమండీ, నాకో చిన్న డౌట్.. మీరెన్ని దొంగ వేషాలు వేసినా I mean  "అవతారాలు" వేసినా ..లోకం లో అన్యాయం  ఆగటం లేదుకదండీ.. దోచేవాడు దోచేస్తూనే ఉన్నాడు, లేని వాడు నిత్యం చస్తూనే ఉన్నాడు. 
చూడబోతే మీరేమి "ఆక్షన్" తీసుకుంటున్నట్టు  లేదు.
  దేవీ .. సకలలోక పాలకుండ.. శేష తల్పుండ.. విశేష నామ దేయుండా... విష్ణు దేవుండ..
తోక్కేం కాదు.. అడిగింది చెప్పండి అంటే..మిమల్ని మీరు పొగుడు కుంటారేంటి ...తెలుగు సినిమా  హీరోల్లాగా.

అంతకంటే చేయటనికేముంది దేవీ .. అడుగు ఏం  చేయలేదో..
 ఆ కుంభకోణం చేసిన మంత్రి గారిని  ఏం చేసారు అంటా ?? కనీసం ఏదైనా శిక్ష వేసారా ?
అయ్యో దేవీ .. తెలిదా, అతను తిరపతి లో నాకు కిలో బంగారం ఇచ్చాడు..
అవునా (నాకు కనీసం  వజ్రపుటుంగరం కూడా లేదాయే) పోనీ.. మరి ఆ ఖనిజం స్కాం సూత్రధారి ?? అతని సంగతేంటి ??
అతనా.. అతను  నా  గుడి కట్టటానికి పెద్ద మొత్తం లో చందా ఇచ్చాడు.

మరి...మరి..అని లక్ష్మి దేవి..ఆలోచిస్తుంటే..
చూడు దేవి.. ప్రతి వాడు ఎంతో కొంత ఇస్తూనే ఉన్నాడు..
ఇవ్వలేక పోయిన వాడికి నేను ఏదో  ఒక కీడు చేస్తూనే ఉన్నా,ఇంకేం కావలి..
అది కాగ మనుషులు తెలివి మీరి పోయారు. బొత్తిగా పాప భీతి లేకుండా పోయింది, మహా అంటే పోతాం, పొతే పోయింది వెధవ జీవితం, ఉన్నన్నాళ్ళు  అప్పో సప్పో.. మోసమో, దగానో ఏదోటి చేసి సుఖం అనుభవిస్తే చాలనుకొంటున్నారు, ఎంతటి ఘోరానికైన తెగిస్తున్నారు.

ఎక్కువగా మాట్లాడితే నువ్వు మాత్రం తక్కువ తిన్నావా అని పురాణాలు, భారత, భాగవతలో  నేను చేసిన ఘన కార్యాలని ఏకరువు పెడుతున్నారు.  నా వీక్ పాయింట్ తెలుసుకున్నారు, నా మోహన డబ్బు, నగా కొడుతుంటే  నేను మాత్రం ఏం  చేయగలను చెప్పు ?
అయినా దేవీ .. నీ కెందుకు ఇవన్నీ .. హాపీ గా కాళ్ళు పట్టక.. మగని సేవ కంటే మగువ కి  కావలసినదేముంది కనక ??
మగని సేవట,  మీరేదో సామాన్య జనాలని ఉద్దరిస్తున్నారేమో, నేను మీ సేవ చేస్తే పుణ్యం కలిసొస్తుందని అనుకుంటున్నా...మీరు కూడా  లంచాలకి మరిగి.. కుపరిపాలన చేస్తుంటే  మీకు సేవ చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. దేవీ.. అంత కంటే  ఏం చేయగలవు దేవి.. హ్యాపీ గా నా సేవలో తరించు..
బ్రతికుంటే.. కాల్ సెంటర్ లో పనిచేసిన బ్రతుకుతా  కాని మీ కాళ్ళు పట్టను..
అయ్యో దేవీ ... వెళ్తున్నావా..

(ఇదంతా ఓరకంట గమనిస్తున్న బ్రహ్మ దేవుడు  ముసిముసి గా  నవ్వుకుంటూ  తన పని తాను చేసుకుంటున్నాడు)

Feb 20, 2010

ఎండాకాలం వోచ్చేస్తోందోచ్


మా ఇంటి ముందు కాలనీ రోడ్డంతా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి.. ఎంటబ్బా , ఏమైంది ?  ఇంత చెత్త ఎక్కడిది రోడ్డు మీద అనుకున్నా ..కొంచం తల ఎత్తు చూద్దును కదా..కానుగ  చెట్లన్నిసగం బోసి పోయి కనిపించాయి.. అప్పుడు స్పురించింది..  ఎండాకాలం వోచ్చేస్తోందోచ్ ...  చాలామందికి  ఎండాకాలం అంటే చిరాకు ..నాకు మాత్రం ఎండాకాలం అంటే ఇష్టం,
చిన్నపుడు సెలవులు ఇస్తారని కాబోలు..కాని
చెట్లకి ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు తోడిగేది,  తెల్లని చిన్ని మల్లె పూలలో అద్భుతమైన పరిమళాన్ని నింపేది ,  నల్లని  కోకిలమ్మ గొంతులో తేనే రాగలు పలికించేది,  మావిళ్ళకి పూత పూయించి ,కాయలు కాయించి మధురమైన రుచిని మనకి పంచేది ఈ కాలమేగా. 
నాకు చిన్నపుడు ఎండాకాలం బాగా గుర్తు. ఒంటి పూట బడి మూలంగా ఉదయం 7గంటలకల్లా హాయిగా చన్నీళ్ళతో స్నానం చేసి స్చూలికి పరిగెత్తే వాణ్ని. మా స్కూల్ ఆవరణలో మల్లె , గులాబీ మొక్కలు  పుష్కలంగా   ఉండేవి..గుమ్మలోనే  మల్లెల  వాసనా, గులాబీ రంగూ పలకరించేవి. గుండెనిండా ఆ పరిమళం నిండిపోయేది. ముందు బెంచిలో కూర్చొని.. మల్లెలకి అంత తెల్లదనం. అ పరిమళం ఎలా వొచ్చిందా  అని ఒకటే ఆలోచన. మధ్యాన్నం కాగానే కొంత మంది పిల్లలని  పిలిచి ఆ మొగ్గలు కోయించి  అమ్మేవాళ్ళు. పావలాకి 25.  కోయటానికి  నేను ముందు ఉండేవాడిని.. మెల్లిగా ఎవరికీ తెలీకుండా ఓ నాలుగు మొగ్గలు జేబులో వేసుకొనే వాడిని ఆ పరిమళం కోసం.
ఇక ఒంటి పూట బడి వదలగానే గంగాపురం రోడ్డు వైపు పరుగు.. ఎందుకంటే అ రోడ్డుకి పక్కనే గా మామిడి చెట్లు ఉండేది. మామిడి పూలు పిందెలుగా మారటం చూసేవాళ్ళం .ఆ బుల్లి మామిడి పిందెల కోసం  ఆరాటం , వాటిని ముక్కలు కోసి ఉప్పులో అద్దుకొని  తినేవాళ్ళం.
ఎండ  ఎక్కువ ఉందని బయట తిరగానిచ్చే వాళ్ళు కాదు నాలుగు గంటల దాక. అప్పుడు ఏ పుచ్చాకాయో .. కర్బుజ పండో.. నిమ్మకాయి షర్బత్తో  తాగి.. ఆటలకి పరుగు. ఇసికలో పోద్దుగుంకే  దాక ఆడి .. ఇల్లు చేరటం.

రాత్రి డాబా మీద వెన్నెల వెలుగులో..చుక్కల దుప్పటి కప్పుకొని తెలిసి తెలియని ఆలోచనలోంచి నిద్రలోకి.
చల్లని చిరుగాలి.. కోకిలమ్మ సుప్రభాతం తో ఉషోదయం, మళ్లీ ఓ కొత్త రోజు.. అదే సెలవు  రోజైతే  చిరుగాలి జోలపాట,  కోకిలమ్మ లాలి పాట అయ్యేవి.

Feb 16, 2010

confessions of an Alky

అవును... తాగాను..
బీరు..విస్కీ..వోడ్కా..రం..బ్రాంది.. జిన్ .వైను..కల్లు.. ఏది దొరికితే అది తాగాను...
మొదట్లో.. అదో adventure లాగ ..ఎలా ఉంటుందో అన్న కుతూహలం కొద్దీ తాగాను ..
ఇంటర్ లో ఉన్నపుడే..రుచి చూసా..
తరవాత డిగ్రీ ఫైనల్ లో ఉన్నపుడు మరో సారి..ఆ తరవాత ఇంకోసారి...అలా అప్పుడప్పుడు..తాగా..
ఇక చదువు అంత ఐపోయి.. పని పాట లేనపుడు ..తాగా..
ఉహలకి,,నిజజీవితానికి వ్యతాసం తెలుసుకున్న కొద్దీ..తాగా..
ప్రపంచం గురించి వాస్తవం తేట తెల్లం అవుతుంటే అది జీర్నిచుకోటానికి తాగా...
సంతోషం లో..దుఖం లో.. తాగా..
మనసుని బండగా మార్చుకోవాలని తాగా..
ఎందుకు పనికిరాని వాడిని అని అనిపించినప్పుడల్లా తాగా..
నేను అందరికంటే గొప్ప అని ఫీల్ అయినపుడు తాగా ..
.ఫ్రెండ్స్ తో సరదాగా తాగా ..
ఒంటరితనాన్ని భరిచలేక తాగా
పార్టీ లో మొహమాటానికి తాగా..
కొన్ని సార్లు ఏమి చేయలేక తాగా
కొని సార్లు ఏమి చేతగాక.. తాగా
ప్రేమించే మనసు లేక..తాగా..
ప్రేమిచడం చేతగాక..తాగా..
సేద తీర్చే ఒడి లేక తాగా  
సెక్స్ దొరక్క  తాగా
యవ్వనం కరిగిపోతుంటే..తాగా..
వయసు మల్లిపోతోంటే ..తాగా..
కలలు కల్లలై పోతుంటే  తాగా
జీవితం బుగ్గి పాలవుతుంటే తాగా.. 
పగలు పని లేక తాగా..
రాత్రి నిద్ర పట్టక తాగా.. 
నామీద నాకు నమకం లేక తాగా 
నన్ను నమ్మేవాడు లేక తాగా 
తెలుగులో రాయలేక తాగా
ఇంగ్లీష్ లో మాట్లాట్టం రాక తాగా 
అనుకున్నది సాధించలేక ..సాధిచింది ఏమిలేక
జీవితం శూన్యమని.. శూన్యమే జీవితం అని.. తోచినపుడు ..
అందరు బానే ఉన్నారు ,,నేను మాత్రమే బాగాలేను అని ఫీల్ ఐనపుడల్లా..
నేను దురదృష్ట వంతుడ్ని అని నమ్మినప్పుడల్లా ... తాగాను.
అవును తాగాను..