May 6, 2012

వెతుక్కుంటున్నాను.



 ప్రపంచం అంతా ఎక్కడికో పరిగెడుతోంది పరిగెడుతోంది  ... రాత్రిని పగటిగా వెలిగించే  విద్యుద్దీపాలు.. ఆకాశ హర్మాలు.. రాజహంసలాంటి  కార్లు..
దేశాలకి చేరవేసే విమానాలు..కొత్త  ప్రపంచాన్ని సృష్టించే  సాఫ్ట్వేర్ లు...

నేను మాత్రం..  మబ్బుల్లోని చల్లదనం  
..ఆకాశపు రంగులు  ..పర్వతాల గంభీరత... పక్షుల రెక్కల్లోని మృదుత్వం.. విత్తులో దాగిన చెట్టు...ఆకుల పచ్చదనం..మన్నులోని కమ్మదనం.. నా గుండెల్లో ప్రేమ.. జీవితానికి అర్థం.....  వీటిని వెతుక్కుంటున్నాను.




 



May 3, 2012

కర్రీ పాయింట్ జీవితాలు.


పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు ఉద్యోగాల జీవితంలో తినటానికే టైం లేని రోజులివి. ఇహ వంట చేసుకొని తినటం అంటే చాలా కష్టమైన పని. దానికి తోడు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవటం..మార్కెట్టు కెళ్ళి ఏకమొత్తంగా తెచ్చుకునే టైం లేకపోవటం.. తెచ్చినా అవి కడిగి తరిగి వంట చేసి తినే ఓపిక లేకపోవటం కర్రీ పాయింట్ వాళ్ళ బిజినెస్ పాయింటు. పెళ్లి అయినవాల్లయినా .. బ్రహ్మచారులయినా, పెళ్లి కాని ముదురులయినా.. విడిపోయిన ఒంటరులయినా అందరికీ ఆకలి తీర్చే అక్షయ పాత్ర ఈ కర్రీ పాయింట్లు.
జేబుల్లో డబ్బులున్నాయి..కాని వండే ఓపిక లేదు.
పొద్దున్నే బందీ మీద రెండిడ్లీలు గతికి .. మధ్యానం ఆఫీసులో ఏదో గడ్డి తిని ..రాత్రికి ఇంటికి వచేటప్పుడు రెండు చపాతీలు..ఓ కర్రీ.. లేదా ఓ పప్పు, సాంబారు తీసుకెళ్ళి రైస్ వండుకొని తినటం అలవాటయ్యింది జనానికి.
శని ఆదివారాలు ఎలాగు బయట తిరుగుళ్ళు..బయట తిండ్లె . ఓ నాలుగు వంటకాలు వండుకునేది మహా అంటే పండక్కే నేమో.
రాను రాను ఏ గడ్డు కాలం దాపురించ బోతోందో...!!

కోటి ఆశలతో..



కోటి  ఆశలతో నీకోసం వచ్చాను ...వెనక్కి పంపక నన్ను అక్కున  చేర్చుకో..    దీనుల , హీనుల దరి చేర్చుకునేది    నీవుతప్ప ఇంకెవరు తల్లీ...లోకంలో ,
నీ చరణ సన్నిధి కి చేరి 'అమ్మా'  అని పిలవనిస్తే చాలు, నాకింకేమీ వద్దు. 
నీవు కాదంటే నన్ను ఆదరించేవారు ఎవరున్నారు ?? 
 ఎక్కడికని వెళ్ళను..??  ఈ చిక్కటి చీకటి  వేళలలో ..రోదిస్తూ..!! 
- రవీంద్రుని కవితకి  తెలుగు అనువాదం 

.....

ఎప్పుడూ అద్భుతమే.


ఒకానొక ఉరికి ఓ యోగీశ్వరుడు వచ్చి ఒక మందిరాన్ని నిర్మించి అందులో ఉంటున్నాడు.     ఆ మందిరంలో ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నాయి . ఎంతోమంది అతన్ని కలుసుకొని ఆ వింతలకి తెలుసుకొని తమ తమ బాధలకి చిట్కా కనుక్కొని పోయేవారట.
ఒకనాడు ఒక యువకుడు అతని దగరికి వచ్చి. తన వంతు రాగానే
ఒకే ప్రశ్న అడిగాడు సూటిగా " నాకు ప్రపంచం సుందరంగా తోచటం లేదు. ఎటు చూసినా మోసం, దగా...దోపిడీ . నాకు బతుకు మీద ఆసక్తి పోయింది. " నాకు జీవితెచ్చని కలిగించే ఓ సూత్రాన్ని  చెప్పగలరా  ?? "
సరే అలాగే. ఒక పని చెయ్యి.. ఈ దీపం వెలిగించి చేతుల్లో పట్టుకొని ఈ  మందిరాన్ని మొత్తం చూసి వచ్చి నాకు చెప్పు మందిరంలోని వింతలూ విశేషాలు " అన్నాడు
యువకుడు దీపాన్ని వెలిగించుకొని వెళ్ళాడు. ఓ రెండుగంటల తరవాత తిరిగొచ్చాడు. దీపం చక్కగా వెలుగుతోంది.
ఆ యోగీశ్వరుడు అడిగాడు.  చెప్పు నాయనా ఎమేం వింతలూ చూసావో..??
దానికి యువకుడు నీళ్ళు నములుతూ.. "దీప్పాన్ని ఆరిపోకుండా కాపాడే ప్రయత్నంలో పెద్దగా ఏమి చూడలేకపోయాను. చూసినవి గుర్తే లేవు. " అని తల దించాడు.
యోగీశ్వరుడు చిరునవ్వు నవ్వి... సరే మరో అవకాశం ఇస్తున్నాను. మళ్ళీ తిరిగి వచ్చి చెప్పు అన్నాడు ఆ యువకునితో..
యువకుడు మళ్ళీ దీపంతో వెళ్లి  మరో రెండుగంటల్లో ఆనందంతో .. ఉత్శాహంతో వచ్చి తను చూసిన వింతలూ  వివరించాడు.
ఓపికగా విన్న యోగీశ్వరుడు.. ఆది సరే కాని దీపం ఆరిపోయింది కదా.. ఆది ఆరకుండా చూడాలని అన్నాను కదా.. అన్నాడు.
యువకుడు అప్పుడూ తేరుకొని దీపం వైపు చూస్తే ఆది ఆరిపోయి ఉంది. బిక్క మొహం వేసిన యువకుడిని చూసి చిరునవ్వు నవ్వి...
ఆనందం అనే దీపం బాల్యంలో బాగా వెలుగుతుంది. ఎందుకంటే
కల్మషం లేని మనసు  ప్రమిదగా..అమాయకత్వం/ స్నేహం/ ప్రేమ  వత్తిగా.. ఆసక్తి నునేగా  వెలిగి    ఏం చేసిన ఎటు చూసినా  ప్రపంచం అంతాఅద్భుతoగా తోస్తుంది.
కాని మనం పెరిగి పెద్దయ్యే కొద్ది ఆ దీపపు వెలుగు తగ్గుతూ ఉంటుంది. ప్రమిద కల్మషంతో చిల్లులు పడుతుంది..స్నేహపు వత్తి కాలి చిన్నడైపోతుంది. ఆసక్తి కలుషితం అవుతుంది..దాంతో దీపం కొడిగడుతుంది.

కనక ఆ ఆనందం అనే దీప్పాన్ని ఆరకుండా చూడగలిగిన వాళ్లకి  ప్రపంచం ఎప్పుడూ  అద్భుతమే !!