ఓ మై డాలింగ్..
నిన్ను ముద్దు పెట్టుకున్న ప్రతి సారి..
ఉపిరిగా మారి ...గుండెల్లో నిండి.
నర నరాన పాకుతూ .. మత్తెకిస్తావ్..
గంట గంట కీ నివు లేనిదే నాకేం తోచదు..
పని అయిన ..కాకున్నా..
బాధొచ్చినా.. సంతోషం చిందినా..
రోజు వారీ జీవితంలో గెలిచినా ఓడినా..
పొద్దు పొడిచినా...పొద్దు వాలినా..
ఎండనకా..వాననకా..
చలి లో.. గిలిలో...నీవే నాకు తోడు.
ఎప్పుడు ఎలా ఎందుకు పరిచయం అయ్యావో తెలిదు.
తెల్లని దుస్తుల్లో దేవతలా వచ్చావు..
నన్ను నా జీవితాన్ని పాలిస్తున్నావు..
బతుకంతా తోడుంటావు ..చితి దాకా నడిపిస్తావు.
నీవు నా చేతుల్లో వెలుగుతావు.. నా జీవితం నీ చేతల్లో ఆరుతుంది.అయినా I love u darling. :)
1 comment:
మీ "ఓ మై డార్లింగ్" చదివి
కనీసం ఒక్కరైనా పొగ ప్రేమలో పడకపోతే బాగుండును.:-)
ఫోటో చాలా ఆప్ట్ గా కవిత సూపర్ గా ఉందండి!
Post a Comment