Mar 7, 2010
కట్టు కథ -1
దేవుడు అందరికి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడని అంటారు..నాకేం టాలెంట్ ఇచ్చాడో ఇప్పటికీ తెలిదు. ఇంటర్మీడియట్ వరకు హ్యాపీ గ గడిచి పోయింది ఆడుతూ పాడుతూ,, అప్పుడు తెలిదు జీవితం మనిషిని పీల్చి పిప్పి చేస్తుందని..
దరిద్రం నన్ను, నా attitude ని మార్చి వేసింది. ఇంటర్ తరవాత డిగ్రీ కోసం హైదరాబాద్ వొచ్చాను.. ఒక పనికి మాలిన న కాలేజీ లో చేరాను. కనీసం బిల్డింగ్ అయినా posh గా లేదు. ఉదయం ఆర్ట్స్ goups , మధ్యాన్నం నుండి science groups . అప్పట్లో ఏమి తెలిదు, చెప్పే నాథుడు లేడు. వెళ్లి Bsc MPC లో జాయిన్ అయ్యా వేరే దిక్కు లేక. ఇంటర్ దాక తెలుగు మీడియం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం.
మధ్యాన్నం కాలేజీ కావటం తో బాగా తిని కాలేజీ కి రావటం, అక్కడ నిద్ర మత్తులో పాటాలు ఏమి అర్థం కాలేదు.
కనిసం అమ్మాయిలైన ఉన్నారా అంటే 40 మంది అబ్బాయిలు, కేవలం 5 మంది అమ్మాయిలు. వాళ్ళు కూడా చూడటానికి అంతగా బాగుండే వారు కాదు.అది కాక వాళ్ళతో మాట్లాడాలంటే భయం. వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం.కొంచం డబ్బు గల వాళ్ళుగానే కనపడే వాళ్ళు.
నా మొహానికి పారగాన్ స్లిపెర్స్ , పారలల్ బాగి ప్యాంటు. రెండే రెండు జతలు ఉండేవి. పొట్ట కొస్తే ఇంగ్లీష్ ముక్క నోట్లోంచి రాదు. అందంగా కనపడే బట్టలు లేవు. కాళ్ళకి షూస్ కూడా లేవు. అమ్మాయిలతో మాట్లాడాలంటే బెరుకు. భయం. నాతో ఎవరు మాట్లాడుతారు ??
అదే Bcom లో చాల మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు . అమ్మాయిలు అబ్బాయిలు హాపీగా ఏ అరమరికలు లేకుండా నవ్వుతు మాట్లాడుకునే వాళ్ళు.. కలిసి సినిమాలు, షికార్లు వెళ్ళేవాళ్ళు.
ఒక రోజు నేను కాల్గే కి వెళ్తుంటే.. ఒక అమ్మాయి, సూపర్ గా ఉంది. Bcom అనుకుంటా, స్కూటీ మీద వొచ్చింది , అప్పుడే classes నుండి బయటికొచ్చిన వాళ్ళ classmate (వాడూ handsome గానే ఉన్నాడ. నీటు గా డ్రెస్, inshirt వేసి , కాలకి షూస్. చేతికి soprts వాచీ)
"హాయ్ రవి అని తెల్లని అందమైన చేయి చాచింది. వాడు తన చేతిని ఆమె చేతితో కలిపి మృదువుగా నొక్కాడు.ఒక్క క్షణం లో ఆ దృశం 10 సార్లు repeat అయ్యింది, వాడి అదృష్టానికి నాలోని ఈర్ష లావాలా పొంగింది.
నా జీవితం లో ఒక అమ్మాయి నాకు అలా షాకే హ్యాండ్ ఇస్తుందా అని అనిపించింది.
"హే కాలేజీ కి రావలనిపిచలేదు .. what happened in the class ?
"nothing much, as usual"
సర్లే గాని సిన్మకేల్దామా ? " నాకైతే గోదారి గలా గలా అంటే ఇదే నేమో అని పించింది.
వాడు సరే అని స్కూటీ ఎక్కాడు.
చీ వెధవ జీవితం . నన్ను నేను తిట్టుకొని తిట్టు లేదు, ఆ క్షణంలో.
ఫస్ట్ ఇయర్ అంతా terms , vocablary నేర్చుకోటానికే సరి పోయింది. రెండు సబ్జక్ట్స్ లో ఫెయిల్. ఎలాగోలా suplamentary లో పాస్ అయ్యా.
సినిమాల పిచ్చితో సెంకండ్ ఇయర్ లో ఫెయిల్ మళ్లీ రెండు సబ్జక్ట్స్ మిగిలిపోయాయి.ఈ సారి suplamentary లో కూడా పాస్ కాలేక పోయా.
కాని నా దృష్టి చదువు మీద లేదు. ఎలా? ఎలా? ఎలా? నేను handsome boy కావలి ? ఇంగ్లీష్ లో తెలుగులో అనర్గళంగా అమ్మాయిలతో గల గలా మాట్లాడి వాళ్ళని కిల కిలా నవ్వించ గలగాలి? ఎం చేస్తే అలా కాగలను ? ఇవే ఆలోచనలు.
దాంతో ఫైనల్ ఇయర్ లో కూడా ఫెయిల్. మళ్లీ రెండు సబ్జక్ట్స్.. సిగ్గుపడి, కష్టపడి, సెప్టెంబర్ లో గట్టెక్కి, ఏదో డిగ్రీ అయిన్దనిపించా .
తరవాత ఎం చేయాలో తెలిదు. తెలిసినవి రెండే రెండు.. అయితే BEd , లేకుంటే Msc.
వాటిల్లో కూడా సీట్ రాలేదు. మా నాన్న పోరు పడలేక certificate course in library sciece లో చేరా . కాని అదేదో వింతగా అనిపించింది. దానికి తోడూ వినీత నన్ను పట్టిచుకోలేదు. ఆ కోర్సు ని మధ్యలో వదిలేసా.
నాన్నని అడిగాను.. స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ కావాలని ఉంది అని.
నీ మొహానికి తెలుగే రాదు, అది నేర్చుకో ముందు అన్నాడు. ఇక ఎం చేయాలో తెలియలేదు.
రోజు తినం పడుకోటం తప్ప వేరే పని పాట లేడు.
ఇలా అయితే లాభం లేదని రోజు deccen cronicle తెచుకొని బిగ్గరగా చదవటం, తెలియని పదాలకి అర్థాలు రాసుకోతం చేశా. మెదడు నిండా ఒకటే ఆలోచనలు. మారాలి , నన్ను నేను మార్చుకోవాలి..ఏదో ఒకటి చేయాలి.
ఒక కొత్త కోర్సు, అందట్లోకి గొప్పగా చూపించేది, మా సర్కిల్ లో diffrent గా, డబ్బు విలాసం అన్ని ఇచ్చేది , రిచ్ అండ్ పోష గాళ్స్ తో కళ కళ లాడేది ... ఒక కొత్త కోర్సు చేయాలనిపించింది.. అలా ఓ రెండు నెలలు పేపర్లు కెరీర్ magazines తిరగేస్తే.....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment