మధ్యాన్నం కదా..ఖాళీ గానే ఉంది సిటీ బస్సు .. ఓ సీట్ చూసుకొని కుర్చున్నా .. నా పక్క సీట్ లో ఎవరు లేదు..వెనక ఓ చదువుకున్న ఉద్యోగి. ఇంకో వైపు..అప్పుడే జాబ్ ఎక్కినట్టు కన్పిస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయి..మంచి దుస్తులతో నిగానిగాలడుతున్నాడు..మేడలో ID వార్డు వేలాడుతోంది.. ప్రేమ కూడ మొదలయినట్టు ఉంది, తనలో తానే చిన్నగా నవ్వుకుంటున్నాడు..ప్రియురాలు గుర్తుకొచ్చేమో ...
ఇంతలో ఒక స్టాప్ లో ఇద్దరు పదకొండో తరగతి కుర్రాళ్ళుఎక్కారు.
ఒకడేమో.. సన్నాగా ఉన్నాడు... కాంతారావు ప్యాంటు..ముందు వైపు వంకీ తిరిగిన బూట్ల లాంటి చెప్పులు...దాని మీద ఎరుపు నలుపు..చారాల T షర్టు.. ఇంకోడు దాదాపు ఇదే వేషం కానీ మనిషి కొంచం దిట్టంగా ఉండటం తో బానే కనబడుతున్నాడు.. ఇద్దరూ మధ్యతరగతి అని వేరే చెప్పనక్కరలేదు..
అప్పటికే ఏదో విషయం సీరియస్ గా మాట్లడు కుంటున్నట్టు ఉన్నారు..దాన్నే కంటిన్యూ చేస్తున్నారు..సన్నగా ఉన్నవాడు ఎక్కువ మాట్లడేవాడిలా ఉన్నాడు..చెప్పుకు పోతున్నాడు..
" ఆడ మంచోడు రా..ఎందుకంటే..అన్నం బెట్టిండ్ర వాడు ..ఇంటికి దీస్క పోయి . .. ఆన్కి ఎంత dare దెల్సారా... తాగి ఇంటికి భి వోతాడ్ ఆడు.. ఆళ్ళ అయ్యా అమ్మా ఏమనర్ ఆన్ని..ఎందుకో ఆన్ని జూస్తే భయంరా బై ఆల్లకి.. మొన్న ఏమైంది దేల్సారా... ఆడు రాజ్ గొట్టిండ్రా ..రాజ్గాడ్ తెల్సుకదా ..మా కాలేజే...మా పక్క గల్లి లా ఉంటడ్ జూడరా...నీవ్ మస్తు సార్లు జుసినావ్.. ఆన్ని. . పొడుగ్గా ఉంటడ్ జూడు ...రాజ్ గాడు సత్తి గాని గాల్ ఫ్రెండ్ ని సతాయిస్తు డoట, రాజ్ గాన్ని ఎమన్నా గొట్టిండా..
ఇంకోడు అడిగాడు.. అనుమానం వచ్చి.. " ఆ పిల్ల సత్తి గాన్ని లవ్ జేస్తుందా ??
ఏమో రా గాల్ ఫ్రెండ్.. గాల్ ఫ్రెండ్ అంటడు.. ఆ _______గాన్కి జెప్పిండ్రు ఆన్ దోస్తులు. ఆ పిల్ల జోలికి వోకురా భై , వొద్దురా బై అని , ఇన్లె....ఆడ్ లైట్ దీస్కుండు.. సత్తి గాంకి దేల్సింది.. అందుకే గొట్టిండు..నేవ్వేమన్న అన్రా ఆని dare కి మెచ్చుకోవాల్ రా.. నిజంగా.. ఆడ్ దోస్తానాల పానం ఇస్తడ్రా.. ఎందుకంటే..నన్ను ఇంటికి దీస్కపోయ్ అన్నం బెట్టిన్డ్రా.....
సత్తి గాన్ని జుష్ణావ్ లే,,నీవ్..
ఏమో..
కల్పిస్త .. ఓ సారి ..
ఇక వీడి వంతు వచ్చింది...
మొన్న మిస్ కాల్ ఇస్తే మల్ల జేయలేదేంది భే..
బాలన్సు లేకుండే.. మా ఆయ్య ఈ సారి పాకెట్ మనీదక్కువ ఇచ్చిండ్రా ..
___ ల బాలెన్సు... నీ అమ్మా.. ఎంద్రా...mr perfect పోదామని .. మిస్ కాల్ జేస్తే మల్ల జేయ్యవారా , బడ్కావ్.. నీ కోసం ఎన్ని సార్లు ట్రై జేస్ష రా..
ఆ యాల్ల మా మామ వాళ్ళింట్ల ఉండే.. అది గాక ..బాలన్సు లేకుండే..
ఎట్లుంది..సిన్మా.
మాటకు ముందు వెనక ఏదో ఒక బూతు చేర్చకుండా మాట్లాడటం లేదు.
నేనేమో వీళ్ళ గురించే ఆలోచిస్తున్నా... ఆ retired ఉద్యోగి...ప్రావిడెంట్ ఫండ్ సగం ఎలా ఖర్చు అయిందా అని ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు..పట్టించు కోవటం లేదు.. MR సాఫ్ట్ వేర్ ..తన ధ్యాసలో తాను ఉన్నాడు..
ప్రభాస్ గాడు వేస్ట్ గాడ్ అయిన్డ్రా .. ఆన్కి బాడి కి ఎసువంటి సినిమాల్ దీయాలే..
నీ అమ్మా.. ______ లాగుంది సినిమా...
రెండు పాటల బావున్నయంకో....నాకైతే నచ్చలేద్ర బై..
అర్రేయి...నేన్ దిగుత...
సరే.. అర్రేయి..ఫోన్ చై రా...
బాయ్ రా..
బస్సు మలుపుతిరుగుతూ ఉండగానే ..ఆ కుర్రాడు చెంగున దూకి జనాల్లో కలిసి పోయాడు..
ఒంటరిగా మిగిలిన వాడు..ఫోన్ తీసి ఏదో ఆట ఆడటం మొదలెట్టాడు.. :)
6 comments:
well written annayya!
idena telangana bhasha ante? ottulu, dheerghalu iraggotti matladatamena?
@ anonymous తెలంగాణా బాష కాదు..తెలుగు బాష.. ప్రాంతాన్ని బట్టి యాస ...మనుషులని బట్టి మాట..పదాలు..పదార్థాలు. ప్రతి బాషలోను..యాసలోను.. సంపూర్ణత..అసంపూర్ణత ...అందం ..ఆకర్షణ.. వికృతం..విపరీతం ఉంటాయి.
Everytime we board a city bus, we come across this kind of scene. You captured the life perfectly!
@Chakri ...Well Said
@Chakri ...Well Said
Post a Comment