Feb 9, 2011

చివుక్కుమంది ప్రాణం..



 బలుక్కున తెల్ల వారింది..టపక్కున మెలకువ వొచ్చింది ...దబుక్కున లేచా.. గబుక్కున తయ్యారయ్యి... చటుక్కున బండెక్కి వెళ్తోంటే.. తలుక్కున ఓ అమ్మాయి..గిరుక్కున తిరిగా .. ఆ పిల్ల చురుక్కున చూసింది.. ఆ చూపు కసక్కున దిగింది ...దడక్కుమంది గుండె.. చెలుక్కున కన్ను గీటితే .. కిలుక్కుమని నవ్వింది.. ఇంతలో సరుక్కున గేదె .. గబుక్కున బ్రేక్ వేసినా ..దళుక్కున కింద పడ్డా.. పుటుక్కుమన్నాయి ఎముకలు... అమ్మాయి మినుక్కుమని మాయం.. చివుక్కుమంది నా ప్రాణం.

No comments: