Jan 10, 2011

పురాణ కథల్లో ప్రేమ






*When love is not a pre-condition for marriage, why should anybody expect love to be a post-condition for marriage?
 పెళ్లి అనేది ఒక బంధం. అ బంధం లో ఉంటామని ఒకరికొకరు ఇష్టం తో ఒప్పుకుని చేసుకునేది పెళ్లి. పెళ్లి పది కాలాల పాటు నిలబడటానికి ఒకరి మీద ఒకరికి ఇష్టం. స్నేహం, అర్థంచేసుకోవటం, క్షమా, నమ్మకం, గౌరవం..ఇష్టయిస్తాలని ఆదరించటం.. మొదలైనవి ఉండాలి.  ఆ ప్రయాణం లో ఒకరి పై ఒకరికి అనుభందం ఏర్పడుతుంది.
 కామం, వాత్సల్యం, అనురాగం, స్నేహం, అభిమానం, గౌరవం, ఇష్టం, మోహము,వలపు....ఇవన్నీ వేరు వేరు. కాని మనం అన్నింటికీ వాడుకలో "ప్రేమ" అనే పేరే పెట్టుకొని.. confusion కి గురి అవుతున్నాం.
మన పురాణ కథల్లో..దాదాపుగా ప్రేమ అనే పదం కనపడదు. దేవి నిన్ను మొహిస్తున్నాను లేదా కామిస్తున్నాను  అంటాడు తప్ప ప్రేమిస్తున్నా అని అనడు.
ప్రేమ అనేది వ్యక్తి కి ప్రకృతి/విశ్వానికి /దేవునికి కి సంభందించింది గా అనుకొవొచ్చు. పైన చెప్పిన వాటి అన్నింటి highest డిగ్రీ ప్రేమ.
అంటే  ఎక్కడినుండి మొదలైనా ఆ ప్రయాణం లో చివరి మజిలీ యే ప్రేమ. ఆ చివరి మజిలీ చేరుకున్నాక మనసులో ఏదో గొప్ప ఆనందం. అ ఆనందం లోంచి ఒక వెలుగు.. ఆ వెలుగులో లోకం అద్భుతంగా దర్శనం ఇస్తుంది. సాధన చేస్తుటే..ఆ వెలుగు విశ్వ వ్యాప్తమైపోతుంది.
ఒక పర్వతాన్ని  ఎక్కటానికి ఎన్నో దారులు ఉండొచ్చు. చేరుకునేది శిఖరాగ్రానికే . ఆ శిఖరాగ్రం నుంచి చుస్తే ప్రపంచం నూతనంగా దర్శనం ఇస్తుంది.  అదే ప్రేమ. 

No comments: