జీవితంలో సాధించింది ఏమీ లేదనే బాధ నిద్ర పట్టనివ్వక..
తెల్లవారి నాలుగున్నరకి మెలకువ వచ్చింది..
అసహనంగా అటు ఇటు దొర్లాను..
ఏమాత్రం ఉపశమించలేదు..
తలుపులు తెరుచుకొని బయటకి వెళ్లాను.
నీ జ్ఞాపకాన్ని మోసుకొచ్చిన చిరుగాలి మొహాన్ని తాకింది..
మనసు కొంచం కుదుట పడింది..
ఆ 'నీవు' ఎవరో తెలిస్తే ఎంత బావుణ్ణు.
No comments:
Post a Comment