Jan 7, 2011

అవురా పెద్దది గుమ్మాడి ..



ఏదో పని చేస్తున్నా  ..కరెంటు పోయింది.. సరే కొంచం సేపు చలి కాచుకుందాం అని  ఎండకోసం  డాబాపైకి వెళ్ళాను. పక్కనే మిగిలిపోయిన ఖాలీ స్థలంలో   రెండు గేదెలు మేస్తూ కనిపించాయి. చుట్టూ apartments మధ్య ఈ దృశ్యం ఇంకేన్నాల్లుంటుందో  అనిఅనుకుంటుండగానే.. నా దృష్టి  అక్కడ పెరిగిన గుమ్మడి పాదుల వైపు మళ్ళింది . ఓ చిన్ని గుమ్మడి కాయి.. పక్కనే అరవిరిసిన గుమ్మడి పువ్వు.
సాధారణంగా కనిపించే కాయగూరల్లో పెద్దనైన దీని ఆకారం యిట్టె ఆకర్షించి అదంటే ఎందుకో కుతూహలం ఉండేది నా చిన్నప్పుడు. అటు తరవాత "వీరి గుమ్మడి పండు వీరి పేరేమి..అనే ఆట" ద్వార గుమ్మడి  బాగా పరిచయం.
బొద్దుగా ఉండే పిల్లని "గుమ్మడికాయ" అని వెక్కిరించటం.."గుమ్మడి  కాయ లాగ ఉంటాడు" చూడు అని  ఉదాహరించటం.."గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవటం" లాంటి సామెతలూ   కూడా మనకి పరిపాటే.
గుమ్మడి కాయ కూర.. గుమ్మడి తో చేసిన పులుసు,  గుమ్మడి పలుకుల పాయసం, గుమ్మడి హల్వా  ..లాంటి  రక రకాల వంటకాలలోగుమ్మడికి ప్రత్యెక స్థానమే ఉంది. అలాగే ..దిష్టి తీయటానికి గుమ్మడిని పగలగోట్టటం.. దిష్టి తగలకుండా గుమ్మడి కాయని గుమ్మానికి వేలాడ తీయటం లాంటి వాటితో మన సాంప్రదాయాల్లో కూడా గుమ్మడికి మంచి ప్రాశాస్తమే  ఉంది.  అమెరికా లాటి దేశాల్లో కూడా గుమ్మడి కి ఓ సముచిత స్థానం ఉంది.


Halloween day రోజు  గుమ్మడి కాయని తొలిచి అందులో దీపం పెట్టి లాంతరు లాగ వెలిగించటం, Thanksgiving డే రోజు కూడా గుమ్మడి తో వొంటకం వడ్డించటం వాళ్ళ సంప్రదాయం.


"ఓ గుమ్మా గుమ్మడి పువ్వు. ఓ కొమ్మ కమ్మగా నవ్వు.."
" అమ్మాడి  నవ్వవే గుమ్మడి నవ్వవే... గుమ్మడి పువ్వులాగా అమ్మాడి  నవ్వవే.. "
" గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి.. "
లాంటి హిట్ పాటలతో  తెలుగు సినీ సాహిత్యం  లో కూడా మంచి చోటే సొంతం చేసుకుంది గుమ్మడి.
అబ్బా గుమ్మడి కథ చాలానే ఉంది....అనుకుంటుండగానే
కరెంటు వొచ్చింది  ..ఆలోచనలు కట్.... 

No comments: