రాత్రి ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఏమి తోచటం లేదు. చాల రోజులైంది కదా అని FM పెట్టుకున్నా.. ఏ చానల్ తిప్పినా అంకర్ల గోల.. అబ్బబ్బా భరించలేం. రాత్రి పదకొండు గంటలు దాటినా మన అంకర్ గొంతులో మాత్రం ఫుల్ energy.. ఎంత అంటే..ఏం మాట్లడుతున్నోరో తెలినంత..సరే ఎప్పుడో రికార్డు చేసింది లైవ్ కాదని అనుకుందాం. కాని ఆ మాట్లదేదేదో స్పష్టంగా కొంచం నిదానంగా మాట్లాడొచ్చు కదా..ఎంత అంకర్ అయితే మాత్రం కనీసం మాట్లాడింది వినేవాడికి అర్థం కావాలిగా.. అర్థం అయ్యే time ఇవ్వాలి కదా..సరే ఈ సంగతి వదిలేస్తే..
ఎంత ఫాస్ట్ మాట్లాడుతున్నమనే ధ్యాసలో...మాటలు తడబడుతూ..u know..u know అని ఇంగ్లీష్ add చేస్తూ...అసలు విషయం మరిచి పోతారు.. సరే ఇదే ప్రస్తుత స్టైల్ అఫ్ ఆకరింగ్ అనుకొని వదిలేద్దాం..
మంచి పాటలు ప్లే చేస్తునపుడు కొంచం పాట గురించో..లేక situation గురించో, పాజిటివ్ గా చెప్పొచ్చు కదా.. అంతా తెలివి ఉందా..అని.
ఆగడి ఆగండి విషయం చెప్పకుండా తిడుతున్నా అనుకుంటున్నారా..
చెపుతున్నా..
"చక్కనైన ఓ చిరుగాలి..ఒక్క మాట వినిపోవాలి.. ఉషా దూరమైన నేను ..ఉపిరైన తీయలేను." పాట వేసాడు.. ఆహా .. అనుకుంటుండగా.. పాట ఆపి మొదలెట్టాడు.." బాబు.. ఇది ముందే హైదరాబాదు..pollution పెరిగిపోయింది.. నీవు ఏదైనా పల్లెటూరు వెళ్లి పాడుకోమ్మా.. ఈ pollution పెరిగిపోయి మాకే ఉపిరి తీయటం కష్టం అవుతోంది....అంటూ ఏదో వాగాడు..
వేసిన పాట ఏంటి ? దాని situation ఏంటి..నీ program ఏంటి.? నీ మాటలేంటి? టైం ఎంత అయింది ?
ఎమన్నా అర్థం ఉందా ??
అంతా చక్కని పాట మొదలెట్టి...ఆపేసి..pollution ఉంది పల్లెటూరు వెళ్లి పాడుకో పో అంటాడా??
జనాలని entertain చెయ్యటం అంటే వెటకారం కాదురా బాబు..ఫీల్ తెప్పించటం..నిదానంగా..స్పష్టంగా మాట్లాడుతూ, చెప్పే విషయాలని చాకచక్యంగా మెలికలు వేస్తూ.. ప్రసేంట్ చేయటం.. అంతే కాని గొప్ప పాటలని వేస్తూ.. సంబంధం లేకుండా మాట్లాడుతూ 'పాట' ని insult చేస్తూ వెటకారంగా మాట్లాడటం కాదు నాయనా.. కొంచం ఆలోచించుకొని ఆంకరింగ్ చెయ్యండి.అభిమానులు ఉన్నారు కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతే..దూరమైపోతారు, తరవాత మీ ఇష్టం.
1 comment:
Good post.
madhuri.
Post a Comment