నిన్న ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది... తీయని గొంతుతో..
" సర్ జీవితాన్ని అద్భతంగా మార్చేయగల దివ్య మైన ఉంగరాలు..రాళ్ళూ...రప్పలు..మణులు ..మాణిక్యాలు..కంకణాలు..వడ్డాణాలు ఉన్నాయి. తీసుకుంటారా "
ఒక పని చేస్తావా ??
చెప్పండి సార్ ..
చంపెయ్యి నన్ను..
సార్ ...ఆ మాటకి ఫోన్ కట్ చేసి తీరాలి అని కట్టయిందో లేదో చూసా..కాలేదు.
" సార్ మీ frustration తొలగించుకోవాలంటే మీరు మా ఉంగరం పెట్టుకోని చూడండి సార్ మీ మనసును పీస్ ఫుల్ గా ........"
మళ్లీ ఫోన్ కట్ అయ్యిందో లేదో చెక్ చేశా..
అయ్యింది.
ఎందుకంటే చేసింది నేనే కదా..
No comments:
Post a Comment