Mar 11, 2012

కేరళ ప్రయాణం - 1


సమయం మధ్యాన్నం 12  గంటలు   .అనుకున్న టైం కి కలుసుకున్నాం  స్టేషన్ లో. మోహన్ అటు ఇటు దిక్కులు చూస్తూ  అమ్మాయిలు పెద్దగా లేరు..టైం పాస్ ఎలా అవుతుందో అన్నాడు. :).   నీ అదృష్టం అన్నాను.                           
 ట్రైన్ సరిగ్గా సమయానికే వచ్చింది.మా బెర్త్ లు చూసుకొని కూర్చుంటే.. ఇద్దరు అమ్మాయిలు ఎదురుగా కనిపించారు. మోహన్ మొహం విప్పారింది. ;). ట్రైన్ కదిలిందో లేదో.. మహేష్ ఆకలి దంచేస్తోంది నేనైతే తినేస్తున్నా అని చికెన్ బిర్యాని తీసాడు. మోహన్ కూడా జాయిన్ అయ్యాడు, నాకోసం veg బిర్యాని కూడా తెచ్చాడు.  ఆ  concerning  నాకు నచ్చింది. మనకోసం ఎవరైనా చిన్న పని చేసినా  ఎందుకో మనసుకు గొప్ప ఆనందం కలుగుతుంది. మధ్యాన్న భోజనం పూర్తయ్యాక .. రాత్రి నిద్ర  లేదు సరిగ్గా అంటూ  మహేష్ పడకేశాడు. ఎందుకు నిద్రలేదో..అతనికే తెలుసు. ;).
నేను , మోహన్  అమ్మయిలవంక ఆశగా చూసాం .కాని వాళ్ళు మలయాళీ బాషలో బిజీ గా ఉన్నారు, మమల్ని పట్టించుకునే ఉద్దేశ్యం కనపడలేదు. ఇహ లాభం లేదని  నేను 'జీవితాదర్శం' బయటకి తీశాను. చేసేది లేక మోహన్ నేను - చీకటి లో కూరుకుపోయాడు.అలా కొద్ది సేపు చదివాను పుస్తకం .. నాలుగు పేజీలు చదవగానే, 
అసలు లాలస లాంటి అమ్మాయి ఉంటుందా ఈ దేశంలో..?? అలంటి పిల్ల నాకు తగలదేం...అని లాలస గురించిన ఆలోచనలో పడ్డాను. పుస్తకం ముసేసాను. కిటికీ లోంచి చల్ల గాలి విసురుగా మొహాన కొడుతోంది ట్రైన్ వేగానికి. ఎదురుగా ఉన్నాయన నిద్రలో జోగుతున్నాడు.. మహేష్ గురక వినిపించటం లేదువిచిత్రంగా. అమ్మాయలు కిటికీల్లోంచి చూస్తూ ఏదో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు.
గుంటూరు దగ్గర పడుతోంది. రేలు వేగంగా దూసుకొని పోతోంది పంట పొలాల్లోంచి. మిరప తోటలు .. ఎర్రగా విరగకాచిన మిరప.. అప్పుడప్పుడు తెల్లగా విచ్చుకున్న పత్తి చేను . మిరపపండు తెంపి ఎండబోసారు చాలా చోట్ల.. ఎర్రగ్గా కుంకుమ రాసుల్లా అనిపిస్తున్నాయి దూరం నించి...

No comments: