May 3, 2012

కర్రీ పాయింట్ జీవితాలు.


పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు ఉద్యోగాల జీవితంలో తినటానికే టైం లేని రోజులివి. ఇహ వంట చేసుకొని తినటం అంటే చాలా కష్టమైన పని. దానికి తోడు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవటం..మార్కెట్టు కెళ్ళి ఏకమొత్తంగా తెచ్చుకునే టైం లేకపోవటం.. తెచ్చినా అవి కడిగి తరిగి వంట చేసి తినే ఓపిక లేకపోవటం కర్రీ పాయింట్ వాళ్ళ బిజినెస్ పాయింటు. పెళ్లి అయినవాల్లయినా .. బ్రహ్మచారులయినా, పెళ్లి కాని ముదురులయినా.. విడిపోయిన ఒంటరులయినా అందరికీ ఆకలి తీర్చే అక్షయ పాత్ర ఈ కర్రీ పాయింట్లు.
జేబుల్లో డబ్బులున్నాయి..కాని వండే ఓపిక లేదు.
పొద్దున్నే బందీ మీద రెండిడ్లీలు గతికి .. మధ్యానం ఆఫీసులో ఏదో గడ్డి తిని ..రాత్రికి ఇంటికి వచేటప్పుడు రెండు చపాతీలు..ఓ కర్రీ.. లేదా ఓ పప్పు, సాంబారు తీసుకెళ్ళి రైస్ వండుకొని తినటం అలవాటయ్యింది జనానికి.
శని ఆదివారాలు ఎలాగు బయట తిరుగుళ్ళు..బయట తిండ్లె . ఓ నాలుగు వంటకాలు వండుకునేది మహా అంటే పండక్కే నేమో.
రాను రాను ఏ గడ్డు కాలం దాపురించ బోతోందో...!!

2 comments:

శరత్ కాలమ్ said...

రైస్ కూడా ఎందుకు వండటం దండగా. ఎవరయినా రైస్ పాయింట్ పెట్టి పలు విధాలయిన రైస్ అందుబాటులో ఉంచితే పోలా.

అయినా ఇంట్లో ఎప్పుడూ వండిన కూరలే మళ్ళీ ఏం తింటారులెండి. అలా కర్రీ పాయింట్ కెళితే పొరుగింటి పుల్లకూరల్లా రుచిగా వుంటాయి కదా. మరి పచి (అంటే శుభ్రత అనుకుంటా) సంగతేంటో. శుభ్రంగానే వండుతారంటారా?

Anonymous said...

కర్రీ పాయింట్స్ ఒంటరి ఉద్యోగస్తులకు, ముసలి వాళ్ళకు, రూముల్లో వుండి చదువుకునే పిల్లలకు చాలా వుపయోగపడుతున్నాయి. రుచి అంటే... కాలే కడుపులకు మాడే గంజి. డిమాండ్ బట్టి ఇంప్రూవ్ అవుతాయేమో.