Mar 19, 2012

A memorable moment . :))

చిన్నప్పటి నుంచి పరమ బేవార్సు గా తిరిగే నాకు సాహిత్యమూ అదీ పెద్దగా పరిచయం లేదు. కాని డిగ్రీలో ఉండగా చలం పుస్తకాలు పరిచయం అయ్యాయి. అవి నన్ను ఓ ఊపు ఊపెసాయి. చలం చదివన తరవాత ఇంక వేరే ఏదీ చదవాలనిపించలేదు. అందుకే పెద్దగా పట్టించుకోలేదు. ఇహ ఈ మధ్య ఒకటో అరో వేరే పుస్తకాలు చదువుతున్నాను. మాటల్లో చిన్నప్పుడెప్పుడో విన్నాను ఆ పేరు. అందుకే మొన్నా వెళ్ళినపుడు ఓ రెండు మూడు పుస్తకాలు తెచ్చాను. చాలా బాగా నచ్చాయి.
అయితే ఈ రోజు ఎడారివర్షం DVD లాంచ్ ప్రసాద్ preview theater లో జరిగింది. స్క్రీనింగ్ ఐపోయాక స్నాక్స్ కి బయటికి వచ్చాం. ఎడారి వర్షం DVD లు, 'సినిమాలు మనవీ - వాళ్ళవీ" పుస్తాకాలు అమ్మకానికి పెట్టాం.
ఒకావిడ వచ్చింది, 'సినిమాలు మనవీ - వాళ్ళవీ" పుస్తకాన్ని చూసికొనుక్కుంది. అర్రే మొన్న ఈవిడ పుస్తకమే కదా నేను చదివి బాగా ఇష్టపడింది అని ఆమెని అలాగే చూస్తూ ..మీరు 'ఓల్గా' గారు కదా అన్నాను. అవును అని చిరునవ్వు నవ్వింది. మీ పేరేమిటి అడిగింది, చెప్పాను.
మీ పుస్తాకాలు బాగా నచ్చాయి చదివి పేస్ బుక్కులో SYNOPSIS పెడుతుంటాను అన్నాను. అవునా అనీ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది.
 Its a memorable Moment. :))

Mar 16, 2012

కేరళ ప్రయాణం - 4


ప్రేమ్ గారిచ్చిన ఆహార పొట్లాలు
తింటూ..హైయిగా పాలక్కాడ్ చేరుకున్నాం.
సరాసరి 'జోబీ మాల్' వేన్యు కి వెళ్ళిపోయి ఎడారివర్షం స్క్రీనింగ్ ఎప్పుడు ఏమిటి అనేది కనుక్కున్నాం. జయ్ అనే కుర్రాడు మమల్ని receive చేసుకుని నడిచి వెళ్ళేంత దూరంలో ఉన్న ఒక హోటల్ చూపించాడు.పాలక్కాడ్ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చల్లగా స్నానం చేసేసరికి హాయిగా అనిపించింది.
ఒక్క పదినిముషాలు రిలాక్ష్ అయ్యాక మళ్ళీ
జోబీ మాల్ చేరుకున్నాం.
రిసెప్షన్ దగ్గర ఇద్దరమ్మాయిలు ఉన్నారు. వచ్చిన గెస్ట్ లకి id కార్డ్స్ తయారుచేసి ఇస్తున్నారు. మొహంలో కేరళ కళ ఉట్టి పడుతోంది.
ఒకమ్మాయి సన్నగా ఉంది, గంధం రంగు చీర కట్టింది, సంప్రదాయంతో ఆకట్టు కొంటోంది. ఇహ రెండో అమ్మాయి దీనికి విరుద్దంగా ప్యాంటు,టీ షర్టు వేసింది. జుట్ట్టు విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే విధంగా .. ఆ మాటకొస్తే కేరళలో అమ్మాయిల జుట్టు బావుంటుంది. ఒత్తుగా నల్లగా. కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.చీరకట్టిన పిల్ల నన్ను పట్టించుకోలేదు కాని...ఈ రెండో పిల్ల మాత్రం నన్ను చూసింది. ఓ మత్తు నన్ను గమ్మత్తుగా పలకరించింది.
ఏం చూపది..వెంటాడే చూపు. వేటాడే చూపు ..ఓ ఆడపిల్ల చూపు. కళ్ళలోకి సూటిగా చూస్తే నా గుండెలోతుల్లోకి తాకింది.నేను
చూపు తిప్పుకోవలసి వచ్చింది తప్ప ఆపిల్ల ఆలా చూస్తోంది పట్టి పట్టి. దొరికితే కళ్ళు కలిపెస్తోంది.
చూద్దాం ఎంతసేపో ఇది అనుకున్నా..ఈ  లోపు మా ID కార్డ్లు రెడీ అయ్యాయి. తీసుకొని హాల్లోకి వెళ్లాం సినిమా చుట్టానికి.
ఓ రెండు సినిమాలు చూసాక ఆకలేసింది .. బయటికివెల్లి భోజనం చేసి వచ్చాము. మళ్ళీ సినిమాలు.. అలా సాయంత్రం ఎదిన్తివరకు చూసి రూం కి చేరుకున్నాం. కొద్ది సేపు రెస్ట్ తీసుకున్నాక చల్లగా ఏదయినా తాగితే బావుండు అనిపించింది. ఆలోచన రావటమే ఆలస్యం..... `వెళ్ళిపోయాం.:)

తెల్లారి పది గంటల కల్లా తయ్యారయ్యి వెళ్ళాము. నన్ను చూసిన పిల్ల చుడీదార్ లో దర్శనం ఇచ్చింది. నన్ను పెద్దగా పట్టించుకోలేదు. విచిత్రం కాకపోతే నిన్న అంత ఇదిగా చుసియన్ పిల్ల ఈ రోజు పట్టించుకోవటం లేదు. ఆడవాళ్లు అంతే.. తమకేం కావాలో తెలిదు. పెద్ద confused minds.
ఇది  నాకు చాల మామూలే కనక  ఏమీ అనిపించలేదు. లంచ్ కి ముందు రెండు సినిమాలు తరవాత రెండు సినిమాలు.. సాయంత్రం చల్లదనం.. అంతే. అలా మూడురోజులు గడిచింది.
నాలుగో రోజు మొదటి షార్ట్ ఫిలిం చూసాక.. పాలక్కాడ్ కోటకి వెళ్లాం. చుట్టూ కందకం. ఎత్తయిన బురుజులు .. విశాలంగా ఉంది . కోట గోడలు మాత్రం ఎత్తుగా రాతి కట్టడం .ప్రధాన ద్వారం  పదిహేను అడుగుల ఎత్తు పన్నెండడుగుల వెడల్పుతో బలిష్టంగా ఉంది. దాటుకొని లోపలి వెళితే  లోపల కోట మాత్రం  కోట లా లేదు . ఓ పెద్ద ఇల్లు,  కేరళ స్టైల్ లో ఉంది.
కోటగోడకి అనుకొని రెండు ఫోటోలు తీసుకున్నాక  .. ఇహ నా వల్ల కాదు మీరెళ్ళి చూసి రండి అని ఓ చెట్టు కింద సెటిల్ అయ్యి  పేస్ బుక్కు ఓపెన్ చేసాడు మహేష్.  నేను, మోహన్ అలా చుట్టూ తిరిగి వచ్చేసాం. అక్కడి నుండి సరాసరి డ్యాం కి వెళ్ళాము. అక్కడ చూడటానికి ఏమీ కొత్తగా అనిపించలేదు. జనాలు, వాళ్ళ బాష తప్ప.
మళ్ళీ వెనక్కి hyderabad  ప్రయాణం. మూడున్నరకి ట్రైన్. మూడింటికి స్టేషన్ చేరుకొని గొప్ప జ్ఞాపకాలేమి సంపాదించుకోకుండానే వెనుదిరిగాను.
మా ఎదురగా ఒక ప్రేమ జంట..తినిపించు కుంటున్నారు. . తిట్టుకుంటున్నారు,..కొట్టుకుంటున్నారు... కొరుక్కుంటున్నారు. మైదానం రాజేశ్వరి ..అమీర్ జంట గుర్తొచ్చారు నాకు . వాళ్ళని చూస్తూ సమయం గడిచింది. తొమ్మిదింటికి వెళ్ళు దిగిపోయారు. ఏదో పనిమీద మోహన్ తిరపతిలో దిగుతాను అన్నాడు. మహేష్ కూడా ఇంటికి వెళ్లి వస్తా నేను అక్కడే దిగుతా అన్నాడు.ఏదో ఆలోచనల్లో తిరపతి రానే వచ్చింది. ఇద్దరు దిగిపోయారు. వాళ్ళని సాగనంపి నేను పై బెర్త్ ఎక్కి కళ్ళు మూసుకున్నాను. ఇంతలో ఓ రెండు జంటలు ఎక్కారు.
బెర్తులు conform కానట్టుంది . ఆందోళనగా ఉన్నారు. ఈ రెండు బెర్తులు మీరు తీసుకోవచ్చు. హైదరాబాద్ దాక రావలసిన మా ఇద్దరు మిత్రులు అవసరమై   ఇక్కడ దిగిపోయారు. అని చెప్పగానే థాంక్ యు సర్.. థాంక్ యు అని టెన్షన్ release అయ్యి ఆనందగా ఫీల్ అయ్యారు. వాళ్ళు. ఇంకో జంటకి వేరే చోట దొరికింది.

అందరూ నిద్ర పోతున్నారు. చీకటిని చీల్చుకుంటూ రైలు పరిగెత్తుతోంది , పెద్ద శబ్దంతో. కళ్ళు మూసుకుంటే రైలు శబ్దం ..తెరిస్తే చూపు రైలు పైకప్పు.
నా చూపు పైకప్పుకి  తాకి వెనక్కి వస్తోంది. అక్కడ చూడటానికి ఏమీ లేకపోవటం తో  తలనెప్పి అనిపిస్తోంది.   ఏదో చిన్న పెట్టెలో బంధించినట్టు అనిపించింది. ఏదో అన్ఈజీ నెస్ . పోనీ ఆలోచనల్లో మరిచిపోదాం అంటే ఒక్క విషయం కూడా తట్టటం లేదు. లేచి కూర్చునే వీలు లేదు. పడుకుంటే నిద్రా రావటం లేదు. ఆ పరిస్థితి నాకు నరకంగా తోచింది.చావంటే అదే నేమో. శరీరాన్ని కదిలించలేక .. కళ్ళు తెరవలేక...ఉపిరి తీసుకోక అచేతనంగా పడిఉండటమే చావేమో.
శరీరం లోంచి బయట పడిన ఆత్మ మళ్ళీ శరీరంలోకి వెళ్ళలేక ఎంత వేదన పడుతుందో అనిపించింది.
చచ్చాక కూడా బాధ ఉంటుందని...నిజానికి బతికి ఉన్నప్పటికంటే చచ్చాకే బాదేక్కువని అనిపించింది.

ఈ   ఆలోచనల్లో ప్రయాణం తెలియటంలేదు.
మనిషి ఏదో ఒక ఆలోచనల్లో మునిగి పోవటమే సుఖం అంటే . ఆలోచనల్లేక..ఆలోచించటానికి ఏమీ లేకపోతే ఆది నరకం.
నేను చావు గురించిన ఆలోచనలో పడ్డాను. నాలుగు నాళ్లలో చచ్చి బూడిద అయిపోయే మనిషి హాయిగా అనుభవించక ఎన్ని sentiments ? .. ఎన్ని బాధలు..ఎంత వేదన ??
ఎన్ని వేషాలు ?? ఎన్ని బేషజాలు ? ఎంత నటన ? ఎంత గర్వం ? ఎంత గొప్ప ?

చావంటే..??  ప్రపంచం అంతా ఉంటుంది, మనం తప్ప. చచ్చేముందు మనకి మన జీవితం అంతా గుర్తోస్తుందేమో. స్వర్గ,నరకాలు ఉన్నాయా. వైతరణీ నది దాటాల్సిన్దేనా ?? ఛీ.. చీము నెత్తురు పారే ఎట్లో ఎలా ఈదాలి ?? ? మరీ అంత అసహ్యంగా ఎందుకుండాలి అది ??
  దేవుడు ఎంత  శాడిస్ట్ కాకపోతే మానని పుట్టించి.. మాయలో పడేసి చంపి శిక్షించి  ఏం బావుకుంటాడు ?

..................... నిద్ర పట్టేసింది.

రాలిపోయేదాన్ని.

లోకం అంతా గులాబీలు ..మల్లెలే ఉండవు.
నాలాంటి ముళ్ళ పూలు కుండా ఉంటాయి.
నా పుట్టుకకి నాకు అర్థం తెలిదు. ఏ జీవశక్తో నన్ను పుట్టించింది..
వికసింపచేసింది. అందుకే నవ్వుతున్నాను.ఆదినా తత్వం.
నీ పుట్టుకకి కారణం, అర్థం ఏంటి అంటే నాకేం తెలుసు ??
ఒక్క పూట మారితే రాలిపోయేదాన్ని.

Mar 15, 2012

మీ ఆత్మ సజీవమే..


మీ గుండెల్లో తీరని కాంక్ష రాగులుతోందంటే మీ  ఆత్మ సజీవమే..
మీ కళ్ళల్లో కలల మెరుపులు ఉన్నాయంటే  మీ  ఆత్మ సజీవమే.. ..
గాలి ని చూసి నేర్చుకోండి స్వేచ్చంటే ఏంటో ..
నీటి అలలని చూసి నేర్చుకోండి ..ప్రవహించటం ఎలాగో 
ఎదురొచ్చే ప్రతిక్షణాన్ని ఎదురెళ్ళి ఆహ్వానించు .. అది తీసుకొచ్చే అనుభూతిని ఆస్వాదించు  .. 
జీవితపు ప్రతి మలుపు కొత్తగా ..గమ్మత్తుగా అనిపిస్తోందంటే  మీ ఆత్మ సజీవమే.. 
మీ గుండెల్లో తీరని కాంక్ష రాగులుతోందంటే మీ  ఆత్మ సజీవమే..
        - జావేద్ అక్తర్ ( జిందగీ నా మిలే దుబారా ) కి తెలుగు అనువాదం.
 


 

Mar 11, 2012

కేరళ ప్రయాణం - 1


సమయం మధ్యాన్నం 12  గంటలు   .అనుకున్న టైం కి కలుసుకున్నాం  స్టేషన్ లో. మోహన్ అటు ఇటు దిక్కులు చూస్తూ  అమ్మాయిలు పెద్దగా లేరు..టైం పాస్ ఎలా అవుతుందో అన్నాడు. :).   నీ అదృష్టం అన్నాను.                           
 ట్రైన్ సరిగ్గా సమయానికే వచ్చింది.మా బెర్త్ లు చూసుకొని కూర్చుంటే.. ఇద్దరు అమ్మాయిలు ఎదురుగా కనిపించారు. మోహన్ మొహం విప్పారింది. ;). ట్రైన్ కదిలిందో లేదో.. మహేష్ ఆకలి దంచేస్తోంది నేనైతే తినేస్తున్నా అని చికెన్ బిర్యాని తీసాడు. మోహన్ కూడా జాయిన్ అయ్యాడు, నాకోసం veg బిర్యాని కూడా తెచ్చాడు.  ఆ  concerning  నాకు నచ్చింది. మనకోసం ఎవరైనా చిన్న పని చేసినా  ఎందుకో మనసుకు గొప్ప ఆనందం కలుగుతుంది. మధ్యాన్న భోజనం పూర్తయ్యాక .. రాత్రి నిద్ర  లేదు సరిగ్గా అంటూ  మహేష్ పడకేశాడు. ఎందుకు నిద్రలేదో..అతనికే తెలుసు. ;).
నేను , మోహన్  అమ్మయిలవంక ఆశగా చూసాం .కాని వాళ్ళు మలయాళీ బాషలో బిజీ గా ఉన్నారు, మమల్ని పట్టించుకునే ఉద్దేశ్యం కనపడలేదు. ఇహ లాభం లేదని  నేను 'జీవితాదర్శం' బయటకి తీశాను. చేసేది లేక మోహన్ నేను - చీకటి లో కూరుకుపోయాడు.అలా కొద్ది సేపు చదివాను పుస్తకం .. నాలుగు పేజీలు చదవగానే, 
అసలు లాలస లాంటి అమ్మాయి ఉంటుందా ఈ దేశంలో..?? అలంటి పిల్ల నాకు తగలదేం...అని లాలస గురించిన ఆలోచనలో పడ్డాను. పుస్తకం ముసేసాను. కిటికీ లోంచి చల్ల గాలి విసురుగా మొహాన కొడుతోంది ట్రైన్ వేగానికి. ఎదురుగా ఉన్నాయన నిద్రలో జోగుతున్నాడు.. మహేష్ గురక వినిపించటం లేదువిచిత్రంగా. అమ్మాయలు కిటికీల్లోంచి చూస్తూ ఏదో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు.
గుంటూరు దగ్గర పడుతోంది. రేలు వేగంగా దూసుకొని పోతోంది పంట పొలాల్లోంచి. మిరప తోటలు .. ఎర్రగా విరగకాచిన మిరప.. అప్పుడప్పుడు తెల్లగా విచ్చుకున్న పత్తి చేను . మిరపపండు తెంపి ఎండబోసారు చాలా చోట్ల.. ఎర్రగ్గా కుంకుమ రాసుల్లా అనిపిస్తున్నాయి దూరం నించి...

కేరళ ప్రయాణం - 2



 ఎర్రగా నవ్వ్తుతున్న మిరప చేలు...దూరంగా కొండలు.. పొలం కూలీలు... చల్లని గాలి అన్నీ చూస్తుంటే.. ప్రపంచం విశాలత్వం కనపడి మనసుకి హాయిగా అనిపించింది. ప్రపంచం ఇంత అందంగా ఉంది , కాని రోజువారీ జీవితంలో పడి ఆ అందాన్ని,ఆనందాన్ని అందుకోలేక పోతున్నమేమో!! అలా కిటికీ లోంచి చూస్తూ ఉంటే గతంలోకి జారిపోవటమో...భవిష్యత్తులో తెలిపోవటమో రెండింట్లో ఏదో ఒకటి జరగటం సహజం ప్రయాణాల్లో.
ట్రైన్ ఏదో పెద్ద స్టేషన్ లో ఆగింది.అప్పుడు జ్ఞాపకాలని వదిలిపెట్టి లేచాను. మోహన్ గారు కూడా పుస్తకాన్ని మూసేసి నావైపు చూసాడు. ఇద్దరం ఆ ఆమ్మయిలవైపు చూసాం. ఉహు ఏమాత్రం చలనం లేదు. ఒక్క చిన్ని చూపు కూడా మావైపు విసరటం లేదు. నాలాగే  బయటకి చూస్తూ ,..తమ తమ జ్ఞాపకాలు నేమరేసుకున్తున్నరేమో. ఇవి పడే రకాలు కాదు అని అనిపించింది. ఆశ వదిలేశా.. ;) . మహేష్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు .
నేను మోహన్ రైలు దిగాం. అటు ఇటు తిరిగితే ఓ ఫాస్ట్ ఫుడ్ ముందు జనం గుమి గుడారు, చూద్దాం అని వెళ్తే వేడి ఇడ్లి..దోష ..
వాటిని చూడగానే ఆకలేసింది. చెరో ప్లేట్ చేత్తో పట్టుకొని ఆవురావురు మంటూ లాగించాం . ఓ దోస పార్సిల్ కట్టించండి నేను మంచినీళ్ళ బాటిల్  తెస్తా అని వెళ్ళాను. 

ట్రైన్ మెల్లిగా కదిలింది.  లోపలి వెళ్ళగానే మహేష్ నిద్రలేచి పైబెర్త్ నుంచి కిందికి దిగాడు. "జీవితంలూ అన్నీ కోల్పోయిన వాళ్ళు దురదృష్టవంతులు.. ఏం కోల్పోయామో తెలుసుకోలేనివాళ్ళు శాపగ్రస్తులు " అని ఎడారి వర్షం కోసం రాసాడు, కాని ఈయన మాత్రం అదృష్ట వంతుడు. లేకపోతే ఏంటది.. నిద్రలేవగానే 'దోస' రెడీ కదా..!!

 
దిక్కులు చూస్తూ మాటల్లో పడ్డాం.  సూర్యాస్తమయం అవుతోంది. నేను అమ్మాయిల వైపు కిటికీ చూసాను. ఆకాశం బంగారు రంగులో మెరుస్తోంది,  సూర్యుడు నారింజ పండులా ఎర్ర బడ్డాడు. చూడు బ్యూటీ అంటే అదీ అని నేను అటువైపు చూపించాను. అప్పుడు ఏంటి అమ్మాయా, మీరు నిజంగా కళాకారులు సర్.. అన్నాడు మోహన్. బాబూ  నేను మాట్లాడేది 'సన్ సెట్' గురించి. మీరేదో అనుకుంటున్నారు అన్నాను. కాదండీ దానికంటే 'అందం' కనపడుతోంటే sunset ఎవరు చూస్తారు అని నవ్వాడు.
అందరం నవ్వుకున్నాం. రైలు సాగిపోతోంది వడి వడిగా ...
                                       *****

రాత్రి ఎనమిదిన్నర అయ్యింది. పొద్దున్న తెచ్చిన వెజ్ బిర్యాని అలాగే ఉంది. అదే తిని పడుకుందాం  ఓ పనైపోతుంది అని మహేష్ పొట్లం విప్పాడు.  ఇంట్లో ఎన్నింటికి తిన్నా,... ట్రైన్ లో మాత్రం సరిగ్గా సమయానికి తింటాం. ఒకరిని చూసి ఒకరు తినటం మొదలు పెడతారు. :) . మేము మొదలు పెట్టగానే మా పక్కనున్న ఆయన తన పొట్లం విప్పాడు.. ఆది చూసి మిగతావాళ్ళు .
  మిగిలి పోయిన బాటరీ ని ఖతం చేద్దామని laptops తీసాడు మహేష్ . మోహన్ నా laptop   తీసుకున్నాడు. నేను పై బెర్త్ మీదకేల్లిపోయి 'జీవితాదర్శం' కొనసాగించాను.

కేరళ ప్రయాణం - 3



"శరీరం కోసం గాక ఆత్మ ఔన్నత్యం కోసం బ్రతకటం అంటే ఎంత మందికి తెలుసు ?"   చలం ని చదువుతుంటే అలా చదువుతూ ముదుకు  వెళ్ళలేము. మధ్యలో వచ్చే కొన్ని  వాక్యాలు  మనసులోతుల్లో దిగిపోయాయి... మనని ప్రశ్నిస్తాయి.. మన ములాలని ఎండ గడతాయి.. ఆలోచింప జేస్తాయి చాలా తీవ్రంగా.  అవును ఏమిటి ఆత్మ ఔన్నత్యం కోసం బ్రతకటం అంటే ?? 
  మహేష్ ..మోహన్ యమా బిజీ ఉన్నారు పేస్బుక్కులో . తొమ్మిదిన్నర అవుతొందేమో.అప్పటికే అందరూ భోజనం చేసేసి నిద్రకు ఉపక్రమించారు లైట్ అర్పి , మేం తప్ప. ఏ ఒంటిగంటకో కన్నుమలిగే నాకు ఇలాంటి ప్రయాణాల్లో అదీ  కష్టమే . మనుషులని గమనిద్దాం అన్నా.. అంతా నిద్రపోతున్నారు .
  మోహన్ తృప్తిగా పేస్బుక్కు చూస్కున్నాక నాకు ఇచ్చాడు లాపీ.
నేను పుస్తకం మూసేసి పేస్బుక్కు మీద పడ్డాను. అదుగో అప్పుడే కేరళ ప్రయాణం - 1 రాసింది. :)

వెంట తెచ్చుకున్న హార్డ్ డిస్క్ తీసి ' ఐ సా డెవిల్' చూడటం మొదలు పెట్టాను. interesting గా అనిపించింది.. ముఖ్యంగా ఇలాంటి ప్రయాణ సమయాల్లో సైకో త్రిల్లెర్స్ బాగా పనికొస్తాయి. :). సినిమా మంచి రసవత్తరంగా ఉండగా హటాత్తుగా బాటరీ డౌన్ అయ్యి.. లాపి ఆగిపోయింది. :(  సమయం పదకొండున్నర కావస్తోంది.
కిందికి చూస్తే మహేష్ , మోహన్ కుడా  పడుకున్నారు. నాకు నిద్ర రావటం లేదు. చేయటానికి ఏమీ లేదు. ఏమీ తోచటం లేదు. ఇంతలో ఏదో స్టేషన్ వచ్చింది. . దిగాను. ఎవరో ఇద్దరు డోర్ దగ్గర నిలబడి ఉన్నారు.. ఇది రేణిగుంట జంక్షన్ వొచ్చేది  తిరుపతి అని చెప్పారు.

తిరుపతి.. అప్పుడు గుర్తొచ్చింది. FB మిత్రుడు ప్రేమ్ చంద్ తిరపతిలో కలుస్తా అన్నాడు.మహేష్ కూడా చెప్పాడు ఆ విషయం. ఎంత సేపట్లో వస్తుంది అడిగా ..అరగంట పట్టొచ్చు అన్నారు.

 ప్రేమ్ చంద్ పేస్బుక్కులో మిత్రుడు. నా పోస్టింగ్స్, photography బావుంటాయని చెప్పాడు. అలా పరిచయం పెరిగి ఒక నాలుగయిదు సార్లు చాట్ చేసాం.అంతే .. వస్తాడో రాడో. అదీ ఈ టైం లో ..నమ్మకం ఏముంది ?? ఏదో మాటవరసకి అని ఉంటాడు అనుకొని మళ్ళీ బెర్త్ మీదకి వెళ్ళిపోయా.
ఏదో ఆలోచనల్లో ..మగతగా నిద్ర పడుతోంది. రైలు ఎప్పుడు ఆగిందో తెలిదు. ప్రేమ్ చంద్ సరాసరి మా బోగీ లోకి వచ్చాడు. నేను ఎవరా అని కళ్ళు నులుపుకున్తుండగా  'హాయ్ చక్రీ ' చాల ఉత్సాహంగా అన్నాడు.
అర్రే ప్రేమ్.. హౌ ఆర్ యు  అంటూ ఆశ్చర్యంగా దిగాను. మోహన్ గారూ కూడా కళ్ళు నులిపుకుంటూ చూస్తుంటే లేపాను. మహేష్ ని కుడా లేపబోతుంటే  ప్రేమ్ వద్దు అనేసరికి...సరే అని ముగ్గురం బయటికి వచ్చాము. మోహన్ ని పరిచయం చేసాను. చక్రీ  ఇలా రా అని నన్ను platform సిట్టింగ్ పిల్లర్ దగ్గరికి తీసుకెళ్ళి nice meeting U అని చక్కగా పాక్ చేయించిన ఒక పళ్ళ బుట్ట చేతిలో పెట్టాడు ప్రేమ్ . అర్రే ఏంటిది.. ఎందుకు .. నాకు చాలా ఆశ్చర్యంగా... ఆనందంగా అనిపించింది. ఇదీ మీకే అని ఓ నిండు సంచి చేతిలో పెట్టాడు.
ఏంటిది ? ఏం లేదు దారిలోకి , ట్రైన్ లో ఫుడ్ బావుండదు కదా.. అన్నాడు
అవేమీ  వద్దు ప్రేమ్. జస్ట్...కలుద్దాం అనుకున్నాం కలిసాం. అని నేను సర్ది చెప్పెంతలో.. పర్లేదు. లోపల పెడదాం పద అన్నాడు .
లోపల పెట్టి కొద్దిసేపు మాట్లాడుకున్నాం ఇంతలో ట్రైన్ స్టార్ట్ అయ్యింది.        ప్రేమ్ చంద్ తో సెలవు తీసుకొని లోపలి వచ్చాక  ఏముంది కారి బాగ్ లో అని చూస్తే చపాతీలు ...గోంగూర పచ్చడి..పెరుగన్నం. . పులుహోర.. చక్కగా పాక్ చేసి ఉన్నాయి. ముగ్గురికీ నాలుగు పుటాలకి సరి పడే ఫుడ్ . అర్థ రాత్రి ఇవన్నీ మాకోసం ఇంట్లో చేయించి.. పళ్ళు కూడా పాక్ చేయించి   తెచ్చాడు. ఎక్కడి స్నేహమిది ..ఎక్కడి బంధమిది ?? ఎంతటి అభిమానం ఇది ?? ఒకరకమైన భావోద్వేగానికి లోనయ్యాం ..
ఇంతలో మహేష్ లేచాడు. ఏంటి అని అరా తీస్తే విష్యం చెప్పాము . అయ్యో నన్ను లేపాల్సిందే అని అన్నాడు. స్నేహభిమానాలు ఉంటాయి. కాని ఇంతాగానా, అదీ పేస్ బుక్కు ద్వారా పరిచయం అయిన  మిత్రుల మీద. నిజంగా ప్రేమ్ స్నేహం అదృష్టమే. అతని అభిమానానికి కృతజ్ఞులం.
  ఇవన్నీ చూడగానే ఆకలి మళ్ళీ వేసింది. చపాతీలు, పెరుగన్నం సుష్టుగా లాగించి మరోసారి ప్రేమ్ చంద్ అభిమానాన్ని తలచుకొని పడక ఎక్కాం.

Mar 9, 2012

సమాజం పై సినిమా ప్రభావం



సినిమా సమజోద్దరణ కి తీస్తారా లేదా వేరే సంగతి. కాని 'సినిమా' సమాజాన్ని  ప్రభావితం చేస్తుందనేది ఒప్పుకోవాల్సిందే. అయితే అన్ని సినిమాలు చేయకపోవచ్చు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ప్రభావం చూపితే..కొన్నిటి ప్రభావం subconscious లెవల్లో ఉంటుంది. ఈ ప్రభావం positive గా ఉండొచ్చు ..negative గాను ఉండొచ్చు. అంతెందుకు ఒక సినిమాలో పాపులేర్ పాత్ర స్టైల్..డైలాగు..హెయిర్ కట్.. డ్రెస్..accessories .. ఏదోటి సమాజం లో వాడబడితే .. ఆ సినిమా సమాజాన్ని ప్రభావితం చేసినట్టే.
సినిమా అనేది ఒక మీడియం. కొందరు జనాలని pure entertain చేయాటానికి ఉపయోగించుకుంటారు. .. మరొక అతను entertain + ఆర్ట్ ఫాం గా ఉపయోగించుకుంటాడు. మరొకడు సమాజం లోని అవకతవకలను చూపిస్తాడు. ఇంకొరు నేర చరిత్రలని ..సమాజ చీకటి కోణాన్ని చూపిస్తాడు. entertainment అనేది అన్నిటిలోనూ దాగి ఉంటుంది. ఆది వేరే విషయం. film maker  దేనికోసం తీసినా అది సమాజం పై ఇంకోరకంగా ప్రభావం చూపొచ్చు. అయితే సినిమా ఎలాంటి ప్రభావం చూపబోతోంది అని ఒకింత దూర దృష్టి కలిగి ఉండాల్సిన బాధ్యత film maker కి ఉంది.
 1989 లో శివ సినిమా విడుదలై సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. కాలేజీల్లో స్కూళ్ళలో ఎక్కడపడితే అక్కడ గ్యాంగ్ లు తయ్యారు అయ్యాయి. అప్పటిదాకా ఎక్కడో మూల ఉండే గుండాగిరి ప్రతి చోటా పాకిపోయింది. రౌడీలు హీరోల్లా ఫీల్ అయ్యారు.
 సినిమా ప్రభావం అంటే, సినిమాలో చూపించినట్టు నరుక్కోవటం ..లేదా ప్రేమించుకోవటం లేదా జనాలకి కాపాడటం లేదా హీరోలు గా మారటం కాదు. ఇది లోతుగా స్టడీ చేస్తే తప్ప తెలియదు.దురదృష్టవశాత్తు మనదగ్గర సినిమా ఎడ్యుకేషన్ మిస్ అయ్యింది. " నీ ఎంకమ్మ.. 'అంత సీన్ లేదు' తోక్కేం కాదు.. ఇలాంటి పదాలు చిన్నా పెద్దా తేడా లేకుండ ఉపయోగించే మాటలు .  సినిమా నించి వచ్చినవే కదా. ఎవరో/ ఎక్కడో /ఒక ప్రదేశం లో ఉపయోగించిన మాట..సినిమా ద్వారా మొత్తం మందికి పాకి అవి జనాలకి ఉతపదాలు అయ్యాయి. ఇదీ సినిమా ప్రభావం.
  నాకు మన సమాజం లో అడుగడునా ..'సినిమా' ప్రభావమే కనపడుతోంది. నేను అమ్మాయికి 'ఐ లవ్ యు' చెప్పటం నేర్చుకుంది సినిమాల ద్వారా.. ఇలా ఉండాలి అని అనుకుంది సినిమా హీరోని చేసే. చేస్తే ఇలాంటి అమ్మాయిని లవ్ చేయాలి అనుకుంది సినిమా హీరో ఇనే లని చూసే. నాలో ఓ రకమైన భయం కలిగించింది సినిమాలే...ఇంకో రకమైన భయం పోగొట్టింది సినిమాలే. సిగరెట్టు తాగింది ..హీరోలని చూసే.. ఇంకా చాలా.. నా జీవితం లో అడుగడుగునా సినిమా ప్రభావం ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా చోపోచ్చు.. కొన్ని కల్పనలు జోడించ వచ్చు.. లేదా పూర్తిగా కల్పనే కావచ్చు.
చెడిపోతారు.. బాగు పడతారు అని కాదు..సినిమా ' ప్రభావం'' కొంతకాలం ఉంటుంది అని మాత్రమే ఒప్పుకోక తప్పదు.
సమాజం పై సినిమా ప్రభావం లేకపోతే ..
* సినిమాకి ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ?
* పోర్నోగ్రఫీ పిల్లలు ఎందుకు చూడకూడదు ??
* ఎందుకు కొన్ని సినిమాలని బాన్ చేసారు /చేస్తారు ??

ప్రాబ్లం ఏంటంటే.. సినిమా చూడగానే మనిషి మొత్తానికి మొత్తం అలా మారిపోతాడు అని అనుకుంటున్నావ్.. కాని ప్రభావం అంటే...అది కాదు. దాన్ని వివరంగా రచకుండా ..మాట్లాడితే ఎలా ? ఆ ప్రభావం కూడా జీవిత కాలం ఉండదు కదా.. సినిమా ఒక్కటే కాదు కదా ప్రభావం చూపించేది. మిగతా అన్నిన్తిలాగే సినిమా కూడా ... అదీ కొంతమందిలో .. అదీ "ఒకింత " ప్రభావం చూప 'వచ్చు' . చూపుతుంది అని కాదు. చూపటానికి అవకాశం ఉంది అని . ఆ ప్రభావం ఇనిస్తంట్ గా కాకుండా  subconsious   పని చేస్తుంది. వ్యక్తిని ..వ్యక్తిత్వాన్ని బట్టి...ఎంతో కొంత కాలం. మనం వ్యక్తిత్వం ఇలా మారటానికి ఏమేం దోహదం చేసాయో చెప్పగలమా ??
ఏ సినిమాలు ఎందుకు ఎంతవరకు ఎవరిని ప్రభావితం చేసాయో ..బాగా ఆలోచిస్తే వాళ్ళకి తెలియటానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుండి సినిమాలు చూసి నచ్చి సినిమా పిచ్చి పెరిగి సినిమాలు తీద్దామని ఇల్లువిదిచిన వాళ్ళందరి మీదా సినిమా ప్రభావం ఉన్నట్టే. సినిమా వాళ్ళ జీవితాని నిర్దేశిన్స్తోన్న్ట్టే. ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకోటి కావాలా సినిమా ప్రభావం గ్గురించి చెప్పటానికి.