నాకు, చక్రి గాడికి అస్సలు పడదు... నాగురించి నన్ను ఒక్క మాట చెప్పనీయడు. చూడండి ఏమంటున్నాడో..
నేను చాలా డిఫరెంట్, .. అందరి లాగే.. (తోక్కేం కాదు )
చెప్పేది సూటిగా గుచ్చుకునేటట్టు చెప్పేస్తా..(రక్తం రాదులెండి)
ఎదుటోడిని కాల్చుకుతినడం అలవాటు. (వీడి మొహం చపాతీలు కాల్చటం కూడా రాదు వీడికి )
లైఫ్ ని top angle నుంచి చూస్తే భయం ( వీడికే )
low angel నుంచి చూస్తే అబ్బ నావల్ల కాదు అని అనిపిస్తుంది (వీడి వల్ల నిజంగా కావటం లేదు , పరమ escapist ).
అందుకే eye level is best. (పాపం ట్రై చేస్తున్నాడు )
పొద్దున్నే లేచి ఓ డబ్బా కట్టుకొని బస్సులో వేళాడి ఆఫీసు కి వెళ్ళటం.. ఏం చేస్తున్నామో తెలీకుండా చెప్పింది చేసి ఉసురు మంటూ కొంపకి రావటం నా వాళ్ళ కాదు. ( మరేం చేతనవుతుందో.. తిని కుర్చోటమా )
ఇంకా చాలు లేవరా బాబు అనిపిస్తే నిద్ర లేవటం. చేయాలి అని అనిపించినపుడు మాత్రమే పని చేయటం. ఒక్క సారి ఏదైనా వర్క్ కి కమిట్ అయితే చేసి తీరటం, (ఇంతవరకు కాలేదు, ఎప్పుదవుతాడో తెలిదు, హి హి )
ఇది నా లైఫ్ స్టయిలు.
(lazy ఫెల్లో అని చెప్పు, నీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది )
No comments:
Post a Comment