నిద్ర పోతున్నావా.. బాగా అలసి పోయి.మత్తుగా..నిన్ను నివే ఆదమరిచావా ??
లేక కలల ప్రపంచంలో.. బంగారు వన్నెల రెక్కలతో విహరిస్తూ వింత లోకాన్ని అస్వాదిస్తున్నవా ??
లేక మానస సముద్రంలో దూకి... అంతరంగ.. అందాల్ని..అద్బుతాల్ని అవిష్కరిస్తున్నావా?
తెలియని అగాధపు లోతుల్ని శోధిస్తున్నావా ?
లేక... నీకే తెలియని భయం.. వికృత రూపంలో దర్శనమిస్తోందా ??
లేక... హృదయాంతరాలాల్లో ఉన్న ఆనందాన్ని నీ మొహం మీద చిరునవ్వులా ఒలికిస్తున్నావా ??
నీ నిద్ర కోసం..సూరీడు దూరంగా ఇవతలి వైపుకి వోచ్చాడని..
ఆకాశం చుక్కల దుప్పటి కప్పి ..చద్రున్ని బెడ్లాంప్ లాగా వెలిగించిందనీ ..
అనంతః దూరంలోంచి పరుగు పరుగున పిల్ల గాలి నీకోసం వేంచేసిందనీ..
సమస్త ప్రకృతి నీకు జోల పాడుతోందనీ.. తెలుసా ??
తూరుపు నీ మెలకువకై.. కళ్ళలో వొత్తులు వేసుకు చూస్తోందనీ
నారింజ రంగు చీరతో తెగ మురిసిపోతోందనీ..
పక్షిలోకం కొత్త రాగాలు నేమరేస్తున్నయనీ..
నీ వాకిట్లో గులాబీ నవ్వుని practice చేస్తోందనీ..
నీకోసం మల్లియ పరిమళాన్ని నింపు కొంటోందని తెలుసా??
No comments:
Post a Comment