"శరీరం కోసం గాక ఆత్మ ఔన్నత్యం కోసం బ్రతకటం అంటే ఎంత మందికి తెలుసు ?" చలం ని చదువుతుంటే అలా చదువుతూ ముదుకు వెళ్ళలేము. మధ్యలో వచ్చే కొన్ని వాక్యాలు మనసులోతుల్లో దిగిపోయాయి... మనని ప్రశ్నిస్తాయి.. మన ములాలని ఎండ గడతాయి.. ఆలోచింప జేస్తాయి చాలా తీవ్రంగా. అవును ఏమిటి ఆత్మ ఔన్నత్యం కోసం బ్రతకటం అంటే ??
మహేష్ ..మోహన్ యమా బిజీ ఉన్నారు పేస్బుక్కులో . తొమ్మిదిన్నర అవుతొందేమో.అప్పటికే అందరూ భోజనం చేసేసి నిద్రకు ఉపక్రమించారు లైట్ అర్పి , మేం తప్ప. ఏ ఒంటిగంటకో కన్నుమలిగే నాకు ఇలాంటి ప్రయాణాల్లో అదీ కష్టమే . మనుషులని గమనిద్దాం అన్నా.. అంతా నిద్రపోతున్నారు .
మోహన్ తృప్తిగా పేస్బుక్కు చూస్కున్నాక నాకు ఇచ్చాడు లాపీ.
నేను పుస్తకం మూసేసి పేస్బుక్కు మీద పడ్డాను. అదుగో అప్పుడే కేరళ ప్రయాణం - 1 రాసింది. :)
వెంట తెచ్చుకున్న హార్డ్ డిస్క్ తీసి ' ఐ సా డెవిల్' చూడటం మొదలు పెట్టాను. interesting గా అనిపించింది.. ముఖ్యంగా ఇలాంటి ప్రయాణ సమయాల్లో సైకో త్రిల్లెర్స్ బాగా పనికొస్తాయి. :). సినిమా మంచి రసవత్తరంగా ఉండగా హటాత్తుగా బాటరీ డౌన్ అయ్యి.. లాపి ఆగిపోయింది. :( సమయం పదకొండున్నర కావస్తోంది.
కిందికి చూస్తే మహేష్ , మోహన్ కుడా పడుకున్నారు. నాకు నిద్ర రావటం లేదు. చేయటానికి ఏమీ లేదు. ఏమీ తోచటం లేదు. ఇంతలో ఏదో స్టేషన్ వచ్చింది. . దిగాను. ఎవరో ఇద్దరు డోర్ దగ్గర నిలబడి ఉన్నారు.. ఇది రేణిగుంట జంక్షన్ వొచ్చేది తిరుపతి అని చెప్పారు.
తిరుపతి.. అప్పుడు గుర్తొచ్చింది. FB మిత్రుడు ప్రేమ్ చంద్ తిరపతిలో కలుస్తా అన్నాడు.మహేష్ కూడా చెప్పాడు ఆ విషయం. ఎంత సేపట్లో వస్తుంది అడిగా ..అరగంట పట్టొచ్చు అన్నారు.
ప్రేమ్ చంద్ పేస్బుక్కులో మిత్రుడు. నా పోస్టింగ్స్, photography బావుంటాయని చెప్పాడు. అలా పరిచయం పెరిగి ఒక నాలుగయిదు సార్లు చాట్ చేసాం.అంతే .. వస్తాడో రాడో. అదీ ఈ టైం లో ..నమ్మకం ఏముంది ?? ఏదో మాటవరసకి అని ఉంటాడు అనుకొని మళ్ళీ బెర్త్ మీదకి వెళ్ళిపోయా.
ఏదో ఆలోచనల్లో ..మగతగా నిద్ర పడుతోంది. రైలు ఎప్పుడు ఆగిందో తెలిదు. ప్రేమ్ చంద్ సరాసరి మా బోగీ లోకి వచ్చాడు. నేను ఎవరా అని కళ్ళు నులుపుకున్తుండగా 'హాయ్ చక్రీ ' చాల ఉత్సాహంగా అన్నాడు.
అర్రే ప్రేమ్.. హౌ ఆర్ యు అంటూ ఆశ్చర్యంగా దిగాను. మోహన్ గారూ కూడా కళ్ళు నులిపుకుంటూ చూస్తుంటే లేపాను. మహేష్ ని కుడా లేపబోతుంటే ప్రేమ్ వద్దు అనేసరికి...సరే అని ముగ్గురం బయటికి వచ్చాము. మోహన్ ని పరిచయం చేసాను. చక్రీ ఇలా రా అని నన్ను platform సిట్టింగ్ పిల్లర్ దగ్గరికి తీసుకెళ్ళి nice meeting U అని చక్కగా పాక్ చేయించిన ఒక పళ్ళ బుట్ట చేతిలో పెట్టాడు ప్రేమ్ . అర్రే ఏంటిది.. ఎందుకు .. నాకు చాలా ఆశ్చర్యంగా... ఆనందంగా అనిపించింది. ఇదీ మీకే అని ఓ నిండు సంచి చేతిలో పెట్టాడు.
ఏంటిది ? ఏం లేదు దారిలోకి , ట్రైన్ లో ఫుడ్ బావుండదు కదా.. అన్నాడు
అవేమీ వద్దు ప్రేమ్. జస్ట్...కలుద్దాం అనుకున్నాం కలిసాం. అని నేను సర్ది చెప్పెంతలో.. పర్లేదు. లోపల పెడదాం పద అన్నాడు .
లోపల పెట్టి కొద్దిసేపు మాట్లాడుకున్నాం ఇంతలో ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ప్రేమ్ చంద్ తో సెలవు తీసుకొని లోపలి వచ్చాక ఏముంది కారి బాగ్ లో అని చూస్తే చపాతీలు ...గోంగూర పచ్చడి..పెరుగన్నం. . పులుహోర.. చక్కగా పాక్ చేసి ఉన్నాయి. ముగ్గురికీ నాలుగు పుటాలకి సరి పడే ఫుడ్ . అర్థ రాత్రి ఇవన్నీ మాకోసం ఇంట్లో చేయించి.. పళ్ళు కూడా పాక్ చేయించి తెచ్చాడు. ఎక్కడి స్నేహమిది ..ఎక్కడి బంధమిది ?? ఎంతటి అభిమానం ఇది ?? ఒకరకమైన భావోద్వేగానికి లోనయ్యాం ..
ఇంతలో మహేష్ లేచాడు. ఏంటి అని అరా తీస్తే విష్యం చెప్పాము . అయ్యో నన్ను లేపాల్సిందే అని అన్నాడు. స్నేహభిమానాలు ఉంటాయి. కాని ఇంతాగానా, అదీ పేస్ బుక్కు ద్వారా పరిచయం అయిన మిత్రుల మీద. నిజంగా ప్రేమ్ స్నేహం అదృష్టమే. అతని అభిమానానికి కృతజ్ఞులం.
ఇవన్నీ చూడగానే ఆకలి మళ్ళీ వేసింది. చపాతీలు, పెరుగన్నం సుష్టుగా లాగించి మరోసారి ప్రేమ్ చంద్ అభిమానాన్ని తలచుకొని పడక ఎక్కాం.
No comments:
Post a Comment