Mar 3, 2010

ప్రశ్నించుకోండి.....




                                

మునుపెన్నడో శంకర మఠం హత్యోదంతం.. అప్పుడెప్పుడో పుట్ట పర్తి ప్రశాంతి నిలయం లో హత్య.. మొన్న కలికి భగవాన్, నిన్న నిత్యానంద స్వామి రాసలీలలు..

వీళ్ళని ఆరాధ్య దైవాలుగా చేసుకొని.. మహిమల్ని ఆపాదించింది ఎవరు??
 
వీళ్ళకి విరాళాలు ఇచ్చి పెంచి పోషించింది ఎవరు ?
వీళ్ళ ఫోటోలు పెట్టి పూజలు, భజనలు చేసింది, చేస్తోంది ఎవరు ?

కాషాయం కట్టగానే కామం మాయం ఐపోతుందని ఎవరు చెప్పారు ?
జీవిత మూల సూత్రాలు మరిచి పోయారా ? 

కూడు , గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. ఒక వయసు వచ్చాక కామం ప్రాథమిక అవసరం అని వేరే చెప్పాలా??
పడక గదుల్లో కెమెరాలు పెడితే , తపస్సు చేసుకుంటున్న నిత్యానందులు  కనపడతాడా?? 

ధనం మూలమిదం జగత్ అని మళ్లీ గుర్తు చేయాలా నేను ??
డబ్బు ముందు నైతికవిలువలు నిలబడవని తెలుసుకోలేదా?
కోటి విద్యలు కూటికోసం అని తెలిదా?? 

The fittest will survive అని పెద్దలు చెప్పింది మరిచారా ???? 

మీ జీవితాలని మార్చేస్తా అని వాడంటే మటుకు మీరెలా నమ్ముతారు ?
ఎం చదువు కున్నారు ? డిగ్రీలుంటే సరిపోతుందా.. విచక్షణా జ్ఞానం ఉండక్కరలేదా??

కళ్ళ ముందు సత్యం ..నిత్యం కనబడుతోంటే.. గుడ్డి వాళ్ళయ్యారా??
ఎవడో చెప్పే కాకమ్మ కథలకి పడి పోతారా ??

"చలం" అసలు సంగతి  అరచి చెపుతూ ఉంటె  వినపడలేదా??

తిరగేయండి గ్రంధాలని
ఒంటబట్టించుకోండి సారాంశాన్ని,
వెతకండి ములాలని,
కనుక్కోండి సత్యాన్ని,
ప్రశ్నించుకోండి మిమల్ని మీరు.  

3 comments:

Nrahamthulla said...

స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.

chakri said...

టీవీ వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తారు.. వాళ్ళూ ఇంకో వేషంలో ఉన్న స్వాములే కదా.
(స్వామీ = స్వాహా చేసేవాడు, స్వ = నేను, మీ = నేను , నేను, నాకు అని ఏడిచే వాడు, స్వార్థపరుడు, ఇవే ప్రస్తుత అర్థాలు.. )

chakri said...

ఐఏఎస్ , రాజకీయ నాయకులు.. సిని ప్రముఖులు కూడా వీళ్ళ శ్యిష్యులుగా ఉన్నారు కదా అంటారా, వాళ్ళలో కొంతమంది వాళ్ళు వీళ్ళతో కుమ్మకై మోసం లో పాలు పంచుకుంటున్నారు.. కొంతమంది మనలాంటి మూర్ఖులే. ఏ మానసిక బలహీన నిముషాన్నో వాళ్ళని ఆశ్రయించారు.
ఇక నైనా మేలుకుందాం ..మానసిక స్వాంతన , సోషల్ లైఫ్ కోసం ఈ గుడో, గోపురమో వెళ్ళటం లో తప్పులేదు...మనని మనం తప్ప , ఈ కల్లబొల్లి గురువులు.. బైరాగులు, స్వామీజీలు, భగవాన్ లు. మార్చలేరని , వీళ్ళంతా డబ్బుకోసం పేరు కోసం సుఖాల కోసం అలా అయ్యారనే పచ్చి నిజాన్ని తెలుసుకుందాం.