వాట్ అన్ ఐడియా...!!
ఆకలి దంచేస్తోంది.. పర్సు వెతికితే అయిదొందల ఆకు పచ్చ నోటు తగిలింది.
ఆహా అదృష్టం, కాని ఏం తిందాం. బిర్యాని.? రోటీ పనీర్ బట్టర్ మసాలా? మెస్
భోజనం ? లేక పిజ్జా బర్గర్ ?? రక రకాల రుచులు జ్ఞాపకం వచ్చి నోరు ఉరింది.
ఏం తినాలో అర్థం కాక తల మునకలవుతుంటే
ఇంతలో ఒక మెసేజి..
డియర్ కష్టమర్ మీరు కట్టవలసిన బిల్లు నాలుగు వందల ముప్పయి అయిదు రూపాయలా ఇరవై రెండు పైసలు .. చివరి తేదీ _ _ _
మీరు ఐడియా వాడుతున్ననదుకు ధన్యవాదాలు.
నోటు మడిచి పర్సులో పెట్టి జేబులు తడిమితే బంగారు రంగులో అయిదు రూపాయల
కాయిన్ తలుక్కుమంది. వెంటనే అప్పుడెప్పుడో ఏళ్ళ కింద చూసిన ఒక టీవీ ప్రకటన
గుర్తొచ్చింది..
అయిదు నిముషాల్లో రెడీ చేసి తిన్నా.ఆకలి ఆల్మోస్ట్ తీరిపోయింది 'మాగి' తో.
so చెప్పుకోవలసిన మాట ఏంటంటే ..
" ఐడియా మీ ఆకలిని తీర్చేస్తుంది." అని ఈ ముక్క నా మిత్రుడికి చెప్పగానే
కాదు కాదు.. " ఒక్క ఒక్క ఐడియా మీ ఫుడ్డుని మార్చేసింది." అన్నాడు. వాట్ అన్ ఐడియా .. :)
1 comment:
మొదట భాగం చదివి మీక్కూడా శ్రీశ్రీకి వచ్చిన సంధ్యా సమస్య వచ్చిందేమోననుకున్నా
good one.
Post a Comment