ఏంటి వీడెవడో స్టైలిష్ గా పోనీ టైల్ వేసుకొని..తెగ పోసులు కొడుతున్నారు అనుకుంటున్నారా..
లేక ఈ ఫోటో ఎందుకు పెట్టా ఇక్కడ అని అలోచిన్స్తున్నారా ...అయ్యో అది నేనే నండీ బాబు.ఏంటి నమ్మకం లేదా ..చెపుతా ..
మీకు ఈ వాస్తవ ప్రపంచం బోర్ గా ఉందా,, ఎలా జీవించాలో అలా ఉండలేక పోతున్నారా..అంటే ఓ నలుగురు గాల్ ఫ్రెండ్స్ ని మైంటైన్ చేయటమో, లేక రెండు అందమైన ఇల్లు లేకపోటమో, లేక తెలవార్లు తాగి తందనాలు అడటమో??
అయితే ఆ విషయం లోకి వెళ్దాం
అదొక వింత లోకం, కాల్పనిక, మాయా, వెబ్ ప్రపంచం. అచ్చం ఈ మన వాస్తవ ప్రపంచం లాగే. అమెరికా , యూరోపు జనాలు వెర్రి ఎత్తినట్టు ఈ కాల్పనిక ప్రపంచం లో నివసిస్తున్నారు... వాస్తవ ప్రపంచాన్ని వొదిలి..ఈ రోగం ముదిరి కొంత మంది పెళ్ళాలని , ఉద్యోగాలని కూడా వదిలేస్తున్నారు..
ఏది ప్రస్తుతం ఆసియా దేశాలలో అంతగా పాకలేదు..రేపో మాపో అది జరిగితే....
చెప్పాగా , పోనీ టైల్ వేసుకున్నవాడు నేను..
దాన్ని అవతార్ అంటారు..నా అవతార్ అన్న మాట...అది నేనే డిజైన్ చేసుకున్నా..నేను ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు . ముఖం, తల కట్టు, దుస్తులు, చెప్పులు, ఆభరణాలు....గాగుల్స్ ..అన్ని సెలెక్ట్ చేసుకొని మన అవతార్ ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు..
ఇది social networking site . కాని 3d అవతార్లు ఉంటాయి కనక గేమ్ లాగా అనిపిస్తుంది. అంటే..నేను నా అవతార్ ని క్రియేట్ చేసుకొని ఆ లోకం లోకి అడుగు పెడతా..నాలాగే చాలా మందీ నూ .
streets , hotels , restorents , pubs , beaches , shopping ఒహ్ ..మనకి నిజ జీవితం లో ఎలా ఉంటాయో అక్కడ అలా ఉంటాయి.. ఇక మనం చేయ వలసిన పని అల్లా.. అలా వీదుల్లో తిరుగుతూ ..కొత్త వాళ్ళతో పరిచయం.. హాయ్ హౌ ఆర్ యు ??అని ..అలా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించు కొని స్నేహం మొదలు పెట్టవచ్చు.
లేదా ఒక అమ్మాయిని/అబ్బాయి తో పరిచయం.. చెట్టా పట్టాల్ వేసుకొని అలా అలా తిరిగి ఒక గ్రీటింగ్ కార్డు, గిఫ్ట్ ఇచ్చి..love లో పడొచ్చు..అలా మీ dating ముదిరితే హోటల్ రూం కో ,,లేదా మీ ఇంటికో..బీచ్ లోనో.. ఎక్కడ అనిపిస్తే అక్కడ u can make love...ఇద్దరు ఒకరి కొకరు వదిలి ఉండలేక పోతున్నారా.. అయితే ఎంచక్కా పెళ్లి కూడా చేసుకోవచ్చు..
పెళ్లి లో ఫోటోలు కూడా తెసుకోవచ్చు.. పెళ్ళికి అందరిని పిలవొచ్చు..డ్రింక్స్ DJ ఏర్పాటు చేయొచ్చు... హనీ మూన్ కి వెళ్ళొచ్చు ..పెళ్లి పెటాకులయితే విడాకులు కూడా తీసుకోవచ్చు , తాగి తాగి దేవదాసు లాగా మారిపోనూవొచ్చు..వీధుల్లో పడి అల్లరి చేయొచ్చు, అమ్మాయిలని ఏడిపిస్తే శిక్ష కూడా ఉంటుంది కనక జాగ్రత్త.
ఇంతే కాదండోయి.. మీరో ఇల్లు రెంట్ కి తీసుకొని.. హ్యాపీగా మీకు కావలసినట్టు అలకంరించుకొని..మీ ఆవిడతో/ గర్ల్ ఫ్రెండ్ తో కాపురం చేయొచ్చు .. అచ్చం నిజ జీవితం లో లాగే.
అక్కడ కూడా మనీ ఉందండోయ్ ..అక్కడ రాయల్ లైఫ్ గడపాలంటే మనీ కావాల్సిందే. అ డబ్బు మీరు అక్కడే సంపాదించు కోవచ్చు ..గేమ్ మనీ అన్న మాట..ఆ గేమ్ మనీ ని రియల్ మనీ గా కూడా మార్చుకోవచ్చు..
ఇంకా ఇంకా చాల చేయొచ్చు. ఎంత తాగినా ..ఏంటి సిగరెట్లు కాల్చినా ఆరోగ్యం పాడవదు ..స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్ లాంటివి రావు. భలే ప్రపంచం కదూ.నాకు మొదట్లో దిమ్మ తిరిగి పోయింది.. కోలు కోవటానికి మూడు నెలలు పట్టింది.
మనం ఇక్కడ కంప్యూటర్ ముందు డు కూర్చొని ఆ అవతర్నాలి అడిస్తున్నట్టే అసలైన మనం ఎక్కడో ఉండి ఈ నిజమనుకుంటున్న మనల్ని అడిస్తున్నామేమో..??
2 comments:
hi .... :) good to catch ya here !
adnnamata vishayam. andduke pelli mata ettatledu tamaru. antaa virtual ga jarigipotunnayiga.
Post a Comment