మొన్నెపుడో ప్రపంచ మహిళా దినోత్సవం జరిగింది. మహిళలందరూ ఒక చోట చేరి " మహిళ గొప్పతనం, కుటుంబానికి, సమాజానికి మహిళ ఎలా సేవ చేస్తుందో, తామెంత ముక్య పాత్ర పోషిస్తున్నారో తెలియజెప్పారు. సమాజం లో ఎలా దూసుకుపోతున్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారో , ఎలాంటి ఆపదలు ఎదురు కావోచ్చో, వాటిని ఎలా face చేయాలో వివరించారు. మహిళా బిల్లు అదేంటో నాకు తెలియదు కాని దాని గురించి కూడా చర్చించారు.
ఆడది ఆబల కాదు సబల అని చాల మంది మహిళలు prove చేసారు, చేస్తున్నారు.
కాని నేను గమనించింది ఏంటంటే... ఇల్లు విడిచి ఉద్యోగాలు చేస్తున్నా , విమానలేక్కి గాల్లో చక్కర్లు కొడుతున్నా.. పొలిసు మిలిటరీ దళాల్లో చేరి దైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నా.. కొన్ని విషయాలలో మాత్రం ఆడది ఆబాల గానే మిగిలిపోయిందేమో అని అనుమానం .
ఉద్యోగం చేసినా, ఊళ్ళేలినా ఇంటికొచ్చి కన్నీటి చిట్టా విప్పుతుంది. చున్ని అంచుతోనో.. tissue paper తోనో కళ్ళు, ముక్కు తుడుచుకొంతోంది. కారణం ఏదైనా కావొచ్చు. బాస్ తిట్టాడనో, బాయ్ ఫ్రెండ్ ముఖం చాటేసాడనో, మొగుడు పట్టించుకోటం లేదనో.
స్త్రీ తత్వం సున్నితం, తద్వారా బాధ అనివార్యం. ఎంత సున్నితం గా ఉంటె అంతా బాధ. ప్రపంచ తత్వం, మగాడి గుణం తెలిసి కూడా, సగం ఎదుర్కొని ఇంకో సగంలో ఓడిపోతోంది. ఇంటికొచ్చి ఏడవటం అసలైన అబలత్వం. ముఖ్యంగా relationships విషయంలో మహిళ బాధని అధిగమించలేక పోతోంది.
ప్రపంచాన్ని గెలుస్తున్నాం.. కాని మనని మనం గెలవకలగాలి.. మన attitude ని మార్చుకోగాలగాలి. దాన్ని సాధన చేయాలి. ఇది సాధించిన రోజున నిజమైన మహిళా దినోత్సవం.
No comments:
Post a Comment