మిట్ట మద్యాన్నం.. ఎండ మండిపోతోంది, నల్లని రోడ్డు కాగుతున్న పెనంలా ఉంది దాన్ని మించి నా మెదడు..
ఒకటే ఆలోచనలు.. ఎడతెగని ఆలోచనలు.. సాలె గూడులా చిక్కుముడులు... జవాబులు లేని ప్రశ్నలు .. ప్రశ్నలు లేని జవాబులు....ఏమిటి మానవుని గొప్పదనం .. ఏముందీ మానవ జీవితంలో ..
మానవ శరీరం, మెదడు మిగత జీవులకంటే సంక్లిష్టమైనది.. కాని దాని ఆలోచనా శక్తితో మానవుడు సాధించింది ఏది కనపడదు, కేవలం తన సుఖం కోసం పాటు పడటం తప్పితే.....
తరచి చూస్తే మానవుడు ఏ జంతువు కన్నా, చెట్లు మొక్కల కన్న చివరికి రాళ్ళు రాప్పలకంటే గొప్పవాడేమి కాడు అని తేలిపోతుంది .తన జ్ఞాపకశక్తి, రీసోనింగ్.. అన్నీ అన్నీ కేవలం తన స్వసుఖనికే ఉపయోగిన్చాడు మనిషి. మిగతా జివులన్నిటిపై అధికారం సంపాదించి తన స్వార్థం కోసం వినియోగించుకోవటం తప్పితే మరెందుకు పనికిరాదు ఈ మానవ మెదడు. అతడు ఈ సృష్టి రహస్యాలని చేధించాననుకొంటున్నాడు.. కాని ఆ మార్గం లోనే సృష్టి ని నాశనం చేసే పథకాలు అల్లాడు.. అతని విజయాలు ఈ సృష్టి ని నాశనం చేసేవి తప్పితే అవి ప్రకృతికి ఉపయోగించేవి ఎంతమాత్రం కావు.
" సాంకేతిక పరిజ్ఞ్యానం మనిషి ని ప్రకృతికి దూరం చేస్తుంది . "
10/12/02
No comments:
Post a Comment