సినిమా సమజోద్దరణ కి తీస్తారా లేదా వేరే సంగతి. కాని 'సినిమా' సమాజాన్ని ప్రభావితం చేస్తుందనేది ఒప్పుకోవాల్సిందే. అయితే అన్ని సినిమాలు చేయకపోవచ్చు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ప్రభావం చూపితే..కొన్నిటి ప్రభావం subconscious లెవల్లో ఉంటుంది. ఈ ప్రభావం positive గా ఉండొచ్చు ..negative గాను ఉండొచ్చు. అంతెందుకు ఒక సినిమాలో పాపులేర్ పాత్ర స్టైల్..డైలాగు..హెయిర్ కట్.. డ్రెస్..accessories .. ఏదోటి సమాజం లో వాడబడితే .. ఆ సినిమా సమాజాన్ని ప్రభావితం చేసినట్టే.
సినిమా అనేది ఒక మీడియం. కొందరు జనాలని pure
entertain చేయాటానికి ఉపయోగించుకుంటారు. .. మరొక అతను entertain + ఆర్ట్
ఫాం గా ఉపయోగించుకుంటాడు. మరొకడు సమాజం లోని అవకతవకలను చూపిస్తాడు. ఇంకొరు
నేర చరిత్రలని ..సమాజ చీకటి కోణాన్ని చూపిస్తాడు. entertainment
అనేది అన్నిటిలోనూ దాగి ఉంటుంది. ఆది వేరే విషయం. film maker
దేనికోసం తీసినా అది సమాజం పై ఇంకోరకంగా ప్రభావం చూపొచ్చు. అయితే సినిమా
ఎలాంటి ప్రభావం చూపబోతోంది అని ఒకింత దూర దృష్టి కలిగి ఉండాల్సిన బాధ్యత
film maker కి ఉంది.
సినిమా ప్రభావం అంటే, సినిమాలో
చూపించినట్టు నరుక్కోవటం ..లేదా ప్రేమించుకోవటం లేదా జనాలకి కాపాడటం లేదా
హీరోలు గా మారటం కాదు. ఇది లోతుగా స్టడీ చేస్తే తప్ప తెలియదు.దురదృష్టవశాత్తు మనదగ్గర సినిమా ఎడ్యుకేషన్ మిస్ అయ్యింది. " నీ
ఎంకమ్మ.. 'అంత సీన్ లేదు' తోక్కేం కాదు.. ఇలాంటి పదాలు చిన్నా పెద్దా తేడా లేకుండ ఉపయోగించే మాటలు . సినిమా నించి వచ్చినవే కదా. ఎవరో/ ఎక్కడో /ఒక ప్రదేశం లో ఉపయోగించిన మాట..సినిమా
ద్వారా మొత్తం మందికి పాకి అవి జనాలకి ఉతపదాలు అయ్యాయి. ఇదీ సినిమా ప్రభావం.నాకు మన సమాజం లో అడుగడునా ..'సినిమా' ప్రభావమే కనపడుతోంది. నేను అమ్మాయికి 'ఐ లవ్ యు' చెప్పటం నేర్చుకుంది సినిమాల ద్వారా.. ఇలా ఉండాలి అని అనుకుంది సినిమా హీరోని చేసే. చేస్తే ఇలాంటి అమ్మాయిని లవ్ చేయాలి అనుకుంది సినిమా హీరో ఇనే లని చూసే. నాలో ఓ రకమైన భయం కలిగించింది సినిమాలే...ఇంకో రకమైన భయం పోగొట్టింది సినిమాలే. సిగరెట్టు తాగింది ..హీరోలని చూసే.. ఇంకా చాలా.. నా జీవితం లో అడుగడుగునా సినిమా ప్రభావం ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా చోపోచ్చు.. కొన్ని కల్పనలు జోడించ వచ్చు.. లేదా పూర్తిగా కల్పనే కావచ్చు.
చెడిపోతారు.. బాగు పడతారు అని కాదు..సినిమా '
ప్రభావం'' కొంతకాలం ఉంటుంది అని మాత్రమే ఒప్పుకోక తప్పదు.
సమాజం పై సినిమా ప్రభావం లేకపోతే ..
* సినిమాకి ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ?
* పోర్నోగ్రఫీ పిల్లలు ఎందుకు చూడకూడదు ??
* ఎందుకు కొన్ని సినిమాలని బాన్ చేసారు /చేస్తారు ??
సమాజం పై సినిమా ప్రభావం లేకపోతే ..
* సినిమాకి ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ?
* పోర్నోగ్రఫీ పిల్లలు ఎందుకు చూడకూడదు ??
* ఎందుకు కొన్ని సినిమాలని బాన్ చేసారు /చేస్తారు ??
ప్రాబ్లం ఏంటంటే.. సినిమా చూడగానే మనిషి
మొత్తానికి మొత్తం అలా మారిపోతాడు అని అనుకుంటున్నావ్.. కాని ప్రభావం
అంటే...అది కాదు. దాన్ని వివరంగా రచకుండా ..మాట్లాడితే ఎలా ? ఆ ప్రభావం కూడా
జీవిత కాలం ఉండదు కదా.. సినిమా ఒక్కటే కాదు కదా ప్రభావం చూపించేది. మిగతా
అన్నిన్తిలాగే సినిమా కూడా ... అదీ కొంతమందిలో .. అదీ "ఒకింత " ప్రభావం
చూప 'వచ్చు' . చూపుతుంది అని కాదు. చూపటానికి అవకాశం ఉంది అని . ఆ ప్రభావం
ఇనిస్తంట్ గా కాకుండా subconsious పని చేస్తుంది. వ్యక్తిని ..వ్యక్తిత్వాన్ని
బట్టి...ఎంతో కొంత కాలం. మనం వ్యక్తిత్వం ఇలా మారటానికి ఏమేం దోహదం
చేసాయో చెప్పగలమా ??
ఏ సినిమాలు ఎందుకు ఎంతవరకు ఎవరిని ప్రభావితం చేసాయో ..బాగా ఆలోచిస్తే వాళ్ళకి తెలియటానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలు చూసి నచ్చి సినిమా పిచ్చి పెరిగి సినిమాలు తీద్దామని ఇల్లువిదిచిన వాళ్ళందరి మీదా సినిమా ప్రభావం ఉన్నట్టే. సినిమా వాళ్ళ జీవితాని నిర్దేశిన్స్తోన్న్ట్టే. ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి కావాలా సినిమా ప్రభావం గ్గురించి చెప్పటానికి.
ఏ సినిమాలు ఎందుకు ఎంతవరకు ఎవరిని ప్రభావితం చేసాయో ..బాగా ఆలోచిస్తే వాళ్ళకి తెలియటానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలు చూసి నచ్చి సినిమా పిచ్చి పెరిగి సినిమాలు తీద్దామని ఇల్లువిదిచిన వాళ్ళందరి మీదా సినిమా ప్రభావం ఉన్నట్టే. సినిమా వాళ్ళ జీవితాని నిర్దేశిన్స్తోన్న్ట్టే. ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి కావాలా సినిమా ప్రభావం గ్గురించి చెప్పటానికి.
No comments:
Post a Comment