Dec 14, 2011

లవ్వు& హేట్

టీ పౌడర్ కొందామని ఓ దుకాణానికి వెళ్ళనా.. అచ్చు గుద్దినట్టు ఉన్న ఇద్దరమ్మాయిలు.. అక్క చెల్లెళ్ళు అని చెప్పకనే చెపుతున్నారు. మొదటి పిల్లని చూసాను నా చూపు తగలగానే ముఖం ముడుచుకొని.. తల పక్కకి తిప్పేసింది. " తరుణీ కడకంటి చూపులకి కూడా నోచుకొని జన్మా ఒక జన్మేనా .....థు
దీనమ్మ జీవితం... అని ఏదో తెలీని బాధపడుతుండగా .. ఆ రెండో పిల్ల నన్ను చూసింది. కళ్ళతో నవ్వింది.. ఆ తరవాత పెదాలు విచ్చుకొని ముసి ముసి నవ్వు నాపై రువ్వింది. ఆహా.. 'జగమే మారినది మధురముగా ఈ వేళా.' పాట మొదలయ్యింది. ఏముంది 3 smiles and 6 looks ..  కొంచం సేపు కాలం ఆగిపోయింది. చేసేదేం లేదు, చేసిందేం లేదు కానీ ఓ నిముషం పాటు సంతోషం. :)
సో చెప్పొచ్చేదేమిటంటే....
1) మనకి కావలసింది దొరక్క పోయినా పక్కది దొరికితే సంతోషించాలి.
2) లవ్వు, హేట్ అక్క చెల్లెళ్ళు. పక్క పక్కనే కలిసి ఉంటాయి.
3)కారణాలు తెలీదు కాని మనం అంటే కొందరికి ఇష్టం ..మరికొందరికి అయిష్టం. అయిష్టాన్ని అటు తోసేసి ఇష్టాన్ని దగ్గరకు తీసుకోవాలి.
4) మనని వద్దు అనుకున్న వాళ్ళని విసిగించి ఆసిడ్ పోయకుండా.. కావాలనుకుంటున్న వాళ్ళని పట్టించుకోవాలి
5) ....

6) ....
7).....

Dec 2, 2011

ఎప్పుడు కష్టాలు వచ్చినా..

 
"మగాడి గుండెల్లో అంతులేని బాధ ఉన్నా.. కృష్ణుడి వేషంలో NTR నవ్వినట్టు  దరహాసం ఇవ్వాలి. అదే ఆడాళ్ళు అయితే వలవలా ఏడ్చేస్తారు. ఎందుకంటే...
అది కలియుగపు ఆరంభపు రోజు.. కలియుగంలో దేవుడు ప్రత్యక్షం అవ్వటం అనే మాట ఉండదు. మానవ జంట ని సృష్టించి నిషిద్ద ఫలం గురించి చెప్పి వెళ్ళిపోయాడు. ఈవ్ నస భరించలేక ఆడం ఆపిల్ తెంచాడు. ఇద్దరూ ఆపిల్ పండు కోరికాక, కొంచం అదోలా అనిపించింది, తెలీని ఓ  గొప్ప బాధ మొదలయ్యింది. ఆది చూసి దేవుడు చిట్ట చివరి సారి ప్రత్యక్షమయ్యి చెప్పుకోండి మీ బాధలు...అని అడగ్గానే, తీర్చే వాడు వచ్చాడన్నచిన్నిసంతోషంలో మగాడు 'చిరునవ్వు' నవ్వాడు. భారీ సీరియల్ మొదలెట్టేముందు ఏడ్చినట్టు ఆమె 'కన్నీళ్ళు' పెట్టింది.
ఇంతలో ఓ అశరీరవాణి కలియుగం ఆరంభం అయ్యింది కదా, ఇహ మీరు మనుషులకి కనిపించటం.. కష్టాలు వినటం.. తీర్చటం చేయకూడదు, మరిచిపోయారా అని చెవిలో ఉదగానే నాలిక్కరుచుకొని దేవుడు మాయం అయ్యాడు. వీళ్ళకి మాత్రం ఆ expressions మిగిలాయి . అప్పటినుండి ఎప్పుడు కష్టాలు వచ్చినా అవే continue అవుతున్నాయి. అదీ అసలు సంగతి. ;)

Dec 1, 2011

విముక్త ( కథలు )

పురాణ కథల్లో నాయకులు ధర్మం కోసం పాటుపడి దాన్ని పునర్నిర్మించటానికి ప్రయత్నించి గెలిస్తే గెలుస్తారు గాక.. కాని ప్రతి పురాణ పురుషుడి వెనకా ఓ స్త్రీ హృదయపు ఆక్రందన ఉంది. స్వయవరంలో రాముడిని వరించి పెళ్ళిచేసుకొని అష్టకష్టాలు పడింది సీత. రాముడిని వలచి వచ్చి అవమానానికి గురయ్యి అంతులేని వేదనకి గురయ్యింది శూర్పణఖ.
అవతార పురుషుడిని వరించినా ధర్మబద్దంగా ఇద్దరికీ అన్యాయమే జరిగింది. .. అయినా ఆ ఇద్దరూ పోరాడి..మనసుని స్వాంతన పరచుకొని ఒంటరి జీవితాన్ని గడిపారు.
రామాయణంలో ఆవేదనకి గురయిన స్త్రీ పాత్రల గురించి చదవండి....ఆలోచించండి.

విముక్త ( కథలు ) రచన : ఓల్గా