కాలేజీ కి వెళ్తూ ఓ x రోడ్డు సిగ్నల్ దగ్గర ఆగాను. ఓ ఏడు ఎనమిది మంది
బిచ్చగాళ్ళు (పిల్లలు)..వొంటిమీద చొక్కా సరిగ్గా లేక.. వాహనాలని చుట్టు
ముట్టారు. కొంత దూరం లో ఓ మహాతల్లి కొంగు పట్టుకొని 5 ఏళ్ళు, 3 ఏళ్ళ
పిల్లలతో పాటు చంకన ఓ చంటిది గుబులుగా చూస్తోంది.
దాదాపు భారత దేశం లో ఏ
మూల చూసినా ఇదే దర్శనం ఇస్తుంది.
ఎన్ని NGO organizations ఉన్నా ఇంకా స్లమ్స్ వెలుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం జనాభా గురించి మరిచి పోయినట్టు ఉంది. అసలు వీళ్ళందరికీ ఉచిత కాండోమ్స్ .. ఉచిత తుబెక్టామి, vasectomy ఆపరేషనులు తప్పని సరిగా చేయక పోతే భారత దేశ దరిద్రం ఎన్నటికీ పోదు.
పేదవాడికి పిల్లలు ఉండకూడదు అని కాదు. అందరికీ ఉండాలి. కాని కటిక దరిద్రులకు సంతానం ఎక్కువ ఉంటె..వాళ్ళు దరిద్రులు గా మారుతారు.
అప్పట్లో కుటుంబనియంత్రణ అంటే తెలియక, ఆపద్దతులు తెలియక.. భయపడో లేక అంత చదువు లేకో ఎక్కువ సంతానాన్ని కని ఉండవచ్చు.ప్రస్తుతకాలంలో మాత్రం వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవ్వరైనా భారత దేశ పౌరుడిగా కుటుంబనియంత్రణ పాటించాల్సిందే. ఇది ఒక రకంగా దేశ పౌరుడిగా మన భాద్యత . ఆ బాధ్యతా నిర్వర్తించి మన
దేశ భక్తిని చాటుదాం. ఒక్కరికంటే ఎక్కువ సంతానం అవసరమా
అని పదే పదే ఓ వంద సార్లు ఆలోచించుకోవాలి. మూడో సంతానం అసలే కూడదు.
కనీసం ఇప్పటినుండి ప్రభుత్వం ఒక జంటకి ఒక్కరి కంటే సంతానం ఉండాలి అని rule పెడితే బావుంటుందేమో!
1 comment:
వాళ్ళు వీళ్ళు అని కాదు.. మతం కులం తో పని లేదు.. aha..ha..ha...antha dammulunna party okkati ledu,ala G.O pass chesina 2va roju prabhutvam koolipoatundi...maream.....seculer vaadulanta minorities ki jarugutonna :"ANYAYAM" paina speachulu danchi...maddatu venakki teesukuntaaru....adee mana BHAARATAM
Post a Comment