Aug 4, 2011

తేనే కన్నా తీయనిదీ తెలుగు బాష ...


చాలామంది తెలుగో అని ఏడిచేవాళ్ళు, ఇక్కడ తెలుగు లిపి ఉపయోగించి తెలుగు రాయరు. తెలుగుని ఇంగ్లీష్ అక్షరమాలతో టైపు చెసి చదవరాకుండా పెద్ద గందర గోళం శ్రుష్టిస్తారు. ఆది బద్దకమో, నిర్లక్షమో తెలిదు.
జీన్స్, t షర్టు వేసుకొని .. చెవుల్లో headphone ఇరికిన్చుకొని... పంచదార బొమ్మ బొమ్మ పట్టుకొవోద్దనకమ్మా ..fm వింటూ.. తనకోసమే వెయిట్ చేస్తున్న తెల్లని కారు లో ఝాం అని వెళ్లి, ఇంగ్లిషు లో లోడ లోడ వాగేసి నేల తిరిగేసరికల్లా తక్కువలో తక్కువ ఓ ప...దివేలు తెస్తుంటే..
తను నేర్చుకొన్న చంపక మాలలు , ఉత్పల మాలలు పైసా సంపాదనకి పనికి రాక పాపం తెలుగు మీడియం విద్యార్ధి, తల్లి దండ్రులు గొల్లు మని ఏడుస్తుంటే..
తెలుగు భాష కోసం మొత్తుకుంటున్న మేధావుల ఇస్తారా పదివేలు ??
పొట్ట కూటికోసం ఇంగ్లీష్ నేరుచుకుంటే..బాష మరిచిపోతున్నారని గోల పెడితే ఏం లాభం ? పొట్ట నిండేది ఎలాగా ??
పోనీ తెలుగు ఒక్కటే నేర్చుకుంటే సరిపోతుందా? అంటే అదీ లేదు..రాష్ట్రం దాటితే పనికి రాకపోయే.
నీరు పల్లమెరుగును.. అన్నట్టు.. ఏది అన్నింటికీ అనుకూలంగా ఉంటుందో దానికే వైపే మొగ్గు చూపుతారు కాని... ప్రవాహానికి ఎదురీదమంటే ఎలా ??

ప్రతుతానికి తెలుగు భాషకి వొచ్చిన నష్టం ఏంటో అర్థం కావటం లేదు.??
తిండి లేక మాడే వాడికి ఏ బాష తిండి పెడితే ఆ బాషే మాట్లాడుతాడు.
"అమ్మ అన్నం పెట్టదు అడుక్కు తిననీయదు " అన్నట్టుంది.. బాషభిమానుల మాటలు.
రేపటి నుండి అందరూ పంచెలు కట్టుకొని తిరగండి..... ప్యాంటు షర్టు ఎందుకో మరి ? ఆ కంఫోర్ట్ వదులుకోం..
అవ్వ బువ్వ రెండు కావాలంటే కుదరదు.
ఇతర దేశాల డబ్బు కావలి.. జాబ్స్ కావలి..కాని ..బాష మారొద్దు , సంకృతి మారొద్దు అంటే ఎలా కుదురుతుంది ?
ఈ software...BPO ఉద్యోగాలు ఉండబట్టి జనాలు బ్రతుకుతున్నారు గాని మన ప్రభుత్వాన్ని నమ్ముకుంటే..ఇన్ని ఉద్యోగావకాశాలు కలిపించేదా ? మనకున్న వనరులతో ?? (of course ఆయా కంపనిలకి permission ఇచ్చి ప్రభుత్వమే అయినప్పటికీ )
దేశ బాషను..సంకృతి ని కాపాడే బాధ్యత దేశానిదే.. ఆదేశ పాలకులదే.
ఓ పక్క...ఇంతకంటే పెద్ద పెద్ద అనర్థాలు జరిగిపోతుంటే ...అడిగే దిక్కు లేదు.
అయినా,,,  ఏం? ప్రపంచానికంతా ఒకే బాష .ఒకే సంకృతి ఉంటే తప్పేంటి ??

2 comments:

Sri Kanth said...

దీన్ని మరో కోణములో కూడా ఆలోచించాలి. తెలుగు ముద్దు అంటే దానర్థం ఇంగ్లీషు వద్దు అని కాదుగదండీ? ఇంగ్లీషు నేర్చుకోండి, ఆ Software, BPO కంపెనీలలో జాబులూ కొట్టండి. హాయిగా బతకండి. కానీ, తెలుగును మర్చిపోకుండా చక్కగా తెలుగును మాట్లాడడానికి ప్రయత్నించండి అనే చెబుతారు ఎవరైనా, అలా కాదు, తెలుగు మాత్రమే నేర్చుకోవాలి అంటే మాత్రం వారు మూర్ఖుల కిందే లెక్క.

chakri said...

" ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎవడికుందండీ సరదా..?? పుట్టిన పాపానికి బతకాలి కదా.. రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే ఓ మంచి జాబ్ దొరుకుతుందని ఆశ . అంతే. తెలుగు మాట్లాడితే తెలుగోడే ఎగాదిగా చుస్తాడాయే