Mar 19, 2012

A memorable moment . :))

చిన్నప్పటి నుంచి పరమ బేవార్సు గా తిరిగే నాకు సాహిత్యమూ అదీ పెద్దగా పరిచయం లేదు. కాని డిగ్రీలో ఉండగా చలం పుస్తకాలు పరిచయం అయ్యాయి. అవి నన్ను ఓ ఊపు ఊపెసాయి. చలం చదివన తరవాత ఇంక వేరే ఏదీ చదవాలనిపించలేదు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. ఇహ ఈ మధ్య ఒకటో అరో వేరే పుస్తకాలు చదువుతున్నాను. మాటల్లో చిన్నప్పుడెప్పుడో విన్నాను ఆ పేరు. అందుకే మొన్నా వెళ్ళినపుడు ఓ రెండు మూడు పుస్తకాలు తెచ్చాను. చాలా బాగా నచ్చాయి.
అయితే ఈ రోజు ఎడారివర్షం DVD లాంచ్ ప్రసాద్ preview theater లో జరిగింది. స్క్రీనింగ్ ఐపోయాక స్నాక్స్ కి బయటికి వచ్చాం. ఎడారి వర్షం DVD లు, 'సినిమాలు మనవీ - వాళ్ళవీ" పుస్తాకాలు అమ్మకానికి పెట్టాం.
ఒకావిడ వచ్చింది, 'సినిమాలు మనవీ - వాళ్ళవీ" పుస్తకాన్ని చూసికొనుక్కుంది. అర్రే మొన్న ఈవిడ పుస్తకమే కదా నేను చదివి బాగా ఇష్టపడింది అని ఆమెని అలాగే చూస్తూ ..మీరు 'ఓల్గా' గారు కదా అన్నాను. అవును అని చిరునవ్వు నవ్వింది. మీ పేరేమిటి అడిగింది, చెప్పాను.
మీ పుస్తాకాలు బాగా నచ్చాయి చదివి పేస్ బుక్కులో SYNOPSIS పెడుతుంటాను అన్నాను. అవునా అనీ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది.
 Its a memorable Moment. :))

2 comments:

జ్యోతిర్మయి said...

మీరు ఓల్గా గారిని కలిశారా...WOW

S said...

"ఒకావిడ వచ్చింది, 'సినిమాలు మనవీ - వాళ్ళవీ" పుస్తకాన్ని చూసికొనుక్కుంది. అర్రే మొన్న ఈవిడ పుస్తకమే కదా నేను చదివి బాగా ఇష్టపడింది అని ఆమెని అలాగే చూస్తూ ..మీరు 'ఓల్గా' గారు కదా అన్నాను. అవును అని చిరునవ్వు నవ్వింది."
-Now, you made my day! :-) I don't know who you are, but thanks :-)