Apr 30, 2011
ఓ దృశ్యమా
నేను చూడలేని లోకాలని చూపించి.
నేను పొందలేని అనుభవాలని అందించి
నాకే తెలియని భావాలని తట్టిలేపి..
వెలకట్టలేని అనుభూతులని పంచి..
క్రికేట్టువై దేశభక్తి ని రేపావో.. .
అశ్లీలమై నా మృగతృష్ణ ని నిద్రపుచ్చావో.. ..
అట మాట పాట కలగలుపుకొని నాకు ఆనందాన్ని ..కలిగించావో..
బొమ్మలుగా మారి పిల్లలకి చిట్టి కథలు చెప్పావో .
సీరియళ్లుగా సాగి పెద్దల గత జ్ఞాపకాలని తట్టి లేపావో..
లేచింది మొదలు...నిద్ర పోయేవరకు..
నిద్ర పోయినా...కను పాపల తెరమీద
ఎటు చూసినా నీ దర్శనమే..
ఎం చేసినా నీ రూపమే..
ఓ దృశ్యమా.. నీకు వందనం..
నేను పొందలేని అనుభవాలని అందించి
నాకే తెలియని భావాలని తట్టిలేపి..
వెలకట్టలేని అనుభూతులని పంచి..
క్రికేట్టువై దేశభక్తి ని రేపావో.. .
అశ్లీలమై నా మృగతృష్ణ ని నిద్రపుచ్చావో.. ..
అట మాట పాట కలగలుపుకొని నాకు ఆనందాన్ని ..కలిగించావో..
బొమ్మలుగా మారి పిల్లలకి చిట్టి కథలు చెప్పావో .
సీరియళ్లుగా సాగి పెద్దల గత జ్ఞాపకాలని తట్టి లేపావో..
లేచింది మొదలు...నిద్ర పోయేవరకు..
నిద్ర పోయినా...కను పాపల తెరమీద
ఎటు చూసినా నీ దర్శనమే..
ఎం చేసినా నీ రూపమే..
ఓ దృశ్యమా.. నీకు వందనం..
Apr 25, 2011
తల్లి మనసు
మొన్నెపుడో సరదాగా సాయంత్రపు నడకకు బల్దేరాను..మెయిన్ రోడ్డు, pollution బాగా ఉంది కూడ..అయినా అదేపనిగా ఇంట్లో కుర్చోటం భరించలేక వెళ్ళా .
తిరిగి వస్తోంటే రోడ్డు మీద ఏదో గొడవ.. ఎంటా అని చూస్తే...ఎవడో ఓ కుర్రాడు తాగి నడి రోడ్డు మీద నిలబడ్డాడు. వచ్చి పోయే వాహనాలు ఆగి, వాడిని వితగా చూస్తూ పక్కనుంచి వెళ్ళిపోతున్నాయి. కొంత సేపు ట్రాఫిక్ జాం కూడా అయ్యింది. ఇంతలో యాభై ఏళ్ళ పబడ్డ వయసున్న ఒకావిడ, వాళ్ళ అమ్మ అనుకుంటా "రా ఇంటి కి రా" .. అని వాడిని లాగుతోంది..వాడు విదిలించుకుంటూ వాహనాలకి ఎదురుగా వెళ్తున్నాడు. ఓరినీ ..ఏం పుట్టిన్దిరా నీకు.. ఎవడిని బెదిరించటానికి ? చచ్చేదానికి బెదిరించటం ఎందుకూ ? ... అని అనుకుంటుండగానే..
వాడు వాళ్ళ అమ్మని దూరంగా నేట్టేసాడు...ఆమె దుమ్ములో పడిపోయింది. దుమ్ములోంచి లేచి మళ్లీ 'రా రా .. నీ కాల్మొక్త రా ..రా' అని లాగుతోంది. వాడు నేట్టేయటము. ఆమె పడిపోయి లేవటం.. వీడు మళ్లీ రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడటం.
అప్పుడు ఇహ అక్కడ ఉండే వాళ్ళూ పోగయ్యి వాడిని పక్కకి లాగేశారు.. వాడు విదిలించుకొని పోబోతోంటే ..లాగి ఒక్కటి కొట్టారు.. ఆ తల్లి బాబూ కొట్టకండి బాబు అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంది .
దాదాపు 25 ఏళ్ళ యువకుడు.. పని చేసేట్టు కనబడటం లేదు. బహుశా తల్లి వెట్టి చాకిరీ చేసి పోషిస్తుంటే.. డబ్బు లాక్కొని తాగి వచ్చే తన్నే బాపతుగా కనపడ్డాడు. నచ్చిన పని చేసి, ఎంతో కొంత సంపాదించి, తల్లిని పోషించాల్సింది పోయి, ఇలా తాగుబోతయ్యాడు..
పాపం ఆ తల్లి.. కన్న పాపానికి ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిందే కాక.. తాగి తంతే భరిస్తోంది. కడుపు లో ఉన్నపుడు తన్నలేదా.. ఇప్పుడు తంతే ఒక లెక్కా అనుకుందేమో ఆ మాతృమూర్తి .పాపం ఆ వయసులో, నలుగుర్లో, నడి రోడ్డు మీద, కన్నకొడుకే తిరస్కారం తో నేట్టేస్తుంటే...ఎందుకో చాల బాధగా అనిపించింది ఆమెని చూస్తే..
ఆ మాతృహృదయానికి నా కన్నీటి చుక్క అర్పితం.
Apr 8, 2011
కొత్త కుండ
సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎంత fridge నీళ్ళు తాగినా గొంతు మాత్రం తడవటం లేదు. దాహార్తి తీరటం లేదు. అందుకే ఓ కుండ కొందామని వెళ్ళాను.
ఎంతమ్మా కుండ ?
150 ..స్టాండ్ కలిపి ౩౦౦
అర్రే ఎంటమ్మ అంత చెపుతున్నావ్ ఒకేసారి, మట్టి కుండ 150 ఆ...ఆ చిన్న స్టాండు 150 ఆ ఆశ్చర్యం ప్రకటించేసా
అవును బాబు ధరలు పెరిగాయి కదా..
సర్లే,,
వెళ్లి పోయాను..పక్క షాప్ కి.
అక్కడ కొంచం ఎక్కువగానే చెప్పాడు.
ఇహ కుండా వద్దు ఏమి వద్దు..౩౦౦ పెట్టి ఎవడు కొంటాడు మహా అంటే ఇంకో నెల..రెండు నెలలు. ఏదోలా గడిచి పోతుంది లే అని వెనుదిరిగాను.
మళ్లీ మొదటి ఆవిడ నాదగ్గరికి వచ్చింది.
కొత్త కుండ కొనాలయ్య.. మంచిది. అంత ఆలోచిస్తావ్ ?
ఆ ఏం మంచి ..? ప్రతిసారి కొంటునే ఉన్నంగా.. ఏం జరిగిందని. అలా జరిగుంటే కుండనే దేవుడిని చేసేవాళ్ళం గా..??
వీడు సెంటిమెంటుకు పడేవాడు కానట్టుంది అనుకోని.. నా మొహం బాగా చూసి ఓ బ్రహ్మాస్త్రం సందించింది.
ఏంటయ్యా... ఇన్ని ఖర్చు చేస్తారు..కుండ దగ్గరికి వచ్చేసరికే మీకు ఎమోస్తది ?
సరిగ్గా తగిలింది..
నాకెందుకో కరెక్టే అనిపించింది. ఓ రాత్రి నిద్రపట్టకపోయినా..mood అస్సలే బాలేకపోయినా..మహా బాగా ఉన్నా ఈజీ గా 250 హుష్ కాకి అయిపోతాయి.
of course ఈ మధ్య నిద్ర పట్టకపోయినా, మూడ్ ఎలా ఉన్నా .. హుష్ కాకి అనిపించలేక పోతున్నా. అదో నిస్సహాయత, :( అది వేరే విషయం.
సరే ఆమె అన్నదానిలో ఒకింత నిజాయితీ ఉందని అనిపించింది.
సరే అమ్మా..220 ఇస్తా ఇచ్చేయి..
250 ఇవ్వు బాబు...
నా వాళ్ళ కాదు...
220 ఏ.
సరే 230 ఇవ్వు ..
సరేలే... పోనీ ...అని 230 చేతిలో పెట్టి కుండ తెచ్చుకున్నా..
అన్నట్టు ఒక రోజు అంతా నీళ్ళు పోసి పెట్టి..ఆ తరవాత నుంచి వాడాలట కదా..
నా అభిమానం
నాకు అప్పుడు అయిదారేళ్ళ వయసు.
సినిమా అంటే అబ్బురం. అందులోను.. చిరంజీవి సినిమా అంటే.. ఓహ్..దసరా ,,దీపావళి కంటే పెద్ద పండగ నాకు ఆది..నానా హంగామా చేసి చిరు సినిమా చూసేవాడిని.. స్కూల్ ఎగ్గొట్టి సినిమా చూసే ధైర్యము..ఘనతా నా కాలనీలో నాకే దక్కాయి. పక్కవాళ్ళ ముందు దోషిగా నిలబడ్డా నామోషి గా ఎప్పుడు ఫీల్ అవలేదు. పైగా అదో గొప్ప adventure గా అనుభూతి చెందేవాడిని. ఆ ఫైగింగులు..ఆ స్టైలు .. ఆ అందము..ఆ డ్రెస్సులు..ఆ స్టెప్పులు..మరిచిపోగాలనా?? ఖైదీ, గుండా..పులి..కిరాతకుడు..యమకింకరుడు....మీకు తెలుసుగా పేర్లు..
Intermediate.
"Gang leader కాలేజీ ఎగ్గొట్టి టిక్కెట్స్ కోసం try చేస్తే చివరికి మొదటి ఆటకి దొరికింది. నాలుగింటికల్లా రావలసిన పిల్లాడు ఎక్కడికి వెళ్ళడా అని ఇంట్లో వాళ్ళంతా యమా ఇదై పోతుంటే.. నేను మాత్రం.. " ఆంజనేయుడికి దండం పెట్టి రాఫ్ఫ్ ఆడించేస్తా నాహా..... రావణ లంకకి నిప్పంటించి మీసం మెలి పెడదామ. జి అ న జి ..గ్యాంగ్ గ్యాంగ్ ..బజావో..బ్యాండ్ బ్యాండ్.."
సినిమా చూస్తూ..అప్పుడప్పుడు పిడికిలి భిగించి వదులుతూ తన్మయత్వం చెంది.. ఇంటికి వెళ్లేసరికి 10 కొట్టింది.ముందు అన్నం పెట్టారు..ఆ తరవాత వాతలు పెట్టారు. కాని నేను గ్యాంగ్ లీడర్ లో చిరంజీవిలా ఫీల్ అయ్యి .. అవి గొప్పగా నొప్పి పెట్టనట్టు నటించాను.
డిగ్రీ
...చదువుతున్నానో...లేక అయిపోయిందో..గుర్తులేదు..
హైదరాబాదు..మల్కాజిగిరి ..సాయిరాం theater.. "స్నేహం కోసం" సినిమా చూసాను.
ఆ తరవాత ఇంక చిరంజీవి సినిమా చూడకూడదు అనుకున్నాను.. అప్పటికే ఆయన మాస్ మసాల మాటల స్టయిలు.. లుంగీలు ఎగ్గట్టడాలు గంతులు వేయటాలు.. ఎంచుకున్న పాత్రల్లో హుందా తనం లేకపోవటము.. చీ చిరంజీవి అనిపించింది.
మళ్లీ ఇంతవరకు చిరంజీవి సినమాని theater లో చూడలేదు.
మొన్నటి దాకా & ప్రస్తుతం.
చిరంజీవి పార్టీ పెట్టటం..నాకు చాల బాధేసింది. ఇక ఆయన ఏం మాట్లాడిన అసహ్యం వేసింది. ఎందుకంటే ఆయన తెర నుంచి రాజకీయ నాయకుడు అయ్యాడు కనక. రాజకీయం అంటే నిజ జీవిత నటన కనక.. రాజకీయ నాయాకుడేవరు హీరో కాదు..కాలేడు గనక
ఇక ఆయన సంపూర్తిగా నా మనసులోంచి తొలగించ బడ్డాడు.
ఆయన తన స్వంత జీవితంలో సరి అయిన దారి ఎంచుకొని..ఒక్కో మెట్టు ఎక్కాడేమో..నా ఒక్కడికి బదులు వంద మంది అభిమానులని సంపాదించుకున్నాడేమో..
కాని నా గుండె కుండలో అభిమానం ఒక్కో చుక్కా కారి పోయి..ఎండిపోయింది.
ప్రజారాజ్యం కాంగ్రేసులో మద్దతో/ విలీనం కావటం తో..ఆ ఎండిన కుండా పగిలి పోయింది.
Apr 7, 2011
భయం..
భయం..
చాల విషయాలలో మనిషిని ముందుకు వెళ్ళకుండా అపేసేది ఈ భయం.
లోకంలోని వింత విషయాలని..
చాల విషయాలలో మనిషిని ముందుకు వెళ్ళకుండా అపేసేది ఈ భయం.
లోకంలోని వింత విషయాలని..
అమలవుతున్న ఆచారానికి ప్రశ్నించటానికి భయం.
తనని తాను చూసుకోవటానికి భయం. తన కోరికని తెలియచేయటానికి భయం. తీర్చుకోవటానికి అంతకంటే భయం.
దేవుడంటే భయం.. లోకం అంటే భయం..మనుషులంటే భయం.
చావటం అంటే భయం..బ్రతకటం నిరంతరం భయం.
వెనక్కి చూసుకుంటే భయం..భవిష్యత్తు తలచుకుంటే భయం.
ఒంటరితనం భయం.. జనాలు చుట్టుముడితే భయం.
అడుగడుగునా ఏదో తెలియని భయం.
క్షణ క్షణం భయం భయం.
తనని తాను చూసుకోవటానికి భయం. తన కోరికని తెలియచేయటానికి భయం. తీర్చుకోవటానికి అంతకంటే భయం.
దేవుడంటే భయం.. లోకం అంటే భయం..మనుషులంటే భయం.
చావటం అంటే భయం..బ్రతకటం నిరంతరం భయం.
వెనక్కి చూసుకుంటే భయం..భవిష్యత్తు తలచుకుంటే భయం.
ఒంటరితనం భయం.. జనాలు చుట్టుముడితే భయం.
అడుగడుగునా ఏదో తెలియని భయం.
క్షణ క్షణం భయం భయం.
క్షణ క్షణం భయం భయం.
Apr 5, 2011
దైవదర్శన మయ్యేనాకు ..!!
ఎండపట్టుకు ఎడ తెగక తిరిగి..
కళ్ళు సోలి సోమ్మసిల్లగ
చెట్టునీడన సేదదీరగ..
చెట్టు నాకు గొడుగు పట్టే,
చల్ల గాలి జోలపాడే
గాలి చాటుగా జోల పాడిన
దైవదర్శన మయ్యేనాకు..!
మాయదారి రోగమొకటి..
తెలియకుండా సోకినాది
ఓపలేని బాధతోనూ..
రోజు రోజు కుంగి పోవగా.
రోజు రోజు కుంగి పోవగా.
వైద్యుడిచ్చిన చిన్న మాత్ర..
నొప్పినంతను తెసివేయగా..
మాత్ర. మాటున దాగి ఉన్న
దైవదర్శన మయ్యేనాకు..!
పొట్ట కూటికి దారి పట్టి
ఆకలికి ప్రాణాలవిసి పోవగా
తుట్ట తుదకు సాటి వాడు
పట్టెడన్నం పెట్టినాడు
సాటివాని దాత గుణమున
దైవదర్శన మయ్యేనాకు ..!!
Apr 4, 2011
స్వేచ్చా దేవత
నిజంగా ఆ స్వేచ్చా దేవత కళ్ళ ముందు నిలిస్తే తట్టుకోగాలమా ??
అవును తట్టుకోగాలమా..????
ఎవరికీ
వారు తమకి స్వేఛ్చ లేదని..తమని ఎవరో బంధించారని అనుకుంటారు. ఆ బంధనాలు తెంపుకోగల దైర్యం చేయడు. తెంపుకోలేడు ..తెంపుకొని తాను కోరిన స్వేచ్చా
ప్రపంచం లోకి వెళ్ళలేడు .
ఎందుకంటే ఈ స్వేచ్చా ప్రపంచాన్ని తట్టుకొనే శక్తి ఉండదు కనక.
బ్రతకటానికి ఒకింత బంధనం.. ఒత్తిడి..అవసరం కనక.
Apr 3, 2011
ఒక్కరోజు కూడ గడవక ముందే...
ఇందాక ATM కి వెళ్ళాను..ఎమన్నా ఉంటే ఉడ్చేద్దామని. కాని బ్యాంకు ముందు ఓ పదిమంది గుంపు కట్టారు. అర్రే డబ్బుల్లేవా ఏంటో అనుకుంటుండగా...ఎవడో ఒకడు సెక్యూరిటీ మీద అరుస్తున్నాడు. ఇంతలో ఒకాయన నేరుగా లోపలి వెళ్లి డబ్బులేక్కపెట్టుకుంటూ వచ్చాడు.
నేను వరుసలో డోర్ దగ్గరకెళ్ళి నించున్న. అయితే ఆ గుంపులో నుండి ఒకాయన వచ్చి అ సెక్యూరిటీ ని బండ బూతులు తిడుతూ మీద మీదకీ వస్తున్నాడు. ఇంతకీ ఆ సెక్యూరిటీ చేసింది ఏంటంటే ఇతన్ని అపాడట..మీరు లేట్ గా వచ్చారు మీ ముందు వచ్చిన అతను తీసుకున్నాక మీరు అని. దానికి ఇతగాడికి కోపం నషాళానికి అంటింది. సెక్యూరిటీ మీద విరుచుకు పడిపోయాడు. తన తాలూకు గుంపు వచ్చేసింది. ఆ గుంపులో నుండి ఓ నిరక్ష్యరాస్యుడు చెపం వాయించనే వాయిన్చాడా సెక్యూరిటీ ని. అర్రే అని అందరూ ఆపారు..మళ్ళీ కొట్టాలని ప్రయత్నం. ఆగవయ్య.. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టటం అని ఓ పెద్దాయన అన్నా వినడే, ..పోనీ లెండి అని ఓ చదువుకున్నావిడ అన్నా బూతులు ఆపడే.. లేడీస్ వస్తుంటే ఎక్కువ చేస్తున్నాడు బూతులు. నేను లక్షలు పెడతాను బాంకులో..ఏమనుకుంటున్నావో అంటూ..
నాకైతే డబ్బుల్లేని frustration కనపడింది. మాట తీరు పెద్దగా చదువుకున్నట్టు లేదు. పోనీ ఏ రియల్ ఎస్తాటే వ్యాపారి అంటే.. టాటా సఫారీ కూడ లేదాయే. పోనీ ఒక చిన్న కారు ?? అదీ లేదు..బైక్ కూడ ఉన్నట్టు కనపడలేదు.మరి లక్షలు ఎక్కడనుంచి పెడతాడు.
ఆ పెట్టె వాడే అయితే సెక్యూరిటీ తో గొడవ పదే టైం ఉంటుందా అని.??
పాపం సెక్యూరిటీ అతని కళ్ళల్లో నీలు తిరిగాయి. అతను చేసిందల్లా తన డ్యూటీ.
నిజంగా ఆ సెక్యూరిటీ తప్పు చేసే ఉంటే అతనికి నేర్పిద్దాం..పాపం పుట్టిన పాపానికి ..చదువు కోని పాపానికి ఈ ఉద్యోగం చేస్తుంటే..అతని కొడితే ఏం వస్తుంది ? మనకంటే పెద్దవాళ్ళని/ గొప్పవాళ్ళని ఎలా గౌరవిస్తున్నాం అనేది కాదు ముఖ్యం మనకంటే తక్కువ వాళ్ళను ఎలా treat చేస్తున్నాం అనేది ముఖ్యం.
నిన్నయితే మాచ్ చూసి ఓహో భారతీయులం అనుకుని.. ఒక్కరోజు కూడ గడవక ముందే మనం ఏంటో మనం మరిచి పోతున్నాం.. పక్క వాడి బలహీనత మీద చెయ్యి చేసుకుంటున్నాం.
నిన్న నేను ఇండియాని గెలిపించమని ప్రార్థన చేయలేదు. కాని ఈ రోజు ఈనా భారతీయులని బాగు చెయ్యి అని ప్రార్థిస్తున్నాను.
Apr 2, 2011
చెలిమికి కుడా కొన్ని ప్రాబ్లెమ్స్ ఉంటై
స్నేహాల్లో ముందస్తు లక్ష్యాలు ముందుగా కాకుండా ..మెల్లిగా వస్తుంటై..
అవసరాన్ని బట్టి సహాయం అడుగుతుంటై.. అవసరానికి రాని స్నేహం ఎందుకు అని అనుకుంటై... ... అన్నిటికి ఉన్నట్టే చెలిమికి కుడా కొన్ని ప్రాబ్లెమ్స్ ఉంటై .. అర్థం చేసుకుంటే బాగుంటై..
కాలం తో పాటే అన్నీ మారుతుంటై.
మొక్కలు ఎంతకాలం పూలు పుస్తై .. నీళ్ళు పోయకున్నా ..lifetime అయిపోయినా ఎండిపోతై ..
స్నేహితులు వస్తుంటై.. పోతుంటై ..స్నేహం మాత్రం మిగిలుంటై.. ఏదైనా కలకాలం ఉండాలి అనుకుంటే మనకి కష్టాలే మిగులుతై.
Apr 1, 2011
Subscribe to:
Posts (Atom)