Jun 28, 2011

one Coffee.. one flavored Milk



శ్రీకర్ ATM సెంటర్ దగ్గరకి వెళ్ళాడు. బాలన్సు చెక్ చేసుకున్నాడు.
నాలుగు లక్షల రెండువేల మూడువందల నాలుగు రూపాయలు..
ఓ అయిదు వేలు   డ్రా చేసాడు.
తన ఫ్లాట్ కి వచ్చాడు.. బాగా అలసటగా ఉంది.సాధారణంగా సాయంత్రం అయితే గాని ఈ అలసినట్టు అనిపించదు. కాని ఎందుకో అనిపిస్తోంది..జీవితంలో అలసి పోయినట్లు.. fridge లోకి చూసాడు. ..నాలుగు  టమోటాలు..అయిదు గుడ్లు.. పచ్చి మిర్చి. కొత్తమీర కట్టలు ఉన్నాయి. వాటితో పాటు   రెండు  ఫ్లేవేర్డ్ మిల్క్ బాటిల్స్  .  ఎప్పుడు flavored మిల్క్ ఉంచుతాడు. ఎందుకంటే..................................అలవాటు అయ్యింది.


 శ్రీకర్ పనిలో నిమగ్నం అయి ఉన్నాడు. ఇంతలో మేనేజర్ జి మెయిల్ లో మెసేజి వచ్చింది. లోపలి రమ్మని.
 లోపలి వెళ్తే ..అక్కడ సన్నగా పొడుగ్గా గుండ్రని  మొహం  మెరిసే కళ్ళు ..చెవులకి పెద్ద రింగులతో చిరునవ్వుతో నిహారిక.
శ్రీకర్ ..she is నిహారిక..
నిహారిక మీట్  శ్రీకర్.. యు  have to work in his team .
హలో ..
హలో ..చెప్పుకున్నారు ఇద్దరు.
ఆ మాత్రం టైం ఇచ్చిన మేనేజర్ .. నిహారిక మీరు ఇక వెళ్ళవచ్చు. i have already mailed u abt the project. ఒకసారి  మొత్తం  బాగా చూసి శ్రీకర్ ని కలవండి.
thank  యు  సర్. నిహారిక వెళ్ళిపోయింది.
రెండు నిముహాలు మేనేజర్ తో మాట్లాడి తన కుబే కి వచ్చాడు శ్రీకర్,
వచ్చి అల కూర్చున్నాడో లేదో..
హలో.. నిహారిక  పింగ్ చేసింది.
హలో..
బిజీ?
నో చెప్పండి.
నొథింగ్ ముచ్ ..జస్ట్ గోయింగ్ తోరో ది ప్రాజెక్ట్.
ఒకే.
నాకో డౌట్ ..
చెప్పండి..
మీరు  కాఫీ తాగుతారా ? 
ఏంటి ఇదా డౌట్ ?
ఒహ్హ సారీ ..I mean coffee  తాగుతూ మాట్లాడుకుందామా ?
వంద మంది అమ్మాయిలని అడిగితే ఒక్క అమ్మాయి కాఫీకి రావటం కష్టం.. కాని  అమ్మాయి అడిగితే అబ్బాయిలు Q కడతారేమో ! ..
శ్రీకర్ రాకుండా ఉంటాడా..
సరే ...after half an hour ..  అప్పుడే వెళ్ళవచ్చు. కాని ఆ మాత్రం లేకుంటే టీం లీడర్ గా పరువేం ఉంటుంది. ?

మీకు కాఫీ ఏ కదా.. ఒనె కాఫీ ..అండ్
ఏంటి మీరు తాగారా ?
నో..చాల చాల తక్కువ..
మరి కాఫీకి రమ్మని అన్నారు. 
కూల్ డ్రింక్ కి.. flavored మిల్క్ కి రండి అని అంటే బావుండదు కనక.. . :)
హహ.
one Coffee.. one flavored Milk
                           ......................................

Jun 24, 2011

' ప్రేమ' తనని వదిలేశాక ( katha - 1 )

శ్రీకర్ మేనేజర్/HR గదిలోకి వెళ్ళాడు. తన resignation లెటర్ టేబుల్ మీద పెట్టాడు.
ఏంటి సడన్ గా ?
కంపెనీ మారుతున్నవా ?? హైక్  కోసం ??
అని బయటికి అన్నా ..అతనికీ తెలుసు  శ్రీకర్ ఎందుకు resign చేస్తునాడో.
అందుకే అలా అడుగుతూనే  accept చేసాడు.
శ్రీకర్ మాత్రం మౌనంగా ఉన్నాడు.
3 డేస్ లో  experience certificate & salary certificate మీ అడ్రస్ కి పంపిస్తాను.
థాంక్ ఉ సర్.. బాయ్..
శ్రీకర్ తన cube దగ్గరికి వచ్చి తన వస్తువులన్నీ సర్దుకొని..ఒక్క సారి ఆఫీసే చూసాడు.
కొంతమంది తమపనుల్లో తాము నిమగ్నం అయ్యారు..కొంత మంది ..తన స్నేహితులు తనని గమనిస్తున్నారు..
తను వాళ్ళవైపు చూసి..తన వస్తువులతో నడుస్తూ...ఒక్కసారి 'నిహారిక' ఉండే cube వైపు చూసాడు .. ఖాళీ గా ఉంది.
ఒక్క క్షణం బాధ ఉవ్వెత్తున ఎగిసింది..కాని మొహం లో అదేమీ కనపడనీయకుండా..బయటికి నడిచాడు.


ఈ రోజు మనని చూసి నవ్విన పువ్వు..రేపు వాడిపోతుంది.. ఆ నిజానికి అలవాటు పడాలి.
అలాగే మనం దేనినైనా ఎంతగా ప్రేమిస్తామో..ఆ ప్రేమ మనని వదిలి పోతే అంతే నిబ్బరంగా ఉండగలగాలి. అని ఎప్పుడూ అనుకునేవాడు, కాని ' ప్రేమ' తనని వదిలేశాక కాని తెలియలేదు...తనకా శక్తి లేదని........

Jun 23, 2011

తీయని గొంతు


నిన్న ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది... తీయని గొంతుతో..
 " సర్ జీవితాన్ని అద్భతంగా మార్చేయగల దివ్య మైన ఉంగరాలు..రాళ్ళూ...రప్పలు..మణులు ..మాణిక్యాలు..కంకణాలు..వడ్డాణాలు ఉన్నాయి.   తీసుకుంటారా "
ఒక పని చేస్తావా ??
చెప్పండి సార్ ..
చంపెయ్యి నన్ను..
సార్ ...
ఆ మాటకి ఫోన్ కట్ చేసి తీరాలి అని   కట్టయిందో లేదో చూసా..కాలేదు.
 " సార్ మీ frustration తొలగించుకోవాలంటే మీరు మా ఉంగరం పెట్టుకోని చూడండి సార్ మీ మనసును పీస్ ఫుల్ గా ........" 
మళ్లీ ఫోన్ కట్ అయ్యిందో లేదో చెక్ చేశా..
అయ్యింది.
ఎందుకంటే చేసింది నేనే కదా..

Jun 20, 2011

ఏ జో దేశ్ హై మేరా..


మారేడ్పల్లి నుంచి వస్తున్నాను.. అక్కడ ఏదో విగ్రహం ఉంది.. దుమ్ముకొట్టుకుపోయి. అక్కడ  ఉన్న సిగ్నల్ దాటి మలుపు తిరుగుతున్ననో లేదో..ట్రాపిక్ పోలీసులు.. జనాన్ని ఆపుతున్నారు..రోడ్డుమీదకు  అడ్డంగా వస్తూ..
ఉదయం పదకొండు ..సికిందరాబాదు ..తార్నాక..మారేడ్పల్లి ఇలా మూడువైపుల నుంచి వచ్చే ట్రాఫిక్ లో వెళ్ళటమే కష్టం రా బాబు అంటే..మధ్యలో వాహనాలని ఆపుతూ ట్రాఫిక్ పోలీసులే ట్రాఫిక్ ఆగేట్టు చేస్తే..ఏం అనాలి ? కొంచం ముందుకు వెళ్తే సెయింట్ ఆన్స్ స్కూల్ ముందు ఖాళీగా స్థలం  ఉంది. అక్కడ వాహనాలను ఆపినా  మిగతావారికి ఇబ్బంది కలగదు.
ఇంకిత జ్ఞానం అంటారు దీన్నే. పదో ..ఇంటర్  ..అత్తెసరు మార్కులతో అప్పుడెప్పుడో   పాసయ్యి..promotions ద్వారా SI అయితే ఇలాగే ఉంటుంది.  వాళ్ళ మెదడు ఇలా కాక ఎలా పనిచేస్తుంది ???
సరే ఇది పక్కన పెడితే..
 cbz మీద జోరుగా వస్తున్న పాష్ యువకుడిని ఆపాడు ఒక భటుడు.
ఏంటి ?
లైసెన్సు..RC చూపించు..
చూపించాడు..
ఇన్సురన్సు..
చూపించాడు..
pollution..
లేదు..
ఫైన్ కట్టు
ఎంత ??
150 /-
ఆ యువకుడు ఒక్కనిముషం అన్నట్టు సైగ చేసి  మహా కూల్ గా  gold flake సిగరెట్టు వెలిగించాడు....గుండెనిండా పొగ పీల్చి..ఉదాడు..
అప్పుడు అన్నాడు..పచాస్ లేలో.. అని..
ట్రాఫిక్ భటుడి మొహం వెలిగింది..
ఆంగీకారపు  నవ్వు పెదాల మీద కనబరచాడు.
purse తీసి ..ఓ యాభై నోటు ఇచ్చాడు..ఆ ఇచ్చే పద్దతి చూస్తే ఎవ్వరికైనా తెలుస్తుంది..బిచ్చగాడికి వేసినట్టు వేస్తున్నాడని..
దాన్ని మహా ప్రసాదం లా అందుకునుని..చిరునవ్వుతో పనిలో లీనం అయ్యాడు మన భటుడు.
జై భారత్ అని తన దేశం మీద   ఒక్క నవ్వు నవ్వుకొని...మళ్ళీ అదే వేగం తో వెళ్ళిపోయాడు.

Jun 19, 2011

నేను మనిషిని.


ఓ వేసవి సెలవుల్లో ఉరువెల్లి హాయిగా పొద్దు మాపు తిని పడుకుంటున్నా. మధ్యలో పుస్తకాలు తిరగేస్తూ.
ఓ రోజు పొద్దున్నే ఎక్కడినుంచి వచ్చిందో ఏంటో ..ఓ బుజ్జి కుక్క పిల్ల వచ్చింది లోపలికి .వెల్లగోట్టాను.. కాని కొద్దిసేపటి తరవాత మళ్ళి వచ్చేసింది. ఎన్ని సార్లు వెల్లగోట్టినా మళ్ళి మళ్ళి సిద్దం అయ్యేది. ఏం చేయాలో..ఎలా వెల్లగోట్టలో తెలియలేదు. ఏదో రునానుభంధం ఉందేమో...సరేలే అని వదిలేసాం.
ఒక పగిలిపోయిన కుండ పెంకు లో అన్నం,పాలు కలిపి పొద్దు మాపు పెట్టాం. అలా పది పదిహేను రోజులు గడిచిపోయింది,
ఇంట్లో వాళ్ళం ఎవ్వరం వచ్చినా  ..చిన్ని తోక ఆడించటం.. కాళ్ళు రాసుకుంటూ ప్రేమని వ్యక్తం చేయటం..వగలు పోవటం...అన్ని చేసేది..ముచ్చటగా అనిపించింది..అదే తెలియని మొహం రాగానే పెద్ద గొంతు తో ఒకటే అరుపు.  ఇంటి ముందు సింహం లాగా కూర్చునేది వచ్చిపోయే వారిమీద అరుస్తు . ఎక్కడెక్కడో తిరిగి హుందాగా ఇది నా ఇల్లు అన్నట్టు వచ్చేది. తనకోసం వేసి తట్టు సంచిలో..ఏదో ఆలోచిస్తూ పడుకునేది.. టైం కి అన్నం వేయాల్సిందే..కొంచం అటు ఇటు అయినా కుయి కుయి మంటూ గోల.. చంటి పిల్లాడి లాగా.. తన ప్రేమ... కోపం..అయిష్టం...ఏదో రకంగా వ్యక్తం చేసేది. ఎన్ని వగలో..
బాగానే అలవాటయ్యింది..దాంతో..
ఒకరోజు దాన్నే గమనిస్తున్నాను...ఉరికే మెడ గోక్కున్తోంది మాటి మాటికి.  కుక్క అన్నాక గోక్కోదా అని పట్టించుకోలేదు....ఓ రెండు రోజులుగా అది ఎక్కువ టైం  గోక్కోవటమే చేస్తోంది ..దానికో తోడు ..కొంచం కొంచం బొచ్చు రాలి పోవటం మొదలైంది. మాకేం తెలుసు రాలిపోయి మల్లి వస్తుందో..ఏంటో...అనుకుంటున్నాం...కాని రోజు రోజుకీ దాని బాధ ఎక్కువవుతోంది.. తిండి తగ్గించి...తిండికోసం అరవటం  మానేసింది.. పదిరోజుల్లో చాల బలహీనంగా తయ్యారయ్యింది.  ఎం చేయాలో తోచలేదు.
అలవాటు లేని విషయం.. కావాలని తెచ్చుకున్నది కాదు కూడాను. చూస్తున్నాం కాని ఏమి చేయటం లేదు.
ఉన్నచోటు నుండి కదలదు...ఉరికే మొహం చూస్తుంది.... దీనంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి ..తోక  అడిచటం కుడా లేదు..పాపం శక్తి లేదేమో..

మూడురోజులైంది అన్నం ముట్టటం లేదు..జ్వరంగా ఉందేమో.. తెలిదు. ఇహ మా అన్నయకి చెప్పి బండి తీసి డాక్టర్ దగ్గరికి తెసుకేల్దాం అని ఇద్దరం రెడీ అయ్యాం.. ఒక పాత తువ్వాలు తో దాన్ని తీసుకొని బండి ఎక్కగానే..ఉంటేనా..చంగున దూకి పారిపోతోంది. అలా ఎంత ప్రయత్నించినా నావల్ల  కాలేదు దాన్ని పట్టుకోవటం.
సరే అని మేమే బయలు దేరాం డాక్టర్ దగ్గరికి.. వెళ్లి విషయం చెప్పాం.. ఏదో ఒక టోనిక్..కొబ్బరి నునే లో కలిపి పుయాటానికి ఆయింట్మెంట్  రాసిచ్చాడు. 

ఎంత ప్రయత్నించినా అది పాలు కుడా తాగటం లేదు. ఇహ టానిక్ కలిపిన పాలు అసలే తాగటం లేదు. అప్పటికి ఇహ విధి లేక దాని నోరు తెరిచి పోసాం ..మహా అంటే రెండు గుక్కలు..కాని తప్పించుకొని మూల కూర్చుంది..
ఆయింట్మెంట్  వంటినిండా పూస్తే..విదిలించింది..దుమ్ములో పోర్లాడింది. 
నీ ఖర్మ అని వదిలేసాం.
తిండి అసలే ముట్టక..ఐదు రోజులై..నిలబడే శక్తి లేక... లేచి నిలబడితే కూలి పడిపోతోంది..చంటి పిల్లాడి లాగా ఎంతో హుషారుగా ఉండేది..అయ్యో ఎలా ..ఎం చేయాలి అని అనుకున్నా కాని ఎం చేసే పరిస్థితి లేదు.

ఆ రోజు మధ్యానం రెండు  అయ్యిందనుకుంటా.. కుక్కపిల్ల పరిస్థితి ఏంటా  అని బయటికి వచ్చా.. నన్ను ఒక దీనాతి  దీనమైన చూపు చూసింది..అతి బలహీనంగా తోక ఆడించి.. నిలబడింది..నావైపు ఒక అడుగు వేసింది.. కూలబడింది...
అంతే...ఆ జీవి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి...

అమ్మా అని గట్టిగా కేకేసా.. కదిపి చూసాం.. కాని లేవలేదు. తోక అడిస్తుందేమో అని ఆశపడాను... దాన్ని చూస్తూ  సాయంత్రం ఏడింటి వరకు గడిపా.. కాని చలనం లేదు. ఏదో జడపదార్థం లా అయిపొయింది..

ఒక సంచిలోకి దాన్ని వేసుకొని..మాఇంటి వెనకాల ఉన్నా రైల్వే ట్రాక్ అవతల ఉన్న దట్టమైన చెట్లు వైపు బయలుదేరాను. అక్కడ దట్టంగా పెరిగిన ఒక పొద చూసి పొదల్లోకి విసిరేసాను సంచీ ని.. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసా..
ఇంటికి రాగానే బాత్రూం లో కూర్చుంటే..మా అమ్మ రెండు బిందెల నీళ్ళు గుమ్మరించింది నా మీద. ఏ ఋణానుభంధమో అంటూ.

ఏ భందమో..ఏ స్నేహమో.. ఏ భందుత్వమో.. ఎక్కడినుంచి వచ్చిందో... ఇరవై రోజులు..ఒక చిన్ని బంధం  పెనవేసింది....కాని అంతలోనే...కళ్ళముందే ...ఇలా జరిగింది. అంతే జీవితం...అంతే బంధం.

అన్నింటికంటే నన్ను బాధించింది, నామీద నాకే  సిగ్గుగా అనిపించింది  ఒకే ఒక్క విషయం..
విసిరేసాను.. నిర్దాక్షిణ్యంగా విసిరేసాను సంచినీ.. కనీసం  సంచీని పదిలంగా పొదల్లో పెట్టొచ్చు..లేదా గుంతలో  పూడ్చి పెట్టేయవచ్చు. కాని చేయలేదు..విసిరేసాను..
ఎందుకంటే .. దాని మొహాన్ని మళ్ళి చూసే దైర్యం లేదు నాకు..ప్రేమ  లేదు నాకు ..గుండెని రాయిని చేసాను..చేసుకోగల సమర్థుడిని. ఎందుకంటే.......నేను మనిషిని.

కన్నీళ్లు ధారకడుతున్నాయి..

Jun 18, 2011

నవ యవ్వనం...



నిన్న సాయంత్రం .. సర్వీసింగ్ కి ఇచ్చిన బైక్ తెచ్చుకుందామని నారాయణ గూడా వెళ్ళాను. సెలవులు ముగిసి కాలేజీ లు మళ్ళి మొదలయ్యాయిగా.. బస్సు స్టాప్ లో ఫుల్లు గా అమ్మాయిలూ అబ్బాయిలు.. నవయవ్వనులు..గుంపులు గుంపులుగా..

ఏది fashion నో  ఏది కాదో.. ఏది తమంకి నప్పుతుందో ...ఏది నప్పదో..        ఏ రంగులు  తమకి సూట్ అవుతాయో..ఏవి కావో...తెలుసో లేదో కాని ఒక్కోరు  ఒక్కోరకంగా..
ఒకడేమో వచ్చిరాని మీసాలని నున్నగా గోరిగేసాడు.. ఇంకోడు ఫ్రెంచ్ గా మార్చేశాడు.. మరొకడు Goate పెట్టాడు,  ఒకడు జులపాల జుట్టు తో..ఇంకోడు ఆల్మోస్ట్ గుండు తో.  కత్తి యుద్ద కాంతారావులా  కాళ్ళకి చుట్టుకుపోయిన పాంట్లు, పొట్టి చేతుల T shirts ..ముదుకు పొడుచుకొచ్చినట్లు కనబడే రంగు రంగుల కాన్వాస్ shoe ,  పాపం కొంత మంది మాత్రం మధ్యతరగతిని ప్రతిబింబిస్తూ ఇవేవి లేకుండా.. 'సింపుల్.' .గా  ఉన్నారు. కాని అందరి attitude లో   ఏదో తెలియని నిర్లక్షం కనపడుతోంది.. ఎవరు ఎలా ఉన్నా అందరి చూపులు మాత్రం అమ్మాయిల వైపే...

ఇహ అమ్మయిలేమో..పాత బడ్డ  fashion  చుడీ దార్ లలో..కొంతమంది షేపులు  కనపడే లేగ్గింగ్స్ తో కొందరు ఇందాక చెప్పిన జీన్స్ ,అప్పుడే వికసిస్తున్న అందాలు కనపడేట్టు T షర్టు... జుట్టు విప్పేసి ఓ పిల్ల..గుర్రం తోకలా ఉన్న జుట్టుతో ఇంకో అమ్మాయి.,, బాబ్డ్ హెయిర్ కట్ తో మరో అమ్మాయి.. .నడుం దాకా రావాల్సిన జడ మెడ దగ్గరే ఆగిపోయిందో పిల్లకి...;)
వీళ్ళకీ మనసంతా అబ్బాయిల వైపే ఉన్నా...అదేమీ లేనట్లు నటిస్తున్నారు..కాని అప్పుడప్పుడు దొంగ చూపులు చూస్తున్నారు..స్నేహితురాళ్ళతో   గుసగుసలలో నవ్వుతున్నారు. కొందరు మౌనంగా దిక్కులు చూస్తున్నారు..ఇంకొందరేమో.. 'అబ్బ ఛీ'  అన్నట్టు  మొహం పెట్టారు. 

మొత్తం మీద  బోయ్స్ n గాళ్స్ మనస్సులో ఒకే భావం...ఒకే తపన.ఒకే ఆరాటం..ఏకే ఉబలాటం..ఏదో శక్తి..ఏదో ఆసక్తి,,,ఏదో ఆశ,,ఏదో నమ్మకం.. ఏదో...ఏదో..ఏదో..  అదే  యవ్వనం తాలూకు  చిన్హం.

Jun 9, 2011

దేశ భక్తి


కాలేజీ కి వెళ్తూ ఓ  x రోడ్డు సిగ్నల్ దగ్గర ఆగాను. ఓ ఏడు ఎనమిది మంది బిచ్చగాళ్ళు (పిల్లలు)..వొంటిమీద చొక్కా సరిగ్గా లేక.. వాహనాలని చుట్టు ముట్టారు. కొంత దూరం లో ఓ మహాతల్లి కొంగు పట్టుకొని 5 ఏళ్ళు, 3 ఏళ్ళ పిల్లలతో పాటు చంకన ఓ చంటిది గుబులుగా చూస్తోంది. 
దాదాపు భారత దేశం లో ఏ మూల చూసినా ఇదే దర్శనం ఇస్తుంది.
ఎన్ని NGO organizations  ఉన్నా ఇంకా స్లమ్స్ వెలుస్తూనే ఉన్నాయి. 

ప్రభుత్వం జనాభా గురించి మరిచి పోయినట్టు ఉంది. అసలు వీళ్ళందరికీ  ఉచిత కాండోమ్స్  .. ఉచిత తుబెక్టామి, vasectomy   ఆపరేషనులు   తప్పని సరిగా చేయక పోతే భారత దేశ దరిద్రం ఎన్నటికీ పోదు. 

 పేదవాడికి పిల్లలు ఉండకూడదు అని కాదు. అందరికీ ఉండాలి. కాని కటిక దరిద్రులకు సంతానం ఎక్కువ ఉంటె..వాళ్ళు దరిద్రులు గా మారుతారు.  
అప్పట్లో కుటుంబనియంత్రణ అంటే తెలియక, ఆపద్దతులు తెలియక.. భయపడో లేక అంత చదువు లేకో ఎక్కువ సంతానాన్ని కని ఉండవచ్చు.ప్రస్తుతకాలంలో మాత్రం  వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవ్వరైనా  భారత  దేశ పౌరుడిగా  కుటుంబనియంత్రణ పాటించాల్సిందే. ఇది ఒక రకంగా దేశ పౌరుడిగా మన భాద్యత . ఆ బాధ్యతా  నిర్వర్తించి మన
  దేశ భక్తి
ని చాటుదాం. ఒక్కరికంటే ఎక్కువ సంతానం అవసరమా
అని  పదే పదే  ఓ వంద సార్లు  ఆలోచించుకోవాలి.  మూడో  సంతానం అసలే కూడదు.


కనీసం  ఇప్పటినుండి ప్రభుత్వం  ఒక జంటకి ఒక్కరి కంటే సంతానం ఉండాలి అని rule పెడితే బావుంటుందేమో!

Jun 8, 2011

ఇదే జీవితం..


అంతా కళ్ళెదుటే..కాని ఏది దొరకదు..
అన్ని అందుబాటులోనే..కానీ ఏదీ అందుకోలేము..
అన్నీ తెలిసినట్టే ఉంటాయి..కాని ఎందుకో అనుమానం..
అమ్మాయి చిరునవ్వుతో మాట్లాడుతుంది..కాని ప్రేమిస్తోందో లేదో.. ??

 తను  పక్కనే ఉన్నట్టు ఉంటుంది.కాని మధ్యన ఓ అగాధం.. 
నవ్వుతూనే ఉంటాం..కాని లోపలి బాధ మనకి తెలుస్తూనే ఉంటుంది.

దేవుడున్నట్టే అనిపిస్తూంది..కాని కనిపించడు ..కనిపించినట్టు అనిపించదు..
కోరిక మొలకెత్తుతుంది..పెరుగుతుంది..పెద్దవ్తుతుంది..చివరకు ఎండిపోతుంది..కాని తీరదు.
కలలు వస్తుంటాయి..పోతుంటాయి..కాని నిజం కావు..
గుండెనిండా సంతోషం పొంగిన
ట్టే అనిపిస్తూంది..కాని ఆది ఎండమావిగా మిగిలిపోతుంది..
ఉదయం ,,మధ్యాన్నం..సాయంత్రం గడిచిపోతుంటుంది..రోజులో  పెద్ద మార్పు ఏమి ఉండదు..

జీవితం చాలా చిన్నదే..కాని రోజు గడవక  ఎంతో పెద్దదైపోతుంది .
అందరూ పక్కనే ఉంటారు...మన చావుని ఎవ్వరూ ఆపలేరు..

Jun 7, 2011

ఎందుకో నచ్చింది.

Athadu_(Malayalam_Movie)_300
                                                      ఎందుకో నచ్చింది. పాటలో..మాటలో.. నటనో..స్టైల్ లో .. సినిమాటోగ్రఫీ నో.. నేపథ్య సంగీతమో.. హీరో హీరోయిన్ ల మధ్య రొమాన్సో.. అన్ని కలిపో..విడివిడిగానో.. తెలిదు.. కాని నచ్చింది.    థింక్ పాజిటివ్ అన్నారు పెద్దలు అందుకే ఎంత సేపు తెలుగు సినిమాని తిట్టకుండా ‘నచ్చిన సినిమా’ గురించి చెప్పాలి అని అనిపించి ఈ వ్యాసం.   http://navatarangam.com/2011/06/13100atadu/

Jun 6, 2011

నక్కతోక ..


చిన్నపుడే తలిదండ్రులను పొగొట్టుకున్న నరేష్ బామ్మ దగ్గర పెరిగాడు.. గారాబం ఎక్కువై చదువు అంతంత  మాత్రమె  అబ్బింది. రాసిపెట్టి ఉంటె,  అదృష్టం తన కొంప తలుపులు పగలగోట్టుకొని మరీ  వొస్తుందని నమ్మె నరేష్, ఏ  పనీ పాట లేక బేవార్స్ అయిపోయాడు. తెలివి తేటల పాళ్ళు కొంచం 'ఎక్కువే.' అందుకే
ఎందుకయినా మంచిదని.. అన్ని తెలుపులు బార్ల తెరిచి పెడతాడు..ఏ తలుపు నుండి అదృష్టం వొస్తుందో  అని ..మూసి ఉంచి పగలగోట్టుకోడం ఎందుకని..


టి. వి లొ బిజినెస్ మాన్  కోటీశ్వరరావు ఇంటర్వూ వస్తోది. సాదువులు రుద్రాక్షలు  దిగెసినట్టుగా బంగారు గొలుసులు దిగెసుకున్న కోటేశ్వరరావు,  తను ఎంత బీదరికం నుండి కోట్లకు త్రాచుపాములా పడగలెత్తింది,
మంచి బీరు  తాగినట్లు గా చెప్పుకుపోతున్నాడు ( ఎంతమందిని కాటెసింది మాత్రం చెప్పలేదు )


అవునేవ్ బామ్మా.. ఈ కోటిగాడి కి అంత డబ్బు ఎలా వచ్చిందంటావ్ ?
అప్పుడే వచ్చి  ఆ బంగారు గొలుసులని  తదేకంత చూస్తూ అడిగాడు నరేష్ ..
'నక్కతోక' తొక్కితే  అంతేరా.. పట్టిందల్లా బంగారమె అవుతుంది.. అంది, కళ్ళూ , చెవులు అంతంత మాత్రంమే పని చేసె బామ్మ.
అవునేవ్   ..వీడు.. రుద్రాక్షమాల పట్టినట్టున్నాడు, అయినా అసలు రహస్యం ఇపుడా చెప్పేది గొణిగాడు
ఎమన్నావ్ రా ? అంది బామ్మ..
ఎం లేదె..  అని లోలోపల తెగ సంబరపడిపోయాడు.  ....ఇప్పుడే వస్తా అని లేచాడు.
ఏంటొ తలతిక్క సన్యాసి అని...బామ్మ తన పనిలొ తానుండిపొయింది.


 తన గ్యాంగ్ కి ఫోన్ ఛేసాడు.విషయం తెలుసుకున్న సీనుగాడు , పండుగాడు  కుడా   తెగ ఆనందపడిపొయారు..
నక్క విషయం బయటికి పొక్క నీయకూడదని ఒకరికొకరు తెలుగు సినిమా రేంజ్ లొ మాటిచ్చుకున్నారు.
మామా.. ఇక చూస్కొ... అని నక్క వేట మొదలెట్టారు ఇద్దరూ . చివరికి ఓ రెండురోజుల తరవాత సీనుగాడు  ఒక న్యూస్ పేపర్ కటింగ్ తెచ్చాడు.
" అన్ని రకాల జంతువులు అద్దెకు లభించును.  సంప్రదించవలసిన చిరునామా. _________.
ఆది చూసి..మిగతా ఇద్దరూ కెవ్వు..


    సర్ నా పేరు  జానిబాబు..  animal trainer ని .  ఎన్నో సినిమాలకి నా animals  పని చేసాయి. 
అదుగో ఆ ఏనుగు రాజెంద్రుడు.. గజెంద్రుడు సినిమాలొది... ఈ గుర్రమ్.... లేటెస్టె గా మగధీరలొ రామ్ చరణ్  తొ నటించింది.
 అదుగదుగొ.. పాము.. నొము లొ పాముకి  ముని మనవడు. చెప్పండీ సర్ మీకు  ఎం కావాలొ ?


"మాకు నక్క కావాలి.. " .అన్నాడు నరెశ్.
ఆ మాట వినగానే.. జానిబాబు    గిరుక్కున తల తిప్పి  చూసి బాబూ... " ఎనుగు,, గుర్రాలు.. కుక్కలు కొతి,సింహం, పులి, పాములు..వీటినే ఇన్నాళ్ళు సినిమాల్లొ వాడారు.కనన ఇవే నాదగ్గర ఉన్నాయి.
కాని ఇంతవరకు నక్క తో ఒక్క సినిమా కూడా రాలేదు.నక్క కావాలని అడిగిన వాళ్ళలొ మీరె ఫస్ట్...ఇంతకీ మీకు దేనికోసం నక్క.. ?? సినిమానా ??  సీరియల్ నా  ??
అది.. అదీ   "తో..క " .  ఎక్కువైన ఆనందం కక్కబొయిన సీను గాని నొరు నొక్కెసాడు..నరేష్
"అదే నక్కతో ఎవరు సినిమా తీయలెదు కదా అందుకె మేం తీయాలని" .. సర్దిచెప్పాడు పండు.
"మీకు నక్క దొరకడం కష్టం... కుక్కను పెట్టుకొని సినిమా తీయండి."
ఈ మధ్య కాలంలో హిట్ సినిమా ఒక్కటి లేదు.. కుక్కతో తీసిన మీ సినిమా హిట్ కావొచ్చు..
"కుక్కతొ ఎవడైనా తీస్తాడు. నక్కతో తీయడమే గొప్ప". అన్నాడు నరెశ్..
నక్క దొరకదు సార్.. దొరికినా అది యాక్షన్ చేయటం చాల కష్టం. చాల ట్రైనింగ్ కావలి.
"డైరక్టర్ నేనా., నువ్వా,,, దాంతొ ఎలా చేయించుకొవాలొ మాకు బాగ తెలుసు." కొంచం అసహనంగా  అన్నాడు..
కొంచం తెలివి ఉపయోగించిన పండూ..."కనీసం ఒక్క సారయినా నక్కనీ దాని తొకని చూస్తే" .. సినిమా కుక్కతొనా నక్కతోనా అనేది తెల్చుకుంటాం. అన్నాడు.
సరే  అయితె.. మీకు ఎలాగయినా నక్కని అరెంజ్ చెస్తాను.. అని మొబైల్ తీసాడు జానిబాబు.
నరెశ్ గాంగ్..ఉహల్లొ తెలిపొయింది. నక్క తొక తొక్కగానె.. ధనవంతులైపొయినట్లు  కలగన్నారు.


 'జూ' లొ పని చెసె తన ఫ్రెండ్ తొ పావుగంట మాట్లాడాడు.  ఆ తరవాత వెల్ల వైపు తిరిగాడు ఈ లోపు వీళ్ళు కూడా కళ్ళల్లోంచి బయటికి వచ్చారు.  సరే మీకోసం పది నిముషాలు  అరేంజ్ చేస్తా,. కాని మీరెం చెయబోతున్నారొ నాకు తెలియాలి.
ఇక చెప్పక తప్పదు అని ఏమ్ లేదు.. తోక  తొక్కుదామని " అన్నాడు శీను గాడు.
ఎంటి తోక తొక్కుతారా?? ఎందుకు బాబు ?
ఎం లేదు ..సరదాగా.. చెప్పాడు నరేష్.. ఎక్కడ వీడు తమ రహస్యం తెలుసుకున్తాడో అని..
సరదాగా నక్క తొక తొక్కాలని ఉందా...మీ ఇద్దరూ సరే .. మరి ఇతను అని పండూ ని చుపింఛాడు. పండు అంటే ఆపిల్ ..ఆరెంజ్ కాదు..పనస పండు..గుమ్మడి పండు లాంటి పండుగాడిని చూపిస్తూ.
నేను అందరి కంటే ఫస్ట్ తొక్కుతా.. ఉత్సాహం ఆపుకొలెక అన్నాడు పండూ.
నీ బరువెంత నాయనా??
జస్ట్ 95 kg .
బాబూ  ..నీ తొక్కుడికి నక్క చచ్చి ఉరుకుంటుంది.. నేను  జైల్ లొ చిప్ప కూడు తినాలి.. నావల్ల కాదు నక్కని అరెంజ్ చేయటం.
అవును రా పండూ.. నీవు  తొక్కాక నక్క చచ్చిన్దనుకో . తరవాత మేం  తొక్కలెం ,,
కనక..నీవ్ లాస్ట్ తొక్కు .. అను శీను గాడు తన అనుమానపు ఆలోచనని వేల్లబోసాడు.
అలా అనకు బాబు..ఎలగయినా నక్క ని అరెంజ్ చెసావంటె నీ ఋనం ఉంచుకోం..అన్నాడు నరేష్ జాని బాబూ ని బ్రతిమాలుతున్నట్టు గడ్డం పట్టుకొని ..
జానీ బాబు  కొద్ది సేపు  ..తీవ్రంగా అలోచించి..
'సరే ..మీ కోసం  చేస్తా.. నక్కని ఇక్కడికె తెప్పిస్థా. కెవలం మీరు సుతారంగా..తొక తాకాలి.. అలాగయితేనే   .. ఏర్పాటు చేస్తా కాని  10,000 /- కర్చవుతుంది..
ముగ్గురు ఒకరి మొకాలొకరు చుసుకొని.. సరే  అన్నారు.
మొత్తం డబ్బు ముందే  తీసుకొని వారం తరవాత రమ్మని చెప్పాడు..


వారం తరవాత 


 బొనులొ నక్క పడుకొని ఉంది
తోక  మాత్రమ్ బయటపెట్టి  ఉంది.
ముగ్గురు వచ్చారు ..నరెశ్ కి చిన్న అనుమానం వచ్చింది  , 'ఇది నక్క అని గ్యారంటీ ఎంటీ..? '
తొక తొక్కి చుడూ నాయనా మీకె తెలుస్తుంది. అన్నాడు జాని బాబు.. ఈ ప్రశ్న వేస్తారని తెలిసే..
నరేష్ దేవుడికి  దండం పెట్టకొని.. సుతారంగా.. తొక మీద కాలెశాడు.  ఊ............ నక్క ఊళ వినపడింది.
హహహ..ఇది నక్కే ... నా దశ తిరగింది.. అని ఆనందంతో  అరిచాడు. జాని బాబుకి ఏమి అర్థం కాలేదు, కాని ఆనందంగా ఉంది,
ఆతర్వాత శీను గాడు, ఆ తరవాత పండుగాడు  ఇద్దరూ  తోక తొక్కి.. .. అదృష్టం తమకు ఏవైపు నుండి పట్టనుందో అని వెర్రి కేకలు వేసారు ఆనందం తో..

Jun 5, 2011

స్వేచ్చా సాగరం


స్వేచ్చాసాగరం లోకి  .......
దూకి అనుభవించే దైర్యం లేక...కొందరు
ఈతకొట్టే శక్తి లేక.. కొందరు
దూకినా మునుగుతామేమో అన్న భయంతో..కొందరు
తననెవరో చూస్తారన్న సిగ్గుతో...కొందరు
అపవిత్రం అయిపోతామన్న భావనతో.. కొందరు
దేవుడికి కోపం వస్తుందేమో అన్న అనుమానం తో..కొందరు
దూకే వాడిని ఆపుతూ.. కొందరు
దూకిన వాడిని భయపెడుతూ.. కొందరు
అక్కడెక్కడో ఇంకో స్వర్గంకోసం దారులు వెతుకుతూ..కొందరు
అనుభవించాలన్న ఆశని అణిచి పెట్టి ..కొందరు 

అనుభవం లేకుండానే అనుభూతి చెందుతారు.
మాటల్లోనే చేతలు ఫీల్ అవుతారు.

Jun 1, 2011

జనాలని entertain చెయ్యటం అంటే...


రాత్రి  ఇంటికి వెళ్ళాక  ఇంట్లో ఏమి తోచటం లేదు. చాల  రోజులైంది కదా అని  FM   పెట్టుకున్నా.. ఏ చానల్ తిప్పినా అంకర్ల గోల.. అబ్బబ్బా భరించలేం. రాత్రి పదకొండు గంటలు దాటినా మన అంకర్  గొంతులో మాత్రం ఫుల్ energy.. ఎంత అంటే..ఏం మాట్లడుతున్నోరో తెలినంత..సరే ఎప్పుడో రికార్డు చేసింది లైవ్ కాదని అనుకుందాం. కాని ఆ మాట్లదేదేదో స్పష్టంగా కొంచం నిదానంగా మాట్లాడొచ్చు కదా..ఎంత అంకర్ అయితే మాత్రం కనీసం మాట్లాడింది వినేవాడికి  అర్థం కావాలిగా.. అర్థం అయ్యే time ఇవ్వాలి కదా..సరే ఈ సంగతి వదిలేస్తే..


ఎంత ఫాస్ట్ మాట్లాడుతున్నమనే ధ్యాసలో...మాటలు తడబడుతూ..u know..u know అని ఇంగ్లీష్ add చేస్తూ...అసలు విషయం మరిచి పోతారు.. సరే ఇదే ప్రస్తుత స్టైల్ అఫ్ ఆకరింగ్  అనుకొని  వదిలేద్దాం..
మంచి పాటలు ప్లే చేస్తునపుడు కొంచం పాట గురించో..లేక situation గురించో, పాజిటివ్ గా చెప్పొచ్చు కదా.. అంతా తెలివి ఉందా..అని.
ఆగడి ఆగండి విషయం చెప్పకుండా తిడుతున్నా అనుకుంటున్నారా..
చెపుతున్నా..
"చక్కనైన ఓ చిరుగాలి..ఒక్క మాట వినిపోవాలి.. ఉషా దూరమైన నేను ..ఉపిరైన తీయలేను." పాట వేసాడు.. ఆహా .. అనుకుంటుండగా.. పాట ఆపి  మొదలెట్టాడు.." బాబు.. ఇది ముందే హైదరాబాదు..pollution  పెరిగిపోయింది.. నీవు  ఏదైనా పల్లెటూరు  వెళ్లి పాడుకోమ్మా.. ఈ pollution పెరిగిపోయి మాకే  ఉపిరి తీయటం కష్టం అవుతోంది....అంటూ ఏదో వాగాడు..
వేసిన పాట ఏంటి ? దాని situation   ఏంటి..నీ program  ఏంటి.?  నీ మాటలేంటి? టైం ఎంత అయింది ?
ఎమన్నా అర్థం ఉందా ??
అంతా చక్కని పాట మొదలెట్టి...ఆపేసి..pollution  ఉంది పల్లెటూరు  వెళ్లి  పాడుకో పో అంటాడా??
జనాలని entertain   చెయ్యటం అంటే వెటకారం కాదురా బాబు..ఫీల్ తెప్పించటం..నిదానంగా..స్పష్టంగా మాట్లాడుతూ, చెప్పే విషయాలని చాకచక్యంగా మెలికలు వేస్తూ.. ప్రసేంట్ చేయటం.. అంతే కాని గొప్ప పాటలని వేస్తూ.. సంబంధం లేకుండా మాట్లాడుతూ 'పాట' ని  insult చేస్తూ వెటకారంగా మాట్లాడటం కాదు నాయనా.. కొంచం ఆలోచించుకొని ఆంకరింగ్  చెయ్యండి.అభిమానులు ఉన్నారు కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతే..దూరమైపోతారు,  తరవాత  మీ ఇష్టం.