Jul 8, 2011

నేనూ ఒక scam చేసానండోయ్ ..

నేను ఇంటర్ చదివేటప్పుడు నాకు యమా సినిమాల పిచ్చి. ఇదీ అదీ అని కాకుండా అన్ని సినిమాలు.. కానీ జేబులో డబ్బు ఉండేది కాదు. ఎప్పుడు జేబులు గల గల లాడినా తిండి లేకున్నా  కాలేజీ ఎగ్గొట్టి సినిమాలో దూరేవాడిని.
మా ఫ్రెండ్ ఒకతనికి స్కాలర్ షిప్ వచ్చింది కాని అతడు అప్పటికే కాలేజి వదిలి పోయాడు. ఇంకో ఇద్దరు మిత్రులు నాకు  విషయం  చెప్పి,  అతని  పేరు మీద నా identity కార్డ్ తయారు చేసారు.నా పేస్ features కొంచం అతనిలాగే ఉంటాయి మరి. నేను చేయవలసిన పనల్లా ప్రిన్సిపాల్ ని కలిసి చెక్ తీసుకోవాలి. 
స్కాలర్ షిప్ వచ్చిన వాళ్ళందరూ ప్రిన్సిపాల్ ని కలవాలి. అతను రెండో మూడో ప్రశ్నలు వేస్తాడు. సమాధానం చెప్పాలి. చెక్ మీద sign చేసి మన చేతికి ఇస్తాడు. పక్కనే  register లో మనం చెక్ తీసుకున్నట్టు సంతకం చేయాలి. ఆ తరవాత మీకు తెలుసుగా..డబ్బు మనదే.
ఆది గవర్నమెంట్ కాలేజీ కనక  వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటారు. ఎవరు ఎవరో ప్రిన్సిపాల్  గుర్తుపట్టే ఛాన్స్ యే లేదు అని అని నన్నుlure చేసారు.
డబ్బు ..అ డబ్బు తో చూసే సినిమాల లిస్టు కళ్ళముందు కనపడే సరికి నేను scam లో పాలు పంచుకున్నా.
   భయం భయంగా ఆ రోజు ఆఫీసు ముందు నిల్చున్న.. ప్రకాష్ అని పిలిచారు , నేను చుట్టూ చూస్తున్న.. నాపక్కన ఫ్రెండ్ నన్ను డొక్కలో పొడిచాడు అప్పుడు గుర్తొచ్చింది నేనే ప్రకాష్ అని. గుండె ని అదిమి పట్టి లోపలికేల్లాను. 
నీ పేరు.. 
చా.ప్రకాష్ సర్..
గ్రూప్.. మ్మ్ మ్మ్  MPC..
మీ నాన్న ఏం చేస్తాడు..
వ్యవసాయం.  
అతను మాములుగా చూసినా నన్ను అనుమానం తో చూస్తున్నాడేమో అని అనిపించింది. భయం వేసింది . ఈ లోపు చెక్ మీద సంతకం పెట్టి నా చేతికి అందించాడు బాగా చదువుకో అంటూ.. నేను registerలో సంతకం చేస్తుంటే ఇంకో విద్యార్ధి వచ్చాడు.  హమ్మయ్య ఇహ నన్నెవరు గమనించరు అనుకొని .. చెక్ తెసుకొని ఆఫీసు రూం బయటికి రాగానే పరుగో పరుగు.. మళ్లీ ఏ అనుమానం వచ్చి వెనక్కి పిలుస్తారో  అని. హహ్హ 
మొత్తానికి 325 రూపాయలు వచ్చింది నా వంతుకి. :) :)



No comments: