జీవ పరిమాణ సిద్దాంతం నుండి మనిషి వోచ్చడా? లేక బైబిలు లో చెప్పినట్టు
దేవుడు ఒక అడ ఒక మగని సృష్టిస్తే వాళ్ళ నుండి ఈ మన
మనుష జాతి విస్తరించిందా ??
తెలీదు కాని ....
మనిషి ప్రయాణం అప్రతి హతంగా సాగి
నిప్పు రగిల్చి.. రుచులు వడ్డించి
కాంతిని చీల్చి... రంగులుగా మార్చి,
చక్రాన్ని చేసి , ప్రపంచాన్ని చుట్టి.
నింగి పై ఎగిసి , నీటిపై తేలి..
భూమి లోతుని ...ఆకాశం అంతును చూసి
కంప్యూటర్ కనిపెట్టి...ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి..
ఏమి సాధించాలనో ఆ తపన ?
అంతు లేని కాంక్ష.. గమ్యం లేని పయనం...
కంప్యూటర్ కనిపెట్టి...ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి..
ఏమి సాధించాలనో ఆ తపన ?
అంతు లేని కాంక్ష.. గమ్యం లేని పయనం...
అదే మనిషి జీవితం.
No comments:
Post a Comment