Oct 29, 2009
నా స్వేచ్ఛ
నేను సాంప్రదాయక మధ్య తరగతి కుటుంబం లో పుట్టాను . నా చిన్నతనం హాయిగా గడిచిపోయేది..తినడం.. స్కూలు .. ఆటలు.. ఇవి తప్ప నాకు మరో ప్రపంచమే తెలిదు..ప్రకృతి అంతా వింతగా తోచేది. ఇంటి వెనక తోటలో కూసే పిచ్చికలు, రంగు రంగుల సితాకోక చిలకలు , తూనిగలు, బోసి నోళ్ళతో నవ్వే పువ్వులు..ఆకాశంలో లో మెరిసే చుక్కలు .. వీటిని చూస్తూ సమయం గడిపేవాడిని.
స్కూలుకి వెళ్ళడం, అదో బద్ధకం.. నరకంగా తోచేది బడి అంటే. కాని తప్పించుకునే మార్గమే లేదు..ఈవిషయం లో మా అన్నయ్యని చూస్తే అసూయ కలిగేది..అన్నయ్య కాలేజి కావటం తో హాయిగా సైకిలు ఫై వెళ్ళేవాడు..పైగా ఒకటే పూట. ఇంకా చాల సార్లు క్లాసులు లేవని ఇంట్లోనే ఉండేవాడు..అది చూసి , పెద్దవాడి నవుతానా అని ఆలోచించే వాడిని.. కాని ఎలా..???
ఎలాగోలా పదవ తరగతి పూర్తి అయింది.రెండు కొత్త pants కుట్టించారు , నేను పెద్దవాడిని అయ్యానన్న సంతోషం కల్గింది. నేను మా అన్నయ లాగే హాయిగా సైకిలు పై కాలేజి కి వెళ్ళొచ్చు అని కలలు కన్నాను, కాని మా నాన్న నన్ను పక్క టౌనులో join చేసాడు. రోజు బస్సు లో వెళ్ళాలి..
ఇంక రోజు అద్దం ముందు గడిపే సమయం ఎక్కువైంది..గంటకోసారి ముఖం కడుక్కోవటం..ఫెయిర్ N లవ్లీ .. పౌడర్ అద్దటం. చెంపలకి వచ్చిన చిన్ని మొటిమలు పెద్ద సమస్య ఐపోయింది నాకు. మనసంతా ముఖం మీద, హెయిర్ స్టైల్ లోను.. డ్రెస్సింగ్ మీదా ఉండేది. చుక్కల్లా మెరిసే అమ్మాయిల కళ్ళు....పువ్వుల్లా నవ్వే పెదాలు ఇవి కొత్త వింతలయ్యాయి.
కాలేజి..ఫార్ములాలు .. నంబర్లతో కుస్తీ .. ఇల్లు .. రెట్టింపైన హోం వర్క్ ...నరకం అంటే ఇదే కాబోలనిపించేది.
పెద్దయితే ఏదో హాప్పీగా తిరగొచ్చు అనుకున్న కాని..more syllabus,more house hold work,, more self conscious...తో ఉన్న స్వేచ్ఛ కాస్త పోయింది .
ఇక క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళటం మెదలెట్టాను. సినిమాలంటే పిచ్చి ఎక్కువయింది , వారానికి మూడు సినిమాలు.హాల్లో సినిమా మారకపోతే చూసిందే చూడటం .. సినిమాకి డబ్బులు లేకపోతె కాలేజి కి దగ్గరలో ఉన్న గుట్ట పై కి వెళ్లి స్నేహితుడి తో లోకం .. జనాలు..దేవుడు.. ఫిలాసఫీ మాటలాడుకోవటంతో నా స్వేచ్ఛని తిరిగి పొందాను. తోచింది చేయటమే తప్పితే జీవితం, దాని సూత్రం ఏంటో పసి గట్టలేక పోయాను. .
......ఇంకా ఉంది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment