Mar 31, 2010

దైవం

మనకి అర్థం కానిదంతా దైవ మాయే. 
భూగోళాన్ని అపకేంద్ర , అభికేంద్ర బలాలు ఒక నిద్రిష్ట కక్షలో తిరిగేలా చేయటం, పదార్థంలో పరమాణువుల అమరిక...తద్వారా  పదార్థ ధర్మ మార్పు, జంతుజాల జీవన క్రియలు  నుంచి మొదలు కొంటె ప్రతిదీ ఒక పద్దతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. 
మానవ మేధస్సు సృష్టి లో ఉన్న కొన్ని రహస్యాలని చేదించి స్వలాభానికి వాడుకుంటూ ఉంది.. కాని  సృష్టి కారణం, కారకులు, జీవం , జీవితం ..వీటిని ఇంకా నిర్వచించ లేక పోయింది . ఇక్కడే "దేవుడు" అన్న పదం ప్రతిపాదించ బడుతుంది..మనకి అర్థం కానిదంతా దైవ మాయే.

దేవుడు ఒక సాంఘీక  అవసరం

దేవుడు ఒక సాంఘీక అవసరం. ప్రజలు దేవుడి పేరుతో కొంత రిలాక్స్ అవ్తున్నారు. తమ తమ కోరికలని తీరుస్తాడని, ఆపదలనుంచి గట్టేకిస్తాడని, సమస్యలని పరిస్కరిస్తాడని నమ్ముతున్నారు. ఆ నమ్మకం లో బ్రతకక పోతే వ్యక్తీ గతంగా, సాంఘీకంగాఅశాంతి ప్రబలి పోతుంది. సమాజం లో విలువలు నశిస్తాయి. అవి పోయిన నాడు లోకం నరకం. ఇప్పటికే చాల శాతం మంది బ్రతుకు పోరాటం లో, ఆశల వాహినిలో, సుఖ భోగ లాలసలో పడి విలువలు మరిచి దోపిడీలు , దొంగ తనాలు, మోసం, హత్యలు , అత్యాచారాలు చేస్తున్నారు. ఇక దేవుడు అనేది గుడ్డి నమ్మకమే అని తెలిసిందో... ప్రపంచం వల్లకాడైపొదూ  ..

ఒక దానికి surrender కావాలి 

మనిషి దేనికో ఒక దానికి surrender కావాలి . అదొక ఆనందం. దానినే ప్రపత్తి అంటారు. మన అహంని మరిచిపోయి ఎవరికో ఒకరికి, దేనికో ఒన దానికి అర్పణ కావాలి..
దేనికి కావలి.?? ఎవరికీ కావాలి??
నీకా? కాని నీలో నాకు లోపాలు కనపడుతున్నాయే..నాకంటే గొప్పగా కనిపించటం లేదే నీవు ??
మరి ఎలా...
సరిగ్గా అప్పుడే "దేవుడు" ఒక అవసరం అవుతుంది ఎవరికైనా. ఎవరితో మనం మనని మరిచిపోయి, ముసుగు తొలగించి, మంచి చెడు చెప్పుకొని. ఏడ్చి, నవ్వి, ఒదార్చుకొని..స్వాంతన పొందుతామో అదే దేవుడు.
ఆ దేవునికి మనని మనం అర్పణ చేసుకొని, ఆ ప్రపత్తి లోఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
అందుకే దేవుడిని idealize చేసి, సకల గుణగణుడుగా, మహా శక్తి సంపన్నుడుగా, దయామయుడిగా, ఆపద్భంధవుడిగా, కొంగు బంగారంగా కీర్తిచి...స్తుతించి, శ్లాఘించి  స్వాంతన ఆనందాన్ని పొందుతున్నాం.
సంగీత మాదుర్యము, భక్తి ప్రపత్తి, సాహిత్య పు గారడీ కలగలిసి మన మనసులో పుట్టించే ఆనంద తరంగాలు మనని ఒలలాడిస్తాయి .

దేవుడంటే ....????

 ఏ శక్తి జీవ చైతన్యానికి ఆధారమో,ఏ శక్తి పూలకి రంగుగా మారుతుందో.. ఏ శక్తి పక్షి రెక్కలో దూరి దాన్ని గాల్లో తెలుస్తుందో.. ఏ శక్తి భూమిని గాల్లో పట్టి ఉంచిందో.. ఏ శక్తి మనని పలికిస్తుందో,నడిపిస్తుందో, పరుగులేట్టిస్తుందో, మన ఆలోచనలకి ఆధారమో, . .. ఏ శక్తి మాటై, పాటై మాధుర్యమై మనని అలరిస్తుందో, ఏ శక్తి వేలుగునీడలో సృష్టిస్తుందో, ఏ చైతన్యం విత్తు లో ఉన్న జీవాన్ని మేలుకొలిపి భూమిని చీలుచుకొని మొలకగా మారుస్తుందో.. ఆ శక్తి చైతన్యమే దేవుడు.

దేవుడు మీ కోరికలు తీర్చడు.

నిజం..

దేవుడు మీకోరికలు తీర్చడు. అరిచి గీ పెట్టు.. లక్ష కొబ్బరికాయలు కొట్టు.. గుండు గీయించుకొని తిరుగు జన్మంతా.. దేశం లోని గుళ్ళు గోపురాలు చుట్టబెట్టు ... ఎమన్నా చెయ్యి ...మీ   కోరిక తీర్చడు..

మీకు మీరు .. హృదయంతరాళం లోనుంచి .. ఫీల్ అయ్యి.. sincere గా శ్రమిస్తే మీ  కోరిక నెరవేరుతుంది..

మనకి కావలసినవి కోరుకోటానికి.. ..అనుకున్నది తీరక పోతే గుండె మండి తిట్టు కోటానికి దేవుడు కావలి. 

 



Mar 22, 2010

అసలైన అబలత్వం

మొన్నెపుడో  ప్రపంచ మహిళా దినోత్సవం  జరిగింది. మహిళలందరూ ఒక చోట చేరి " మహిళ గొప్పతనం, కుటుంబానికి, సమాజానికి మహిళ ఎలా సేవ చేస్తుందో, తామెంత ముక్య పాత్ర పోషిస్తున్నారో తెలియజెప్పారు. సమాజం లో ఎలా దూసుకుపోతున్నారో, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారో , ఎలాంటి ఆపదలు ఎదురు కావోచ్చో, వాటిని ఎలా face చేయాలో  వివరించారు. మహిళా బిల్లు అదేంటో నాకు తెలియదు కాని దాని గురించి కూడా చర్చించారు.
ఆడది ఆబల  కాదు సబల అని చాల మంది మహిళలు prove చేసారు, చేస్తున్నారు.
కాని నేను గమనించింది ఏంటంటే... ఇల్లు విడిచి ఉద్యోగాలు చేస్తున్నా , విమానలేక్కి గాల్లో చక్కర్లు కొడుతున్నా.. పొలిసు మిలిటరీ దళాల్లో  చేరి దైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నా.. కొన్ని విషయాలలో మాత్రం ఆడది ఆబాల గానే మిగిలిపోయిందేమో అని అనుమానం .
ఉద్యోగం చేసినా, ఊళ్ళేలినా  ఇంటికొచ్చి  కన్నీటి చిట్టా విప్పుతుంది. చున్ని అంచుతోనో.. tissue  paper   తోనో కళ్ళు, ముక్కు తుడుచుకొంతోంది. కారణం ఏదైనా కావొచ్చు. బాస్ తిట్టాడనో,  బాయ్ ఫ్రెండ్ ముఖం చాటేసాడనో, మొగుడు పట్టించుకోటం లేదనో.  
         స్త్రీ తత్వం సున్నితం, తద్వారా బాధ అనివార్యం. ఎంత సున్నితం గా ఉంటె అంతా బాధ. ప్రపంచ తత్వం, మగాడి గుణం తెలిసి కూడా,  సగం ఎదుర్కొని ఇంకో సగంలో ఓడిపోతోంది. ఇంటికొచ్చి ఏడవటం  అసలైన అబలత్వం. ముఖ్యంగా  relationships  విషయంలో మహిళ బాధని అధిగమించలేక పోతోంది.
ప్రపంచాన్ని గెలుస్తున్నాం.. కాని మనని మనం గెలవకలగాలి.. మన attitude ని మార్చుకోగాలగాలి. దాన్ని సాధన చేయాలి. ఇది సాధించిన  రోజున నిజమైన మహిళా దినోత్సవం. 

Mar 16, 2010

ఇది నా లైఫ్ స్టయిలు.

నాకు, చక్రి గాడికి  అస్సలు పడదు... నాగురించి  నన్ను  ఒక్క మాట చెప్పనీయడు. చూడండి ఏమంటున్నాడో..


నేను చాలా డిఫరెంట్, .. అందరి లాగే..  (తోక్కేం కాదు )
చెప్పేది సూటిగా గుచ్చుకునేటట్టు చెప్పేస్తా..(రక్తం రాదులెండి)
ఎదుటోడిని కాల్చుకుతినడం అలవాటు. (వీడి మొహం చపాతీలు కాల్చటం కూడా రాదు వీడికి )
లైఫ్ ని top angle నుంచి చూస్తే భయం ( వీడికే )
 low angel నుంచి చూస్తే అబ్బ నావల్ల కాదు అని అనిపిస్తుంది (వీడి  వల్ల నిజంగా కావటం లేదు , పరమ  escapist ).
అందుకే eye level is best. (పాపం ట్రై చేస్తున్నాడు )
పొద్దున్నే లేచి ఓ డబ్బా కట్టుకొని బస్సులో వేళాడి ఆఫీసు కి వెళ్ళటం.. ఏం చేస్తున్నామో తెలీకుండా చెప్పింది చేసి ఉసురు మంటూ కొంపకి రావటం నా వాళ్ళ కాదు. ( మరేం చేతనవుతుందో.. తిని కుర్చోటమా )
ఇంకా చాలు లేవరా బాబు అనిపిస్తే నిద్ర లేవటం. చేయాలి అని అనిపించినపుడు మాత్రమే పని చేయటం. ఒక్క సారి ఏదైనా వర్క్ కి కమిట్ అయితే చేసి తీరటం, (ఇంతవరకు కాలేదు, ఎప్పుదవుతాడో  తెలిదు, హి హి )
ఇది నా లైఫ్ స్టయిలు.
(lazy ఫెల్లో అని చెప్పు, నీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది )

Mar 10, 2010

స్వాములోరి పూజమహిమ..

ఆ మధ్య ఎప్పుడో మా అమ్మ పోరు పడలేక .. ఒక జాతకాల స్వామిజి దగ్గరికి వెళ్ళా. ఆమెకీ ఎవరో చెప్పారంటా  గొప్ప స్వామిజీ . అతను చెప్పినట్టు చేస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి అని..
సరే ఇద్దరం వెళ్ళాము.. అడ్రస్ వెతుకుంటూ..


లోపల జనం బాగానే ఉన్నారు.. అయన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు.. జనం అంతా కింద కూర్చున్నారు  . ఏదో జపం చేస్తున్నట్టున్నాడు,  ఎప్పుడూ కళ్ళు తెరుస్తాడా అని జనం ఆయన్ని అదేపనిగా చూస్తున్నారు,  ..నేను మా అమ్మ వెళ్లి కాళ్ళు కడుక్కొని వరుసలో చోటు చేసుకొని కూర్చున్నాం. (కాళ్ళు  కడుక్కొమ్మని శిష్యుడు చెప్పాడు..అదో కండిషన్ అక్కడ మరి.)
అలా ఒక 15 నిముషాల తరవాత అయన కళ్ళు తెరిచాడు.
అందరినీ  తేరి పార చూసి.. లోపలి కెళ్ళాడు.. కొన్ని సెకనుల  తరవాత ఘంటా నాదం వినిపించింది..హారతి  పళ్ళెం,తీర్థం తో బయటకు వచ్చాడు..
అందరూ భక్తి తో మోకరిల్లి, హారతి కళ్ళ  కద్దుకొని  తీర్థం తీసుకున్నారు,
ఒకాయన అయన దగ్గరికెళ్ళి తన గోడు విన్నవించుకున్నాడు..
భార్య తనతో కాపురం చేయటం లేదంట.. జేబులో డబ్బులు మాయం చేస్తుందంట, నిన్నే ౪ వేలు నోక్కేసిందట,  ఎం చేయాలో తెలీటం  లేదంట.. ఎలా దారికి తెచ్చుకోవాలి  అని సందేహం వెల్ల గక్కాడు.
స్వామి వారు ఒక చీటిలో ఏదో రాసిచ్చాడు..ఏం రాసాడబ్బా అని నాcuriosity  ఆపుకోలేక చచ్చా అనుకో...
చీటీ ని చూసి  అతను దాన్ని కళ్ళకద్దుకొని  సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు.


     మా వంతు వొచ్చింది. అంతకుముందే శిష్యుడి ద్వారా  డేట్ అఫ్ బర్త్,  స్టార్, అండ్ టైం అఫ్ బర్త్ రాసిచ్చిన చీటీ అయన చేతికి వొచ్చింది.
కొంత సేపు  వెళ్ళు లేక్కపెట్టుకొని లెక్కలు వేసాడు.  "అంతా బానే ఉంది .. లక్మి దేవి కటాక్షం  లేడు, అందుకనే అనుకున్న పనులు జరగటం లేడు.పెళ్లి కూడా అందుకే వాయిదా పడుతోంది.. అని. స్వామి వారు మహా జ్ఞాని, నేను బ్రహ్మ చారి వెధవనని గుర్తుపట్టేసారు. మా అమ్మ సంతోషం ముఖం లో ప్రస్పుటంగా కనపడింది.
 చీటీ మీద  ఏదో రాసి  మా అమ్మ చేతిలో పెట్టాడు. నేను నా curiosity  ని చంపే  ప్రయత్నం లో చీటీ లాక్కుని చూసాను..
1200 /- అని ఉంది. శిషుడు తనవైపు రమ్మని సైగ చేస్తే స్వామికి నమస్కారం చేసి, అతని దగ్గరికి వెళ్ళాము. రెండో ఇంట్లో రాహువు శని కొట్టుకుంటున్నారు. ఏదోఇంట్లో శుక్రున్ని  కేతువు మింగేశాడు. కనకనే పెళ్లి కుదరటం లేడు అన్నాడు. నేనేమో పెళ్లి సంగతి సరే , కనీసం gf అయినా దొరకటం లేదు . దానికి కూడా  వీళ్ళేనా  కారణం అని అడగాలని నోటి దాకా వొచింది. అమ్మని చూసి ఆగిపోయా..నాకేమి అర్థం కాలేదు ఆ బాక్స్. నన్ను వెన్ను పోటు పొడవటానికి ఇంత మంది ఉన్నారా? నా వెనక మహా కుట్ర జరుగుతోందే అని అనిపించింది. పెట్టక పెట్టక అసలైన వాటికే ఎసరు పెట్టారు అనుకున్నా.  జపం చేసి హోమం చేయాలి.మూడు రోజులు పడుతుంది  అని వివరించాడు.
అలాగే అంటూ  అక్కడినుండి వోచ్చేసాం .
ఇక మొదలుపెట్టింది మా అమ్మ..  ఎప్పడు వెళ్దాం అని..
వేల్దామే ప్రస్తుతానికి 1200 /-  లేవు అని చెప్పా.. నీకెందుకు నేను నాన్న ని అడిగి తెస్తాగా  అంది.
వొద్దు లేవే  డబ్బులు దొరకగానే నేనే చెప్తా కొంచం ఓపిక పట్టు అని చెప్పా.
సరిగ్గా ఒక వారం  తరవాత..డబ్బులు అడ్జస్ట్   కాకున్నా ఏదో ఒకలా మేనేజ్ చేసి.. (అమ్మ పోరు పడలేక )
సరే వెళ్దాం పద అని మళ్లీ ఆయనదగ్గరికి వెళ్ళాం.
ఇందాక చెప్పినట్టు హారతి, తీర్థం  అయిపోయాక అయన ఇచ్చిన  చీటీ చూపించి డబ్బులు ఇవ్వబోయాం .. దానికి ఆయన  పూజ ఐపోయాక అన్నట్టు చెప్పాడు.
రోజు ఉదయం 6   కల్లా  వొచ్చి తీర్థం తెసుకొని వెళ్ళండి అని చెప్పాడు..
మొదటి రోజు నా పేరు మీద సంకల్పం  చేసాడు.. రెండో రోజు జస్ట్  తీర్థం  తెసుకొని  వోచ్చేసాం .మూడో రోజు మాత్రం.. హోమగుండం లో పూజ, నాలాగే ఒక 8 మంది దాకా, .. నెయ్యి , నువ్వులు అగ్నికి ఆహుతి చేసాం .    తర్వాత  తీర్థం ప్రసాదం... డబ్బు సమర్పిచుకున్నాం.
నాకు మహా చెడ్డ చిరాకుగా  ఉంది..డబ్బు  పోయినందుకేమో..??? 
కాని  next day  ఎం జరిగిందంటే..

11 గం  కి ఏదో పనిమీద బయటికి వెళ్లి వొచ్చా. చేసే పని లేక, అలా కల్లుముసుకొని పడుకున్నా.. నిద్ర పట్టేసింది ఘాడంగా.. అ మత్తులోనే ఓ సారి లేచి బయటికి చూసా ..అంతా  సవ్యంగానే  ఉంది ..నిశబ్ధంగా ..
మళ్లీ ఒచ్చి ఇంకో కునుకేసా.. ౩ pm దాకా ..తరవాత ఇంక ఆకలికి ఆగలేక నిద్రపట్టక లేచా. బయట నా బైక్ లేదు. 
 అర్థం కాలేదు.. అసలు ఈ రోజు డేట్ ఎంత?  నేను ఎక్కడున్నా? బయటికి వెళ్ళానా  లేదా ?  బైక్ ఎక్కడ పార్క్ చేశా ? ..ఇలా ఒక్క సారి ఆరోజు చేసిన పనులని రీల్ వేసుకుంటే అప్పుడర్థమైంది.. బైక్ ఎవడో కొట్టేసాడని.
వెంటనే తేరుకొని.. కంట్రోల్ రూం కి ఫోన్  చేస్తే, నల్లకుంట PS   కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వమని అన్నారు. ఆలస్యం చేయకుండా ఆటోలో వెళ్ళా  , అక్కడ గేటు ముందున్న  పోలీసు దగ్గరినుండి నుండి.. ఎదురైన ప్రతివాళ్ళు
"ఏమైంది.. ఎక్కడ.. ఎక్కడ పెట్టావు, లాక్ చేయలేదా.. ఎంత సేపైంది.. మీకు careless ఎక్కువ " అని లక్ష ప్రశ్నలు వేసి  చివరికి తేల్చింది ఏంటంటే ..నా అడ్రస్  వేరే PS   పరిథి లోకి వొస్తుంది అని.. అక్కడి నుండి వేరే స్టేషన్ కి పరుగు లంకించుకొని మళ్లీ ఎదురైన  ప్రతివాళ్ళకి వివరాలు ఇచ్చి అందరి తో తిట్లు తిని చివరికి  కంప్లైంట్ తీసుకునే  అతనికి  చెప్తే..  నెంబర్, నేమ్  రాసుకొని..  "ఆ దొరికితే ఇస్తాం, అప్పుడప్పుడు వొచ్చి  కలుస్తూ ఉండు" కూల్ గా చెప్పాడు
ఈ  ఏప్రిల్  22  వొస్తే రెండు వసంతాలు నిండుతాయి .

ఇదీ   స్వాములోరి   పూజమహిమ..

Mar 9, 2010

కట్టుకథ- 3

ఎ ప్పుడూ అంచనాలు తారు మారు అయ్యే నాకు కూడా ఈ సారి అంచనా correct అయ్యింది.. అదే... నాకు సీట్ రాదు అనుకున్నాను.. రాలేదు.. అప్పుడే గాట్టి నిర్ణయం తీసుకున్నా  .. కనిసం ఒక్క రోజైనా  నిఫ్ట్ లో స్టూడెంట్ గా  ఉండాలని .. మళ్లీ preparation start. ఈ సారి confidence ని పెంచుకోడానికి meditation మొదలెట్టా...ఈ ఫై ఫై మెరుగులకి భయపదోద్దని నా మనసుకి నేనెం ధైర్యమిచ్చు కున్నా...మొత్తం 240 సీట్లు, 239 సీట్లు అలాంటి  వాళ్ళకి రావొచ్చు గాక.. మిగిలిన ఆ ఒకటి మాత్రం నాది...నాదే ..అన్నంత   లెవెల్లో.confedent గా ఫీల్ అయ్యా..
ఈ సారి ఎంట్రన్స్ హాల్ ముందు ఆ rich people ని చూసి...పిచ్చినా కొడుకులు..ఈ మాత్రం ఎంట్రన్స్ కి ఇంత బిల్డుప్ అవసరమా..? అన్నటు ఎవ్వరిని లెక్క చేయకుండా..ఎంట్రన్స్ రాసాను..


ఓ మూడు నెలల తరవాత....
ఓ ఎండాకాలం మిట్ట మధ్యాన్నం.... ..ట్రింగ్ మన్న పోస్ట్ మాన్ సైకిల్ బెల్ ..
వెళ్లి చూస్తే..నిఫ్ట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్.

Mar 7, 2010

కట్టు కథ -2

                
అలా ఓ రెండు నెలలు పేపర్లు కెరీర్ magazines తిరగేస్తే........NIFT fashion designing కోర్సు కనిపించింది..అవును నేను ఫ్యాషన్ డిజైనర్ అయితే ,,, నాకంటూ ఒక గుర్తింపు..క్లిక్ అయితే పేరు, డబ్బు.. నేను ఎంత fashioned గా ఉన్నా , వాడు ఫ్యాషన్ డిజైనర్ రా అని గొప్ప చెప్పుకుంటారు.
ఇంట్లో వాళ్లకి చెప్పాను..చేస్తే fashion designing మాత్రమే చేస్తా అని. మీకంతగా కోర్సు మీద నమ్మకం లేకపోతే..మీరే వెళ్లి en quire చేసుకొని రండి అని అన్నాను.
సరే చూద్దాం, అని ఓరోజు మా నాన్న హైదరాబాద్ బయలుదేరి..,నిఫ్ట్ కి వెళ్లి..enquire చేసి మొత్తానికి అప్లికేషను ఫాం తెసుకొచ్చాడు.." నీ మొహానికి సీట్ వొస్తుందని నేను అనుకోవటం లేదు"..అంటూ అప్లికేషన్ ఫాం ఇచ్చాడు.
రంగురంగుల బట్టలేసుకొని.. చలాకీగా తిరుగుతూ..ఇంగ్లిష్ వాయించేసే..నార్త్ ఇండియన్ గాళ్స్  మధ్య నన్ను ఉహిచుకొని..మా నాన్న అలా అనటం చాల మాములు విషయం.
నిజానికి అన్ని విషయాలు తెలుసుకుందామని నేనే ఓసారి వెళ్ళా ..కాని లోపలికేల్లె దైర్యం లేక వొచ్చేసా ..అందుకే తెలివిగా నాన్నకి చెప్పా.. పాపం నాన్న ఎలాగోలా నాకోసం అప్లికేషను తెచ్చాడు.
ఇక నన్నెవ్వరు పట్టించుకోలేదు.. నేను మాత్రం ఏవో బొమ్మలు గీస్తూ,,రంగులద్దుకుంటూ..ఇంగ్లీష్ magazines చదువుతూ..నాకు తెలిసినంతలో లో prepare అయ్యాను.

ఇక entrance రోజు మళ్లీ కళ్ళు తిరిగాయి..examination hall ముందు చాల వరకు...jeens T shirts లో rich అమ్మాయిలు అబ్బాయిలు.. అదే లెవెల్లో వాళ్ళ అమ్మా నాన్నలు..
పిల్లలు last minite preparation లో ఉంటె..స్పూన్ ఫీడింగ్ చేస్తున్న తల్లి దండ్రులు. ధారాళంగా ఇంగ్లీష్ లో encouragement. నాలాంటి వాళ్ళు బిక్కు బిక్కు మంటూ వీళ్ళనే చూస్తున్నారు. ఇంత మంది rich పీపుల్. అన్ని రకాలుగా encourage చేసే parents ఉండగా. నాలాంటి వాడికి సీట్ రావటం అసంభవం అనుకున్నాను మనసులో.
మొత్తానికి ఎలాగో ఒకలా entrance ముగిసింది.. ఫలితాలు వెలువడ్డాయి..


సీట్ విషయం అంటారా. నాకేందుకొస్తుంది చెప్పండి..ఈ ఫై ఫై మెరుగులు చూసి..భయపడి..inferior గా ఫీలయ్యే నాలాంటి వాడికి అస్సలు రాదు........

కట్టు కథ -1



దేవుడు అందరికి   ఏదో ఒక టాలెంట్ ఇస్తాడని అంటారు..నాకేం టాలెంట్ ఇచ్చాడో ఇప్పటికీ  తెలిదు. ఇంటర్మీడియట్ వరకు హ్యాపీ గ గడిచి పోయింది  ఆడుతూ పాడుతూ,, అప్పుడు తెలిదు జీవితం  మనిషిని పీల్చి పిప్పి చేస్తుందని..
దరిద్రం నన్ను, నా attitude ని మార్చి వేసింది.  ఇంటర్ తరవాత డిగ్రీ కోసం హైదరాబాద్ వొచ్చాను.. ఒక పనికి మాలిన న కాలేజీ లో చేరాను. కనీసం  బిల్డింగ్ అయినా   posh గా లేదు. ఉదయం  ఆర్ట్స్ goups , మధ్యాన్నం నుండి science groups . అప్పట్లో ఏమి తెలిదు, చెప్పే నాథుడు లేడు. వెళ్లి Bsc MPC   లో జాయిన్ అయ్యా వేరే  దిక్కు  లేక.   ఇంటర్ దాక తెలుగు మీడియం, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం. 
మధ్యాన్నం కాలేజీ కావటం తో బాగా  తిని కాలేజీ కి రావటం, అక్కడ నిద్ర మత్తులో పాటాలు ఏమి అర్థం కాలేదు.
కనిసం అమ్మాయిలైన ఉన్నారా అంటే  40 మంది అబ్బాయిలు,  కేవలం 5 మంది అమ్మాయిలు. వాళ్ళు కూడా చూడటానికి అంతగా బాగుండే వారు కాదు.అది కాక వాళ్ళతో మాట్లాడాలంటే భయం. వాళ్ళేమో  ఇంగ్లీష్ మీడియం.కొంచం డబ్బు గల వాళ్ళుగానే  కనపడే వాళ్ళు.
నా మొహానికి  పారగాన్ స్లిపెర్స్ , పారలల్ బాగి  ప్యాంటు. రెండే రెండు జతలు  ఉండేవి. పొట్ట కొస్తే ఇంగ్లీష్ ముక్క నోట్లోంచి రాదు. అందంగా కనపడే బట్టలు లేవు. కాళ్ళకి షూస్ కూడా లేవు. అమ్మాయిలతో మాట్లాడాలంటే బెరుకు. భయం. నాతో ఎవరు మాట్లాడుతారు ??
అదే  Bcom లో చాల మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు . అమ్మాయిలు అబ్బాయిలు హాపీగా ఏ అరమరికలు లేకుండా నవ్వుతు మాట్లాడుకునే వాళ్ళు.. కలిసి సినిమాలు, షికార్లు వెళ్ళేవాళ్ళు. 
ఒక రోజు  నేను కాల్గే కి వెళ్తుంటే.. ఒక అమ్మాయి, సూపర్ గా ఉంది.  Bcom అనుకుంటా,  స్కూటీ మీద వొచ్చింది ,  అప్పుడే classes నుండి బయటికొచ్చిన  వాళ్ళ classmate   (వాడూ handsome గానే ఉన్నాడ. నీటు   గా  డ్రెస్, inshirt వేసి  , కాలకి షూస్. చేతికి soprts వాచీ)
"హాయ్ రవి అని  తెల్లని అందమైన  చేయి చాచింది. వాడు తన చేతిని ఆమె చేతితో కలిపి మృదువుగా నొక్కాడు.ఒక్క క్షణం లో ఆ  దృశం 10 సార్లు repeat అయ్యింది,  వాడి అదృష్టానికి  నాలోని ఈర్ష  లావాలా పొంగింది.
నా జీవితం లో ఒక అమ్మాయి నాకు అలా షాకే హ్యాండ్ ఇస్తుందా అని అనిపించింది.
"హే కాలేజీ కి రావలనిపిచలేదు .. what happened  in the class ? 
"nothing much,  as usual" 
సర్లే గాని సిన్మకేల్దామా  ? "    నాకైతే గోదారి గలా గలా అంటే ఇదే నేమో అని పించింది.
వాడు సరే అని  స్కూటీ ఎక్కాడు.
చీ వెధవ జీవితం . నన్ను నేను తిట్టుకొని తిట్టు లేదు, ఆ క్షణంలో.
  ఫస్ట్ ఇయర్ అంతా terms , vocablary   నేర్చుకోటానికే సరి పోయింది. రెండు సబ్జక్ట్స్ లో ఫెయిల్. ఎలాగోలా suplamentary లో   పాస్ అయ్యా.
సినిమాల  పిచ్చితో సెంకండ్ ఇయర్ లో ఫెయిల్ మళ్లీ రెండు సబ్జక్ట్స్ మిగిలిపోయాయి.ఈ సారి suplamentary  లో కూడా పాస్ కాలేక పోయా.
 కాని నా దృష్టి  చదువు మీద లేదు.  ఎలా? ఎలా? ఎలా?  నేను handsome boy  కావలి  ? ఇంగ్లీష్ లో తెలుగులో అనర్గళంగా అమ్మాయిలతో గల గలా మాట్లాడి వాళ్ళని కిల కిలా నవ్వించ గలగాలి?  ఎం చేస్తే అలా కాగలను ? ఇవే ఆలోచనలు.

దాంతో  ఫైనల్ ఇయర్ లో కూడా ఫెయిల్. మళ్లీ రెండు సబ్జక్ట్స్.. సిగ్గుపడి, కష్టపడి, సెప్టెంబర్ లో గట్టెక్కి, ఏదో డిగ్రీ అయిన్దనిపించా .

తరవాత ఎం చేయాలో తెలిదు. తెలిసినవి రెండే రెండు.. అయితే BEd , లేకుంటే  Msc.

వాటిల్లో కూడా సీట్ రాలేదు. మా నాన్న పోరు పడలేక certificate course in library sciece లో  చేరా . కాని అదేదో వింతగా అనిపించింది.  దానికి తోడూ వినీత నన్ను పట్టిచుకోలేదు. ఆ కోర్సు ని మధ్యలో వదిలేసా. 
నాన్నని అడిగాను.. స్పోకెన్ ఇంగ్లీష్ లో జాయిన్ కావాలని ఉంది అని. 
నీ మొహానికి తెలుగే రాదు, అది నేర్చుకో ముందు అన్నాడు. ఇక ఎం చేయాలో తెలియలేదు.
రోజు తినం పడుకోటం తప్ప వేరే పని పాట లేడు.
ఇలా అయితే లాభం లేదని రోజు deccen cronicle తెచుకొని బిగ్గరగా చదవటం, తెలియని పదాలకి అర్థాలు రాసుకోతం చేశా. మెదడు నిండా ఒకటే ఆలోచనలు. మారాలి , నన్ను నేను మార్చుకోవాలి..ఏదో ఒకటి చేయాలి.
 ఒక కొత్త కోర్సు,   అందట్లోకి గొప్పగా చూపించేది,  మా సర్కిల్ లో diffrent గా, డబ్బు విలాసం అన్ని ఇచ్చేది , రిచ్ అండ్ పోష గాళ్స్ తో  కళ కళ లాడేది ...   ఒక కొత్త కోర్సు చేయాలనిపించింది.. అలా ఓ రెండు నెలలు పేపర్లు కెరీర్ magazines తిరగేస్తే.....

Mar 5, 2010

దేవుడు



మొన్న ఆ మధ్య "దేవుడు " గురించి ఒక కమ్యూనిటీ లో discussions జరిగింది..అందులో ముఖ్యమైన పాయింట్స్ బ్లాగ్ లో పెడదాం అనిపించింది..

M: దేవుడు ఈ కష్టాలు ఎందుకు తీర్చటం లేదు?అమ్మ ఎంత ఆకలి వేస్తున్నా ఎందుకు అన్నానికి పిలవట్లేదు అంటే ఈ రోజు పండగ అన్నమాట. అమ్మ మనకోసం చాల చాల తీపి వంటకాలు చేస్తున్నది.

M :ఒక అతన్ని మరొక వ్యక్తి అడిగాడట , బాబు! నీవు ఇంతగా దేవుణ్ణి నమ్ముతున్నావు, నీ కొడుకు చనిపొయ్యాడు కదా ఇక నైన దేవుణ్ణి నమ్మకుండా వుంటావా అని, "అయ్యా పోయిన కొడుకు పోనే పొయ్యాడు ఉన్న ఒక ఆధారము కూడా పోగొట్టుకోమంటారా? " అన్నాడట.- చలం ఉత్తరాలు

చక్రి :అమ్మ తీపి వంటకాలు చేస్తుంది సరే,, కానీ ఈ లోపు కుర్రాడు ఆకలితో చచ్చి ఊరుకుంటే ?? 

"యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అబ్యుధానం ఆధర్మస్య : తదాత్మానం సృజామ్యహం" 

భగవత్ గీత శ్లోకం .. మన భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే అంతా అయిపోయిన తరవాత ..చివరలో..

ఇక రెండు నిముషాల్లో చస్తాం అనగా అప్పుడోస్తాడు.. ఈ లోపు మంచి వాడు కష్టాలను అనుభవించి అనుభవించి చావుకి రెడీ ఐన తరవాత.. ఇక చెడ్డ వాడు అన్ని అనుభవించి సంతృప్తి చెందే సమయంలో భగవంతుదోస్తాడు.. ఆ సమయంలో వచ్చినా రాకున్న పెద్దగా ఒరిగేదేం లేదు..
లోకం లో జరుగుతున్నది ...జరిగేది ఇదే...
ఎమన్నా అంటే పాపం పండాలి అంటారు.. ఎందుకు పండాలి..మొగ్గలోనే ఎందుకు తున్చకూడదు??
 
K : chakri gaaru...
dhevudu oka optimistic solace...


చక్రి:  కే.. గారు.. మీరన్నది నిజమే ఐనప్పటికీ.. ఈ దేవుడు, మతం ,, కులం ,పూజలు పసుపు కుంకుమలు విగ్రహాలు . బ్రమ్హోత్సవాలు రథొత్సవాలు .. కార్తీక స్నానాలు..కుంభ మేళాలు.. మడి.. మైల.. అంట్లు.. ఆచారం.
పొద్ద్దున లేస్తే మైకుల్లో అరుపులు.. ఒకవైపు గుళ్ళో పాటలు.. ఇంకో వైపు మసీదు నమాజులు .. మరో వైపు దివ్య మహా సభలు ..
ఒకడు సత్య సాయిబాబా అంటదు.. ఇంకోడు కాదు కాదు షిర్డీ సాయిబాబా అంటాడు..
శనికి తైలాభిషేకాలు .. పాముకి పుట్టలో పాలు ...
అది కాక politicians ఊరేగింపులు ,, వినాయక నిమజ్జనాలు,పెళ్లి బారాత్ లు ఎన్నని చెప్పాలి...
మీకు ఈ experiences ఉన్నాయో లేదో తెలిదు .. నేను మాత్రం అన్నిటితో విసిగి పోయాను..
ఈ దేవుడు అనేది వ్యక్తిగతంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలిదు 
( మీరన్నట్టు ) కాని సమాజ పరంగా కొంచ నష్టమే ఎక్కువ.. ఇది నా అభిప్రాయం .

M: సమాజానికి కూడా ఉపయోగమే. నాస్తికులైన మన పక్క రాష్ట్రము వాళ్ళని చూడండి, ఏమి చెయ్యాలో తెలియక బతికున్నవరినే దేవుడిగా పూజిస్తారు. హీరోయిన్ లకు గుళ్ళు కడుతున్నారు. హీరోలకు పాల అభిషేకాలు చేస్తున్నారు. ఈ హీరోలు హీరోయిన్లు మాకు అలా చేయ్యమని అడగనట్లే దేముడు కూడా అడగలేదు. ఇది అలా చేసిన వాళ్ళ మనో వికారం. /ఆనందం .కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే, TV చూడటం చాల మందికి కాలక్షేపం అయినట్లే ఇది కూడా . మీకు ఇష్టమైతే ఉత్సవంలో డాన్స్ చెయ్యండి లేకుంటే లేదు :) 

 

చక్రి: భలే చెప్పారండి.. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని tv చూస్తే ఎవరికీ ఏ బాధ లేదు ..
కాని రోడ్డు కేక్కితేనే నాలాంటి వాడికి బాధ........ఎవడింట్లో వాడు దేవుడినే పుజిస్తాడో దెయ్యాన్నే అవహిస్తాడో వాడిష్టం..
ఇక తిరపతి .. శ్రీశైలం..మక్కా ....(క్రైస్తవులకి ఏముందో ) ఇలాటి పుణ్య క్షేత్రాలు ఉందనే ఉన్నయి, కేవలం వీటి కోసమే ..దైవ భక్తి ఎక్కువైనవాడు అక్కడికి వెళ్లి హాయిగా పారవశ్యం చెందవచ్చు కాని ఈ మైకుల్లో అరుపులే .. నోటితో అరిస్తే కాసేపుకి అలసి పోతారు కాని మైకుల్లో పాటలు ఎవడికి కావాలి..??
గల్లి గల్లి లో .. వినాయకులు.నాయకులూ. మైకుల్లో అరుపులు... మాట్లాడితే రోడ్డెక్కి తైతక్కలాడటం...







ఏమి భాగ్యమది.

సినిమా షూటింగ్ కోసం .. కులు, మనాలి వెళ్ళాం.
మనాలి నుండి " లే లడక్" దారిలో షూటింగ్ లొకేషన్ ఉంది.
అక్కడే  సాయంత్రం దాక షూటింగ్ చేసాక,  చీకటి పడుతుండగా  మిగతా వాళ్ళందరూ తిరిగి బస చేసిన hotel కి వెళ్ళిపోయారు.. నేను మా డైరెక్టర్, మిగతా మెయిన్ టీం దారిలో ఇంకో చిన్న ప్రాంతంలో షూటింగ్ చేయాలనీ అక్కడికి చేరుకున్నాం....అ ప్రదేశం అచ్చం "చలం" గారు వర్ణించినట్టు .. చుట్టూ మంచు కొండలు, దాన్ని తాకుతూ మెలికలుగా రోడ్డు.. పక్కనే ఒక చిన్న కొలను...మంచు కరిగి చేరిన స్వచ్చమైన చల్లని నీరు అ కొలనులో..

సాయంత్రం చీకటిగా మారుతోంది...ఇంతలొ ఎవరో అన్నారు..ఈ రోజు పౌర్ణమి అని .. చుట్టూ చూస్తున్నాం..ఏవైపు నుండి చంద్రోదయం అవుతుందా అని.. కొంత సేపు తరవాత .....


ఓ వైపు తెల్లని వెండి కొండల మధ్య నుండి  కాంతి పుంజం దర్శన మిచ్చింది.. అ వైపు కెమెరా ఆన్ చేసి కూర్చున్నాం..చల్లని మంచు గాలి మమల్ని సన్నగా వోణికిస్తోంది. ఇంతలో.. . మెల్లిగా.. తెల్లగా.. మంచు కొండలని వెండిలా మెరిపింప చేస్తూ.. నిండు చంద్రుడు దర్శన మిచచ్చాడు .
వావ్ ..ఏదో తెలియని ఆనందం చుట్టుముట్టేసింది..

.....నేనంటూ లేకుండా ఆ కాంతి లో ఐక్యమైతే ... ఏమి భాగ్యమది.

Mar 3, 2010

ప్రశ్నించుకోండి.....




                                

మునుపెన్నడో శంకర మఠం హత్యోదంతం.. అప్పుడెప్పుడో పుట్ట పర్తి ప్రశాంతి నిలయం లో హత్య.. మొన్న కలికి భగవాన్, నిన్న నిత్యానంద స్వామి రాసలీలలు..

వీళ్ళని ఆరాధ్య దైవాలుగా చేసుకొని.. మహిమల్ని ఆపాదించింది ఎవరు??
 
వీళ్ళకి విరాళాలు ఇచ్చి పెంచి పోషించింది ఎవరు ?
వీళ్ళ ఫోటోలు పెట్టి పూజలు, భజనలు చేసింది, చేస్తోంది ఎవరు ?

కాషాయం కట్టగానే కామం మాయం ఐపోతుందని ఎవరు చెప్పారు ?
జీవిత మూల సూత్రాలు మరిచి పోయారా ? 

కూడు , గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. ఒక వయసు వచ్చాక కామం ప్రాథమిక అవసరం అని వేరే చెప్పాలా??
పడక గదుల్లో కెమెరాలు పెడితే , తపస్సు చేసుకుంటున్న నిత్యానందులు  కనపడతాడా?? 

ధనం మూలమిదం జగత్ అని మళ్లీ గుర్తు చేయాలా నేను ??
డబ్బు ముందు నైతికవిలువలు నిలబడవని తెలుసుకోలేదా?
కోటి విద్యలు కూటికోసం అని తెలిదా?? 

The fittest will survive అని పెద్దలు చెప్పింది మరిచారా ???? 

మీ జీవితాలని మార్చేస్తా అని వాడంటే మటుకు మీరెలా నమ్ముతారు ?
ఎం చదువు కున్నారు ? డిగ్రీలుంటే సరిపోతుందా.. విచక్షణా జ్ఞానం ఉండక్కరలేదా??

కళ్ళ ముందు సత్యం ..నిత్యం కనబడుతోంటే.. గుడ్డి వాళ్ళయ్యారా??
ఎవడో చెప్పే కాకమ్మ కథలకి పడి పోతారా ??

"చలం" అసలు సంగతి  అరచి చెపుతూ ఉంటె  వినపడలేదా??

తిరగేయండి గ్రంధాలని
ఒంటబట్టించుకోండి సారాంశాన్ని,
వెతకండి ములాలని,
కనుక్కోండి సత్యాన్ని,
ప్రశ్నించుకోండి మిమల్ని మీరు.  

Mar 2, 2010

రంగుల లోకం పిలిచే వేళా ..





నిన్న (అంటే  మార్చ్  1 సోమవారం 2010) ..హైదరాబాద్ అంతా  హోలీ పండగ  బాగా చేసుకున్నారనుకుంటా ..నేను మాత్రం ముందురోజే  హైదరాబాద్ విడిచి పారి పోయా..
 పార్వతి, శివుడికై తపస్సు.. అది  చూసి  కాముడు  ( మన్మదుడు  ) పార్వతికి  సహయంచేద్దామని   శివుడిపై పూల బాణం వేయటం..శివుడు ఆగ్రహంతో కాముడిని  బస్మం చేయటం.. దానికి నిదర్శనంగామనం కామున్ని దహనం చేసి ఒకరి పై ఒకరు రంగులు పోసుకొని  .. ..ఈ  పండగ చేసుకోటం ...భలే భలే ..
ఈ గోలంతా భరించే ఓపిక లేక , ముందు రోజు సాయంత్రమే నేను , మా కజిన్ తో కలిసి వాళ్ళ ఊరికి ప్రయాణం కట్టా .  
వాళ్ళ ఊరు..చుట్టుపక్కల ఉండే పంటపొలాలు..చిట్టడవులు..రాళ్ళూ రప్పలు..గుళ్ళు గోపురాలు..అన్ని చుట్టేసాం .. అలసిపోయి సుస్టుగా తిని పడుకున్నాం.. మావాడికి ఆఫీసు ఉంది కనక పొద్దున్నే లేచి తిరుగు ప్రయాణం అయ్యాం.
వొచ్చీ రాగానే  పాల కోసం షాప్ దగ్గరికేల్లాను .ఓ కాలేజీ  అమ్మాయి రీ ఛార్జ్  కోసం వొచ్చింది. మొహం అంత గులాబీ రంగు..హోలీ  రంగు ఇంకా పోనేలేదు. అప్పుడు అనిపించింది.. నేను హోలీ మిస్ అయ్యానా అని. 
ఇంటికొచ్చి చాయ్ తాగి, కెమేరా  లో షూట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ చూడ్డం  మొదలెట్టా, అప్పుడు తెలిసింది.  నామీద కూడా రంగు పడిందని.
ఎలా అంటారా ....


షామీర్ పేట్ లేక్  లో.. ఆకాశం చిమ్మిన నీలం , కెంజాయ రంగులు,
పంటచేలు పులిమిన ఆకుపచ్చ రంగు,
మోదుగచెట్టు గుప్పిన ఎరుపు రంగు,
పల్లె మనుషుల...పసి మనసుల అద్దిన తెలుపు,
పూదోట   చిలకరించిన  పసుపు, గులాబి రంగులు..
అడవి పువ్వులు..పోద్దుదిరుగుడు   చల్లిన   పసుపు  రంగు..

ఇలా ...ప్రకృతి కాంత నా మీద చల్లిన ర్ణాని  ఫోటోల్లో  దాచేశా...!!